Indian captain
-
రిటైర్ మెంట్ వార్తలపై స్పందించిన రోహిత్ శర్మ
-
అదృష్టం కలిసొస్తేనే...
ముంబై: మెగా ఈవెంట్లలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లకు కొన్నిసార్లు ప్రదర్శనతో పాటు కాస్తంత అదృష్టం కూడా తోడవ్వాలని భారత మాజీ కెపె్టన్, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. ‘సియెట్’ సంస్థ అందించే వార్షిక క్రికెట్ అవార్డుల్లో ద్రవిడ్‌కు ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ పురస్కారం లభించింది. ఈ అవార్డుల కార్యక్రమం సందర్భంగా ద్రవిడ్ తన అనుభవాలను వివరించాడు. ద్రవిడ్ ఏమన్నాడంటే‘గతేడాది భారత్ వన్డే ప్రపంచకప్‌లో అజేయంగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో వరుసగా పది మ్యాచ్‌ల్లో గెలిచిన టీమిండియాకు అనూహ్యంగా టైటిల్ పోరులో ఆ్రస్టేలియా చేతిలో పరాజయం ఎదురైంది. ఓ ఆరు నెలల తిరిగేసరికి... ఈ ఏడాది జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ డెత్ ఓవర్లలో కనబరిచిన అద్భుత పోరాటంతో దక్షిణాఫ్రికాను ఓడించి రెండోసారి టి20 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. ఈ రెండు సందర్బాల్లోనూ కెపె్టన్‌గా రోహిత్, కోచ్‌గా నేను ఉన్నాను. మాకు టి20 ప్రపంచకప్ టైటిల్‌కు మధ్య దక్షిణాఫ్రికా అడ్డుగా ఉంది. అయితే ఆటతోపాటు కొంచెం అదృష్టం కలసిరావడంతో కప్‌తో ఆనందం మా వశమైంది. ఎంత చేసినా ఆ రోజు మనది కావాలంటే రవ్వంత అదృష్టం కూడా మనతో ఉండాలి.దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 30 బంతుల్లో 30 పరుగుల సమీకరణం ప్రత్యరి్థకే అనుకూలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంత చిత్తంతో అనుకున్న ప్రణాళికను కెపె్టన్ రోహిత్ అమలు చేయాలి. ఎవరో ఒకరు మా ప్రయత్నాలకు కలిసి రావాలి. చివరకు సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ రూపంలో అదృష్టం మా పక్షాన నిలిచింది. ఈ క్యాచ్ తుది ఫలితాన్ని మావైపునకు తిప్పింది. కానీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరిగిన నవంబర్ 19న మాత్రం ఆసీస్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ శతకం శతకోటికిపైగా భారతీయుల కలల్ని కల్లలు చేసింది.టి20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు రిటైర్మెంట్ ఇచి్చనప్పటికీ యువ బ్యాటర్లు వారి స్థానాలను భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇకముందు కూడా భారత క్రికెట్ వెలిగిపోతుంది. ప్రస్తుతం దేశంలో నాణ్యమైన అకాడమీలు, మెరుగైన మౌలిక వసతులు, లీగ్‌లతో అపార అవకాశాలు యువ క్రికెటర్ల భవిష్యత్తుకు బంగారుబాట వేస్తున్నాయి’ అని ద్రవిడ్ వివరించారు. -
ధోనిని ఇలాంటి స్టైల్లో ఎప్పుడైనా చూశారా?
-
టీమిండియా కెప్టెన్సీ రేసులో అతడు కూడా! జట్టులో చోటుకే దిక్కులేదు!
India Future Captain Candidates: పొట్టి ఫార్మాట్లో టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరన్న అంశంపై గత కొంతకాలంగా క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు సారథిగా ఉన్న రోహిత్ శర్మ వయసు(35 ఏళ్లు) దృష్ట్యా, విశ్రాంతి పేరిట వరుస సిరీస్‌లకు అతడు దూరమవుతున్న నేపథ్యంలో కొత్త కెప్టెన్ ఆవశ్యకత గురించి ఇప్పటికే పలువురు మాజీలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. రోహిత్ తర్వాత పాండ్యానే! ఇక ద్వైపాక్షిక సిరీస్‌లలో రోహిత్ నేతృత్వంలో అదరగొట్టిన టీమిండియా ఆసియా కప్, ప్రపంచకప్-2022 టోర్నీల్లో వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ రెండు ప్రధాన టీ20 టోర్నీల్లో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌కు మంచి మార్కులు పడలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే రోహిత్ గైర్హాజరీలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టీ20 జట్టుకు నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఐర్లాండ్‌తో సిరీస్ గెలవడం సహా కివీస్ గడ్డపై కూడా ట్రోఫీ గెలిచి సత్తా చాటాడు పాండ్యా. ఈ క్రమంలో త్వరలోనే టీ20 పూర్తి స్థాయి కెప్టెన్‌గా అతడి నియామకం ఖరారు కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మరో కొత్త పేరును తెరమీదకు తెచ్చాడు. పాపం రోహిత్.. పాండ్యాతో పాటు అతడు కూడా రేసులో ఢిల్లీలో ఆదివారం జరిగిన ఫిక్కీ(ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) ఈవెంట్‌కు గౌతీ హాజరయ్యాడు. ఈ సందర్భంగా క్రికెట్‌కు సంబంధించిన విషయాలు ప్రస్తావనకు రాగా.. కెప్టెన్సీ అంశం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఐసీసీ ఈవెంట్లో ప్రదర్శనను బట్టి రోహిత్ శర్మ కెప్టెన్సీని జడ్జ్ చేయడం సరికాదన్న గంభీర్.. అతడిపై విమర్శలు దురదృష్టకరం అని పేర్కొన్నాడు. ఇక హిట్‌మ్యాన్ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాకు అవకాశం ఉందని గౌతీ అభిప్రాయపడ్డాడు. జట్టులో చోటే లేదు! కెప్టెనా? అయితే, పృథ్వీ షా కూడా భావి భారత జట్టు కెప్టెన్ కాగల అర్హత కలవాడని గంభీర్ పేర్కొనడం విశేషం. కాగా గతేడాది శ్రీలంక పర్యటనలో భాగంగా చివరిసారిగా టీమిండియా తరఫున ఆడిన షా.. ఇప్పటి వరకు మళ్లీ జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. అంతర్జాతీయ టెస్టులాడి కూడా రెండేళ్లకు పైనే అయింది. ఫిట్నెస్ లేని కారణంగా ఇదిలా ఉంటే.. 2019లో యాంటీ- డోపింగ్ టెస్టులో విఫలమైన పృథ్వీ షా.. కొన్నాళ్లపాటు క్రికెట్ ఆడకుండా నిషేధం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఫిట్‌నెస్‌పై దృష్టి సారించడంలో విఫలమైన అతడు.. ఈ ఏడాది మార్చిలో యో-యో టెస్టులో విఫలమయ్యాడు. ఈ క్రమంలో దేశవాళీ టోర్నీలో సత్తా చాటుతున్నప్పటికీ టీమిండియాలో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు. pic.twitter.com/KXYHcUcBR0 — Prithvi Shaw (@PrithviShaw) July 30, 2019 ఇలా జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న షా గురించి గంభీర్ మాట్లాడుతూ.. ‘‘జట్టు కూర్పు గురించి బయట చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. నిజానికి సెలక్టర్లు, కోచ్‌లు ఎన్నో రకాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. 15 మందిని సెలక్ట్ చేయడం కాదు.. అందులో ఎవరు సరైన వాళ్లో చూసుకోవాలి. అందుకే అతడి పేరు సూచించా పృథ్వీ షా దూకూడైన కెప్టెన్. విజయవంతమైన సారథిగా అతడికి పేరుంది. ఆటగాడిగా కూడా అతడు భేష్. అందుకే టీమిండియా భవిష్యత్ కెప్టెన్‌గా నేను అతడి పేరును సూచించాను’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. గంభీర్ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్లు... ‘‘జట్టులో చోటే లేని ఆటగాడు కెప్టెన్ అవుతాడా? ఏం మాట్లాడుతున్నావు గంభీర్?’’ అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, పృథ్వీ షా సత్తా గురించి తెలుసుకాబట్టే గౌతీ ఇలా అన్నాడంటూ అతడి అభిమానులు సమర్థించుకుంటున్నారు. చదవండి: WC 2023: టీమిండియా ప్రధాన సమస్య అదే! ఉన్నదే 25 మ్యాచ్‌లు.. ఇకనైనా కళ్లు తెరిచి.. Ind Vs NZ: అసలేం చేస్తున్నారు.. టీమిండియాను భ్రష్టు పట్టించకండి: నెహ్రా ఘాటు వ్యాఖ్యలు! కోచ్‌గా లక్ష్మణ్.. -
టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్‌గా..! టీ20 ప్రపంచకప్ టోర్నీలో..
India vs West Indies T20 Series: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో టీమిండియాకు మరోసారి కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం దక్కించుకున్నాడు హార్దిక్ పాండ్యా. నామమాత్రపు ఐదో టీ20కి రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో అతడి స్థానంలో సారథిగా బాధ్యతలు చేపట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఏకంగా 88 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అద్భుత విజయం! లక్ష్య ఛేదనకు దిగిన విండీస్‌ను భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయి దెబ్బకొట్టారు. దీంతో 15.4 ఓవర్లకే పూరన్ బృందం చాపచుట్టేసి ఓటమిని ఆహ్వానించింది. అక్షర్‌కు మూడు, కుల్దీప్‌నకు మూడు, బిష్ణోయికి నాలుగు వికెట్లు దక్కాయి. మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు కూల్చిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఫ్లోరిడా వేదికగా సాగిన ఈ ఆఖరి మ్యాచ్‌లో విజయంతో భారత జట్టు 4-1తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. కచ్చితంగా చేస్తాను! ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పూర్తిస్థాయి టీ20 కెప్టెన్‌గా ఉండే అవకాశం వస్తే బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారా అనే ప్రశ్న అతడికి ఎదురైంది. ఇందుకు బదులుగా హార్దిక్.. ‘‘కచ్చితంగా! ఎందుకు సిద్ధంగా ఉండను? ఒకవేళ భవిష్యత్తులో నాకు ఈ అవకాశం వస్తే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. అయితే, ఇప్పుడు మా దృష్టి మొత్తం ప్రపంచకప్ మీదే ఉంది. అంతకంటే ముందు ఆసియా కప్ ఆడాల్సి ఉంది. జట్టుగా సమిష్టిగా ముందుకు సాగుతూ శాయశక్తులు ఒడ్డుతున్నాం. నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటున్నాం. విజయాలను ఆస్వాదిస్తున్నాం. అదే సమయంలో తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాం. నా వరకైతే మేము టీ20 ప్రపంచకప్ టోర్నీకి వందకు వంద శాతం సిద్ధంగా ఉన్నామనే అనుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు కెప్టెన్సీ చేసిన హార్దిక్ పాండ్యా అద్భుత విజయం అందుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు ఐపీఎల్-2022లో కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ అందించి సారథిగా సత్తా చాటాడు. చదవండి: Asia Cup 2022: ఆసియా కప్‌కు భారత జట్టు.. అయ్యర్‌కు నో ఛాన్స్! హుడా వైపే మొగ్గు! Dressing room POV! 👌 👌 𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦: Captain @ImRo45's speech after #TeamIndia's successful tour of the West Indies & USA. 👏 👏 - By @28anand Watch the special feature 🎥 🔽https://t.co/m0C5nsgJDG pic.twitter.com/qKsm6hRuEJ — BCCI (@BCCI) August 8, 2022 -
టీ20 కెప్టెన్ పదవికి కొహ్లీ గుడ్ బై
-
కోహ్లి సంచలన నిర్ణయం.. టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై!
Virat Kohli-T20 Captaincy: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. యూఏఈ, ఒమన్ వేదికగా జరుగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలకనున్నట్లు తెలిపాడు. ఈ విషయం గురించి బీసీసీఐ కార్యదర్శి జై షా, అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నాడు. అయితే వన్డే, టెస్టుల్లో మాత్రం కెప్టెన్‌గా కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఈ మేరకు కోహ్లి ట్విటర్ వేదికగా ఓ లేఖను విడుదల చేశాడు. ‘‘టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడమే కాకుండా.. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నాను. సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలక్షన్ కమిటీ, నా కోచ్‌లు, ప్రతీ భారతీయుడికి కృతజ్ఞతలు. మీ మద్దతు లేకుండా ఇదంతా సాధ్యమయ్యేదే కాదు. 8-9 ఏళ్లుగా మూడు ఫార్మాట్లలో ఆడుతుండటం, గత 5-6 ఏళ్లుగా కెప్టెన్సీ కారణంగా వర్క్‌లోడ్ ఎక్కువైంది. కాస్త విశ్రాంతి కోరుకుంటున్నా. వన్డే, టెస్టు కెప్టెన్సీపై దృష్టి సారించాలనుకుంటున్నాను. టీ20 కెప్టెన్‌గా నా బెస్ట్ ఇచ్చాను. ఇకపై బ్యాట్స్‌మెన్‌గా కూడా అదే తరహా ప్రదర్శనతో ముందుకు సాగుతాను. నిజానికి చాలా రోజుల కిందటే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా సన్నిహితులతో చర్చించాను. లీడర్షిప్ గ్రూపులో కీలకమైన రవి భాయ్, రోహిత్‌తో కూడా మాట్లాడాను. అందుకే దుబాయ్‌లో అక్టోబరులో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతా. ఈ విషయం గురించి సెక్రటరీ జై షా, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో మాట్లాడాను. వన్డే, టెస్టు కెప్టెన్‌గా నా శక్తిమేర జట్టును ముందుకు నడిపిస్తాను’’ అని కోహ్లి పేర్కొన్నాడు. కాగా కోహ్లి నిర్ణయంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన హిట్‌మ్యాన్‌కు టీమిండియా టీ20 కెప్టెన్సీ దక్కడం లాంఛనమే కానుంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ నుంచి అధికారికి ప్రకటన వెలువడాల్సి ఉంది. (చదవండి: Sustainable Cities and Society Study: ఆరు అడుగుల భౌతిక దూరం సరిపోదు) T20 World Cup: అశ్విన్‌కు అది కన్సోలేషన్ ప్రైజ్ లాంటిది.. తుదిజట్టులో ఉంటాడా? 🇮🇳 ❤️ pic.twitter.com/Ds7okjhj9J — Virat Kohli (@imVkohli) September 16, 2021 -
ఇంకా ఒక్కటి బాదితే రికార్డు బద్దలే!
డర్బన్ : ఎవడు కొడితే రెండోఇన్నింగ్స్‌లో టీమిండియా విక్టరీ సాధింస్తుందో.. ఆ ‘చేజింగ్ మాస్టర్’ కోహ్లి మరో ఘనత సాధించాడు. విదేశీ గడ్డపై అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ రికార్డును సమం చేశాడు. సారథులుగా కోహ్లి, గంగూలీలు ఇద్దరూ విదేశాల్లో 11 సెంచరీలు చేశారు. ఇందుకుగానూ గంగూలీకి 142 ఇన్నింగ్స్‌లు పడితే, కోహ్లి కేవలం 41 ఇన్నింగ్స్‌ల్లోనే పూర్తిచేశాడు. కోహ్లి ఇకా ఒకే ఒక్క సెంచరీ బాదితే.. గంగూలీ రికార్డు బద్దలయినట్లే! సౌతాఫ్రికా గడ్డపై తొలి సెంచరీ మోదిన కోహ్లి.. ఆ జట్టుతో మరో ఐదు వన్డేలు ఆడాల్సిఉంది. కాబట్టి ఈ సిరీస్‌లోనే విరాట్ పనికాచ్చేస్తాడని ఆశిద్దాం. చేజింగ్ మాస్టర్ : డర్బన్ టన్నుతో కలిపి వన్డేల్లో కోహ్లి సెంచరీల సంఖ్య 33కు చేరింది. ఇందులో 20 సెంచరీలు లక్ష్యఛేదనలో సాధించినవే కావడం గమనార్హం. ఆ 20 సెంచరీల్లోనూ 18 సెంచరీలు జట్టును విజయతీరాలకు చేర్చినవే కావడం విశేషం. కెరీర్లో మొత్తంలో విదేశీ గడ్డపై కోహ్లి 15 సెంచరీలు చేశాడు. అందులో కెప్టెన్‌గా సాధించినవే 11 సెంచరీలు! డర్బన్ వేదికగా గురువారం సౌతాఫ్రికా-ఇండియాల మధ్య జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 270 పరుగుల లక్ష్యాన్ని భారత్ 45.3 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ కోహ్లి 112(119 బంతుల్లో), రహానే 79 (86 బందుల్లో) పరుగులతో జట్టును గెలిపించారు. ఈ విజయంతో ఆరు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ముందంజలో నిలిచింది. -
కోహ్లిని చూసేందుకు ఆస్పత్రికి పోటెత్తారు!
-
కోహ్లిని చూసేందుకు ఆస్పత్రికి పోటెత్తారు!
మ్యాచ్‌ల సందర్భంగా టీమిండియా కెప్టెన్, డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి మైదానంలో తప్ప బయట పెద్దగా కనిపించడు. కానీ, రాంచీలో ఆస్ట్రేలియాతో రెండో టెస్టు తొలిరోజున భుజానికి గాయం కావడంతో రెండోరోజు పూర్తిగా మూడు సెషన్లలోనూ కోహ్లి మైదానంలో కనిపించలేదు. అయినప్పటికీ, కోహ్లి ఫిట్‌గా ఉన్నాడని, బ్యాటింగ్‌కు దిగుతాడని బీసీసీఐ, బౌలర్ ఉమేశ్ యాదవ్ స్పష్టం చేశారు. అయినప్పటికీ గాయం స్వభావాన్ని తెలుసుకోవడానికి కోహ్లికి జట్టు వైద్యబృందం రాంచీలోని ఓ స్థానిక ఆస్పత్రిలో ఎంఆర్ఐ స్కానింగ్ చేయించింది. ఈ సందర్భంగా ఆస్పత్రికి కోహ్లి వస్తున్నారన్న వార్త చుట్టుపక్కల దావాహనంలా వ్యాపించింది. దీంతో వేలాదిమంది ఆస్పత్రి వద్ద గుమిగూడి కోహ్లిని చూసేందుకు ఆరాటపడ్డారు. అభిమానులు ఎగబడకుండా కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన వెళ్లిపోయారు. అయిన్పటికీ ఆస్పత్రి నుంచి బయటకు వస్తున్న కోహ్లిని చూసిన క్రికెట్ ప్రేమికులు కెరింతలతో తమ హర్షం వ్యక్తం చేశారు. గత గురువారం రాంచీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. A small insight into How Indian cricket players are bigger stars than Premier League Football players over here !!! https://t.co/QhIYgh46tw — Michael Vaughan (@MichaelVaughan) March 17, 2017 -
హర్మన్‌ప్రీత్ జోరు
బిగ్‌బాష్‌లో మరో మెరుపు ప్రదర్శన ఆల్బరీ (ఆస్ట్రేలియా): మహిళల బిగ్‌బాష్ లీగ్ టి20 టోర్నీలో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జోరు కొనసాగుతోంది. లీగ్‌లో ఆడుతున్న తొలి మ్యాచ్‌లో 28 బంతుల్లోనే 47 పరుగులతో చెలరేగిన హర్మన్, మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లోనూ ఆల్‌రౌం డ్ ప్రదర్శనతో సత్తా చాటింది. హర్మన్ ప్రదర్శనతో సిడ్నీ థండర్స్ 8 వికెట్లతో మెల్బోర్న్ స్టార్స్‌ను చిత్తు చేసింది. ముందుగా మెల్బోర్న్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. హర్మన్ 27 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం విశేషం. అనంతరం థండర్స్ టీమ్ 18.5 ఓవర్లలో 2 వికెట్లకు 121 పరుగులు చేసింది. ఛేదనలోనూ కీలక పాత్ర పోషించిన హర్మన్ (21 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. -
అండర్–17 కబడ్డీ విభాగం ఇండియన్ కెప్టెన్‌గా మంజి
మహబూబాబాద్ : కేసముద్రం మండలం బేరువాడ శివారుగుడి తండాకు చెందిన బోడ మంజి అండర్–17 విభాగంలో ఇండియన్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. త్వరలోనే నేపాల్‌లో జరగనున్న అంతర్జాతీయ కబడ్డీ క్రీడలో మంజి ఇండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం(తెగ) ఆధ్వర్యంలో మానుకోటలో ఆ విద్యార్థిని ఆదివారం రాత్రి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం డివిజన్ అధ్యక్షుడు బాలునాయక్, కార్యదర్శి హట్యానాయక్, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ వెంకట్రాములు, జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వీరన్న, సభ్యులు వీరన్ననాయక్ మాట్లాడుతూ మంజి నేపాల్ వెళ్లేందుకు అసోసియేషన్ ఆధ్వర్యాన ఆర్థిక సాయం అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బాలాజీ, తదితరులు పాల్గొన్నారు. -
'ధోనీ ఏ టీమ్‌లో ఉన్నా అదే ఫేవరెట్'
న్యూఢిల్లీ: ఐపీఎల్ కొత్త ప్రాంఛైజీ రాజ్‌కోట్ కెప్టెన్‌గా భారత క్రికెటర్‌నే నియమించాలని టీమిండియా మాజీ కెప్టెన్ గవాస్కర్ సూచించాడు. స్థానిక ఆటగాళ్ల ప్రతిభ గురించి భారత ఆటగాడికే బాగా తెలుసునని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. 'రాజ్‌కోట్ జట్టుకు భారతీయ క్రికెటర్ కెప్టెన్‌గా ఉండాలి. అతనికి స్థానిక ఆటగాళ్ల బలాలు, బలహీనతల గురించి తెలుసు. కోచ్‌గా భారతీయుడు అవసరమైతే.. కెప్టెన్‌గా బ్రెండన్ మెకల్లమ్‌ను నియమించుకోవచ్చు' అని సన్నీ అన్నాడు. వచ్చే రెండు సీజన్ల కోసం రాజ్‌కోట్‌తో పాటు పుణె జట్లను ఐపీఎల్‌లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజా వేలంలో రాజ్‌కోట్.. సురేష్ రైనా, లోకల్ హీరో రవీంద్ర జడేజాతో పాటు న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్కనర్‌ను దక్కించుకుంది. పుణెకు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉండటంతో ఆ జట్టు ఫేవరెట్‌గా కనిపిస్తోందని సన్నీ అభిప్రాయపడ్డాడు. ధోనీ ఏ టీమ్‌లో ఉన్నా అది ఫేవరేట్ అని అన్నాడు. కొత్త జట్టుకు మహీ వంటి ఆటగాడు అవసరమని పేర్కొన్నాడు. భారత క్రీడల్లో ధోనీ అతిపెద్ద బ్రాండ్ అని కితాబిచ్చాడు. రాజ్‌కోట్‌తో పోలిస్తే పుణె కాస్త బలోపేతంగా కనిపిస్తోందని చెప్పాడు. -
రహానే సమర్థుడు: సచిన్
భారత జట్టు కెప్టెన్‌గా అజింక్య రహానే ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని, బాగా కష్టపడే తత్వం, అంకితభావం ఉన్న రహానే కెప్టెన్‌గానూ సమర్థుడని సచిన్ అన్నాడు. 15 ఏళ్ల తర్వాత ముంబై క్రికెటర్‌కు భారత జట్టు కెప్టెన్సీ దక్కింది. జూన్ 21న బంగ్లాదేశ్‌తో రెండో వన్డే సందర్భంగా తుది జట్టులో రహానే స్థానం కోల్పోయాడు. సరిగ్గా ఎనిమిది రోజుల తర్వాత ఏకంగా భారత జట్టు కెప్టెన్‌గా మారిపోయాడు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ముంబై నుంచి కెప్టెన్సీ దక్కించుకున్న ఆటగాడిగా నిలిచాడు. వివాదాలకు దూరంగా తన పనేదో చేసుకుంటూ వెళ్లే రహానే.. ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆటగాడు. కొత్త వ్యక్తులతో అంత త్వరగా కలసిపోలేని రహానే భారత కెప్టెన్‌గా ఎదిగిన క్రమాన్ని పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుస్తాయి.. బంగ్లాదేశ్‌తో వన్డేలో అజింక్య రహానేను జట్టులోకి తీసుకోకపోవడంతో అతనికి గాయం అయ్యిండొచ్చని అందరూ భావించారు. అయితే కావాలనే తప్పించారనే విషయం తెలియగానే షాకవడం అభిమానుల వంతైంది. అయినా రహానే టాలెంట్ అతణ్ని నిలబెట్టింది. వారం తిరగకముందే భారత వన్డే జట్టు కెప్టెన్‌గా మారాడు. దీంతో సెలక్టర్లు అతనిపై ఉంచిన నమ్మకమేంటో మనకు అర్థమవుతోంది. కోహ్లికి వారసుడిగా రహానేను ఇప్పటినుంచే తయారుచేయాలని భావిస్తున్నారు. ఎవరిని ఒక్క మాట కూడా అనలేని రహానే కెప్టెన్సీకి పూర్తి న్యాయం చేయగలడా అని కొందరు అంటున్నా అవసరమోచ్చినప్పుడు తన అభిప్రాయాలను చెప్పడంలో మోహమాటపడడు అని అతని గురించి తెలిసిన వాళ్లు చెబుతున్నారు. తండ్రి భయం.. రహానే కుటుంబం ముంబై మెట్రోపాలిటన్‌లో ఒక మూలన ఉన్న డొంబ్లివాలీలో నివాసం ఉండేది. చిన్నప్పుడు రహానే ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఇలా ఉంటే అందరూ ఏడిపిస్తారనే భయంతో రహానే తండ్రి అతణ్ని కరాటే స్కూల్లో చేర్చాడు. 9 ఏళ్ల వయసులో కరాటే నేర్చుకోవడం మొదలుపెట్టిన రహానే.. మెల్లగా రాటుదేలాడు. అతని జీవితంలో అన్ని సవాళ్లకు ఎదురు నిలబడి పోరాడడంలో, దృఢంగా మారడంలో ఆ శిక్షణ ఎంతో ఉపయోగపడింది. కరాటే స్కూల్లో కూడా మృదుస్వభావిగానే ఉన్నా ప్రత్యర్థిపై అటాక్ చేసే విషయంలో మాత్రం ఎలాంటి వెనకడుగు వేసేవాడు కాదు. ప్రస్తుతం బౌలర్లపై విరుచుకుపడుతున్నట్లు. రిజర్వ్‌గా ఉండడం వల్ల చెప్పిన పనిని చాలా ఏకాగ్రతతో చేసేవాడు. కరాటేతో అతడు దృఢంగా తయారవడంతో తన కంటే పెద్ద వారితో క్రికెట్లో పోటీ పడడానికి భయపడేవాడు కాదు. సచిన్, కాంబ్లీలతో ఆడాలని.. తన వీధిలో క్రికెట్ స్టార్‌గా మారిన రహానేను అతని తండ్రి.. డొంబ్లివాలీలోని ఒక క్రికెట్ క్యాంప్‌లో చేర్చాడు. అక్కడి ట్రైనర్ రెండు ఫొటోలని రహానేకు చూపించి వారిని గుర్తించమని అడగగా, వాటిల్లోని వ్యక్తుల పేర్లు చెప్పడమే కాకుండా వారితో ఆడాలని ఉందనే కోరికను బయట పెట్టాడు. ఆ వ్యక్తులు సచిన్, వినోద్ కాంబ్లీ. తర్వాతి కాలంలో భారత జట్టులో సచిన్‌తో కలసి రహానే ఆడాడు. జిల్లా స్థాయిలో తన జట్టుకు నాయకత్వం వహించిన రహానే.. ఒక వన్డే మ్యాచ్‌లో ఏకంగా 300 పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడు. తర్వాత ముంబై నగరంలోని కొన్ని క్లబ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. కేవలం క్రికెట్ ఆడటానికి రోజు రెండు గంటలు ప్రయాణం చేసేవాడు. రహానే కోసం అతని కుటుంబం ముంబై నగరానికి దగ్గరగా ఉండే ఏరియాకు మారింది. 2013 తర్వాత అసలు ప్రదర్శన.. 2007లో భారత అండర్-19 జట్టుకు ఎంపికైన రహానే.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రెండు సెంచరీలు బాదాడు. ముంబై జట్టులో చోటు సంపాదించి అద్భుత ప్రదర్శనతో 2011లోనే భారత వన్డే జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే అతి జాగ్రత్తగా ఆడడంతో పరుగులు చేయలేక ఇబ్బందిపడి జట్టులో చోటు కోల్పోయాడు. 2010 వరకు ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నా ఐపీఎల్లో మెరిసింది తక్కువే. అయితే 2012లో రాజస్తాన్ జట్టులో అత్యుత్తమ ప్రదర్శన చేసి అందర్నీ ఆశ్చర్చపరిచాడు. దాంతో మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. ఈ సారి ఇక వెనుదిరగలేదు. టెస్టు, వన్డే, టీ20లనే తేడా లేకుండా అదరగొడుతున్నాడు. కెప్టెన్‌గా అనుభవం తక్కువే.. రహానే రంజీల్లో ముంబై తరఫున ఆడేవాడు. కెప్టెన్‌గా అనుభవం చాలా తక్కువ. ముంబై జట్టుకు ఒక లిస్ట్-ఎ మ్యాచ్, ఒక టీ20 మ్యాచ్‌లకు మాత్రమే సారథిగా వ్యవహరించాడు. అయితే అండర్-19 లెవల్లో 2005-06 కూచ్ బెహార్ టోర్నీలో తన జట్టును విజేతగా నిలిపాడు. ఆ టోర్నీలో ఏకంగా 762 పరుగులు చేసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. మరికొన్ని.. ►రహానే ఓపెనింగ్ పొజిషన్లో ఆడేవాడు. అయితే రోహిత్ శర్మ ఆ స్థానంలో కుదురుకోవడంతో మిడిలార్డర్‌కు మారాడు. ►ఆటను మెరుగుపరచుకుంటూ గత 18 నెలలుగా భారత జట్టులో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడిగా నిలిచాడు. ►భారీ హిట్టర్ కాకపోయినా టీ20ల్లో కూడా స్టార్‌గా ఎదిగాడు. టైమింగ్ షాట్లతో క్రికెట్ పండితుల ప్రశంసలు అందుకున్నాడు. ►రహానేకు కుటుంబంతో అనుబంధం ఎక్కువ. ►ముంబై మెట్రోపాలిటన్‌లోని ములుంద్ ప్రాంతంలో భార్య రాధికతో పాటు చెల్లెలు, తమ్ముడు, తల్లిదండ్రులతో కలసి ఉంటున్నాడు. ►పార్టీలకు దూరంగా ఉంటాడు. ఖాళీగా ఉన్నప్పుడు స్నేహితులతో కలసి కేఫ్‌లలో టీ పార్టీ చేసుకుంటాడు. ►సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ►బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూస్తాడు. -
‘ఐదో’ విలువైన ఆటగాడు
‘ఫోర్బ్స్’ విలువైన ప్రపంచ అథ్లెట్ల జాబితాలో ధోనికి ఐదో స్థానం న్యూయార్క్: భారత కెప్టెన్ ఎం.ఎస్.ధోని... ప్రపంచంలో విలువైన అథ్లెట్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ‘ఫోర్బ్స్’ తయారు చేసిన ఈ జాబితాలో భారత్ నుంచి కేవలం మహీ ఒక్కడికే స్థానం దక్కింది. 2014లో ధోని బ్రాండ్ విలువ 20 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.122 కోట్లు)గా లెక్కగట్టింది. గతేడాదితో పోలిస్తే ధోని బ్రాండ్ విలువ 1 మిలియన్ డాలర్లు తగ్గింది. అయినా ధోని ఐదో స్థానంలో నిలిచాడు. 2013 చివర్లో స్పార్టన్ స్పోర్ట్స్, అమిటీ యూనివర్సిటీలతో కుదుర్చుకున్న బ్యాట్ ఒప్పందంతో ధోని బ్రాండ్ విలువ బాగా పెరిగిందని ఫోర్బ్స్ తెలిపింది. బ్యాట్ కోసం రీబాక్ ఏడాదికి 1 మిలియన్ డాలర్లు ఇస్తే... స్పార్టన్ 4 మిలియన్ డాలర్లు చెల్లించిందని వెల్లడించింది. అమెరికా బాస్కెట్ బాల్ స్టార్ ప్లేయర్ లీబ్రాన్ జేమ్స్ (37 మిలియన్ డాలర్లు) ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... టైగర్ వుడ్స్ (36 మిలియన్ డాలర్లు), రోజర్ ఫెడరర్ (32 మిలియన్ డాలర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్, రియల్ మాడ్రిడ్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో, లియోనాల్ మెస్సీ (అర్జెంటీనా), రాఫెల్ నాదల్ టాప్-10లో ఉన్నారు. -
విజయంపైనే దృష్టి పెట్టాం: ధోని
-
అవకాశాలను వదులుకోం
- గతం నుంచి నేర్చుకున్నామన్న ధోని - ఇంగ్లండ్‌కు బయల్దేరిన భారత జట్టు ముంబై: టెస్టు మ్యాచుల్లో ఆరంభంలో ఆధిక్యం దక్కినా, ఆ తర్వాత పట్టు విడవటం భారత్‌కు అలవాటు. ఇటీవల దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సిరీస్‌లలో అదే జరిగింది. అయితే ఈసారి గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు భారత కెప్టెన్ ఎం.ఎస్. ధోని తెలిపాడు. ఇంగ్లండ్‌లో సుదీర్ఘ పర్యటన కోసం భారత జట్టు ఆదివారం తెల్లవారుజామున బయల్దేరి వెళ్లనున్న నేపథ్యంలో ధోని మీడియాతో మాట్లాడాడు. ‘2011లో ఇంగ్లండ్, ఆసీస్ పర్యటనలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అయితే ఆ తర్వాత మా ఆటతీరు మెరుగైంది. కొన్ని టెస్టుల్లో శాసించే స్థితిలో నిలిచాం. అయితే ఆ తర్వాత పట్టు జారవిడిచాం. ఈసారి అలాంటి అవకాశం లభిస్తే వదులుకోము’ అని ధోని ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. మ్యాచ్ పరిస్థితులు ఎలా ఉన్నా తన బ్యాటింగ్ శైలి మారదని ధోని స్పష్టం చేశాడు. ఈ పర్యటనలో భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు వచ్చే నెల 9 నుంచి జరుగుతుంది. అంతకుముందు టీమిండియా...లీసెస్టర్‌షైర్, డెర్బీషైర్ జట్లతో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతుంది.