
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా-భారత్‌ల మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు గంటపాటు మ్యాచ్‌ను నిలిపేసిన అంపైర్లు.. రెండో ఇన్నింగ్స్ లక్ష్యాన్ని కుదించారు. సవరించిన లక్ష్యం ప్రకారం సౌతాఫ్రికా గెలుపుకోసం 28 ఓవర్లలో 202 పరుగులు చేయాల్సిఉంటుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 289 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్(109; 105 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి(75), ఎంఎస్ ధోని( 42 నాటౌట్)లు రాణించడంతో భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. దాంతో భారత ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌లు ఆరంభించారు. అయితే ఇన్నింగ్స్ నాల్గో ఓవర్‌లో రోహిత్(5) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో ధావన్‌కు కోహ్లి జత కలిశాడు. వీరిద్దరూ సమయోచితంగా ఆడి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడి రెండో వికెట్‌కు 158 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత కోహ్లి రెండో వికెట్‌గా అవుటయ్యాడు. ఆపై ధావన్ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికి పెవిలియన్‌కు చేరడంతో భారత స్కోరులో వేగం తగ్గింది. అజింక్యా రహానే(8), శ్రేయస్ అయ్యర్(18), హార్దిక్ పాండ్యా(9)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. కాగా, ధోని చివర వరకూ క్రీజ్‌లో నిలబడటంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా, ఎన్‌గిడిలు తలో రెండు వికెట్లు సాధించగా, మోర్నీ మోర్కెల్, క్రిస్ మోరిస్‌లకు చెరో వికెట్ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment