Nat Sciver
-
ఆల్‌రౌండ్ షోతో ఇరగదీసిన ఇంగ్లండ్ బ్యాటర్.. చిత్తుగా ఓడిన పాక్
3 టీ20లు, 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు కనీసం ఒక్క విజయం కూడా సాధించకుండానే రిక్త హస్తాలతో ఇంటిబాట పట్టింది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన పాక్.. నిన్న జరిగిన మూడో వన్డేతో వన్డే సిరీస్‌ను సైతం 0-2 తేడాతో కోల్పోయింది.మూడో వన్డేలో ఇంగ్లండ్ 178 పరుగుల భారీ తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 302 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన పాక్ 29.1 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. నాట్ సీవర్ బ్రంట్ ఆల్‌రౌండ్ షోతో ఇరగదీసి ఇంగ్లండ్‌ను ఒంటిచేత్తో గెలిపించింది.తొలుత బ్యాటింగ్‌లో అజేయ సెంచరీతో (124 నాటౌట్) చెలరేగిన బ్రంట్.. ఆతర్వాత బౌలింగ్‌లోనూ రాణించి 2 వికెట్లు తీసింది. బ్రంట్‌తో పాటు బౌచియర్ (34), డేనియెల్ వ్యాట్ (44), అలైస్ క్యాప్సీ (39 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. పాక్ బౌలర్లలో హనీ 2, డయానా బేగ్, నిదా దార్, ఫాతిమా సనా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఇంగ్లండ్ బౌలర్లు తలో చేయి వేయడంతో పాక్ స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. సోఫీ ఎక్లెస్టోన్ 3, బ్రంట్, లారెన్ బెల్ చెరో 2, కేట్ క్రాస్, చార్లెట్ డీన్ తలో వికెట్ పడగొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో మునీబా అలీ (47), అలియా రియాజ్ (36), సిద్రా అమీన్ (10), అయేషా జాఫర్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
యశస్విని వెనక్కినెట్టిన రచిన్: అవార్డులు గెలిచింది వీళ్లే.. పూర్తి జాబితా
ICC Awards 2023: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)- 2023 వార్షిక పురస్కారాల్లో భారత్‌కు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. రన్‌మెషీన్ విరాట్ కోహ్లి మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవగా.. టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. కోహ్లి ఏకంగా నాలుగోసారి(వన్డే) ఈ అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించగా.. సూర్య వరుసగా రెండోసారి పురస్కారం అందుకుని ఇంత వరకు ఎవరికీ సాధ్యం కాని ఘనత(టీ20) సాధించాడు. కెప్టెన్సీలో అదరగొట్టాడు.. అందుకే గత ఏడాది సూర్య 18 మ్యాచ్‌లు ఆడి 155.95 స్ట్రయిక్‌రేట్‌తో 733 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ‘టి20 ఫార్మాట్లో భారత మిడిలార్డర్ వెన్నెముకగా సూర్య ఉన్నాడు. తన దూకుడైన ఆటతో పలుసార్లు భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్సీ బాధ్యతల్లోనూ అతను ఒత్తిడికి లోనుకాకుండా నిలకడగా రాణించాడు’ అని ఐసీసీ వ్యాఖ్యానించింది. ఇక ఈ టీమిండియా స్టార్లతో పాటు 2023 ఏడాదికి గానూ ఐసీసీ అవార్డులు అందుకున్న జాబితా చూద్దాం. ►మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 విజేత జట్టు కెప్టెన్ ►మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- విరాట్ కోహ్లి(ఇండియా) డబ్ల్యూటీసీ టైటిల్ ►మెన్స్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా)- 13 మ్యాచ్‌లలో కలిపి 1210 పరుగులు- ఆసీస్ డబ్ల్యూటీసీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర యశస్విని వెనక్కినెట్టి ►మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్)- వన్డే వరల్డ్‌కప్‌లో 578 పరుగులు. యశస్వి జైస్వాల్, గెరాల్డ్ కోయెట్జీ, దిల్షాన్ మధుషాంకలను వెనక్కినెట్టి అవార్డు సొంతం చేసుకున్నాడు. డచ్ జట్టు విజయాలకు కారణం ►మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- బాస్ డి లీడే(నెదర్లాండ్స్)- 285 పరుగులు చేసి, 15 వికెట్లు తీసి- వన్డే వరల్డ్‌కప్‌నకు డచ్ జట్టు అర్హత సాధించడంలో కీలక పాత్ర- వన్డే ప్రపంచకప్‌లో 139 పరుగులు- 16 వికెట్లు. మహిళా క్రికెట్లో మహరాణులు ►వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- నాట్ సీవర్ బ్రంట్(ఇంగ్లండ్) ►వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- చమరి ఆటపట్టు(శ్రీలంక)- 8 మ్యాచ్‌లలో కలిపి 415 రన్స్ ►వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- హేలీ మాథ్యూస్(వెస్టిండీస్)- స్టెఫానీ టేలర్ తర్వాత ఈ అవార్డు అందుకున్న రెండో వెస్టిండియన్ ప్లేయర్- టీ20లలో జట్టుకు అవసరమైన సమయంలో 99 నాటౌట్, ఆస్ట్రేలియా గడ్డ మీద వరుసగా 132, 79 రన్స్ ►వుమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- ఫోబె లిచ్‌ఫీల్డ్(ఆస్ట్రేలియా)- ఆసీస్ టాపార్డర్‌కు వెన్నెముకగా నిలిచినందుకు ►వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- క్వీంటర్ అబెల్(కెన్యా)- అంతర్జాతీయ టీ20లలో 476 పరుగులు, 30 వికెట్లు జింబాబ్వేకే ఆ అవార్డు స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డు- జింబాబ్వే జాతీయ జట్టు(ఓటమి బాధలో ఉన్న వెస్టిండీస్ ఆటగాడు అకీల్ హుసేన్‌ను ఓదార్చినందుకు) అంపైర్ ఆఫ్ ది ఇయర్- రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్. ఐసీసీ టెస్టు జట్టు: ఉస్మాన్ ఖవాజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్, ట్రావిస్ హెడ్, రవీంద్ర జడేజా, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, రవిచంద్రన్ అశ్విన్, మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్. ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: ఫోబె లిచ్‌ఫీల్డ్, చమరి ఆటపట్టు (కెప్టెన్), ఎలిస్ పెర్రీ, అమేలియా కెర్, బెత్ మూనీ (వికెట్ కీపర్), నాట్ సీవర్-బ్రంట్, యాష్ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, నాడిన్ డి క్లెర్క్, లీ తహుహు, నహీదా అక్తర్. ఐసీసీ 2023 వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సన్, ఆడమ్ జంపా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్. ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్: చమరి అటపట్టు(కెప్టెన్), బెత్ మూనీ (వికెట్ కీపర్), లారా వోల్వార్డ్, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, ఎల్లిస్ పెర్రీ, యాష్ గార్డెన్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, మెగాన్ షట్. ఐసీసీ పురుషుల టీ20 జట్టు: యశస్వి జైస్వాల్, ఫిల్ సాల్ట్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, సికందర్ రజా, అల్పేశ్ రాంజాని, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, రిచర్డ్ ఎన్‌గరవ, అర్ష్‌దీప్ సింగ్. చదవండి: INDA& U19 WC: ఒకేరోజు అటు అన్న.. ఇటు తమ్ముడు సెంచరీలతో ఇరగదీశారు! -
Ashes 2023: ఇంగ్లండ్ బ్యాటర్ వరుస శతకాలు.. యాషెస్ నిలబెట్టుకున్న ఆసీస్
మహిళల యాషెస్ సిరీస్‌ను ఆసీస్ నిలబెట్టుకుంది. మల్టీ ఫార్మాట్లో జరిగిన ఈ సిరీస్‌ను ఆసీస్ 8-8 పాయింట్లతో సమం చేసుకుంది. నిన్న జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ నెగ్గినప్పటికీ, డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆసీస్ టైటిల్ నిలబెట్టుకుంది. వన్డే సిరీస్ ఇంగ్లండ్‌దే.. వర్షం అంతరాయాల నడుమ సాగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 69 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. Alyssa Healy reckons there's an opportunity for the @AusWomenCricket team to reset following a drawn #Ashes series pic.twitter.com/gZbbkCgFxp — cricket.com.au (@cricketcomau) July 18, 2023 వరుసగా రెండో వన్డేలోనూ సెంచరీ చేసిన నాట్ సీవర్ బ్రంట్.. నాట్ సీవర్ బ్రంట్ వరుసగా రెండో వన్డేలోనూ సెంచరీ (129) చేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కీలకపాత్ర పోషించింది. అనంతరం ఆసీస్ బ్యాటింగ్‌కు దిగే ముందు వర్షం మొదలుకావడంతో ఆ జట్టు లక్ష్యాన్ని 44 ఓవర్లలో 269 పరుగులకు కుదించారు. చేతులెత్తేసిన ఆసీస్.. 269 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ చేతులెత్తేసింది. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించి, ఆసీస్‌ను 35.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ చేశారు. ఫలితంగా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1 తేడాతో (రెండో వన్డేలో ఆసీస్ గెలుపు) కైవసం చేసుకుంది. Series drawn! Is this the best Women's #Ashes we've ever seen? pic.twitter.com/TtwwMhds0f — cricket.com.au (@cricketcomau) July 18, 2023 టీ20 సిరీస్ కూడా ఇంగ్లండ్‌దే.. వన్డే సిరీస్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ను ఆతిధ్య జట్టు 2-1 తేడాతో (తొలి టీ20లో ఆసీస్ గెలుపు) గెలుచుకుంది. Neither were entirely satisfied, nor downbeat. But both recognised they’d been part of something special #Ashes | @JollyLauz18 https://t.co/5znIBCCxxp — cricket.com.au (@cricketcomau) July 18, 2023 ఆసీస్ యాషెస్‌ను ఎలా నిలుపుకుందంటే..? మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో గెలవడంతో ఆసీస్ ఖాతాలో 4 పాయింట్లు చేరాయి. ఆతర్వాత జరిగిన టీ20 సిరీస్‌ను ఆ జట్టు 1-2తో కోల్పోయినప్పటికీ, పాయింట్ల పరంగా (ఒక్కో గెలుపుకు 2 పాయింట్లు) అప్పటికీ ఆధిక్యంలోనే (6-4) ఉండింది. వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1 తేడాతో చేజిక్కించుకోవడంతో 8-8తో పాయింట్లు సమం అయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆసీస్ యాషెస్‌ను నిలుపుకుంది. -
వీరోచిత శతకం వృధా.. యాషెస్‌ను నిలుపుకున్న ఆసీస్
మహిళల యాషెస్ సిరీస్‌లో నిన్న (జులై 16) జరిగిన ఉత్కంఠ పోరులో ఆతిధ్య ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలో ఆసీస్ 3 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 1-1కి తగ్గించిన ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలుండగానే యాషెస్‌ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్ ఉండగానే ఎలా..? మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో గెలవడంతో 4 పాయింట్లు సాధించిన ఆసీస్, ఆతర్వాత జరిగిన టీ20 సిరీస్‌ను 1-2తో కోల్పోయినప్పటికీ, పాయింట్ల పరంగా (ఒక్కో గెలుపుకు 2 పాయింట్లు) అప్పటికీ ఆధిక్యంలోనే ఉండింది. అయితే తొలి వన్డేలో ఇంగ్లండ్ గెలవడంతో 6-6తో పాయింట్లు సమం అయ్యాయి. తాజాగా ఆసీస్ రెండో వన్డే గెలవడం ద్వారా ఇంగ్లండ్‌పై మళ్లీ ఆధిక్యత (8-6) సాధించింది. సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20లో ఒకవేళ ఇంగ్లండ్ గెలిచినా సిరీస్ 8-8తో సమం అవుతుంది. అప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆసీస్ యాషెస్‌ను నిలుపుకుంటుంది. మ్యాచ్ విషయానికొస్తే.. తీవ్ర ఉత్కంఠ రేపిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌పై ఆసీస్ పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేయగా.. ఆతర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్ అద్భుతంగా పోరాడినప్పటికీ గెలవలేకపోయింది. బ్రంట్ వీరోచిత శతకం వృధా.. 283 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను నాట్ సీవర్ బ్రంట్ (99 బంతుల్లో 111 నాటౌట్; 10 ఫోర్లు) గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. సీవర్‌కు ట్యామీ బేమౌంట్ (60), యామీ జోన్స్ (37), సారా గ్లెన్ (22 నాటౌట్) సహకరించినా ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 279 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆసీస్ 3 పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ గెలవాలంటే ఇంగ్లండ్ ఆఖరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సి రాగా.. 11 పరుగులే చేయడంతో ఓటమిపాలైంది. టీ20 సిరీస్ డిసైడర్ రేపు (జులై 18) జరుగనుంది. -
రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ పేసర్
ఇంగ్లండ్ స్టార్ మహిళా క్రికెటర్ కేథరీన్ హెలెన్ స్కీవర్ బ్రంట్ 19 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగతున్నట్లు ఆమె ఇవాళ (మే 5) ప్రకటించింది. ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున బ్రంట్ చివరిసారిగా ఫిబ్రవరిలో సౌతాఫ్రికా వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొంది. 2004లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన 37 ఏళ్ల బ్రంట్.. ఇంగ్లండ్ గెలిచిన రెండు వరల్డ్‌కప్‌ల్లో, ఓ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఉంది. రైట్ ఆర్మ ఫాస్ట్ బౌలర్, లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ అయిన బ్రంట్.. 14 టెస్ట్‌ల్లో 51 వికెట్లు, 184 పరుగుల.. 141 వన్డేల్లో 170 వికెట్లు, 1090 పరుగులు.. 112 టీ20ల్లో 114 వికెట్లు, 590 పరుగులు చేసింది. బ్రంట్.. టెస్ట్‌ల్లో 3 సార్లు, వన్డేల్లో 5 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనను నమోదు చేసింది. ఈమె ఖాతాలో 2 వన్డే హాఫ్ సెంచరీలు, ఓ టెస్ట్ అర్ధశతకం కూడా ఉన్నాయి. కెరీర్ చరమాంకం వరకు ఫాస్ట్ బౌలర్‌గా రాణించిన బ్రంట్.. ఇంగ్లండ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా నాలుగు సార్లు ఎంపికైంది. బ్రంట్.. 2009 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై అత్యుత్తమ ప్రదర్శన (3/6) కనబర్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. బ్రంట్.. 2022 మేలో సహచర మహిళా క్రికెటర్ నాట్ స్కీవర్‌ను వివాహం చేసుకుంది. -
స్కివర్ విధ్వంసం.. యూపీ ముందు భారీ లక్ష్యం
మహిళల ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా యూపీ వారియర్జ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జూలు విదిలించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ముంబై బ్యాటర్లలో నాట్ స్కివర్(72 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడగా.. కేర్(29), మాథ్యూస్(26) పరుగులతో రాణించారు. స్కివర్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు,2 సిక్స్‌లు ఉన్నాయి. ఇక యూపీ బౌలర్లలో ఎకిలిస్టోన్ రెండు వికెట్లు పడగొట్టగా, అంజిలి శార్వాణి, ప్రసవి చోప్రా తలా వికెట్ సాధించారు. తుది జట్లు: ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమెలీయా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్ యూపీ వారియర్జ్: అలిస్సా హీలీ(కెప్టెన్), శ్వేతా సెహ్రావత్, సిమ్రాన్ షేక్, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వాణి, పార్షవి చోప్రా, రాజేశ్వరి గైక్వాడ్ చదవండి: IPL 2023: పంత్ స్థానంలో విధ్వంసకర ఆటగాడు.. ఎవరంటే? -
T20 WC: అత్యుత్తమ జట్టును ప్రకటించిన ఐసీసీ.. భారత్ నుంచి ఒకే ఒక్కరు!
Women's T20 World Cup 2023: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2023 ఈవెంట్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి ‘మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ని ప్రకటించింది. ఈ అత్యుత్తమ జట్టులో భారత్ నుంచి ఒకే ఒక్క బ్యాటర్‌కు చోటు దక్కింది. అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యురాలైన వికెట్ కీపర్ రిచా ఘోష్ ఐసీసీ జట్టులో స్థానం సంపాదించింది. ఈ మెగా టోర్నీలో రిచా 130కి పైగా స్ట్రైక్‌రేటుతో 136 పరుగులు చేసింది. పాకిస్తాన్‌పై 31(నాటౌట్), వెస్టిండీస్‌పై 44(నాటౌట్), ఇంగ్లండ్‌పై 47(నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. అదే విధంగా ఐదు క్యాచ్‌లు, రెండు స్టంపింగ్స్‌లో రిచా ఘోష్ భాగస్వామ్యమైంది. ఇదిలా ఉంటే.. మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ జట్టుకు ఇంగ్లండ్ క్రికెటర్ నాట్ సీవర్ బ్రంట్ కెప్టెన్‌గా ఎన్నికైంది. ఇక ఈ జట్టులో అత్యధికంగా విజేత ఆస్ట్రేలియాకు చెందిన నలుగురు ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. ఐసీసీ మహిళా ప్రపంచకప్-2023 మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఇదే(బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం): 1. తజ్మీన్ బ్రిట్స్ (సౌతాఫ్రికా)- 186 పరుగులు సగటు 37.20 2. అలిసా హేలీ(వికెట్ కీపర్- ఆస్ట్రేలియా)- 189 పరుగులు సగటు 47.25, నాలుగు డిస్మిసల్స్ 3. లారా వాల్వర్ట్(సౌతాఫ్రికా)- 230 పరుగులు సగటు 46 4. నాట్ సీవర్- బ్రంట్(కెప్టెన్- ఇంగ్లండ్)- 216 పరుగులు సగటు 72 5. ఆష్లే గార్డ్నర్ (ఆస్ట్రేలియా)- 110 పరుగులు 36.66, 10 వికెట్లు 6. రిచా ఘోష్(ఇండియా)- 136 పరుగులు సగటు 68 7. సోఫీ ఎక్లిస్టోన్(ఇంగ్లండ్)- 11 వికెట్లు 8. కరిష్మ రామ్హరక్(వెస్టిండీస్)- 5 వికెట్లు 9. షబ్నిమ్ ఇస్మాయిల్ (సౌతాఫ్రికా)- 8 వికెట్లు 10. డార్సీ బ్రౌన్ (ఆస్ట్రేలియా)- 7 వికెట్లు 11. మేగన్ షట్(ఆస్ట్రేలియా)- 10 వికెట్లు 12: ఓర్లా ఫ్రెండర్గాస్ట్(ఐర్లాండ్)- 109 పరుగులు సగటు 27.25. సెమీస్‌లోనే.. ఇక భారత మహిళా క్రికెట్‌కు తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన అండర్-19 కెప్టెన్, ఓపెనర్ షఫాలీ వర్మ సీనియర్ టీమ్ వరల్డ్‌కప్ ఈవెంట్లో ఆకట్టుకోలేకపోయింది. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ సైతం అంచనాల మేర రాణించలేకపోయారు. ఇక ఈ ఈవెంట్లో హర్మన్ సేన సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. చదవండి: సూర్య కాదు.. ఆ ఆసీస్ బ్యాటర్ వల్లేనన్న ఆజం ఖాన్! ‘స్కై’తో నీకు పోలికేంటి? Shaheen Afridi: తొలి బంతికి బ్యాట్ రెండు ముక్కలైంది.. రెండో బంతికి వికెట్ ఎగిరిపడింది -
బాబర్ ఆజమ్‌కు డబుల్ ధమాకా.. వన్డే క్రికెటర్ అవార్డుతో పాటు ఐసీసీ అత్యున్నత ట్రోఫీ
Sir Garfield Sobers Trophy 2022: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు ఈ ఏడాది ఐసీసీ అవార్డుల పంట పండింది. ఇప్పటికే ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డు దక్కించుకున్న బాబర్.. తాజాగా ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. ఇందుకు గానూ ఐసీసీ బాబర్‌ను సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ-2022తో సత్కరించింది. ఈ అవార్డు రేసులో బాబర్‌తో పాటు ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీలు పోటీ పడినప్పటికీ, ఐసీసీ వరల్డ్ గవర్నింగ్ బాడీ బాబర్ వైపే మొగ్గుచూపింది. బాబర్ 2022లో అన్ని ఫార్మాట్లలో కలిపి 44 మ్యాచ్‌ల్లో 54.12 సగటున 2598 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శనను పరిగణలోకి తీసుకునే ఐసీసీ బాబర్‌ను ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది. Double delight for Babar Azam 🤩After being named the ICC Men's ODI Cricketer of the Year, the Pakistan star bags the Sir Garfield Sobers Trophy for the ICC Men's Cricketer of the Year 👏#ICCAwards— ICC (@ICC) January 26, 2023 2021లో ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్న బాబర్.. వరుసగా రెండో ఏడాది కూడా అవార్డు దక్కించుకున్నాడు. ఎంఎస్ ధోనీ, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి తర్వాత వరుసగా రెండో ఏడాది ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్న ఆటగాడిగా బాబర్ రికార్డులకెక్కాడు. 2022లో బాబర్ 9 వన్డేల్లో 84.87 సగటున మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీల సాయంతో 679 పరుగులు చేశాడు. ప్రస్తుతం బాబర్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ నంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. 2021 జూలైలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం చేసుకున్న బాబర్.. దాదాపు ఏడాదిన్నరగా ఐసీసీ టాప్ వన్డే బ్యాటర్‌గా చలామణి అవుతున్నాడు. మరోవైపు, ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ అఫ్ ద ఇయర్ 2022 అవార్డును ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ నతాలీ సీవర్ గెలుచుకుంది. సీవర్ గతేడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 33 మ్యాచ్‌లు ఆడి 22 వికెట్లు, 1346 పరుగులు చేసింది. ఈ అవార్డుకు ముందు సీవర్ 2022 ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా గెలుచుకుంది. England's talismanic all-rounder caps off a phenomenal 2022 with the Rachael Heyhoe Flint Trophy for ICC Women’s Cricketer of the Year 👌#ICCAwards— ICC (@ICC) January 26, 2023 ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ అఫ్ ద ఇయర్ 2022 అవార్డు గెలుచుకున్నందుకు గానూ ఐసీసీ సీవర్‌ను రేచల్ హేహోయ్ ఫ్లింట్ ట్రోఫీతో (Rachael Heyhoe Flint Trophy) సత్కరించింది. కాగా, మెన్స్, వుమెన్స్ విభాగంలో వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు (2022) గెలిచిన ప్లేయర్లు (బాబర్, సీవర్) ఐసీసీ క్రికెటర్ అఫ్ ద ఇయర్ అవార్డు కూడా గెలుచుకోవడం విశేషం. -
భారత్‌తో టీ20 సిరీస్.. ఇంగ్లండ్‌కు భారీ షాక్!
స్వదేశంలో భారత మహిళలతో టీ20 సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, స్టాండింగ్ కెప్టెన్ నాట్ స్కివర్ టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌కు కూడా దూరమైంది. మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా స్కివర్ ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే రెగ్యులర్ కెప్టెన్ హీథర్ నైట్ గాయం కారణంగా భారత్ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నైట్ స్థానంలో స్కివర్‌కు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అప్పగించింది. తాజాగా స్కివర్ కూడా తప్పుకోవడంతో ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. ఇక స్కివర్ స్థానంలో ఇంగ్లీష్ జట్టుకు కెప్టెన్‌గా వికెట్ కీపర్ అమీ జోన్స్ కెప్టెన్‌గా ఎంపికైంది. ఇక ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా శనివారం జరగనున్న తొలి టీ20తో భారత్ టూర్ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ జట్టు: లారెన్ బెల్, మైయా బౌచియర్, ఆలిస్ క్యాప్సే, కేట్ క్రాస్, ఫ్రెయా డేవిస్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, సారా గ్లెన్, అమీ జోన్స్ (కెప్టెన్), ఫ్రెయా కెంప్, బ్రయోనీ స్మిత్, ఇస్సీ వాంగ్, డాని వ్యాట్ భారత జట్టు: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, తనియా భాటియా(వికెట్ కీపర్), స్నేహ రాణా, రాధా యాదవ్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, రాజేశ్వరి గయాక్వాడ్, సబ్బినేని మేఘనా, సబ్బినేని మేఘనా హేమలత, రిచా ఘోష్, సిమ్రాన్ బహదూర్, కిరణ్ నవ్‌గిరే చదవండి: Asia Cup 2022: 'కెప్టెన్ రిజ్వాన్ కాదు.. నేను'.. అంపైర్‌పై బాబర్ ఆజాం ఆగ్రహం