IND Vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌.. భారత జట్టు ప్రకటన | BCCI Announces 16-Member India Women Squad For Three-Match ODI Series Against New Zealand, Check Names Inside | Sakshi
Sakshi News home page

IND Vs NZ ODI Series: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌.. భారత జట్టు ప్రకటన

Published Fri, Oct 18 2024 7:55 AM | Last Updated on Fri, Oct 18 2024 8:59 AM

BCCI Announces 16-Member India Women Squad For Three-Match ODI Series Against New Zealand

మహిళల టి20 ప్రపంచకప్‌లో నిరాశజనక ప్రదర్శన అనంతరం కూడా ఈ నెల 24 నుంచి న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కొనసాగనుంది. తాజా వరల్డ్‌కప్‌లో భారత జట్టు గ్రూప్‌ దశ నుంచే ని్రష్కమించగా... సారథ్య మార్పు అంశం తెరపైకి వచ్చింది. 

కానీ, సెలెక్టర్లు మాత్రం ప్రస్తుతానికి నాయకత్వ మార్పు జోలికి వెళ్లకుండా హర్మన్‌పైనే నమ్మకం ఉంచారు. అహ్మదాబాద్‌లో ఈ నెల 24, 27, 29న జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం సెలెక్షన్‌ కమిటీ గురువారం 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది.

ఇందులో నలుగురు కొత్త ప్లేయర్లకు చోటు దక్కింది. 12వ తరగతి బోర్డు పరీక్షల నేపథ్యంలో వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఆల్‌రౌండర్‌ పూజ వ్రస్తాకర్‌కు విశ్రాంతినివ్వగా... ఆశ శోభనను గాయం కారణంగా పరిగణించలేదు. 

ఇటీవల ఆ్రస్టేలియాలో పర్యటించిన భారత ‘ఎ’జట్టు నుంచి తేజల్‌ హస్నాబిస్‌, సయాలీ సత్గారె, ప్రియా మిశ్రాతో పాటు మహిళల ఐపీఎల్‌లో రాణించిన సైమా ఠాకూర్‌ తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చారు.  

భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హేమలత, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, ఉమా ఛెత్రీ, సయాలీ, అరుంధతి రెడ్డి, రేణుక సింగ్, తేజల్‌ హసాబ్నిస్, సైమా ఠాకూర్, ప్రియా మిశ్రా, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్‌.
చదవండి: టీమిండియా 46 ఆలౌట్‌.. అజింక్య రహానే పోస్ట్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement