ముంబై: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌కు భారత మహిళల జట్టు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శనివారం ఇక్కడ నాలుగో టి20 మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిస్తేనే భారత్‌కు సిరీస్ గెలిచే అవకాశముంటుంది. ఈ మ్యాచ్‌లో గనక ఓడితే ఇక్కడే సిరీస్‌ను సమర్పించుకుంటుంది.
ఈ నేపథ్యంలో చావోరేవో తేల్చుకోవాల్సిన భారత అమ్మాయిలపైనే ఒత్తిడి నెలకొంది. పైగా ఆసీస్‌లాంటి మేటి జట్టును ఎదుర్కోవాలంటే హర్మన్‌ప్రీత్ సేన సర్వశక్తులు ఒడ్డాల్సిందే! ముఖ్యంగా బ్యాటింగ్ ఫర్వాలేదనిపిస్తున్నా... బౌలింగే జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. గత మ్యాచ్‌లో ఆరంభంలోనే ఆసీస్ వికెట్లను పడగొట్టినప్పటికీ తర్వాత పట్టు సడలించడంతో ఆస్ట్రేలియా స్కోరు మళ్లీ 170 పరుగులు దాటింది. ఆంధ్ర పేసర్ అంజలి శర్వాణి వికెట్లు తీస్తున్నప్పటికీ పరుగులు మాత్రం ధారాళంగా ఇస్తోంది.
సీనియర్లు రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మలు సైతం భారీగా పరుగులు ఇవ్వడం ప్రతికూలంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కోచింగ్ బృందం బౌలింగ్ విభాగంపైనే ప్రధానంగా దృష్టి సారించాలి. లోపాలను సరిదిద్దుకొని బౌలింగ్ పదును పెంచాలి. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే జెమిమా రోడ్రిగ్స్ పేలవ ఫామ్ వల్ల పటిష్ట భాగస్వామ్యాలకు అవకాశం లేకుండాపోతోంది.
మూడు మ్యాచ్‌ల్లో ఆమె వరుసగా 0, 4, 16 పరుగులతో నిరాశపరిచింది. కీలకమైన నేటి మ్యాచ్‌లో ఆమె మంచి స్కోరు చేస్తే జట్టు భారీస్కోరుకు బాటపడుతుంది. మరోవైపు 2–1తో ఇప్పటికే ఆధిక్యంలో ఉన్న ఆసీస్ అమ్మాయిలు ఇక్కడే సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా బౌలింగ్, బ్యాటింగ్ రంగాల్లో మనకన్నా మెరుగ్గా ఉండటంతో ఆస్ట్రేలియాకు వరుస విజయం ఏమంత కష్టం కాదు.
భారత తుది జట్టు(అంచనా): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, దేవికా వైద్య, రిచా ఘోష్, దీప్తి శర్మ, రాధా యాదవ్, అంజలి సర్వాణి, రేణుకా ఠాకూర్, రాజేశ్వరి గయక్వాడ్
చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్ గడ్డపై కుల్దీప్ యాదవ్ సరికొత్త చరిత్ర.. తొలి భారత స్పిన్నర్‌గా
Comments
Please login to add a commentAdd a comment