ICC Womens T20 World Cup 2023: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2023 సెమీస్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్‌న్యూస్! కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్, ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ కీలక టీ20కి దూరమైనట్లు సమాచారం. అనారోగ్య కారణాల వల్ల వీరిద్దరు గురువారం(ఫిబ్రవరి 23) నాటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో పేర్కొంది.
కాగా వరల్డ్‌కప్-2023 తొలి సెమీ ఫైనల్లో భాగంగా టీమిండియా- ఆస్ట్రేలియాతో తలపడనుంది. పటిష్ట కంగరూ జట్టును ఓడించి టైటిల్ గెలిచే దిశగా మరో ముందడుగు వేయాలని పట్టుదలగా ఉంది. గతంలో రెండు కీలక సందర్భాల్లో తమను ఓడించిన ఆసీస్‌కు సెమీస్‌లోనే చెక్ పెట్టాలన్న తలంపుతో ఉంది భారత మహిళా జట్టు.
అస్వస్థతకు గురై
ఈ క్రమంలో హర్మన్, పూజ అనారోగ్యం బారిన పడటం ఆందోళన రేకెత్తించింది. అస్వస్థతకు గురై బుధవారం ఆస్పత్రిలో చేరిన వీరిద్దరు డిశ్చార్జ్ అయినప్పటికీ మ్యాచ్ ఆడతారా లేదా అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది.
కాగా కెప్టెన్ హర్మన్ వరల్డ్‌కప్ తాజా ఎడిషన్‌లో నాలుగు మ్యాచ్‌లలో కలిపి 66 పరుగులు చేసింది. ఒకవేళ ఆమె జట్టుకు దూరమైతే యస్తికా భాటియా తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. మరోవైపు.. ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ స్థానంలో దేవిక వైద్య ఆడే ఛాన్స్ ఉంది. హర్మన్ ఆడనట్లయితే వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనుంది.
టీ20 వరల్డ్‌కప్-2023 తొలి సెమీ ఫైనల్- తుది జట్లు (అంచనా)
భారత్: స్మృతి మంధాన, షఫాలీ, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, రేణుక, యస్తికా భాటియా, దేవికా వైద్య.
ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెప్టెన్), బెత్ మూనీ, అలీసా హీలీ, ఎలీస్ పెర్రీ, ఆష్లే గార్డ్‌నర్, తాలియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, జార్జియా, అలానా కింగ్, మేగన్ షుట్, డార్సీ బ్రౌన్.
చదవండి: మహ్మద్ రిజ్వాన్ విధ్వంసకర శతకం.. 18 బంతుల్లోనే..!
BGT 2023: ఆసీస్‌తో సిరీస్.. టీమిండియా క్రికెటర్ తండ్రి కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment