
మహిళల ప్రీమియర్ లీగ్-2025లో వడోదర వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో ఆల్‌రౌండర్ నాట్ స్కివర్-బ్రంట్ అదరగొట్టింది.
ఇన్నింగ్స్ ఆరంభంలోనే హీలీ మాథ్యూస్ వికెట్‌ను ముంబై కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నాట్ స్కివర్ జట్టు బాధ్యతను తన భుజాన వేసుకుంది. బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించింది. ఆమెతో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా బ్యాట్ ఝులిపించింది.
స్కివర్-బ్రంట్ 59 బంతుల్లో 13 ఫోర్లతో 80 పరుగులు చేయగా.. హర్మాన్ 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42 పరుగులు చేసింది. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో సదర్లాండ్ మూడు వికెట్లు పడగొట్టగా.. శిఖా పాండే రెండు, క్యాప్సీ, మిన్నీ మణి తలా వికెట్ సాధించారు.
తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ ప్లేయింగ్ ఎలెవన్: మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సీ, జెమిమా రోడ్రిగ్స్, అన్నాబెల్ సదర్లాండ్, నికి ప్రసాద్, సారా జెన్నిఫర్ బ్రైస్ (వికెట్ కీపర్), శిఖా పాండే, అరుంధతి రెడ్డి, మిన్ను మణి, రాధా యాదవ్
ముంబై ఇండియన్స్ ఉమెన్ ప్లేయింగ్ : యాస్తికా భాటియా (వికెట కీపర్), హేలీ క్రిస్టెన్ మాథ్యూస్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, సజీవన్ సజన, అమంజోత్ కౌర్, జింటిమణి కలితా, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్
NAT SCIVER-BRUNT SHOW IN WPL
80* off just 59 balls without much support from the other end, crazy innings under immense pressure from one of the best players of this generation! pic.twitter.com/byJWFKVXcm— Daddyscore (@daddyscore) February 15, 2025
Comments
Please login to add a commentAdd a comment