
డర్బన్ : ఎవడు కొడితే రెండోఇన్నింగ్స్‌లో టీమిండియా విక్టరీ సాధింస్తుందో.. ఆ ‘చేజింగ్ మాస్టర్’ కోహ్లి మరో ఘనత సాధించాడు. విదేశీ గడ్డపై అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ రికార్డును సమం చేశాడు. సారథులుగా కోహ్లి, గంగూలీలు ఇద్దరూ విదేశాల్లో 11 సెంచరీలు చేశారు. ఇందుకుగానూ గంగూలీకి 142 ఇన్నింగ్స్‌లు పడితే, కోహ్లి కేవలం 41 ఇన్నింగ్స్‌ల్లోనే పూర్తిచేశాడు. కోహ్లి ఇకా ఒకే ఒక్క సెంచరీ బాదితే.. గంగూలీ రికార్డు బద్దలయినట్లే! సౌతాఫ్రికా గడ్డపై తొలి సెంచరీ మోదిన కోహ్లి.. ఆ జట్టుతో మరో ఐదు వన్డేలు ఆడాల్సిఉంది. కాబట్టి ఈ సిరీస్‌లోనే విరాట్ పనికాచ్చేస్తాడని ఆశిద్దాం.
చేజింగ్ మాస్టర్ : డర్బన్ టన్నుతో కలిపి వన్డేల్లో కోహ్లి సెంచరీల సంఖ్య 33కు చేరింది. ఇందులో 20 సెంచరీలు లక్ష్యఛేదనలో సాధించినవే కావడం గమనార్హం. ఆ 20 సెంచరీల్లోనూ 18 సెంచరీలు జట్టును విజయతీరాలకు చేర్చినవే కావడం విశేషం. కెరీర్‌లో మొత్తంలో విదేశీ గడ్డపై కోహ్లి 15 సెంచరీలు చేశాడు. అందులో కెప్టెన్‌గా సాధించినవే 11 సెంచరీలు!
డర్బన్ వేదికగా గురువారం సౌతాఫ్రికా-ఇండియాల మధ్య జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 270 పరుగుల లక్ష్యాన్ని భారత్ 45.3 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ కోహ్లి 112(119 బంతుల్లో), రహానే 79 (86 బందుల్లో) పరుగులతో జట్టును గెలిపించారు. ఈ విజయంతో ఆరు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ముందంజలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment