
హర్మన్‌ప్రీత్ జోరు
బిగ్‌బాష్‌లో మరో మెరుపు ప్రదర్శన
ఆల్బరీ (ఆస్ట్రేలియా): మహిళల బిగ్‌బాష్ లీగ్ టి20 టోర్నీలో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జోరు కొనసాగుతోంది. లీగ్‌లో ఆడుతున్న తొలి మ్యాచ్‌లో 28 బంతుల్లోనే 47 పరుగులతో చెలరేగిన హర్మన్, మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లోనూ ఆల్‌రౌం డ్ ప్రదర్శనతో సత్తా చాటింది. హర్మన్ ప్రదర్శనతో సిడ్నీ థండర్స్ 8 వికెట్లతో మెల్‌బోర్న్ స్టార్స్‌ను చిత్తు చేసింది. ముందుగా మెల్‌బోర్న్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. హర్మన్ 27 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం విశేషం. అనంతరం థండర్స్ టీమ్ 18.5 ఓవర్లలో 2 వికెట్లకు 121 పరుగులు చేసింది. ఛేదనలోనూ కీలక పాత్ర పోషించిన హర్మన్ (21 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది.