ICC Women's T20 World Cup 2023
-
బీసీసీఐకి హెచ్‌సీఏ షాక్... మరోసారి ప్రపంచ కప్ షెడ్యూల్లో మార్పులు?
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 46 రోజుల్లో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. అయితే ఈ మెగా టోర్నీకి ముందు ఐసీసీ, బీసీసీఐకి మరో తలనొప్పి వచ్చి పడింది. కొత్తగా ప్రకటించిన వరల్డ్‌కప్ షెడ్యూల్లో మార్పులు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సిఏ) బీసీసీఐను అభ్యర్దించినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అభ్యర్ధన మెరకు ముందుగా ప్రకటించిన షెడ్యూల్లో ఐసీసీ స్వల్ప మార్పులు చేసిన సంగతి తెలిసిందే. కొత్త షెడ్యూల్ ప్రకారం మరో వారం రోజుల్లో టికెట్ల విక్రయాలకు కూడా బీసీసీఐ సిద్దమైంది. అంంతలోనే హెచ్‌సీఏ.. భారత క్రికెట్ బోర్డుకు షాకిచ్చింది. కాగా వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ ప్రకారం, హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 9వ తేదీన న్యూజిల్యాండ్, నెదర్లాండ్స్ తలపడనున్నాయి. ఆ మరుసటి రోజే(ఆక్టోబర్) 10వ తేదీన పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇలా వరుస రోజుల్లో మ్యాచ్‌లకు భద్రత కల్పించడం తమకు కష్టమవుతుందని హైదరాబాద్ పోలీసులు హెచ్‌సిఎకు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులల అభ్యర్దను పరిగణలోకి తీసుకున్న హెచ్సిఏ.. ఇదే విషయంపై బీసీసీఐకు లేఖ రాసింది. కాగా వాస్తవానికి పాక్-శ్రీలంక మ్యాచ్ ఆక్టోబర్ 12 హైదారాబాద్గా జరగాల్సింది. కానీ ఐసీసీ షెడ్యూల్ మార్చడంతో ఆ మ్యాచ్ రెండు రోజులు ముందు వచ్చింది. ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రిక్వెస్ట్‌పై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి చదవండి: ODI WC 2023: సంజూ శాంసన్ కాదు.. వన్డే ప్రపంచకప్‌లో భారత వికెట్ కీపర్ అతడే! -
T20 WC: అత్యుత్తమ జట్టును ప్రకటించిన ఐసీసీ.. భారత్ నుంచి ఒకే ఒక్కరు!
Women's T20 World Cup 2023: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2023 ఈవెంట్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి ‘మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ని ప్రకటించింది. ఈ అత్యుత్తమ జట్టులో భారత్ నుంచి ఒకే ఒక్క బ్యాటర్‌కు చోటు దక్కింది. అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యురాలైన వికెట్ కీపర్ రిచా ఘోష్ ఐసీసీ జట్టులో స్థానం సంపాదించింది. ఈ మెగా టోర్నీలో రిచా 130కి పైగా స్ట్రైక్‌రేటుతో 136 పరుగులు చేసింది. పాకిస్తాన్‌పై 31(నాటౌట్), వెస్టిండీస్‌పై 44(నాటౌట్), ఇంగ్లండ్‌పై 47(నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. అదే విధంగా ఐదు క్యాచ్‌లు, రెండు స్టంపింగ్స్‌లో రిచా ఘోష్ భాగస్వామ్యమైంది. ఇదిలా ఉంటే.. మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ జట్టుకు ఇంగ్లండ్ క్రికెటర్ నాట్ సీవర్ బ్రంట్ కెప్టెన్‌గా ఎన్నికైంది. ఇక ఈ జట్టులో అత్యధికంగా విజేత ఆస్ట్రేలియాకు చెందిన నలుగురు ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. ఐసీసీ మహిళా ప్రపంచకప్-2023 మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఇదే(బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం): 1. తజ్మీన్ బ్రిట్స్ (సౌతాఫ్రికా)- 186 పరుగులు సగటు 37.20 2. అలిసా హేలీ(వికెట్ కీపర్- ఆస్ట్రేలియా)- 189 పరుగులు సగటు 47.25, నాలుగు డిస్మిసల్స్ 3. లారా వాల్వర్ట్(సౌతాఫ్రికా)- 230 పరుగులు సగటు 46 4. నాట్ సీవర్- బ్రంట్(కెప్టెన్- ఇంగ్లండ్)- 216 పరుగులు సగటు 72 5. ఆష్లే గార్డ్నర్ (ఆస్ట్రేలియా)- 110 పరుగులు 36.66, 10 వికెట్లు 6. రిచా ఘోష్(ఇండియా)- 136 పరుగులు సగటు 68 7. సోఫీ ఎక్లిస్టోన్(ఇంగ్లండ్)- 11 వికెట్లు 8. కరిష్మ రామ్హరక్(వెస్టిండీస్)- 5 వికెట్లు 9. షబ్నిమ్ ఇస్మాయిల్ (సౌతాఫ్రికా)- 8 వికెట్లు 10. డార్సీ బ్రౌన్ (ఆస్ట్రేలియా)- 7 వికెట్లు 11. మేగన్ షట్(ఆస్ట్రేలియా)- 10 వికెట్లు 12: ఓర్లా ఫ్రెండర్గాస్ట్(ఐర్లాండ్)- 109 పరుగులు సగటు 27.25. సెమీస్‌లోనే.. ఇక భారత మహిళా క్రికెట్‌కు తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన అండర్-19 కెప్టెన్, ఓపెనర్ షఫాలీ వర్మ సీనియర్ టీమ్ వరల్డ్‌కప్ ఈవెంట్లో ఆకట్టుకోలేకపోయింది. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ సైతం అంచనాల మేర రాణించలేకపోయారు. ఇక ఈ ఈవెంట్లో హర్మన్ సేన సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. చదవండి: సూర్య కాదు.. ఆ ఆసీస్ బ్యాటర్ వల్లేనన్న ఆజం ఖాన్! ‘స్కై’తో నీకు పోలికేంటి? Shaheen Afridi: తొలి బంతికి బ్యాట్ రెండు ముక్కలైంది.. రెండో బంతికి వికెట్ ఎగిరిపడింది -
T20 WC: సఫారీల చరిత్రలో తొలిసారి.. ఫైనల్లో ఆసీస్‌తో పోరుకు సై
ICC Womens T20 World Cup 2023- SA_W Vs Eng_ W: ఐసీసీ టోర్నీల్లో ఆరంభ దశలో రాణించడం, అసలు మ్యాచ్‌లకు వచ్చేసరికి బోర్లా పడటం దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు అలవాటే. పురుషులతో పాటు మహిళల టీమ్‌లోనూ ఇది చాలాసార్లు కనిపించింది. ఇప్పుడు వీటికి ముగింపు పలుకుతూ దక్షిణాఫ్రికా మహిళల టీమ్ టి20 ప్రపంచకప్‌లో ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల, మహిళల జట్లను కలిపి చూస్తే ఏ ఫార్మాట్లోనైనా సఫారీ టీమ్(సీనియర్) ఐసీసీ టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి కావడం విశేషం. సొంతగడ్డపై లీగ్ దశలో తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో అనూహ్యంగా ఓడిన తర్వాత కోలుకున్న టీమ్ ఇప్పుడు తుది సమరానికి సిద్ధమైంది. కేప్‌టౌన్‌లో శుక్రవారం జరిగిన రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికా 6 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. బ్రిట్స్ హాఫ్ సెంచరీ ముందుగా దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తజ్మీన్ బ్రిట్స్ (55 బంతుల్లో 68; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), లౌరా వాల్వర్ట్ (44 బంతుల్లో 53; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 82 బంతుల్లో 96 పరుగులు జోడించారు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులే చేయగలిగింది. నాట్ సీవర్ (34 బంతుల్లో 40; 5 ఫోర్లు) టాప్ స్కోరర్. షబ్నిమ్ ఇస్మాయిల్ (3/27), అయబొంగ ఖాక (4/29) ఇంగ్లండ్‌ను దెబ్బ తీశారు. షబ్నిమ్ వేసిన చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు అవసరం కాగా, ఇంగ్లండ్ 6 పరుగులే చేయగలిగింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. కాగా భారత జట్టుతో జరిగిన తొలి సెమీస్‌లో గెలుపొంది ఆసీస్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs Aus: మూడో టెస్టుకు కమిన్స్ దూరం.. బీసీసీఐ ట్వీట్! గ్రేట్ అంటున్న ఫ్యాన్స్ Ind Vs Aus: అంత సిల్లీగా అవుటవుతారా? అవునా అలా అన్నాడా? ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌కు హర్మన్ కౌంటర్.. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
అంత సిల్లీగా అవుటవుతారా? అవునా? ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌కు హర్మన్ కౌంటర్
ICC Womens T20 World Cup 2023- Harmanpreet Kaur: ‘‘అవునా...? ఆయన అలా అన్నాడా? పర్లేదు. నాకైతే ఆ విషయం తెలియదు. అయితే, అది ఆయన ఆలోచనా విధానానికి నిదర్శనం. అయినా కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పరుగులు తీసే క్రమంలో సింగిల్ పూర్తి చేసిన తర్వాత మరో పరుగుకు యత్నించినపుడు బ్యాట్ అలా అక్కడ స్టక్ అయిపోయింది. నిజంగా అదో దురదృష్టకర పరిణామం. మేము ఈ మ్యాచ్‌లో మరీ అంత చెత్తగా ఫీల్డింగ్ చేయలేదు. కొన్నిసార్లు బాగా బౌలింగ్ చేయకపోవచ్చు.. మరికొన్ని సార్లు సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవచ్చు. అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణిస్తేనే మ్యాచ్ గెలవగలం. ఈరోజు మా ప్రదర్శన బాగానే ఉంది. కానీ దురదృష్టవశాత్తూ ఇలా జరిగిపోయింది. ఇక రనౌట్ విషయానికొస్తే.. ఆయనన్నట్లు అదేమీ స్కూల్ గర్ల్ మిస్టేక్ కాదు. మేము పరిణతి కలిగిన ఆటగాళ్లమే. నేను గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా. ఆయన అలా ఆలోచిస్తే నేనేమీ చేయలేను. అయితే, కచ్చితంగా అది స్కూల్ గర్ల్ మిస్టేక్ కాదని మాత్రం చెప్పగలను’’ అంటూ భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇంగ్లండ్ మాజీ సారథి, కామెంటేటర్ నాసిర్ హుస్సేన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. సెమీస్ భారత్ ఓటమి కాగా సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ20 మహిళా ప్రపంచకప్-2023 టోర్నీ తొలి సెమీ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడ్డ సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆరంభంలోనే తడబడ్డా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జెమీమా రోడ్రిగ్స్, ఐదో స్థానంలో వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్ గెలుపు ఆశలు చిగురింపజేశారు. అనూహ్య రీతిలో రనౌట్ జెమీమా 24 బంతుల్లో 43 పరుగులతో రాణించగా.. హర్మన్ 34 బంతుల్లో 52 పరుగులతో మెరిసింది. అయితే, 14.4 వోర్ వద్ద ఆసీస్ బౌలర్ వారెహాం బౌలింగ్‌లో హర్మన్ దురదృష్టకర రీతిలో రనౌట్ అయింది. సింగిల్ పూర్తి చేసిన మరో పరుగు తీసే క్రమంలో.. డైవ్ చేసి బంతిని ఆపిన గార్డ్నర్వికెట్ కీపర్ వైపు బాల్ విసిరింది. ఆ సమయంలో హర్మన్ సులువుగానే క్రీజులోకి చేరుకుంటుందన్నట్లు కనిపించినా బ్యాట్ స్టక్ అయిపోవడంతో.. అప్పటికే బంతిని అందుకున్న హేలీ బెయిల్స్‌ను పడగొట్టింది. దీంతో హర్మన్ రనౌట్‌గా వెనుదిరిగింది. ఇదే మ్యాచ్‌ను ఆసీస్ వైపు తిప్పింది. ఆఖరి వరకు పోరాడిన టీమిండియా 5 పరుగుల తేడాతో ఓడి ఇంటిబాట పట్టింది. అతడికి కౌంటర్ ఇదిలా ఉంటే.. హర్మన్ రనౌట్‌పై కామెంటేటర్ నాసిర్ హుస్సేన్ స్పందిస్తూ.. కాస్తైనా పరిణతి లేకుండా చిన్న పిల్ల మాదిరి ఏంటిది అన్న అర్థంలో స్కూల్ గర్ల్ ఎర్రర్ అంటూ లైవ్‌లో వ్యాఖ్యానించాడు. ఇంత సిల్లీగా అవుటవుతారా అని కామెంట్ చేశాడు. ఈ విషయం గురించి మ్యాచ్ తర్వాత హర్మన్‌కు ప్రశ్న ఎదురుకాగా.. ఆమె పైవిధంగా స్పందిస్తూ అతడికి కౌంటర్ ఇచ్చింది. చదవండి: Ind Vs Aus: భారత పిచ్‌లపై ఆస్ట్రేలియా నిందలు.. ఐసీసీ రేటింగ్ ఎలా ఉందంటే! Tim Southee: టిమ్ సౌథీ అరుదైన ఘనత.. సరికొత్త రికార్డు.. 700 వికెట్లతో.. View this post on Instagram A post shared by ICC (@icc) -
కన్నీటి పర్యంతమైన హర్మన్... అక్కున చేర్చుకున్న అంజుమ్.. వీడియో
ICC Womens T20 World Cup 2023: ఇటీవలే సౌతాఫ్రికాలో అండర్-19 టీ20 వరల్డ్‌కప్-2023లో మన అమ్మాయిలు అదరగొట్టి ఐసీసీ టైటిల్ గెలిచారు. అదే జోష్‌ను కొనసాగిస్తూ అదే గడ్డపై ట్రోఫీని ముద్దాడాలని హర్మన్‌ప్రీత్ సేన భావించింది. అందుకు తగ్గట్లుగానే మెరుగైన ప్రదర్శనతో టీ20 మహిళా ప్రపంచకప్-2023 టోర్నీలో సెమీస్‌కు దూసుకెళ్లింది. అయితే, కీలక మ్యాచ్‌కు ముందు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అనారోగ్యం బారిన పడిందన్న వార్త అభిమానులను కలవరపెట్టింది. అయినప్పటికీ, పటిష్ట ఆస్ట్రేలియాను ఎదుర్కొనే క్రమంలో బరిలోకి దిగిన హర్మన్ అద్భుత ఇన్నింగ్స్(34 బంతుల్లో 52 పరుగులు) ఆడింది. 173 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా జెమీమా రోడ్రిగ్స్ 24 బంతుల్లో 43 పరుగులతో చెలరేగగా.. హర్మన్ అర్ధ శతకంతో మెరిసింది. అయితే, ఆమె రనౌట్ కావడం టీమిండియా అవకాశాలను దెబ్బతీసింది. ఆఖరి వరకు పోరాడినా గెలుపు గీత దాటలేక ఓటమి ముందు తలవంచింది. మరోసారి ప్రపంచకప్ ట్రోఫీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. గత ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత్ ఈసారి సెమీస్‌లోనే ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కన్నీటిపర్యంతమైంది. అద్భుత పోరాట పటిమ కనబరిచినా.. పరాజయం తప్పకపోవడంతో ఓటమిని జీర్ణించుకోలేక తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న భారత మాజీ సారథి అంజుమ్ చోప్రా హర్మన్‌ను అక్కున చేర్చుకుని ఓదార్చింది. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని హర్మన్‌కు ఓదార్పు మాటలు చెప్పింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా మ్యాచ్ ప్రెజెంటేషన్ సమయంలో సన్‌గ్లాసెస్ ధరించిన హర్మన్ తన కన్నీటిని మాతృదేశం చూడకూడదనే ఉద్దేశంతోనే వాటిని ధరించినట్లు చెప్పిన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs Aus: భారత పిచ్‌లపై ఆస్ట్రేలియా నిందలు.. ఐసీసీ రేటింగ్ ఎలా ఉందంటే! PSL 2023: బౌలర్‌ను బ్యాట్‌తో కొట్టడానికి వెళ్లిన పాకిస్తాన్ కెప్టెన్! వీడియో వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2023 Semi Final: పోరాడి ఓడిన భారత్.. టోర్నీ నుంచి ఔట్
India Women Vs Australia Women Live Updates: పోరాడి ఓడిన భారత్.. టోర్నీ నుంచి ఔట్ మహిళల టీ20 ప్రపంచకప్-2023లో టీమిండియా ప్రయాణం ముగిసింది. కేప్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు పోరాడి ఓడింది. ఆసీస్ చేతిలో 5 పరుగుల తేడాతో ఓటమి చవి చూసిన భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. అయితే భారత విజయం ఖాయం అనుకున్న దశలో.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రనౌట్‌గా వెనుదిరిగడం మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. 52 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ రనౌట్‌గా వెనుదిరిగింది. హర్మన్ పాటు జెమీమా రోడ్రిగ్స్(24 బంతుల్లో 43 పరుగులు) రాణించింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో బ్రౌన్,గార్డనర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా స్కాట్, జానసెన్ తలా వికెట్ సాధించారు. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ మూనీ(54),మెగ్ లానింగ్(49 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు, రాధా యాదవ్, దీప్తి శర్మ తలా వికెట్ సాధించారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. హర్మన్‌ప్రీత్ ఔట్ 133 పరుగులు వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. అద్భుతంగా ఆడుతున్న భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(52) రనౌట్‌గా వెనుదిరిగింది. భారత విజయానికి 28 బంతుల్లో 39 పరుగులు కావాలి. 14 ఓవర్లకు భారత స్కోర్: 124/4 14 ఓవర్లు ముగిసే సరికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. భారత విజయానికి 36 బంతుల్లో 49 పరుగులు కావాలి. క్రీజులో హర్మన్‌ప్రీత్ కౌర్(43), రిచా ఘోష్(14) పరుగులతో ఉన్నారు. 173 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 10 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(39), హర్మన్‌ప్రీత్ కౌర్(33) పరుగులతో అద్భుతంగా ఆడుతున్నారు. రెండో వికెట్ కోల్పోయిన భారత్ 15 పరుగులు వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన స్మృతి మంధాన.. గార్డనర్ బౌలింగ్‌లో ఔటయ్యంది. తొలి వికెట్ కోల్పోయి భారత్ 173 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన షఫాలీ వర్మ.. స్కాట్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరింది. చెలరేగిన ఆసీస్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ లక్ష్యం భారత్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ మూనీ(54),మెగ్ లానింగ్(49 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు, రాధా యాదవ్, దీప్తి శర్మ తలా వికెట్ సాధించారు. 18 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 142/3 18 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. క్రీజులో మెగ్ లానింగ్(28), హ్యారీస్(1) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్ 89 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 54 పరుగులు చేసిన బెత్ మూనీ.. శిఖాపాండే బౌలింగ్‌లో షఫాలీ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. 12 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 89/2 తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ ►54 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన అలిస్సా హీలీ రాధాయాదవ్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగింది. 11 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 78/1 ►4 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. క్రీజులో అలిస్సా హీలీ(19),మూనీ(7) పరుగులతో ఉన్నారు. ►2 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. క్రీజులో అలిస్సా హీలీ(8),మూనీ(6) పరుగులతో ఉన్నారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2023 తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే అస్వస్థతకు గురైన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. జెస్ జోనాస్సెన్, వికెట్ కీపర్ అలిస్సా హీలీ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు భారత్ కూడా తమ జట్టులో మూడు మార్పులు చేసింది. యస్తిక భాటియా,స్నేహ రానా, రాధాయాదవ్ తుది జట్టులోకి వచ్చారు. తుది జట్లు: భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, యాస్తికా భాటియా, స్నేహ రాణా, శిఖా పాండే, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్ సింగ్ ఆస్ట్రేలియా : అలిస్సా హీలీ(వికెట్ కీపర్), బెత్ మూనీ, మెగ్ లానింగ్(కెప్టెన్), ఆష్లీ గార్డనర్, ఎల్లీస్ పెర్రీ, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, జార్జియా వేర్హామ్, జెస్ జోనాస్సెన్, మేగాన్ షట్, డార్సీ బ్రౌన్ -
T20 WC 2023: ఆసీస్‌తో సెమీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్!
ICC Womens T20 World Cup 2023: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2023 సెమీస్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్‌న్యూస్! కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్, ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ కీలక టీ20కి దూరమైనట్లు సమాచారం. అనారోగ్య కారణాల వల్ల వీరిద్దరు గురువారం(ఫిబ్రవరి 23) నాటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో పేర్కొంది. కాగా వరల్డ్‌కప్-2023 తొలి సెమీ ఫైనల్లో భాగంగా టీమిండియా- ఆస్ట్రేలియాతో తలపడనుంది. పటిష్ట కంగరూ జట్టును ఓడించి టైటిల్ గెలిచే దిశగా మరో ముందడుగు వేయాలని పట్టుదలగా ఉంది. గతంలో రెండు కీలక సందర్భాల్లో తమను ఓడించిన ఆసీస్‌కు సెమీస్‌లోనే చెక్ పెట్టాలన్న తలంపుతో ఉంది భారత మహిళా జట్టు. అస్వస్థతకు గురై ఈ క్రమంలో హర్మన్, పూజ అనారోగ్యం బారిన పడటం ఆందోళన రేకెత్తించింది. అస్వస్థతకు గురై బుధవారం ఆస్పత్రిలో చేరిన వీరిద్దరు డిశ్చార్జ్ అయినప్పటికీ మ్యాచ్ ఆడతారా లేదా అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. కాగా కెప్టెన్ హర్మన్ వరల్డ్‌కప్ తాజా ఎడిషన్‌లో నాలుగు మ్యాచ్‌లలో కలిపి 66 పరుగులు చేసింది. ఒకవేళ ఆమె జట్టుకు దూరమైతే యస్తికా భాటియా తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. మరోవైపు.. ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ స్థానంలో దేవిక వైద్య ఆడే ఛాన్స్ ఉంది. హర్మన్ ఆడనట్లయితే వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనుంది. టీ20 వరల్డ్‌కప్-2023 తొలి సెమీ ఫైనల్- తుది జట్లు (అంచనా) భారత్: స్మృతి మంధాన, షఫాలీ, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, రేణుక, యస్తికా భాటియా, దేవికా వైద్య. ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెప్టెన్), బెత్ మూనీ, అలీసా హీలీ, ఎలీస్ పెర్రీ, ఆష్లే గార్డ్నర్, తాలియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, జార్జియా, అలానా కింగ్, మేగన్ షుట్, డార్సీ బ్రౌన్. చదవండి: మహ్మద్ రిజ్వాన్ విధ్వంసకర శతకం.. 18 బంతుల్లోనే..! BGT 2023: ఆసీస్‌తో సిరీస్.. టీమిండియా క్రికెటర్ తండ్రి కన్నుమూత -
T20 WC: ఆ సిరీస్ గురించి ఇక్కడెందుకు? అయినా; టీమిండియా పటిష్ట జట్టు..
ICC Womens T20 World Cup 2023 - AusW vs IndW: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2023 సెమీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. భారత జట్టుపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యారా అంటూ ఓ విలేకరి ఆమెను ప్రశ్నించారు. భారత్‌లో టీమిండియా- ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీని వరల్డ్‌కప్ మ్యాచ్‌తో ముడిపెట్టి ప్రశ్నలు సంధించారు. ఆ సిరీస్ గురించి ఇక్కడెందుకు? అయినా.. భారత్‌లో ఆస్ట్రేలియా పురుషుల జట్టుకు టీమిండియా చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోబోతున్నారా అని అడిగారు. ఇందుకు బదులుగా.. ‘‘ఓహ్.. ఆ సిరీస్ గురించి ఇక్కడ మాట్లాడకూడదు. మా జట్టు అక్కడ అత్యుత్తమ రాణించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. పూర్తిస్థాయిలో సన్నద్ధమై వందకు వంద శాతం న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తోంది. వాళ్లకు మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది. రెండు టెస్టులు ముగిశాయి. అయితే, వాళ్లు మెరుగ్గానే ఆడారు. మిగిలిన వాటిలో మంచి ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది’’ అని మెగ్ లానింగ్ పేర్కొంది. ప్రతీకారం తీర్చుకునేందుకు! కాగా సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా గురువారం నాటి తొలి సెమీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. గతంలో రెండుసార్లు(ప్రపంచకప్, కామన్వెల్త్ గేమ్స్)లో ఫైనల్ పోరులో భారత మహిళా జట్టు ఆసీస్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే, ఈసారి సమిష్టిగా రాణించి కంగారూల ఫైనల్ అవకాశాలు గల్లంతు చేసి ప్రతీకారం తీర్చుకోవాలని హర్మన్‌ప్రీత్ సేన పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్‌కు ఈ మేర ప్రశ్న ఎదురైంది. దీంతో ఆమె పైవిధంగా స్పందించింది. టీమిండియా పటిష్ట జట్టు ఇక సెమీ ఫైనల్ గురించి మాట్లాడుతూ.. ‘‘టీమిండియా పటిష్ట జట్టు. రెండు జట్లు పరస్పరం ఎన్నోసార్లు పోటీపడ్డాయి. వాళ్ల జట్టులో వరల్డ్‌క్లాస్ క్రికెటర్లు, ఒంటిచేత్తో మ్యాచ్ మలుపు తిప్పగల ప్లేయర్లు ఉన్నారు. అలాంటి ఉత్తమ జట్టుతో పోటీ పడేందుకు మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అత్యుత్తమంగా రాణించి విజయం సాధించాలని కోరుకుంటున్నాం’’ అని మెగ్ లానింగ్ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 మొదటి రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్ సెమీ ఫైనల్- తుది జట్లు (అంచనా) భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్ ), స్మృతి మంధాన, షఫాలీ, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, పూజ, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్. రేణుక. ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెప్టెన్), బెత్ మూనీ, అలీసా హీలీ, ఎలీస్ పెర్రీ, ఆష్లే గార్డ్నర్, తాలియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, జార్జియా, అలానా కింగ్, మేగన్ షుట్, డార్సీ బ్రౌన్. చదవండి: Virat Kohli: కోహ్లిపై ఐస్లాండ్ క్రికెట్ ట్వీట్.. పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే.. ఫ్యాన్స్ ఫైర్ Ind Vs Aus: పాపం గిల్ ఎందుకు ఎదురుచూడాలి? మరి సంజూ మాటేమిటి? -
WC 2023: ఇక్కడ రోహిత్ సేన సూపర్.. అక్కడ మీరు కూడా ఆసీస్‌ను ఓడించి..
ICC Womens T20 World Cup 2023 - India vs Australia: ‘‘ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే ఆ మజానే వేరు. వాళ్లతో మ్యాచ్ ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాం. ఇరు జట్లకు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. అయితే, ఒత్తిడికి లోనుకాకుండా స్వేచ్ఛాయుతంగా బ్యాటింగ్ చేస్తేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలుగుతాం’’ అని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది. సెమీస్‌లో ఆసీస్‌తో అమీ తుమీ తేల్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కాగా ఐసీసీ టీ20 ప్రపంచకప్-2023 టోర్నీలో భాగంగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఐర్లాండ్‌ను ఓడించింది. స్మృతి అద్భుత ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికాలోని సెయింట్ జార్జ్ మైదానంలో సోమవారం జరిగిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ క్రమంలో డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో 5 పరుగుల తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది హర్మన్‌ప్రీత్ సేన. స్మృతి మంధాన అద్భుత ఇన్నింగ్స్ కారణంగా కీలక మ్యాచ్‌లో గెలుపొంది సెమీస్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23 నాటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీ ఫైనల్ జరుగనుంది. గొప్ప విషయం ఈ నేపథ్యంలో ఐర్లాండ్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ఓపెనర్ స్మృతి మంధానపై ప్రశంసలు కురిపించింది. ‘‘కీలక మ్యాచ్‌లో స్మృతి ఆడిన అత్యంత విలువైన ఇన్నింగ్స్ ఆడింది. తను శుభారంభం అందించిన ప్రతిసారి మేము భారీ స్కోరు చేయగలుగుతాం. ఈసారి కూడా అదే జరిగింది. సెమీస్ చేరడం ఎంతో గొప్ప విషయం. రోహిత్ సేన మాదిరే మీరు కూడా! ఇక్కడిదాకా చేరుకోవడానికి మేము చాలా కష్టపడ్డాం. ఇక సెమీస్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఉంది. వాళ్లతో పోటీలో మజా ఉంటుంది. ఫైనల్ చేరేందుకు మేము వందకు వంద శాతం ప్రయత్నిస్తాం’’ అని హర్మన్‌ప్రీత్‌కౌర్ చెప్పుకొచ్చింది. ఇక స్వదేశంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను చిత్తు చేస్తూ.. రోహిత్ సేన వరుస విజయాలు సాధిస్తున్న వేళ.. మహిళా జట్టు సైతం ఆసీస్‌ను వరల్డ్‌కప్ సెమీస్‌లో ఓడించాలని అభిమానులు కోరుకుంటున్నారు. హర్మన్‌ప్రీత్ బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో భారత క్రికెటర్ల రికార్డులు ►ఐర్లాండ్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టి20 క్రికెట్లో 150 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డు నెలకొల్పింది. 2009 తొలి టి20 ప్రపంచకప్‌లో మొదటి మ్యాచ్ ఆడిన హర్మన్ 2023లో టి20 ప్రపంచకప్‌లోనే తన 150వ మ్యాచ్ ఆడటం విశేషం. ►అంతర్జాతీయ మహిళల టి20ల్లో 3,000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో క్రికెటర్‌గా, భారత్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్ గుర్తింపు పొందింది. టాప్–3లో సుజీ బేట్స్ (3,820–న్యూజిలాండ్), మెగ్ లానింగ్ (3,346–ఆస్ట్రేలియా), స్టెఫానీ టేలర్ (3,166–వెస్టిండీస్) ఉన్నారు. ►టి20 ప్రపంచకప్ టోర్నీలో భారత మహిళల జట్టు సెమీఫైనల్ చేరుకోవడం ఇది ఐదోసారి. 2009, 2010, 2018లలో సెమీఫైనల్లో ఓడిన భారత్ 2020లో రన్నరప్‌గా నిలిచింది. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ స్కోర్లు ఇండియా- 155/6 (20) ఐర్లాండ్ 54/2 (8.2) చదవండి: BGT 2023: రెండున్నర రోజుల్లోనే టెస్టు ముగిస్తే ఇంతే! అయినా.. గాయం సంగతి ఏమైంది? ఆస్ట్రేలియా క్రికెట్లో కలవరం.. తర్వాత ఎవరు? Women T20 WC: ఆస్ట్రేలియాను ఓడిస్తే వరల్డ్‌కప్ మనదే..! -
T20 WC 2023: పాక్‌పై ఇదే అత్యధిక ఛేదన.. విరాట్ కోహ్లి ప్రశంసల జల్లు
ICC Womens T20 World Cup 2023: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2023 టోర్నీలో శుభారంభం చేసిన భారత మహిళా క్రికెట్ జట్టుపై టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించిన హర్మన్‌ప్రీత్ సేనకు శుభాభినందనలు తెలిపాడు. అద్భుత ఆట తీరుతో ముందుకు సాగుతూ మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడాడు. మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించాడు. భారత్ వర్సెస్ పాక్ దక్షిణాఫ్రికా వేదికగా శుక్రవారం(ఫిబ్రవరి 10)న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్ ఆరంభమైంది. ఈ క్రమంలో కేప్‌టౌన్‌లో జరిగిన మూడో మ్యాచ్‌లో ఆదివారం(ఫిబ్రవరి 12) చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఇక భారత్ లక్ష్య ఛేదనకు దిగిన క్రమంలో.. ఓపెనర్ యస్తికా భాటియా(17) తక్కువ స్కోరుకే వెనుదిరిగింది. అదరగొట్టిన జెమీమా- రిచా మరో ఓపెనర్ షఫాలీ వర్మ 25 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 33 పరుగులు సాధించింది. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగెస్ ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 16 పరుగులకే పెవిలియన్ చేరిన వేళ.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వికెట్ కీపర్ రిచా ఘోష్‌తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపింది. ఇదే అత్యధిక ఛేదన జెమీమా(53)- రిచా(31) జోడీ అద్భుతంగా రాణించి ఆఖరి వరకు అజేయంగా నిలవడంతో 19 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించగలిగింది. 3 వికెట్ల నష్టానికి 151 పరుగులు సాధించి ప్రపంచకప్ ప్రయాణాన్ని గెలుపుతో ఆరంభించింది. కాగా.. వరల్డ్‌కప్ మ్యాచ్‌లో భారత మహిళా జట్టుకిదే అత్యధిక ఛేదన కావడం విశేషం. అంతేకాదు.. టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్‌కిది ఐదో విజయం. వాట్ ఏ విన్ ఈ నేపథ్యంలో ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లి ఇన్‌స్టా వేదికగా భారత మహిళా జట్టు ఫొటో షేర్ చేస్తూ వారిని అభినందించాడు. ‘‘తీవ్ర ఒత్తిడిలోనూ.. పాకిస్తాన్ విధించిన లక్ష్యాన్ని ఛేదించారు. వాట్ ఏ విన్’’ అని కొనియాడాడు. ప్రతి టోర్నమెంట్లోనూ సత్తా చాటుతూ ఆటను ఉన్నత శిఖరాలకు చేరుస్తూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కితాబులిచ్చాడు. చదవండి: SA20 2023: తొట్టతొలి మినీ ఐపీఎల్ టైటిల్‌ను హస్తగతం చేసుకున్న సన్‌రైజర్స్ ధర్మశాల టెస్టు వైజాగ్‌లో? View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli)