స్కివర్‌ విధ్వంసం.. యూపీ ముందు భారీ లక్ష్యం | Nat Sciver Brunt stars with 72 as Mumbai Indians post 1824 against up | Sakshi
Sakshi News home page

WPL 2023: స్కివర్‌ విధ్వంసం.. యూపీ ముందు భారీ లక్ష్యం

Published Fri, Mar 24 2023 9:15 PM | Last Updated on Fri, Mar 24 2023 9:24 PM

Nat Sciver Brunt stars with 72 as Mumbai Indians post 1824 against up - Sakshi

మహిళల ప్రీమియర్‌ లీగ్‌-2023లో భాగంగా  యూపీ వారియర్జ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ జూలు విదిలించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

ముంబై బ్యాటర్లలో నాట్‌ స్కివర్‌(72 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడగా.. కేర్‌(29), మాథ్యూస్‌(26) పరుగులతో రాణించారు. స్కివర్‌ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు,2 సిక్స్‌లు ఉన్నాయి. ఇక  యూపీ బౌలర్లలో ఎకిలిస్టోన్‌ రెండు వికెట్లు పడగొట్టగా, అంజిలి శార్వాణి, ప్రసవి చోప్రా తలా వికెట్‌ సాధించారు.

తుది జట్లు:
ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా(వికెట్‌ కీపర్‌), నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్‌), అమెలీయా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్

యూపీ వారియర్జ్: అలిస్సా హీలీ(కెప్టెన్‌), శ్వేతా సెహ్రావత్, సిమ్రాన్ షేక్, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వాణి, పార్షవి చోప్రా, రాజేశ్వరి గై‍క్వాడ్‌
చదవండి: IPL 2023: పంత్‌ స్థానంలో విధ్వంసకర ఆటగాడు.. ఎవరంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement