Pooja Vastrakar
-
టీ20 వరల్డ్‌కప్.. టీమిండియాకు గాయల బెడద?
యూఏఈ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు భారత మహిళల జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. భారత మహిళల జట్టు ప్రస్తుతం బెంగళూరులోని ఏన్సీఏలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంప్‌లో చెమడ్చోతుంది. అయితే జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. స్టార్ ప్లేయర్లు గాయాలతో బాధపడుతుండడంతో భారత జట్ట మెనెజ్‌మెంట్ ఆందోళన చెందుతోంది.గాయాల బారిన పడిన ప్లేయర్స్ వీరేఅరుంధతి రెడ్డిభారత జట్టు స్టార్ పేసర్ అరుంధతి రెడ్డి ప్రస్తుతం భుజం గాయంతో బాధపడుతోంది. ఆమె ప్రస్తుతం బౌలింగ్ ప్రాక్టీస్ దూరంగా ఉంది. అయితే ప్రపంచకప్ ప్రారంభమయ్యే ఆమె పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ మెగా టోర్నీ అయితే భారత్‌కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పుకోవాలి. అరుంధతి ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉంది.పూజా వస్త్రాకర్టీమిండియా మరో స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ కూడా భుజం గాయంతో పోరాడుతోంది. అయితే గాయంతో పూజా గాయంతో బాధపడుతున్నప్పటకి పెయిన్‌కిల్లర్ ఇంజెక్షన్ల సహాయంతో తన ప్రాక్టీస్‌ను కొనసాగిస్తోంది. ఆమె కూడా వరల్డ్‌కప్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించే ఛాన్స్ ఉంది.శ్రేయాంక పాటిల్ వేలి ఫ్రాక్చర్ కారణంగా ఆసియా కప్‌కు దూరమైన యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఇంకా కోలుకోలేదు. టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపికైనప్పటకి టోర్నీ అందుబాటులో ఉంటుందా లేదన్నది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఆమె మెగా ఈవెంట్ సమయానికి ఈ కర్ణాటక స్పిన్నర్ కోలుకునే అవకాశమున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.జెమిమా రోడ్రిగ్స్ స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ కూడా చేతివేలి గాయంతో బాధపడుతోంది. ఆసియాకప్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు రోడ్రిగ్స్ చేతి వేలికి గాయమైంది. అయితే ఆమె తన వేలికి టేప్ చుట్టి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. ఆమె ప్రపంచకప్ సమయానికి దాదాపుగా కోలుకునే సూచనలు కన్పిస్తున్నాయి. కాగా ఈ మెగా టోర్నీ ఆక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. భారత తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో తలపడనుంది. -
నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. 80 పరుగులకే బంగ్లా ఖేల్ ఖతం
వుమెన్స్ ఆసియా కప్ టీ20- 2024 టోర్నీ సెమీ ఫైనల్లో భారత బౌలర్లు విజృంభించారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బంగ్లాదేశ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఫలితంగా కేవలం ఎనభై పరుగులకే బంగ్లా కథ ముగిసింది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఆసియా టీ20 కప్‌లో గ్రూప్-ఏలో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన లీగ్ దశలో హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఈ క్రమంలో గ్రూప్-ఏ టాపర్‌గా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. మరోవైపు.. బంగ్లాదేశ్ గ్రూప్-బి సెకండ్ టాపర్‌గా నిలిచింది.ఫలితంగా తొలి సెమీస్ మ్యాచ్‌లో టీమిండియాతో పోటీకి అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో డంబుల్లా వేదికగా ఇరు జట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత పేసర్ రేణుకా సింగ్ ఆది నుంచే నిప్పులు చెరిగే బంతులతో బంగ్లా బ్యాటర్లను తిప్పలు పెట్టింది.తన బౌలింగ్ నైపుణ్యాలతో టాపార్డర్‌ను కుదేలు చేసింది. రేణుక దెబ్బకు ఓపెనర్లు దిలారా అక్తర్(6), ముర్షీదా ఖతూన్(4), వన్‌డౌన్ బ్యాటర్ ఇష్మా తంజీమ్(8) పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే పెవిలియన్ చేరారు.నిగర్ కెప్టెన్ ఇన్నింగ్స్జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న వేళ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానా పట్టుదలగా నిలబడింది. 51 బంతులు ఎదుర్కొని 32 పరుగులు సాధించింది. భారత స్పిన్నర్ రాధా యాదవ్ బౌలింగ్‌లో నిగర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఆ తర్వాత టపా టపా వికెట్లు పడ్డాయి. పేసర్ పూజా వస్త్రాకర్, స్పిన్నర్ దీప్తి శర్మ మిగిలిన పని పూర్తి చేశారు. బంగ్లాదేశ్ లోయర్ ఆర్డర్లో ష్రోనా అక్తర్ 19 పరుగులతో ఫర్వాలేదనిపించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ కేవలం 80 పరుగులు మాత్రమే చేయగలిగింది.భారత బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్ అత్యధికంగా మూడేసి వికెట్లు దక్కించుకోగా.. పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ టోర్నీలో భారత బ్యాటర్లు సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ విధించిన 81 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళా జట్టు తేలికగానే ఛేదించే అవకాశం ఉంది. -
టీమిండియా కెప్టెన్‌కు విశ్రాంతి.. కారణం?
వుమెన్స్ ఆసియా టీ20 కప్-2024లో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఇప్పటి వరకు ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో భారీ విజయాలు సాధించి సెమీస్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో నేపాల్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌కు విశ్రాంతినిచ్చింది. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టింది. హర్మన్, పూజా స్థానాల్లో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఎస్.సజన, ఫాస్ట్ బౌలర్ అరుంధతిరెడ్డి తుదిజట్టులో స్థానం దక్కించుకున్నట్లు తెలిపింది.డంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ షెఫాలీ వర్మ పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టింది. పవర్ ప్లే ముగిసే సరికి 19 బంతులు ఎదుర్కొని 32 పరుగులు సాధించింది.మరో ఓపెనర్ దయాలన్ హేమలత 17 బంతుల్లో 15 రన్స్ చేసింది. ఈ క్రమంలో ఆరు ఓవర్లు(పవర్ ప్లే) పూర్తయ్యేసరికి టీమిండియా హాఫ్ సెంచరీ మార్కు అందుకుంది. యాభై పరుగులు పూర్తి చేసుకుంది.ఇండియా వుమెన్ వర్సెస్ నేపాల్ వుమెన్ తుదిజట్లుభారత్షెఫాలీ వర్మ, స్మృతి మంధాన (కెప్టెన్), దయాలన్ హేమలత, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ఎస్ సజానా, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్, అరుంధతి రెడ్డి.నేపాల్సంఝనా ఖడ్కా, సీతా రాణా మగర్, కబితా కున్వర్, ఇందు బర్మా (కెప్టెన్), డాలీ భట్టా, రుబీనా ఛెత్రి, పూజా మహతో, కబితా జోషి, కాజల్ శ్రేష్ఠ (వికెట్ కీపర్), సబ్నమ్ రాయ్, బిందు రావల్.గ్రూప్-ఏ పాయింట్ల పట్టిక ఇలాఆసియా కప్-2024లో గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్తాన్, నేపాల్, యూఏఈ జట్లు ఉన్నాయి. భారత్ ఇప్పటి వరకు పాకిస్తాన్, యూఏఈలపై గెలిచి టాపర్(నెట్ రన్‌రేటు +3.298)గా ఉంది.ఇక తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓడిన పాకిస్తాన్.. తర్వాత నేపాల్, యూఏఈలపై విజయం సాధించింది. తద్వారా మూడింట రెండు గెలిచి రెండో స్థానం(నెట్ రన్‌రేటు + 1.158)లో కొనసాగుతోంది.ఇక శ్రీలంక, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేషియా గ్రూప్-బిలో ఉన్నాయి. శ్రీలంక, థాయ్‌లాండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.నేపాల్‌తో భారత్ మ్యాచ్ ఫలితం తర్వాత సెమీస్ బెర్తులు అధికారికంగా ఖరారుకానున్నాయి. -
T20I: టీమిండియా ఘన విజయం.. ఇలా ఇది మూడోసారి
India Women vs South Africa Women, 3rd T20I: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను 1–1తో సమంగా ముగించింది. చెన్నై వేదికగా మంగళవారం జరిగిన చివరిదైన మూడో టీ20 మ్యాచ్‌లో.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా.. 10 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది.తొలి టీ20లో దక్షిణాఫ్రికా నెగ్గగా... రెండో టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఇక 2006 నుంచి ఇప్పటి వరకు 187 టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టుకిది 100వ విజయం కావడం విశేషం. ప్రత్యర్థి జట్టుపై టీమిండియా 10 వికెట్లతో నెగ్గడం ఇది మూడోసారి.ఈ మ్యాచ్ కంటే ముందు భారత జట్టు 2016లో ఆస్ట్రేలియాపై, 2019లో వెస్టిండీస్‌పై 10 వికెట్ల తేడాతో గెలిచింది. సిరీస్‌ను సమం చేయాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ నెగ్గిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 17.1 ఓవర్లలో 84 పరుగులకే కుప్పకూలింది.పూజ వస్త్రకర్‌కు 4 వికెట్లుభారత పేస్ బౌలర్ పూజా వస్త్రకర్ 13 పరుగులిచ్చి 4 వికెట్లు, స్పిన్నర్ రాధా యాదవ్ 6 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశారు. అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ ఒక్కో వికెట్ తీశారు.అనంతరం 85 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఆడుతూపాడుతూ ఛేదించింది. 10.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 88 పరుగులు చేసి టీమిండియా గెలిచింది. Series Levelled ✅#TeamIndia and @ProteasWomenCSA share the honours in the T20I series. 🤝 🏆#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/RS3yCOjH2Q— BCCI Women (@BCCIWomen) July 9, 2024 స్మృతి మంధాన (40 బంతుల్లో 54 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీ సాధించగా... షఫాలీ వర్మ (25 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) కూడా రాణించింది. పూజా వస్త్రకర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. A clinical 🔟-wicket win in the 3rd T20I 🥳The @IDFCFIRSTBank #INDvSA series is drawn 1⃣-1⃣Scorecard ▶️ https://t.co/NpEloo6GAm#TeamIndia pic.twitter.com/f1wcGPWWKo— BCCI Women (@BCCIWomen) July 9, 2024 -
వివాదంలో భారత ఆల్‌రౌండర్.. ప్రధాని మోదీకి క్షమాపణలు
ప్రధాని నరేంద్ర మోదీ పట్ల తనకు అపార గౌరవం ఉందని భారత మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్ తెలిపింది. బీజేపీ నేతలను ఉద్దేశించి తన అకౌంట్ నుంచి అభ్యంతరకర పోస్టు ఎలా వెళ్లిందో తెలియదని.. అప్పుడు తన ఫోన్ తన ఆధీనంలో లేదని స్పష్టం చేసింది. ఏదేమైనా తెలియకుండానే చాలా మంది హృదయాలను గాయపరిచానని.. ఇందుకు చింతిస్తున్నట్లు పూజా పేర్కొంది. ప్రధాని మోదీకి క్షమాపణలు చెబుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా టీమిండియా ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ ఇన్‌స్టా స్టోరీలో ‘వసూలీ టైటాన్స్’ పేరిట ప్రధాని మోదీతో పాటు బీజేపీ కీలక నేతలు, కేంద్ర మంత్రుల మార్ఫింగ్ ఫొటో ప్రత్యక్షమైంది. శుక్రవారం నాటి పోస్టు నెట్టింట వైరల్‌కాగా వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో ఈ విషయంపై స్పందించిన పూజా వస్త్రాకర్.. ‘‘నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి అత్యంత అభ్యంతరకరమైన ఫొటో పోస్ట్ అయినట్లు నా దృష్టికి వచ్చింది. నిజానికి ఆ సమయంలో ఫోన్ నా దగ్గర లేదు. ప్రధాన మంత్రి పట్ల నాకు అమితమైన గౌరవం ఉంది. తెలిసో తెలియకో నా వల్ల కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాను. క్షమాపణలు కోరుతున్నాను’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కాగా మధ్యప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల పూజా వస్త్రాకర్ టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్. భారత్ తరఫున 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఆమె.. ఇప్పటి వరకు నాలుగు టెస్టులు, 30 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు ఆడింది. టెస్టుల్లో 14, వన్డేల్లో 23, టీ20లలో 40 వికెట్లు తీసింది. వన్డేల్లో నాలుగు అర్ధ శతకాలు కూడా సాధించింది. టెస్టుల్లో 47, టీ20లలో 37* పూజా అత్యధిక స్కోర్లు. ఇక ఇటీవల ముగిసిన వుమెన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన పూజా వస్త్రాకర్ నిరాశపరిచింది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి ఈ రైటార్మ్ పేసర్ కేవలం ఐదు వికెట్లు తీసింది. చదవండి: #Kohli: పాపం.. కోహ్లి ఒక్కడు ఏం చేయగలడు? -
ఆస్ట్రేలియాతో వన్డే.. భారత స్టార్ బౌలర్‌కు గాయం!
ఆస్ట్రేలియాతో మ్యాచ్ మధ్యలోనే భారత మహిళా క్రికెటర్ స్నేహ్ రాణా మైదానాన్ని వీడింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సహచర ప్లేయర్ పూజా వస్త్రాకర్‌ను ఢీకొట్టిన ఆమె తలనొప్పి కారణంగా ఫీల్డ్ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో స్నేహ్ రాణా స్థానంలో హర్లీన్ డియోల్‌ను కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా ప్రకటించింది బీసీసీఐ మేనేజ్మెంట్. కాగా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టులో విజయం సాధించి చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతోంది. ముంబై వేదికగా జరుగుతున్న ఈ సిరీస్‌లో తొలి వన్డేను ఆసీస్ గెలిచింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య శనివారం నాటి రెండో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్లలో స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. ఇతర స్పిన్నర్లు స్నేహ్ రాణా, శ్రెయాంక పాటిల్ ఒక్కో వికెట్ తీశారు. పేస్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌కు ఒక వికెట్ దక్కింది. ఇదిలా ఉంటే.. ఆసీస్ ఇన్నింగ్స్ 25వ ఓవర్ వద్ద ఆసీస్ బ్యాటర్ బెత్ మూనీ బంతిని గాల్లోకి లేపగా బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న స్నేహ్ రాణా.. పూజా వస్త్రాకర్ పరస్పరం ఢీకొట్టుకున్నారు. ఈ ఘటనలో తలకు దెబ్బ తగలడంతో స్నేహ్ రాణా నొప్పితో విలవిల్లాడింది. ఈ క్రమంలో తీవ్ర తలనొప్పితో బాధపడిన ఆమెను స్కానింగ్‌కు పంపించగా.. హర్లిన్ డియోల్ ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధమైంది. అయితే, రాణా తిరిగి రావడంతో ఆమె అవసరం లేకపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో గాయపడటానికి ముందు నాలుగు ఓవర్లు బౌల్ చేసిన స్నేహ్ రాణా.. తిరిగి వచ్చిన తర్వాత తన కోటాలో మిగిలిన మిగిలిన ఆరు ఓవర్లు పూర్తి చేసి ఓ వికెట్ ఖాతాలో వేసుకుంది. కాగా ఐసీసీ నిబంధన ప్రకారం.. ఎవరైనా బ్యాటర్/బౌలర్ కన్కషన్(తలకు దెబ్బ తగలడం/బ్రెయిన్ ఫంక్షన్ ఎఫెక్ట్ చేసేలా గాయపడటం) కారణంగా దూరమైతే వారి స్థానంలో అవే నైపుణ్యాలున్న ప్లేయర్‌ను బరిలోకి దించాలి. అయితే, ఆల్‌రౌండర్‌తో సదరు ప్లేయర్ స్థానాన్ని భర్తీ చేస్తే బ్యాటర్ ప్లేస్‌లో వేస్తే బ్యాటింగ్, బౌలర్ ప్లేస్‌లో వస్తే బౌలింగ్ మాత్రమే చేయాలి. ఇక్కడ స్నేహ్ రాణా స్పిన్నర్ కాగా.. హర్లిన్ డియోల్ పార్ట్‌టైమ్ స్పిన్నర్. ఇక ఈ మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రిచా ఘోష్ అద్భుత అర్ధ శతకంతో మెరిసింది. దురదృష్టవశాత్తూ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. -
‘టీమిండియాకు మరో నయా ఫినిషర్’.. దుమ్ములేపిన ఆల్‌రౌండర్.. కానీ
Update: ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో భారత మహిళా జట్టు ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. వాంఖడేలో 46.3 ఓవర్లలోనే టీమిండియా విధించిన లక్ష్యాన్ని ఛేదించింది ఆసీస్ వుమెన్ టీమ్. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. దుమ్ములేపిన భారత ఆల్‌రౌండర్ ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టులో అదరగొట్టిన భారత మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్ తొలి వన్డేలోనూ సత్తా చాటింది. జట్టుకు అవసరమైన సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ కేవలం 46 బంతుల్లోనే 62 పరుగులతో దుమ్ములేపింది. దీంతో టీమిండియా తరఫున మరో నయా ఫినిషర్ వచ్చేసిందంటూ అభిమానులు పూజా వస్త్రాకర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సొంతగడ్డపై ఆసీస్‌తో ఏకైక టెస్టులో గెలుపొంది చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్టు గురువారం నుంచి వన్డే సిరీస్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ముంబైలోని వాంఖడేలో టాస్ గెలిచిన ఆతిథ్య టీమిండియా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టాపార్డర్‌లో ఓపెనర్ యస్తికా భాటియా 49 పరుగులతో రాణించగా.. మరో ఓపెనర్ షఫాలీ వర్మ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటైంది. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన రిచా ఘోష్ 21 పరుగులు చేయగా.. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పూర్తిగా నిరాశపరిచింది. మొత్తంగా 17 బంతులు ఎదుర్కొన్న హర్మన్ కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇలా ఓవైపు వికెట్లు పడుతున్నా జెమీమా రోడ్రిగ్స్ పట్టుదలగా నిలబడి సంచలన ఇన్నింగ్స్‌తో మెరిసింది. 77 బంతుల్లో 82 పరుగులు సాధించింది. జెమీమా తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన దీప్తి శర్మ 21, అమన్‌జోత్ కౌర్ 20, స్నేహ్ రాణా 1 పరుగులు చేశారు. దీంతో స్వల్ప స్కోరుకే భారత్‌ను కట్టడి చేయగలమన్న ఆస్ట్రేలియా ఆశలపై పూజా వస్త్రాకర్ నీళ్లు చల్లింది. ధనాధన్ ఇన్నింగ్స్‌తో.. రేణుకా ఠాకూర్ సింగ్(5- నాటౌట్)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి సత్తా చాటింది. యస్తికా, జెమీమా, పూజా అద్భుత బ్యాటింగ్ కారణంగా భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 282 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో డారిస్ బ్రౌన్, మేగన్ షట్, అన్నాబెల్ సదర్లాండ్, అలనా కింగ్ ఒక్కో వికెట్ తీయగా.. ఆష్లే గార్డ్నర్, వెరెహాం తలా రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. Pooja Vastrakar a fighter and new finisher for team India She scored 62 of 46 balls.Brilliant 👏#AUSvPAK #INDvSA #Dhoni #SENA #BBL13 #INDvAUS #BabarAzam #Shami #Abdullah #Prasidh #CricketTwitterpic.twitter.com/OaXDuyiXpx — Sujeet Suman (@sujeetsuman1991) December 28, 2023 -
ఏకైక టెస్టులో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్.. సరికొత్త చరిత్ర
India Women vs Australia Women, Only Test: భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాను మట్టికరిపించి సొంతగడ్డపై చరిత్రాత్మక విజయం అందుకుంది. సమిష్టి ప్రదర్శనతో రాణించి కంగారూ జట్టుపై మొట్టమొదటి టెస్టు గెలుపు నమోదు చేసింది. మరోరోజు ఆట మిగిలి ఉండగానే జయకేతనం ఎగురవేసి సత్తా చాటింది. కాగా భారత్ ఏకైక టెస్టు ఆడేందుకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ముంబైకి వచ్చింది. ఇరు జట్ల మధ్య వాంఖడే వేదికగా డిసెంబరు 21న మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ల దెబ్బకు 219 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. అదరగొట్టిన బౌలర్లు, బ్యాటర్లు పూజా వస్త్రాకర్ నాలుగు, స్నేహ్ రాణా మూడు, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశారు. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌కు ఓపెనర్లు షఫాలీ వర్మ 40, స్మృతి మంధాన 74 పరుగులతో అదిరిపోయే ఆరంభం అందించారు. మిడిలార్డర్లో రిచా ఘోష్ 52, జెమీమా రోడ్రిగ్స్ 73 పరుగులతో దుమ్ములేపారు. ఇక లోయర్ ఆర్డర్లో దీప్తి శర్మ 78, పూజా వస్త్రాకర్ 47 పరుగులతో అద్వితీయ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇలా బ్యాటర్లంతా సమిష్టిగా రాణించడంతో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 406 పరుగులకు ఆలౌట్ అయి ఆధిక్యంలో నిలిచింది. చెలరేగిన భారత బౌలర్లు.. ఆసీస్ పోరాడినా ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 233 పరుగులు సాధించింది. ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని పట్టుదలగా పోరాడింది. అయితే, భారత బౌలర్ల ముందు ఆసీస్ పప్పులు ఉడకలేదు. టాపార్డర్, మిడిలార్డర్ పర్వాలేదనిపించినా.. నాలుగో రోజు ఆటలో లోయర్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. స్నేహ్ రాణా నాలుగు వికెట్లుతో చెలరేగగా.. పూజా ఒకటి, రాజేశ్వరి గైక్వాడ్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రెండేసి వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను కట్టడి చేశారు. దీంతో 261 పరుగులకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ఆలౌట్ అయింది. మొట్టమొదటి టెస్టు గెలుపు ఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆదివారం నాటి నాలుగో రోజు ఆటలోనే మ్యాచ్‌ను ముగించేసింది. స్మృతి మంధాన 38, జెమీమా రోడ్రిగ్స్ 12 పరుగులతో ఆఖరి అజేయంగా నిలవగా.. 18.4 ఓవర్లలోనే టార్గెట్‌ను పూర్తి చేసింది. మంధాన ఫోర్ బాది విజయాన్ని ఖరారు చేయగా.. ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా టెస్టుల్లో ఆస్ట్రేలియాపై భారత మహిళా క్రికెట్ జట్టుకు ఇదే తొలి విజయం. అంతేకాదు 1984 తర్వాత సొంతగడ్డపై ఆసీస్‌తో టెస్టు ఆడటం కూడా ఇదే మొదటిసారి అది కూడా వాంఖడేలో!! ఇక గతంలో భారత్- ఆసీస్ మహిళా జట్లు పదిసార్లు ముఖాముఖి పోటీపడగా.. ఆసీస్ నాలుగుసార్లు గెలిచింది. ఆరుసార్లు మ్యాచ్ డ్రా అయింది. చదవండి: WFI: క్రీడా శాఖ సంచలన నిర్ణయం.. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐపై వేటు 𝙃𝙄𝙎𝙏𝙊𝙍𝙔 𝙄𝙉 𝙈𝙐𝙈𝘽𝘼𝙄! 🙌#TeamIndia women register their first win against Australia in Test Cricket 👏👏 Scorecard ▶️ https://t.co/7o69J2XRwi#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/R1GKeuRa69 — BCCI Women (@BCCIWomen) December 24, 2023 -
ఆసీస్ బౌలర్లకు చుక్కలు.. బ్యాట్‌తో చెలరేగిన దీప్తి, పూజ
ఆస్ట్రేలియాతో టెస్టులో భారత మహిళా క్రికెట్ జట్టు రెండో రోజు కూడా ఆధిపత్యం కనబరిచింది. ఓపెనర్ స్మృతి మంధానకు తోడు రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ(70- నాటౌట్) అర్ధ శతకాలతో చెలరేగడంతో ఆసీస్‌పై పైచేయి సాధించింది. శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 376 పరుగులు చేసింది. కాగా ముంబై వేదికగా ఆస్ట్రేలియా మహిళా జట్టుతో భారత వుమెన్ టీమ్ ఏకైక టెస్టులో తలపడుతోంది. వాంఖడే స్టేడియంలో గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ పూజా వస్త్రాకర్ నాలుగు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. కీలక వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టింది. ఇతర బౌలర్లలో స్నేహ్ రాణా మూడు, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ రెండు వికెట్లు తీశారు. ఈ క్రమంలో ఆసీస్ మహిళా జట్టు 219 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ నేపథ్యంలో తొలి రోజే ఆసీస్‌ను ఆలౌట్ చేసిన భారత్.. ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో భాగంగా ఓపెనర్ స్మృతి మంధాన 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైంది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిచా ఘోష్ 52 పరుగులతో రాణించగా.. జెమీమా రోడ్రిగ్స్ 73 పరుగులతో అదరగొట్టింది. అయితే, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. గార్డ్నర్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగింది. యస్తికా భాటియా సైతం ఒక్క పరుగుకే పెవిలియన్ చేరింది. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న దీప్తి శర్మ ఓపికగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపింది. శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి 147 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 70 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమెకు తోడుగా పూజా వస్త్రాకర్ సైతం 33 పరుగులతో క్రీజులో ఉంది. వీరిద్దరు కలిసి 102 పరుగుల అజేయ భాగస్వామ్యంతో భారత్ 157 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇదిలా ఉంటే.. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆష్లీ గార్డ్నర్కు అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కగా.. కిమ్‌గార్త్ ఒకటి, జెస్ జొనాసెన్ ఒక వికెట్ పడగొట్టారు. కిమ్ గార్త్, గార్డ్నర్ కలిసి స్మృతి మంధానను రనౌట్ చేశారు. -
ఆసీస్‌ను పడగొట్టిన పూజ
ముంబై: ఆ్రస్టేలియాతో ప్రారంభమైన ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు తొలి రోజు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ముందుగా చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసిన మన బృందం ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ మెరుగైన స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ్రస్టేలియా మహిళల జట్టు భారత బౌలర్ల ధాటికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకే ఆలౌటైంది. భారత జట్టుపై టెస్టుల్లో ఆసీస్ జట్టుకిదే అత్యల్ప స్కోరు. తహీలా మెక్‌గ్రాత్ (56 బంతుల్లో 50; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా... బెత్ మూనీ (40), కెప్టెన్ అలీసా హీలీ (38), కిమ్ గార్త్ (28 నాటౌట్) కీలక పరుగులు సాధించారు. పేసర్ పూజ వస్త్రకర్ (4/53) నాలుగు కీలక వికెట్లు పడగొట్టగా... స్పిన్నర్లు స్నేహ్ రాణా 3, దీప్తి శర్మ 2 వికెట్లు తీశారు. తొలి ఓవర్లోనే లిచ్‌ఫీల్డ్ (0) రనౌట్ కాగా, అద్భుత బంతితో ఎలీస్ పెరీ (4)ని పూజ బౌల్డ్ చేయడంతో ఆసీస్ కష్టాల్లో పడగా... మెక్‌గ్రాత్, మూనీ మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 19 ఓవర్లలోనే 98 పరుగులు చేసింది. స్మృతి మంధాన (49 బంతుల్లో 43 బ్యాటింగ్; 8 ఫోర్లు), షఫాలీ వర్మ (59 బంతుల్లో 40; 8 ఫోర్లు) ఆరంభం నుంచే దూకుడుగా ఆడి తొలి వికెట్‌కు 100 బంతుల్లోనే 90 పరుగులు జత చేశారు. ప్రస్తుతం భారత్ మరో 121 పరుగులు వెనుకబడి ఉంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: మూనీ (సి) స్నేహ్ రాణా (బి) పూజ 40; లిచ్‌ఫీల్డ్ (రనౌట్) 0; ఎలీస్ పెరీ (బి) పూజ 4; తహీలా (సి) రాజేశ్వరి (బి) స్నేహ్ రాణా 50; హీలీ (బి) దీప్తి 38; అనాబెల్ (ఎల్బీ) (బి) పూజ 16; యాష్లీ (సి) యస్తిక (బి) పూజ 11; జెస్ (ఎల్బీ) (బి) దీప్తి 19; అలానా కింగ్ (సి) యస్తిక (బి) స్నేహ్ రాణా 5; గార్త్ (నాటౌట్) 28; లౌరెన్ (సి) స్మృతి (బి) స్నేహ్ రాణా 6; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (77.4 ఓవర్లలో ఆలౌట్) 219. వికెట్ల పతనం: 1–2, 2–7, 3–87, 4–103, 5–143, 6–159, 7–160, 8–168, 9–198, 10–219. బౌలింగ్: రేణుక 7–0–35–0, పూజ వస్త్రకర్ 16–2–53–4, స్నేహ్ రాణా 22.4–4–56–3, రాజేశ్వరి 13–4–29–0, దీప్తి శర్మ 19–3–45–2. భారత్ తొలి ఇన్నింగ్స్: షఫాలీ (ఎల్బీ) (బి) జెస్ 40; స్మృతి (బ్యాటింగ్) 43; స్నేహ్ రాణా (బ్యాటింగ్) 4; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19 ఓవర్లలో వికెట్ నష్టానికి) 98. వికెట్ల పతనం: 1–90. బౌలింగ్: లౌరెన్ 4–2–12–0, కిమ్ గార్త్ 4–0–34–0, పెరీ 4–0–31–0, యాష్లీ 5–3–8–0, జెస్ జొనాసెన్ 2–1–4–1. -
ఆసీస్‌తో ఏకైక టెస్ట్.. టీమిండియా డామినేషన్
స్వదేశంలో (ముంబై) ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు భారత మహిళా జట్టు డామినేషన్ నడించింది. తొలుత బౌలింగ్‌లో ఆసీస్‌ను చుక్కలు చూపించిన టీమిండియా బౌలర్లు.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ ప్రతాపం చూపించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. భారత బౌలర్లు పూజా వస్త్రాకర్ (4/53), స్నేహ్ రాణా (3/56), దీప్తి శర్మ (2/45) ధాటికి 77.4 ఓవర్లలో 219 పరుగులకు కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో తహిల మెక్‌గ్రాత్ (50) హాఫ్ సెంచరీతో రాణించగా.. బెత్ మూనీ (40), అలైసా హీలీ (38), కిమ్ గార్త్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది. షఫాలీ వర్మ 40 పరుగులు చేసి ఔట్ కాగా.. స్మృతి మంధన (43), స్నేహ్ రాణా (4) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు టీమిండియా ఇంకా 121 పరుగులు వెనుకపడి ఉంది. షఫాలీ వర్మ వికెట్ జెస్ జొనాస్సెన్‌కు దక్కింది. ఆసీస్.. ప్రస్తుత భారత పర్యటనలో ఈ టెస్ట్ అయిపోయాక 3 వన్డేలు, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలోనే ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో భారత్ 347 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అంతకుముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మాత్రం ఇంగ్లండ్ 2-1 తేడాతో గెలుచుకుంది. -
స్వర్ణ పతకానికి గెలుపు దూరంలో
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ మహిళలపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 51 పరుగులకే కుప్పకూలింది. కెపె్టన్ నిగార్ సుల్తానా (12) టాప్ స్కోరర్ కాగా మిగతా వారిలో ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ఐదుగురు బ్యాటర్లు ‘డకౌట్’ కావడం విశేషం. పేస్ బౌలర్ పూజ వస్త్రకర్ (4/17) తన కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనను నమోదు చేసి బంగ్లాను దెబ్బ కొట్టింది. భారత్ 8.2 ఓవర్లలో 2 వికెట్లకు 52 పరుగులు చేసి విజయాన్నందుకుంది. స్మృతి మంధాన (7) తొందరగానే అవుటైనా... జెమీమా రోడ్రిగ్స్ (20 నాటౌట్), షఫాలీ వర్మ (17) కలిసి గెలిపించారు. స్వర్ణపతకం కోసం నేడు జరిగే ఫైనల్లో శ్రీలంకతో భారత్ తలపడుతుంది. రెండో సెమీస్‌లో శ్రీలంక 6 వికెట్లతో పాకిస్తాన్‌పై గెలిచింది. -
BCCI: ఏపీ పేసర్ అంజలి శర్వాణి చేజారిన గోల్డెన్ ఛాన్స్.. జట్టులోకి ఆమె
ఆసియా క్రీడలు-2023కు ఆంధ్రప్రదేశ్ పేసర్ అంజలి శర్వాణి దూరమైంది. మోకాలి గాయం కారణంగా ఆమె టోర్నీ నుంచి తప్పుకొంది. ఈ క్రమంలో ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్‌బౌలర్ స్థానంలో.. పూజా వస్త్రాకర్‌ను ప్రధాన జట్టులోకి తీసుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. అంజలి స్థానాన్ని హార్డ్ హిట్టింగ్ ఆల్‌రౌండర్‌తో భర్తీ చేసినట్లు వెల్లడించింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 26 ఏళ్ల అంజలి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ సందర్భంగా టీమిండియాలో ఎంట్రీ ఇచ్చింది. మెరుగైన ఆట తీరు కనబరిచి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ప్రస్తుతం గ్రేడ్-సి(రూ. 10 లక్షల వార్షిక వేతనం)లో ఉన్న అంజలి 19వ ఆసియా క్రీడల్లో ఎంట్రీ ఇవ్వనున్న భారత మహిళా ప్రధాన జట్టుకు ఎంపికైంది. అయితే, దురదృష్టవశాత్తూ గాయం కారణంగా మెగా ఈవెంట్లో పాల్గొనే సువర్ణావకాశం ఆమె చేజారింది. అంజలి శర్వాణి జట్టుకు దూరం కావడంతో స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న పూజా వస్త్రాకర్‌కు ప్రధాన జట్టులో చోటు దక్కింది. కాగా సెప్టెంబరు 23 నుంచి ఆసియా క్రీడలు ఆరంభం కానున్నాయి. చైనాలోని హోంగ్జో ఇందుకు వేదిక. ఆసియా క్రీడలు-2023కి భారత మహిళా క్రికెట్ జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, దేవికా వైద్య, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రి (వికెట్ కీపర్), అనూష బారెడ్డి, పూజా వస్త్రాకర్. స్టాండ్ బై ప్లేయర్ల జాబితా: హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, స్నేహ్ రాణా, సైకా ఇషాక్. -
సెమీస్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం
ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2023 సెమీస్ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ అనారోగ్య కారణంతో టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఆమె ప్రస్తుతం శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో నాలగు మ్యాచ్‌లు ఆడిన ఆమె రెండు వికెట్లు పడగొట్టింది. ఇక పూజా స్థానాన్ని మరో ఆల్ రౌండర్ స్నేహ్ రానాతో సెలక్షన్ కమిటీ భర్తీ చేసింది. పూజా స్థానాన్ని స్నేహ్ రానాతో భర్తీ చేయడాన్ని ఐసీసీ ఈవెంట్ టెక్నికల్ కమిటీ కూడా ఆమోదించింది. అయితే తుది జట్టులో మాత్రం స్నేహ్ రానా చోటు దక్కే అవకాశం కన్పించడం లేదు. ప్లేయింగ్ ఎల్వెన్లో పూజా స్థానంలో దేవికా వైద్య వైపు జట్టు మెనెజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు ఆస్ట్రేలియాతో సెమీఫైనల్‌కు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్ అందుబాటుపై కూడా సంధిగ్ధం నెలకొంది. కీలక మ్యాచ్‌కు ముందు హర్మన్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఇక ఆస్ట్రేలియా-భారత్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ గురువారం(ఫిబ్రవరి 23) సాయంత్రం 6:30 గంటల నుంచి ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్‌కప్-2023 తొలి సెమీ ఫైనల్- తుది జట్లు (అంచనా) భారత్: స్మృతి మంధాన, షఫాలీ, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, రేణుక, యస్తికా భాటియా, దేవికా వైద్య. ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెప్టెన్), బెత్ మూనీ, అలీసా హీలీ, ఎలీస్ పెర్రీ, ఆష్లే గార్డ్నర్, తాలియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, జార్జియా, అలానా కింగ్, మేగన్ షుట్, డార్సీ బ్రౌన్. చదవండి: T20 WC 2023: సెమీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. కెప్టెన్‌కు అస్వస్థత?! UPDATE 🚨 - Pacer Pooja Vastrakar has been ruled out due to an upper respiratory tract infection! The Event Technical Committee of the ICC Women’s T20 World Cup 2023 has approved @SnehRana15 as a replacement for Pooja Vastrakar in the India squad! #T20WorldCup | #TeamIndia pic.twitter.com/NKiTvp22Hn — BCCI Women (@BCCIWomen) February 23, 2023 -
T20 WC 2023: ఆసీస్‌తో సెమీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్!
ICC Womens T20 World Cup 2023: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2023 సెమీస్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్‌న్యూస్! కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్, ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ కీలక టీ20కి దూరమైనట్లు సమాచారం. అనారోగ్య కారణాల వల్ల వీరిద్దరు గురువారం(ఫిబ్రవరి 23) నాటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో పేర్కొంది. కాగా వరల్డ్‌కప్-2023 తొలి సెమీ ఫైనల్లో భాగంగా టీమిండియా- ఆస్ట్రేలియాతో తలపడనుంది. పటిష్ట కంగరూ జట్టును ఓడించి టైటిల్ గెలిచే దిశగా మరో ముందడుగు వేయాలని పట్టుదలగా ఉంది. గతంలో రెండు కీలక సందర్భాల్లో తమను ఓడించిన ఆసీస్‌కు సెమీస్‌లోనే చెక్ పెట్టాలన్న తలంపుతో ఉంది భారత మహిళా జట్టు. అస్వస్థతకు గురై ఈ క్రమంలో హర్మన్, పూజ అనారోగ్యం బారిన పడటం ఆందోళన రేకెత్తించింది. అస్వస్థతకు గురై బుధవారం ఆస్పత్రిలో చేరిన వీరిద్దరు డిశ్చార్జ్ అయినప్పటికీ మ్యాచ్ ఆడతారా లేదా అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. కాగా కెప్టెన్ హర్మన్ వరల్డ్‌కప్ తాజా ఎడిషన్‌లో నాలుగు మ్యాచ్‌లలో కలిపి 66 పరుగులు చేసింది. ఒకవేళ ఆమె జట్టుకు దూరమైతే యస్తికా భాటియా తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. మరోవైపు.. ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ స్థానంలో దేవిక వైద్య ఆడే ఛాన్స్ ఉంది. హర్మన్ ఆడనట్లయితే వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనుంది. టీ20 వరల్డ్‌కప్-2023 తొలి సెమీ ఫైనల్- తుది జట్లు (అంచనా) భారత్: స్మృతి మంధాన, షఫాలీ, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, రేణుక, యస్తికా భాటియా, దేవికా వైద్య. ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెప్టెన్), బెత్ మూనీ, అలీసా హీలీ, ఎలీస్ పెర్రీ, ఆష్లే గార్డ్నర్, తాలియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, జార్జియా, అలానా కింగ్, మేగన్ షుట్, డార్సీ బ్రౌన్. చదవండి: మహ్మద్ రిజ్వాన్ విధ్వంసకర శతకం.. 18 బంతుల్లోనే..! BGT 2023: ఆసీస్‌తో సిరీస్.. టీమిండియా క్రికెటర్ తండ్రి కన్నుమూత -
'నా కూతురికి డబ్బు విలువ తెలియదు'
టీమిండియా మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్ ప్రస్తుతం సౌతాఫ్రికాలో జరుగుతున్న మహిళల టి20 వరల్డ్‌కప్‌లో బిజీగా ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పూజా వస్త్రాకర్ 4 ఓవర్లు బౌలింగ్ వేసి ఒక వికెట్ కూడా పడగొట్టింది. ఇవాళ గ్రూప్-బిలో భాగంగా వెస్టిండీస్‌తో తలపడనుంది. ఇటీవలే తొలిసారి జరిగిన వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలంలోనూ పూజాకు మంచి ధర పలికింది. ముంబై ఇండియన్స్ జట్టు రూ.కోటి 90 లక్షలకు పూజాను కొనుగోలు చేసింది. కాగా పూజా వస్త్రాకర్ టి20 వరల్డ్‌కప్ ఆడేందుకు సౌతాఫ్రికా వెళ్లడానికి ముందు తండ్రి బంధన్ రామ్‌కు రూ. 15 లక్షల విలువైన కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. కూతురు గిఫ్ట్‌ను చూసి సంతోషపడాల్సిన తండ్రి ఆశ్చర్యంగా నిరాశకు గురయ్యాడు. ''నా కూతురు అనవసరంగా డబ్బులు వృథా చేస్తుందంటూ'' బంధన్ రామ్ పేర్కొనడం ఆసక్తిని కలిగించింది. పూజా వస్త్రాకర్ తండ్రి బంధన్ రామ్ రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి. మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో బంధన్ రామ్ చాలా విషయాలను పంచుకున్నాడు. వివరాలు ఆయన మాటల్లోనే.. ''పూజా వస్త్రాకర్ తన నాలుగేళ్ల వయస్సులోనే క్రికెట్‌ను ప్రేమించడం మొదలుపెట్టింది. ఆ సమయంలో నా కూతురు టీమిండియాకు ఆడుతుందని నేను ఊహించలేదు. కానీ పట్టుదలతో తను అనుకున్నది సాధించి ఇవాళ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుండడం గొప్ప విషయం. పూజా చిన్నప్పుడు క్రికెట్ ఆడడానికి డబ్బులు అడిగిన ప్రతీసారి తనను సరదాగా ఎగతాళి చేసేవాడిని. చదువుకోకుండా అనవసరంగా క్రికెట్‌పై డబ్బులు ఖర్చు చేయిస్తున్నావు అంటూ కోప్పడేవాడిని. అయితే నా మాటలను సంతోషంగా స్వీకరించే పూజా ఎప్పుడు ఒక మాట అంటుండేది..'' చూడు నాన్న.. ఏదో ఒకరోజు కచ్చితంగా దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తాను''. అయితే పూజా దగ్గర ఒక బలహీనత ఉంది.. అదే డబ్బులు వృథా చేయడం. ఈ మధ్యనే వద్దని చెప్పినా కూడా రూ. 15 లక్షల విలువైన కారును బహుమతిగా ఇచ్చింది. బిడ్డ ప్రయోజకురాలు అయ్యిందంటే నాకు సంతోషమే. కానీ ఇలా అనవసరపు ఖర్చు నాకు నచ్చదు. అందుకే డబ్ల్యూపీఎల్ వేలం ద్వారా వచ్చిన రూ.1.90 కోట్లను దాచుకోవడానికి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పాను. ఇలా అయినా నా కూతురు అనవసర ఖర్చు తగ్గించుకుంటుంది'' అంటూ పేర్కొన్నాడు. ఇక టీమిండియా తరపున 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన పూజా వస్త్రాకర్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకుంది. జట్టు తరపున 2 టెస్టుల్లో ఐదు వికెట్లు తీసింది. ఇక 26 వన్డేల్లో 816 పరుగులు చేయడంతో పాటు 20 వికెట్లు, 44 టి20ల్లో 257 పరుగులతో పాటు 29 వికెట్లు పడగొట్టింది. చదవండి: Shoaib Akhtar: అందం ఒక్కటే సరిపోదు.. తెలివి కూడా ఏడిస్తే బాగుండు! -
Ind Vs Pak: దాయాది చేతిలో భారత్‌కు తప్పని భంగపాటు.. అప్పుడు అలా! ఇప్పుడిలా!
Womens Asia Cup T20 2022- India Vs Pakistan: మహిళల ఆసియా కప్- 2022 టీ20 టోర్నీలో భారత జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. దాదాపు ఆరేళ్ల తర్వాత తొలిసారిగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రీతిలో సాగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేనకు భంగపాటు తప్పలేదు. 13 పరుగుల తేడాతో గెలుపొందిన పాక్ మహిళా జట్టు.. సుదీర్ఘకాలం తర్వాత పొట్టి ఫార్మాట్లో భారత్‌పై తొలి విజయం నమోదు చేసింది. ఆదుకున్న నిదా బంగ్లాదేశ్‌లోని సెల్హెట్ వేదికగా శుక్రవారం భారత్- పాకిస్తాన్ మహిళా జట్లు ముఖాముఖి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్లు దీప్తి శర్మ మూడు వికెట్లు, పూజా వస్త్రాకర్ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో పాక్ 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్ బిస్మా మరూఫ్ 32 పరుగులతో రాణించగా.. ఆల్‌రౌండర్ నిదా దర్ 56 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. భారత బౌలర్లలో దీప్తికి మూడు, పూజాకు రెండు, రేణుకకు ఒక వికెట్ దక్కాయి. ఒకరిద్దరు మినహా భారత ఓపెనర్లు సబ్బినేని మేఘన 15, స్మృతి మంధాన 17 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించారు. మూడో స్థానంలో వచ్చిన జెమీమా(2) పూర్తిగా నిరాశపరచగా.. హేమలత 20 పరుగులతో రాణించింది. మిగతా వాళ్లలో దీప్తి 16, హర్మన్‌ప్రీత్ కౌర్ 12, రిచా ఘోష్ 26 పరుగులు(13 బంతుల్లో) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేయగలిగారు. దీంతో 19.4 ఓవర్లలో 124 పరుగులకే భారత జట్టు ఆలౌట్ అయింది. పాక్ 13 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాట్‌తోనూ, బంతితోనూ రాణించిన నిదా దర్(37 బంతుల్లో 56 పరుగులు, రెండు వికెట్లు)ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది. అప్పుడలా.. ఇప్పుడిలా కాగా టీ20 ఫార్మాట్లో ఇరుజట్లు 13 సార్లు తలపడగా భారత మహిళా జట్టుపై పాక్ టీమ్‌కు ఇది మూడో విజయం. 2016 తర్వాత ఇదే తొలి గెలుపు. ఇక ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో హర్మన్‌ప్రీత్ బృందం మూడింట గెలిచింది. మరోవైపు పాక్‌కు ఇది రెండో విజయం. ఇదిలా ఉంటే.. ఇటీవల ముగిసిన పురుషుల ఆసియా కప్-2022 ఈవెంట్లో లీగ్ దశలో పాక్‌పై గెలుపొందిన రోహిత్ సేన.. కీలకమైన సూపర్-4 దశలో మాత్రం ఓటమిని మూటగట్టుకుంది. ఫైనల్ చేరకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది ఈ డిఫెండింగ్ చాంపియన్. చదవండి: T20 WC 2022: ప్రపంచకప్ టోర్నీ.. ప్రాక్టీసు మొదలుపెట్టిన టీమిండియా IND vs SA: 'మేము అలా చేయలేకపోయాం.. అందుకే ఓడిపోయాం! సంజూ గ్రేట్' -
థర్డ్ అంపైర్ చీటింగ్.. టీమిండియా క్రికెటర్‌కు అన్యాయం
ఆసియాకప్ మహిళల టి20 టోర్నీలో టీమిండియా మహిళలు శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. శనివారం శ్రీలంక వుమెన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వుమెన్స్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ బ్యాటింగ్‌లో మెరవగా.. బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో భారత మహిళల జట్టు విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్ విజయం పక్కనబెడితే.. థర్డ్ అంపైర్ చీటింగ్‌కు టీమిండియా క్రికెటర్ పూజా వస్త్రాకర్‌కు అన్యాయంగా బలవ్వాల్సి వచ్చింది. రనౌట్ కాదని క్లియర్‌గా తెలుస్తున్నప్పటికి రిప్లేలో ఔటివ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన టీమిండియా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో చోటుచేసుకుంది. అచిని కౌలసూరియా వేసిన ఓవర్ ఐదో బంతిని పూజా వస్త్రాకర్ కవర్స్ దిశగా ఆడింది. సింగిల్ పూర్తి చేసిన పూజా రెండో పరుగు కోసం ప్రయత్నించింది. పూజా క్రీజులో బ్యాట్ పెట్టగానే కీపర్ బెయిల్స్‌ను ఎగురగొట్టింది. రిప్లేలో చూస్తే పూజా క్రీజుకు చేరినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం ఔట్ ఇవ్వడం షాక్‌కు గురిచేసింది. ఇది చూసిన పూజాకు కాసేపు ఏమి అర్థం కాలేదు. థర్డ్ అంపైర్ పొరపాటున ఔట్ ఇచ్చాడేమోనని ఎదురుచూసింది. కానీ బిగ్‌స్క్రీన్‌లో ఎలాంటి మార్పు లేదు. దీంతో నిరాశగా పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలోనూ ఆమె స్క్రీన్‌నే చూడడం గమనార్హం. కామెంటేటర్లు కూడా థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ''ఓ మై గుడ్నెస్ ఇట్స్ ఔట్.. హౌ'' అంటూ కామెంట్ చేయడం స్పష్టంగా వినిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''పూజా వస్త్రాకర్ రనౌట్ కాదని క్లియర్‌గా తెలుస్తోంది. అసలు ఏ కోశానా థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడో అర్థం కావడం లేదు.. '' అంటూ కామెంట్ చేశారు. కాగా పూజా వస్త్రాకర్ ఔటైన తీరుపై టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ''థర్డ్ అంపైర్‌ది వెరీ పూర్ డెసిషన్. రనౌట్ కాదని క్లియర్‌గా తెలుస్తోంది.. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఔట్ ఇచ్చి ఉంటాడు.'' అని పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఉమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జేమీమా రోడ్రిగ్స్ 53 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 76 పరుగులతో రాణించగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 33 పరుగులు చేసింది. లంక బౌలర్లలో రణసింగే మూడు వికెట్లు తీయగా.. సుగంధిక కుమారి, ఆటపట్టు చెరొక వికెట్ తీశారు 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 18.2 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్స్‌లో హాసిని పెరీరా 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్షితా మాధవి 26 పరుగులు చేసింది. భారత మహిళా బౌలర్లలో హేమలత మూడు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ చెరో రెండు వికెట్లు తీయగా.. రాధా యాదవ్ ఒక వికెట్ తీసింది. pic.twitter.com/lRDMOGYF6U — cricket fan (@cricketfanvideo) October 1, 2022 చదవండి: ప్రేమలో పడ్డ పృథ్వీ షా!.. గర్ల్‌ఫ్రెండ్ ఎవరంటే.. జెమీమా రోడ్రిగ్స్ విధ్వంసం.. ఆసియాకప్‌లో టీమిండియా మహిళలు శుభారంభం -
కామన్వెల్త్ గేమ్స్.. భారత క్రికెట్ జట్టుకు గుడ్ న్యూస్..!
కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్‌కు ముందు భారత్ మహిళల జట్టుకు గుడ్ న్యూస్ అందింది. కరోనా బారిన పడిన బ్యాటర్ సబ్భినేని మేఘన కోలుకుంది. తాజాగా నిర్వహించిన పరీక్షలలో ఆమెకు నెగిటివ్‌గా తేలింది. దీంతో మేఘన బర్మింగ్‌హామ్‌లో ఉన్న భారత జట్టలో చేరేందుకు సిద్దమైంది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మేఘన దృవీకరించింది. ఇక మేఘనా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో బర్మింగ్‌హామ్‌కు వెళ్లే తన ఫ్లైట్ బోర్డింగ్ పాస్ ఫోటోను షేర్ చేసింది. కాగా కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనడానికి భారత జట్టు బర్మింగ్‌హామ్‌కు పయనమయ్యే ఒక్క రోజు ముందు మేఘన, ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ కరోనా బారిన పడ్డారు. దీంతో వీరిద్దరూ బర్మింగ్‌హామ్‌కు వెళ్లే ఫ్లైట్ ఎక్కకుండా బెంగళూరులో ఉండిపోయారు. అయితే పూజా ఇంకా కోలుకోలేనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌తో జరిగే లీగ్ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇక కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలి సారిగా మహిళల క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్ జూలై 29న బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఎనిమిది జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఆస్ట్రేలియా,పాకిస్తాన్ బార్బడోస్ జట్లతో కలిపి భారత్ గ్రూప్-ఎలో ఉంది. గ్రూప్-బిలో ఆతిథ్య ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక ఉన్నాయి. ఆయా గ్రూప్స్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. భారత తమ తొలి మ్యాచ్‌లో శుక్రవారం(జూలై 29) ఆస్ట్రేలియాతో తలపడనుంది. కామన్వెల్త్ గేమ్స్‌కు భారత జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, ఎస్. మేఘన, తనియా భాటియా,యాస్తిక భాటియా, దీప్తి శర్మ, రాజేశ్వరి గయాక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్, జెమిమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, స్నేహ రాణా చదవండి: PV Sindhu: ఆర్టీపీసీఆర్ ఫలితాల్లో వ్యత్యాసంతో అనుమానం.. ఐసోలేషన్‌కు తరలింపు -
బిగ్‌బాష్ లీగ్ లో ఆడనున్న భారత ఆల్ రౌండర్..!
భారత ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ మహిళల బిగ్ బాష్ లీగ్-2022లో తొలి సారి ఆడనుంది. ఈ మెరకు బ్రిస్బేన్ హీట్‌తో పూజా తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బ్రిస్బేన్ హీట్ వెల్లడించింది. కాగా న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్ తర్వాత బ్రిస్బేన్ హీట్‌కు పూజా రెండో విదేశీ క్రికెటర్ కావడం గమనార్హం. గత ఏడాది ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత జట్టు తరపున వస్త్రాకర్ అద్భుతంగా రాణించింది. అదే విధంగా ఈ ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లోనూ పూజా తన ప్రదర్శనతో అకట్టుకుంది. వరల్డ్‌కప్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన పూజా.. 156 పరుగులతో పాటు 10 వికెట్లు పడగొట్టింది. ఇక కామన్వెల్త్ గేమ్స్-2022కు ప్రకటించిన భారత జట్టులో పూజా భాగంగా ఉంది. అయితే ఆమె కరోనా బరిన పడడంతో ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి మ్యాచ్‌కు దూరం కానుంది. బిగ్ బాష్ లీగ్‌లో భారత స్టార్ క్రికెటర్లు ఇప్పటికే భారత స్టార్ మహిళా క్రికెటర్లు బిగ్ బాష్ లీగ్‌లో భాగమయ్యారు. వారిలో స్మృతి మంధాన, దీప్తి శర్మ (సిడ్నీ థండర్), షఫాలీ వర్మ, రాధా యాదవ్ (సిడ్నీ సిక్సర్స్) తరపున ఆడగా.. రిచా ఘోష్ (హోబర్ట్ హరికేన్స్) హర్మన్‌ప్రీత్ కౌర్ ( మెల్ బోర్న్ రెనెగేడ్స్ ),రాధా యాదవ్ ( సిడ్నీ సిక్సర్స్) తరపున ప్రాతనిధ్యం వహిస్తున్నారు. చదవండి: Prabath Jayasuriya: టెస్ట్ క్రికెట్లో నయా సెన్సేషన్.. తొలి మూడు టెస్ట్‌ల్లో ఏకంగా 29 వికెట్లు..! -
WTC 2022: విజృంభించిన పూజ.. స్మృతి టీమ్‌ను చిత్తు చేసిన హర్మన్ సేన
పుణే: అమ్మాయిల మెరుపుల క్రికెట్ టోర్నీ ‘టి20 చాలెంజ్’లో సూపర్ నోవాస్ శుభారంభం చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని సూపర్ నోవాస్ 49 పరుగుల తేడాతో స్మృతి కెప్టెన్సీలోని డిఫెండింగ్ చాంపియన్ ట్రయల్ బ్లేజర్స్ జట్టుపై జయభేరి మోగించింది. తొలుత సూపర్ నోవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (29 బంతుల్లో 37; 4 ఫోర్లు) రాణించగా, హర్లీన్ (19 బంతుల్లో 35; 5 ఫోర్లు), డాటిన్ (17 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. బ్లేజర్స్ స్పిన్నర్లు హేలీ మాథ్యూస్ 3, సల్మా ఖాటున్ 2 వికెట్లు తీశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన ట్రయల్ బ్లేజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 పరుగులకే పరిమితమైంది. స్మృతి మంధాన (23 బంతుల్లో 34; 4 ఫోర్లు) ఆరంభంలో వేగంగా ఆడింది. అయితే పేసర్ పూజ వస్త్రకర్ (4/12) వైవిధ్యమైన బంతులతో ట్రయల్ బ్లేజర్స్‌ను దెబ్బ తీసింది. ఒకదశలో 7 ఓవర్లలో 63/1 స్కోరుతో మెరుగైన స్థితిలో ఉన్న బ్లేజర్స్ అనూహ్యంగా 10 పరుగుల వ్యవధిలోనే ఏకంగా 6 వికెట్లను కోల్పోయి ఓటమి ముంగిట నిలిచింది. ఇదే వేదికపై నేడు మధ్యాహ్నం గం. 3:30 నుంచి జరిగే మ్యాచ్‌లో సూపర్ నోవాస్‌తో వెలాసిటీ జట్టు తలపడుతుంది. -
ఇదేం షాటయ్యా ఇది.. ప్రపంచకప్‌లో అతి భారీ సిక్సర్ బాదిన టీమిండియా బ్యాటర్
Womens World Cup 2022: టీమిండియా బ్యాటర్ పూజా వస్త్రాకర్ మహిళల ప్రపంచకప్ 2022లో అతి భారీ సిక్సర్ బాది రికార్డుల్లోకెక్కింది. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వస్త్రాకర్.. ఆసీస్ పేసర్ మెగాన్ షట్ వేసిన ఇన్నింగ్స్ 49వ ఓవర్లో ఏకంగా 81 మీటర్ల అతి భారీ సిక్సర్ బాది ఔరా అనిపించింది. ప్రస్తుతప్రపంచకప్లో ఇప్పటి వరకు ఇదే అత్యంత భారీ సిక్సర్ కాగా, అంతకుముందు ఈ మెగా టోర్నీలో భారత బ్యాటర్ స్మృతి మంధాన, సౌతాఫ్రికా క్రీడాకారిణి క్లో టైరన్లు 80 మీటర్ల సిక్సర్లు బాదారు. తాజాగా వస్త్రాకర్ వీరిద్దరిని అధిగమించి 2022 వన్డే ప్రపంచకప్‌లో అతి భారీ సిక్సర్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇదిలా ఉంటే, ఆక్లాండ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. యస్తికా భాటియా (59), మిథాలీ రాజ్ (68), హర్మన్‌ప్రీత్ కౌర్ (57 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేయగా, ఛేదనలో ఆసీస్ మహిళా జట్టు మరో 3 బంతులుండగానే లక్ష్యాన్ని చేరుకుని సూపర్ విక్టరీ సాధించింది. కెప్టెన్ మెగ్ లాన్నింగ్ (97) మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ జట్టును విజయపుటంచులదాకా తీసుకురాగా, ఓపెనర్లు అలైసా హీలీ (72), రేచల్ హేన్స్ (43) విజయానికి గట్టి పునాది వేశారు. ఆఖర్లో బెత్ మూనీ (30 నాటౌట్) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చింది. చదవండి: World Cup 2022: మిథాలీ సేనకు షాక్.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆసీస్ -
Ind W Vs Pak W: పాక్ కెప్టెన్ కూతురిని ముద్దు చేసిన భారత మహిళా క్రికెటర్లు.. వైరల్
ICC Women's World Cup 2022 Ind Vs Pak: ‘దాయాదులు’... ‘చిరకాల ప్రత్యర్థులు’... ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. ఇక ఐసీసీ మేజర్ ఈవెంట్లలో ఇరు జట్లు పోటీ పడుతున్నాయంటే అభిమానులు చేసే సందడి మామూలుగా ఉండదు. టైటిల్ గెలవకపోయినా సరేగానీ.. దాయాది చేతిలో ఓడితే మాత్రం అస్సలు జీర్ణించుకోలేరు. అందుకు కారణమైన ఆటగాళ్లను ఏ స్థాయిలో ట్రోల్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వ్యక్తిగత దూషణలకు సైతం దిగుతారు. అయితే, క్రికెటర్లు మాత్రం ఈ ‘వైరాన్ని’ కేవలం మైదానం వరకే పరిమితం చేస్తారు. ఒక్కసారి బయట అడుగుపెట్టాక అంతా కలిసిపోయి సరదాగా ఉంటారు. పురుషుల టీ20 ప్రపంచకప్-2021లో భారత్ పాక్ చేతిలో ఓటమి పాలైన తర్వాత మెంటార్ ధోని, అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి క్రీడా స్ఫూర్తిని చాటిన తీరు ఇందుకు నిదర్శనం. తాజాగా మహిళల వన్డే వరల్డ్‌కప్-2022లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఈ మెగా ఈవెంట్లో భారత మహిళా జట్టు పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. 107 పరుగుల తేడాతో దాయాదిని చిత్తు చేసి గెలుపు సంబరంలో మునిగిపోయింది. పాక్ మహిళా జట్టు ఓటమి బాధలో కూరుకుపోయింది. ఇదంతా ఆట వరకే! పాక్ కెప్టెన్ కూతురిని ముద్దు చేసిన భారత మహిళా క్రికెటర్లు మ్యాచ్ ముగిసిన తర్వాత భారత మహిళా క్రికెటర్లు పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బిస్మా మరూఫ్ పట్ల వ్యవహరించిన తీరు ఆకట్టుకుంటోంది. ప్రపంచకప్ ఆడేందుకు న్యూజిలాండ్ వచ్చిన బిస్మా.. తన చిన్నారి పాపాయిని కూడా వెంట తీసుకువచ్చింది. ఆ చిట్టితల్లిని చూసి ముచ్చటపడిన భారత మహిళా క్రికెటర్లు ఆ ‘అమ్మ’ దగ్గరకు వెళ్లి బుజ్జాయిని కాసేపు ఆడించారు. బిడ్డను ఎత్తుకున్న బిస్మా చుట్టూ చేరి పాపతో సరదాగా గడిపారు. ఆ తర్వాత ఆమెతో ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐసీసీ సైతం ఈ ఫొటోను ట్విటర్లో షేర్ చేసింది. ‘‘ఇండియా- పాకిస్తాన్ క్రికెట్ స్ఫూర్తి గురించి చిన్నారి ఫాతిమా ఇప్పుడే పాఠాలు నేర్చుకుంటోంది’’ అంటూ క్యాప్షన్ జతచేసింది. ఇందుకు స్పందించిన నెటిజన్లు... ‘‘ఫొటో ఆఫ్ ది డే.. ఎంత హృద్యంగా ఉంది. అత్యంత అందమైన అద్బుతమైన క్షణాలు ఇవి. హృదయం పరవశించిపోతోంది’’ అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్- 2022 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ స్కోర్లు: ఇండియా-244/7 (50) పాకిస్తాన్-137 (43) 102 పరుగుల తేడాతో భారత్ విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: పూజా వస్త్రాకర్ చదవండి: Shane Warne Death: విషాద సమయంలో ఇలాంటివి అవసరమా.. గావస్కర్‌పై విమర్శలు! Little Fatima's first lesson in the spirit of cricket from India and Pakistan 💙💚 #CWC22 📸 @TheRealPCB pic.twitter.com/ut2lCrGL1H — ICC (@ICC) March 6, 2022 This video .. 🇮🇳🙌🏻🇵🇰#INDvPAK #INDvSL #PAKvIND #PAKvAUS#CWC22 #Peshawarblast pic.twitter.com/VuoCOGyzKW — DhrubaJyot Nath 🇮🇳 (@Dhrubayogi) March 6, 2022 Photo of the day!! #INDvPAK pic.twitter.com/OmHXuLPaVv — Milan Nakrani (@milannaks) March 6, 2022 View this post on Instagram A post shared by ICC (@icc) -
శెభాష్ అమ్మాయిలు.. పాక్‌పై భారత్ ఘన విజయం(ఫోటోలు)
-
పూజా వస్త్రాకర్.. నీ ఆటకు ఫిదా
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా భోణీ కొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 107 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాకిస్తాన్‌పై భారత మహిళల జట్టు తమకున్న రికార్డును మరింత మెరుగుపరుచుకుంది. ఇప్పటివరకు పాకిస్తాన్‌తో 11 వన్డేలు ఆడి ఒక్కసారి కూడా ఓడిపోలేదు. తాజాగా వన్డే ప్రపంచకప్ వేదికగా భారత్ పాక్‌పై మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక కెప్టెన్‌గా మిథాలీరాజ్‌కు కూడా పాకిస్తాన్‌పై ఇది 11వ విజయం కావడం విశేషం. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన పూజా వస్త్రాకర్ ఆటకు అభిమానులు ఫిదా అయ్యారు. మ్యాచ్ ఆరంభంలోనే షెఫాలీ వర్మ డకౌట్‌గా వెనుదిరగ్గా.. ఆ తర్వాత ఓపెనర్ మంధాన(52 పరుగులు), దీప్తి శర్మ(40 పరుగులు) రెండో వికెట్‌కు 92 పరుగులు జోడించి ఇద్దరు ఒకేసారి ఔటయ్యారు. ఆ తర్వాత కెప్టెన్ మిథాలీతో పాటు మిగతా బ్యాట్స్‌మన్ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో 114 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పూజా వస్త్రాకర్.. స్నేహా రాణాతో కలసి ఇన్నింగ్స్ ఆడింది. ఈ ఇద్దరు కలిసి ఏడో వికెట్‌కు దాదాపు 122 పరుగులు రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. పూజా వస్త్రాకర్(59 బంతుల్లో 67, 8 ఫోర్లు), స్నేహ రాణా(48 బంతుల్లో 53 నాటౌట్, 4 ఫోర్లు) పరుగులు సాధించారు. దీంతో టీమిండియా మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 244 పరుగులు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అనంతరం 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ వుమెన్స్‌ను టీమిండియా బౌలర్లు కట్టడిచేశారు. రాజేశ్వరీ గైక్వాడ్ 4 వికెట్లతో రాణించడంతో పాకిస్తాన్ 43 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. ఇక టీమిండియా మహిళల జట్టు తమ తర్వాతి మ్యాచ్ మార్చి 10న న్యూజిలాండ్‌తో ఆడనుంది. Pooja Vastrakar brings up a brilliant 50 on her World Cup debut! 👏 Can she take India past 250?#CWC22 pic.twitter.com/0LgDBMfX6z — ICC (@ICC) March 6, 2022