India Women Vs Australia Women Live Updates:
పోరాడి ఓడిన భారత్.. టోర్నీ నుంచి ఔట్
మహిళల టీ20 ప్రపంచకప్-2023లో టీమిండియా ప్రయాణం ముగిసింది. కేప్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు పోరాడి ఓడింది. ఆసీస్ చేతిలో 5 పరుగుల తేడాతో ఓటమి చవి చూసిన భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది.
అయితే భారత విజయం ఖాయం అనుకున్న దశలో.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రనౌట్‌గా వెనుదిరిగడం మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. 52 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ రనౌట్‌గా వెనుదిరిగింది. హర్మన్ పాటు జెమీమా రోడ్రిగ్స్(24 బంతుల్లో 43 పరుగులు) రాణించింది.
ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో బ్రౌన్,గార్డనర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా స్కాట్, జానసెన్ తలా వికెట్ సాధించారు. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ మూనీ(54),మెగ్ లానింగ్(49 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు, రాధా యాదవ్, దీప్తి శర్మ తలా వికెట్ సాధించారు.
ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. హర్మన్‌ప్రీత్ ఔట్
133 పరుగులు వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. అద్భుతంగా ఆడుతున్న భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(52) రనౌట్‌గా వెనుదిరిగింది. భారత విజయానికి 28 బంతుల్లో 39 పరుగులు కావాలి.
14 ఓవర్లకు భారత స్కోర్: 124/4
14 ఓవర్లు ముగిసే సరికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. భారత విజయానికి 36 బంతుల్లో 49 పరుగులు కావాలి. క్రీజులో హర్మన్‌ప్రీత్ కౌర్(43), రిచా ఘోష్(14) పరుగులతో ఉన్నారు.
173 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 10 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(39), హర్మన్‌ప్రీత్ కౌర్(33) పరుగులతో అద్భుతంగా ఆడుతున్నారు.
రెండో వికెట్ కోల్పోయిన భారత్
15 పరుగులు వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన స్మృతి మంధాన.. గార్డనర్ బౌలింగ్‌లో ఔటయ్యంది.
తొలి వికెట్ కోల్పోయి భారత్
173 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన షఫాలీ వర్మ.. స్కాట్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరింది.
చెలరేగిన ఆసీస్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ లక్ష్యం
భారత్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ మూనీ(54),మెగ్ లానింగ్(49 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు, రాధా యాదవ్, దీప్తి శర్మ తలా వికెట్ సాధించారు.
18 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 142/3
18 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. క్రీజులో మెగ్ లానింగ్(28), హ్యారీస్(1) పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్
89 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 54 పరుగులు చేసిన బెత్ మూనీ.. శిఖాపాండే బౌలింగ్‌లో షఫాలీ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. 12 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 89/2
తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్
►54 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన అలిస్సా హీలీ రాధాయాదవ్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగింది. 11 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 78/1
►4 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. క్రీజులో అలిస్సా హీలీ(19),మూనీ(7) పరుగులతో ఉన్నారు.
►2 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. క్రీజులో అలిస్సా హీలీ(8),మూనీ(6) పరుగులతో ఉన్నారు.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2023 తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే అస్వస్థతకు గురైన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంది.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. జెస్ జోనాస్సెన్, వికెట్ కీపర్ అలిస్సా హీలీ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు భారత్ కూడా తమ జట్టులో మూడు మార్పులు చేసింది. యస్తిక భాటియా,స్నేహ రానా, రాధాయాదవ్ తుది జట్టులోకి వచ్చారు.
తుది జట్లు:
భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, యాస్తికా భాటియా, స్నేహ రాణా, శిఖా పాండే, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్ సింగ్
ఆస్ట్రేలియా : అలిస్సా హీలీ(వికెట్ కీపర్), బెత్ మూనీ, మెగ్ లానింగ్(కెప్టెన్), ఆష్లీ గార్డనర్, ఎల్లీస్ పెర్రీ, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, జార్జియా వేర్‌హామ్, జెస్ జోనాస్సెన్, మేగాన్ షట్, డార్సీ బ్రౌన్
Comments
Please login to add a commentAdd a comment