రిచా ఘోష్ (ఫైల్ ఫొటో)
Women's T20 World Cup 2023: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2023 ఈవెంట్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి ‘మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ని ప్రకటించింది. ఈ అత్యుత్తమ జట్టులో భారత్ నుంచి ఒకే ఒక్క బ్యాటర్‌కు చోటు దక్కింది. అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యురాలైన వికెట్ కీపర్ రిచా ఘోష్ ఐసీసీ జట్టులో స్థానం సంపాదించింది.
ఈ మెగా టోర్నీలో రిచా 130కి పైగా స్ట్రైక్‌రేటుతో 136 పరుగులు చేసింది. పాకిస్తాన్‌పై 31(నాటౌట్), వెస్టిండీస్‌పై 44(నాటౌట్), ఇంగ్లండ్‌పై 47(నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది.
అదే విధంగా ఐదు క్యాచ్‌లు, రెండు స్టంపింగ్స్‌లో రిచా ఘోష్ భాగస్వామ్యమైంది. ఇదిలా ఉంటే.. మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ జట్టుకు ఇంగ్లండ్ క్రికెటర్ నాట్ సీవర్ బ్రంట్ కెప్టెన్‌గా ఎన్నికైంది. ఇక ఈ జట్టులో అత్యధికంగా విజేత ఆస్ట్రేలియాకు చెందిన నలుగురు ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు.
ఐసీసీ మహిళా ప్రపంచకప్-2023 మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఇదే(బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం):
1. తజ్మీన్ బ్రిట్స్ (సౌతాఫ్రికా)- 186 పరుగులు సగటు 37.20
2. అలిసా హేలీ(వికెట్ కీపర్- ఆస్ట్రేలియా)- 189 పరుగులు సగటు 47.25, నాలుగు డిస్మిసల్స్
3. లారా వాల్వర్ట్(సౌతాఫ్రికా)- 230 పరుగులు సగటు 46
4. నాట్ సీవర్- బ్రంట్(కెప్టెన్- ఇంగ్లండ్)- 216 పరుగులు సగటు 72
5. ఆష్లే గార్డ్‌నర్ (ఆస్ట్రేలియా)- 110 పరుగులు 36.66, 10 వికెట్లు
6. రిచా ఘోష్(ఇండియా)- 136 పరుగులు సగటు 68
7. సోఫీ ఎక్లిస్టోన్(ఇంగ్లండ్)- 11 వికెట్లు
8. కరిష్మ రామ్‌హరక్(వెస్టిండీస్)- 5 వికెట్లు
9. షబ్నిమ్ ఇస్మాయిల్ (సౌతాఫ్రికా)- 8 వికెట్లు
10. డార్సీ బ్రౌన్ (ఆస్ట్రేలియా)- 7 వికెట్లు
11. మేగన్ షట్(ఆస్ట్రేలియా)- 10 వికెట్లు
12: ఓర్లా ఫ్రెండర్‌గాస్ట్(ఐర్లాండ్)- 109 పరుగులు సగటు 27.25.
సెమీస్‌లోనే..
ఇక భారత మహిళా క్రికెట్‌కు తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన అండర్-19 కెప్టెన్, ఓపెనర్ షఫాలీ వర్మ సీనియర్ టీమ్ వరల్డ్‌కప్ ఈవెంట్‌లో ఆకట్టుకోలేకపోయింది. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ సైతం అంచనాల మేర రాణించలేకపోయారు. ఇక ఈ ఈవెంట్‌లో హర్మన్ సేన సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే.
చదవండి: సూర్య కాదు.. ఆ ఆసీస్ బ్యాటర్ వల్లేనన్న ఆజం ఖాన్! ‘స్కై’తో నీకు పోలికేంటి?
Shaheen Afridi: తొలి బంతికి బ్యాట్ రెండు ముక్కలైంది.. రెండో బంతికి వికెట్ ఎగిరిపడింది
Comments
Please login to add a commentAdd a comment