Harman Preet
-
IND Vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన
మహిళల టి20 ప్రపంచకప్‌లో నిరాశజనక ప్రదర్శన అనంతరం కూడా ఈ నెల 24 నుంచి న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ కొనసాగనుంది. తాజా వరల్డ్‌కప్‌లో భారత జట్టు గ్రూప్ దశ నుంచే ని్రష్కమించగా... సారథ్య మార్పు అంశం తెరపైకి వచ్చింది. కానీ, సెలెక్టర్లు మాత్రం ప్రస్తుతానికి నాయకత్వ మార్పు జోలికి వెళ్లకుండా హర్మన్‌పైనే నమ్మకం ఉంచారు. అహ్మదాబాద్‌లో ఈ నెల 24, 27, 29న జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం సెలెక్షన్ కమిటీ గురువారం 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది.ఇందులో నలుగురు కొత్త ప్లేయర్లకు చోటు దక్కింది. 12వ తరగతి బోర్డు పరీక్షల నేపథ్యంలో వికెట్ కీపర్ రిచా ఘోష్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఆల్‌రౌండర్ పూజ వ్రస్తాకర్‌కు విశ్రాంతినివ్వగా... ఆశ శోభనను గాయం కారణంగా పరిగణించలేదు. ఇటీవల ఆ్రస్టేలియాలో పర్యటించిన భారత ‘ఎ’జట్టు నుంచి తేజల్ హస్నాబిస్, సయాలీ సత్గారె, ప్రియా మిశ్రాతో పాటు మహిళల ఐపీఎల్లో రాణించిన సైమా ఠాకూర్ తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చారు. భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హేమలత, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, ఉమా ఛెత్రీ, సయాలీ, అరుంధతి రెడ్డి, రేణుక సింగ్, తేజల్ హసాబ్నిస్, సైమా ఠాకూర్, ప్రియా మిశ్రా, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్.చదవండి: టీమిండియా 46 ఆలౌట్.. అజింక్య రహానే పోస్ట్ వైరల్ -
అదరగొట్టిన భారత హాకీ జట్టు.. ఐర్లాండ్‌పై ఘన విజయం
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత పురుషల హాకీ జట్టు అదరగొడుతోంది. పూల్-బిలో భాగంగా మంగళవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత హాకీ జట్టు పూల్ బిలో అగ్రస్ధానానికి చేరుకుంది.దీంతో పూల్ బి నుండి టాప్ 4 క్వార్టర్ ఫైనల్లోకి వెళ్లే అవకాశాలను భారత్ మరింత మెరుగుపరుచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లోనూ భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ సత్తాచాటాడు. భారత్ సాధించిన రెండు గోల్స్ కూడా హర్మన్ కొట్టినవే కావడం గమనార్హం.11వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌లో గోల్ చేసిన హర్మన్‌ప్రీత్ సింగ్.. 19వ నిమిషంలో రెండో గోల్ చేశాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆగస్టు 1న బెల్జియంతో తలపడనుంది. -
ముంబై ఇండియన్స్‌తో యూపీ వారియర్జ్ ఢీ.. గెలిస్తే ఫైనల్‌కు
మహిళల ప్రీమియర్ లీగ్-2023 ఎలిమినేటర్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ వారియర్జ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక లీగ్ ఆఖరి మ్యాచ్‌కు దూరమైన యూపీ వారియర్జ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్రేస్ హారిస్ తిరిగి జట్టులోకి వచ్చింది. మరోవైపు ముంబై ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మార్చి 26న జరగనున్న ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. తుది జట్లు: ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమెలీయా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్ యూపీ వారియర్జ్: అలిస్సా హీలీ(కెప్టెన్), శ్వేతా సెహ్రావత్, సిమ్రాన్ షేక్, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వాణి, పార్షవి చోప్రా, రాజేశ్వరి గైక్వాడ్ చదవండి: IPL 2023: పంత్ స్థానంలో విధ్వంసకర ఆటగాడు.. ఎవరంటే? -
World Cup 2023 Semi Final: పోరాడి ఓడిన భారత్.. టోర్నీ నుంచి ఔట్
India Women Vs Australia Women Live Updates: పోరాడి ఓడిన భారత్.. టోర్నీ నుంచి ఔట్ మహిళల టీ20 ప్రపంచకప్-2023లో టీమిండియా ప్రయాణం ముగిసింది. కేప్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు పోరాడి ఓడింది. ఆసీస్ చేతిలో 5 పరుగుల తేడాతో ఓటమి చవి చూసిన భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. అయితే భారత విజయం ఖాయం అనుకున్న దశలో.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రనౌట్‌గా వెనుదిరిగడం మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. 52 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ రనౌట్‌గా వెనుదిరిగింది. హర్మన్ పాటు జెమీమా రోడ్రిగ్స్(24 బంతుల్లో 43 పరుగులు) రాణించింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో బ్రౌన్,గార్డనర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా స్కాట్, జానసెన్ తలా వికెట్ సాధించారు. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ మూనీ(54),మెగ్ లానింగ్(49 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు, రాధా యాదవ్, దీప్తి శర్మ తలా వికెట్ సాధించారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. హర్మన్‌ప్రీత్ ఔట్ 133 పరుగులు వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. అద్భుతంగా ఆడుతున్న భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(52) రనౌట్‌గా వెనుదిరిగింది. భారత విజయానికి 28 బంతుల్లో 39 పరుగులు కావాలి. 14 ఓవర్లకు భారత స్కోర్: 124/4 14 ఓవర్లు ముగిసే సరికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. భారత విజయానికి 36 బంతుల్లో 49 పరుగులు కావాలి. క్రీజులో హర్మన్‌ప్రీత్ కౌర్(43), రిచా ఘోష్(14) పరుగులతో ఉన్నారు. 173 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 10 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(39), హర్మన్‌ప్రీత్ కౌర్(33) పరుగులతో అద్భుతంగా ఆడుతున్నారు. రెండో వికెట్ కోల్పోయిన భారత్ 15 పరుగులు వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన స్మృతి మంధాన.. గార్డనర్ బౌలింగ్‌లో ఔటయ్యంది. తొలి వికెట్ కోల్పోయి భారత్ 173 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన షఫాలీ వర్మ.. స్కాట్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరింది. చెలరేగిన ఆసీస్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ లక్ష్యం భారత్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ మూనీ(54),మెగ్ లానింగ్(49 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు, రాధా యాదవ్, దీప్తి శర్మ తలా వికెట్ సాధించారు. 18 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 142/3 18 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. క్రీజులో మెగ్ లానింగ్(28), హ్యారీస్(1) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్ 89 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 54 పరుగులు చేసిన బెత్ మూనీ.. శిఖాపాండే బౌలింగ్‌లో షఫాలీ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. 12 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 89/2 తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ ►54 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన అలిస్సా హీలీ రాధాయాదవ్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగింది. 11 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 78/1 ►4 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. క్రీజులో అలిస్సా హీలీ(19),మూనీ(7) పరుగులతో ఉన్నారు. ►2 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. క్రీజులో అలిస్సా హీలీ(8),మూనీ(6) పరుగులతో ఉన్నారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2023 తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే అస్వస్థతకు గురైన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. జెస్ జోనాస్సెన్, వికెట్ కీపర్ అలిస్సా హీలీ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు భారత్ కూడా తమ జట్టులో మూడు మార్పులు చేసింది. యస్తిక భాటియా,స్నేహ రానా, రాధాయాదవ్ తుది జట్టులోకి వచ్చారు. తుది జట్లు: భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, యాస్తికా భాటియా, స్నేహ రాణా, శిఖా పాండే, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్ సింగ్ ఆస్ట్రేలియా : అలిస్సా హీలీ(వికెట్ కీపర్), బెత్ మూనీ, మెగ్ లానింగ్(కెప్టెన్), ఆష్లీ గార్డనర్, ఎల్లీస్ పెర్రీ, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, జార్జియా వేర్హామ్, జెస్ జోనాస్సెన్, మేగాన్ షట్, డార్సీ బ్రౌన్ -
ఆఖరి టీ20లోనూ భారత్‌కు తప్పని ఓటమి..
ముంబై: గత మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా మహిళల చేతికి టి20 సిరీస్ అప్పగించిన భారత మహిళల జట్టు చివరి పోరులోనూ చతికిలపడింది. ఫలితంగా సొంతగడ్డపై సిరీస్‌ను ఓటమితో ముగించింది. మంగళవారం జరిగిన ఐదో టి20 మ్యాచ్‌లో ఆస్ట్రే లియా 54 పరుగులతో భారత్‌పై నెగ్గి సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా... భారత్ 20 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ పేసర్ హీతర్ గ్రాహమ్ (4/8) ‘హ్యాట్రిక్’తో భారత్‌ను దెబ్బ తీసింది. తాను వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లోని చివరి రెండు బంతులకు దేవిక, రాధ యాదవ్‌లను అవుట్ చేసిన హీతర్... 20వ ఓవర్ తొలి బంతికి రేణుక సింగ్‌ను అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ పూర్తి చేసుకుంది. అంతకుముందు ఆస్ట్రేలియా తరఫున యాష్లే గార్డ్నర్ (32 బంతుల్లో 66 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్), గ్రేస్ హారిస్ (35 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీలతో చెలరేగారు. 67 పరుగుల వద్దే ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోగా, ఆ తర్వాత గార్డ్నర్, హారిస్ కలిసి జట్టుకు భారీ స్కోరు అందించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అభేద్యంగా 62 బంతుల్లోనే 129 పరుగులు జోడించడం విశేషం. తొలి 10 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు 72 పరుగులు కాగా, తర్వాతి 10 ఓవర్లలో జట్టు 124 పరుగులు సాధించింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఒక్క దీప్తి శర్మ (53; 8 ఫోర్లు, 1 సిక్స్) చివరి వరకు పోరాడటం మినహా ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. హర్లీన్ (24) ఫర్వాలేదనిపించగా... టాప్ బ్యాటర్లు స్మృతి మంధాన (4), షఫాలీ వర్మ (13), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (12) ప్రభావం చూపలేకపోవడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. చదవండి: FIFA WC 2022: అభిమాన సంద్రం మధ్య... అర్జెంటీనా జట్టు సంబరాలు -
సిరీస్‌లో నిలవాలంటే.. గెలవాల్సిందే! భారత్ తుది జట్టు ఇదే?
ముంబై: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌కు భారత మహిళల జట్టు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శనివారం ఇక్కడ నాలుగో టి20 మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిస్తేనే భారత్‌కు సిరీస్ గెలిచే అవకాశముంటుంది. ఈ మ్యాచ్‌లో గనక ఓడితే ఇక్కడే సిరీస్‌ను సమర్పించుకుంటుంది. ఈ నేపథ్యంలో చావోరేవో తేల్చుకోవాల్సిన భారత అమ్మాయిలపైనే ఒత్తిడి నెలకొంది. పైగా ఆసీస్‌లాంటి మేటి జట్టును ఎదుర్కోవాలంటే హర్మన్‌ప్రీత్ సేన సర్వశక్తులు ఒడ్డాల్సిందే! ముఖ్యంగా బ్యాటింగ్ ఫర్వాలేదనిపిస్తున్నా... బౌలింగే జట్టు మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. గత మ్యాచ్‌లో ఆరంభంలోనే ఆసీస్ వికెట్లను పడగొట్టినప్పటికీ తర్వాత పట్టు సడలించడంతో ఆస్ట్రేలియా స్కోరు మళ్లీ 170 పరుగులు దాటింది. ఆంధ్ర పేసర్ అంజలి శర్వాణి వికెట్లు తీస్తున్నప్పటికీ పరుగులు మాత్రం ధారాళంగా ఇస్తోంది. సీనియర్లు రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మలు సైతం భారీగా పరుగులు ఇవ్వడం ప్రతికూలంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కోచింగ్ బృందం బౌలింగ్ విభాగంపైనే ప్రధానంగా దృష్టి సారించాలి. లోపాలను సరిదిద్దుకొని బౌలింగ్ పదును పెంచాలి. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే జెమిమా రోడ్రిగ్స్ పేలవ ఫామ్ వల్ల పటిష్ట భాగస్వామ్యాలకు అవకాశం లేకుండాపోతోంది. మూడు మ్యాచ్‌ల్లో ఆమె వరుసగా 0, 4, 16 పరుగులతో నిరాశపరిచింది. కీలకమైన నేటి మ్యాచ్‌లో ఆమె మంచి స్కోరు చేస్తే జట్టు భారీస్కోరుకు బాటపడుతుంది. మరోవైపు 2–1తో ఇప్పటికే ఆధిక్యంలో ఉన్న ఆసీస్ అమ్మాయిలు ఇక్కడే సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా బౌలింగ్, బ్యాటింగ్ రంగాల్లో మనకన్నా మెరుగ్గా ఉండటంతో ఆస్ట్రేలియాకు వరుస విజయం ఏమంత కష్టం కాదు. భారత తుది జట్టు(అంచనా): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, దేవికా వైద్య, రిచా ఘోష్, దీప్తి శర్మ, రాధా యాదవ్, అంజలి సర్వాణి, రేణుకా ఠాకూర్, రాజేశ్వరి గయక్వాడ్ చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్ గడ్డపై కుల్దీప్ యాదవ్ సరికొత్త చరిత్ర.. తొలి భారత స్పిన్నర్‌గా -
ఫామ్‌లో లేదన్నారు... సెంచరీతో చెలరేగింది
మహిళల వన్డే ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ రెండు పరుగుల తేడాతో నెగ్గింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (114 బంతుల్లో 103; 9 ఫోర్లు) సెంచరీ చేయగా, యస్తిక భాటియా (58; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించింది. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 244 పరుగులు సాధించింది. అనంతరం దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లకు 242 పరుగులు చేసి ఓడిపోయింది. గత కొంత కాలంగా ఫామ్‌లో లేకపోయినా హర్మన్‌ప్రీత్ కౌర్ సెంచరీ సాధించడం జట్టుకు కలిసొచ్చే వచ్చే అంశం. ఇక ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తలకు గాయమైంది. గాయం అంత తీవ్రమైనది కానప్పటికీ ఆమె ఫీల్డ్‌ను వదిలి వెళ్లింది. ఇక ప్రపంచ కప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌తో తలపడనుంది. చదవండి: IND Vs SL:లంక క్రికెటర్లు ప్రయాణించిన బస్సులో బుల్లెట్ల కలకలం -
పాక్‌తో మ్యాచ్ : టాస్ గెలిచిన భారత్
గయనా : విమెన్స్ టీ-20 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరగునున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో అద్బుతమైన విజయంతో ఊపుమీద ఉన్న భారత్.. దాయది దేశమైన పాకిస్తాన్‌పై కూడా అదే దూకుడు కొనసాగించాలని పట్టుదలతో ఉంది. పాక్ కూడా పటిష్టమైన జట్టే కావడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో దూకుడైన ఆటతో చెలరేగిన హర్మన్ అదే ఫామ్‌ను కొనసాగించాలని భారత టీం భావిస్తోంది. భారత జట్టు : హర్మత్ ప్రీత్‌కౌర్ (కెప్టెన్), భాటియా, మంధనా, రోడ్రిగ్సి, హేమలత, వేధా కృష్ణమూర్తి, మిథాల్ రాజ్, దీప్తి శర్మ, రాధ యాదవ్, అరుంధతి రాయ్, పూనయ్ యాదవ్ పాకిస్తాన్ జట్టు : జవారియా ఖాన్ (కెప్టెన్), నిధా ఖాన్, ఉస్మానియా సోహేల్, అయేషా జాఫర్, బీస్మాన్ మారూఫ్, నిదా డార్, అలియా రిజా, డయానా, నవాజ్, అనాయ్ అమీ కౌర్ పవర్! -
సెంచరీ 'మంధ' హాసం
♦ విండీస్‌పై 7 వికెట్లతో భారత్ జయభేరి ♦ రాణించిన పూనమ్, హర్మన్‌ప్రీత్ భారత అమ్మాయిల ఆల్‌రౌండ్ జోరు కొనసాగుతోంది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బౌలర్లు సమష్టిగా రాణించి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను దెబ్బతీయగా... తర్వాత లక్ష్యఛేదనలో ఓపెనర్ స్మృతి మంధన శతక్కొట్టింది. కెప్టెన్ మిథాలీ రాజ్ రాణించడంతో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. టాంటన్: భారత ఓపెనర్ స్మృతి మంధన బ్యాటింగ్‌లో మళ్లీ గర్జించింది. గత మ్యాచ్‌లో సెంచరీకి 10 పరుగుల దూరంలో నిలిచిన ఆమె ఈసారి ఛేదనలో శతక్కొట్టింది. ఈ మ్యాచ్‌లో భారత్ గత ప్రపంచకప్ రన్నరప్, టి20 చాంపియన్ వెస్టిండీస్‌ను కంగుతినిపించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ను ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దెబ్బతీసింది. దీంతో భారత్ 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 183 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (57 బంతుల్లో 43; 7 ఫోర్లు) రాణించగా, భారత బౌలర్లలో పూనమ్ యాదవ్, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 42.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ స్మృతి మంధన (108 బంతుల్లో 106 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) శతక్కొట్టగా, కెప్టెన్ మిథాలీ రాజ్ (88 బంతుల్లో 46; 3 ఫోర్లు) రాణించింది. స్మృతికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. దెబ్బ మీద దెబ్బ టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. విండీస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన హేలీ మాథ్యూస్, ఫెలిసియా వాల్టర్స్ శుభారంభం అందించలేకపోయారు. జట్టు స్కోరు 29 పరుగుల వద్ద ఫెలిసియా (9) నిష్క్రమించింది. ఏక్తా బిష్త్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో సుష్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. తర్వాత హెలీకి కెప్టెన్ స్టెఫానీ టేలర్ జతయ్యింది. ఇద్దరు నింపాదిగా ఆడుతున్న దశలో హేలీ, దీప్తిశర్మకు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఇక్కడి నుంచి వెస్టిండీస్ కష్టాలు మొదలయ్యాయి. భారత స్పిన్నర్లు పూనమ్ యాదవ్, హర్మన్‌ప్రీత్ కౌర్ పిచ్ నుంచి సహకారం లభించడంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తిప్పేశారు. దీంతో ఆ తర్వాత 15 ఓవర్లలో కేవలం 21 పరుగులే జతచేసిన వెస్టిండీస్ 4 కీలక వికెట్లను కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న టేలర్ (16) రనౌట్ కాగా... డియాండ్రా డాటిన్ (7), మెరిస్సా అగులిరా (6) పూనమ్ బౌలింగ్‌లో నిష్క్రమించారు. కైషోనా (5), చెడియాన్ నషన్ (12)లు హర్మన్‌ప్రీత్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు. 91 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన విండీస్‌ను టెయిలెండర్లు షానిల్ డాలీ (37 బంతుల్లో 33; 5 ఫోర్లు), అఫి ఫ్లెచర్ (23 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు) ఆదుకున్నారు. దీంతో ప్రత్యర్థి ముందు విండీస్ 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. చెలరేగిన స్మృతి... సునాయాస లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన భారత మహిళలకు ఆదిలోనే పూనమ్ రౌత్ (0) రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ ఐదో బంతికే ఆమె కానెల్ బౌలింగ్ డకౌటైంది. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ దీప్తి శర్మ (6) స్టెఫానీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయింది. 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్‌ను ఓపెనర్ స్మృతి మంధన, కెప్టెన్ మిథాలీ నడిపించారు. ఇద్దరు కుదురుగా ఆడుతూ తొలుత క్రీజ్‌లో పాతుకుపోయారు. ఆ తర్వాత తమదైన శైలిలో స్వేచ్ఛగా ఆడారు. వెస్టిండీస్ ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది. స్మృతి 57 బంతుల్లో అర్ధసెంచరీ చేసింది. మిథాలీతో కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది. జట్టు స్కోరు 141 పరుగుల వద్ద మిథాలీ... హేలీ మాథ్యూస్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరింది. దీంతో మూడో వికెట్‌కు 108 పరుగులు భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత స్మృతి, మోనా మేష్రమ్(18 నాటౌట్) సహకారంతో 105 బంతుల్లో సెంచరీని పూర్తిచేయడంతో పాటు జట్టును గెలిపించింది. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) అండ్ (బి) దీప్తి శర్మ 43; ఫెలిసియా (సి) సుష్మ (బి) ఏక్తాబిష్త్ 9; స్టెఫానీ టేలర్ రనౌట్ 16; డాటిన్ (సి) పూనమ్ రౌత్ (బి) పూనమ్ యాదవ్ 7; మెరిస్సా (స్టంప్డ్) సుష్మ (బి) పూనమ్ యాదవ్ 6; కైషోనా నైట్ (సి) స్మృతి (బి) హర్మన్‌ప్రీత్ కౌర్ 5; చెడియాన్ (స్టంప్డ్) సుష్మ (బి) హర్మన్‌ప్రీత్ కౌర్ 12; షానిల్ డాలీ (స్టంప్డ్) సుష్మ (బి) దీప్తి శర్మ 33; అఫి ఫ్లెచర్ నాటౌట్ 36; అనిసా మొహమ్మద్ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 183. వికెట్ల పతనం: 1–29, 2–69, 3–70, 4–80, 5–91, 6–91, 7–121, 8–146. బౌలింగ్: జులన్ గోస్వామి 6–0–37–0, శిఖాపాండే 3–0–13–0, ఏక్తాబిష్త్ 10–2–23–1, దీప్తిశర్మ 10–1–27–2, మోనా మేశ్రమ్ 4–0–20–0, పూనమ్ యాదవ్ 10–2–19–2, హర్మన్‌ప్రీత్ కౌర్ 7–0–42–2. భారత్ ఇన్నింగ్స్: పూనమ్ రౌత్ (సి) మెరిస్సా (బి) కానెల్ 0; స్మృతి మంధన నాటౌట్ 106; దీప్తిశర్మ (బి) స్టెఫానీ 6; మిథాలీ (సి) అఫి ఫ్లెచర్ (బి) హేలీ మాథ్యూస్ 46; మోనా మేశ్రమ్ నాటౌట్ 18; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (42.3 ఓవర్లలో 3 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–0, 2–33, 3–141 బౌలింగ్: కానెల్ 4–0–23–1, డాటిన్ 4–0–25–0, స్టెఫానీ 10–1–24–1, డాలీ 5–0–24–0, అనిసా 6–0–25–0, అఫి ఫ్లెచర్ 4–0–18–0, చెడియాన్ 1–0–9–0, హేలీ మాథ్యూస్ 8.3–0–35–1.