Womens World Cup 2022: టీమిండియా బ్యాటర్ పూజా వస్త్రాకర్ మహిళల ప్రపంచకప్ 2022లో అతి భారీ సిక్సర్ బాది రికార్డుల్లోకెక్కింది. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వస్త్రాకర్.. ఆసీస్ పేసర్ మెగాన్ షట్ వేసిన ఇన్నింగ్స్ 49వ ఓవర్‌లో ఏకంగా 81 మీటర్ల అతి భారీ సిక్సర్ బాది ఔరా అనిపించింది. ప్రస్తుతప్రపంచకప్లో ఇప్పటి వరకు ఇదే అత్యంత భారీ సిక్సర్ కాగా, అంతకుముందు ఈ మెగా టోర్నీలో భారత బ్యాటర్ స్మృతి మంధాన, సౌతాఫ్రికా క్రీడాకారిణి క్లో టైరన్‌లు 80 మీటర్ల సిక్సర్లు బాదారు. తాజాగా వస్త్రాకర్ వీరిద్దరిని అధిగమించి 2022 వన్డే ప్రపంచకప్‌లో అతి భారీ సిక్సర్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
ఇదిలా ఉంటే, ఆక్లాండ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. యస్తికా భాటియా (59), మిథాలీ రాజ్ (68), హర్మన్‌ప్రీత్ కౌర్ (57 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేయగా, ఛేదనలో ఆసీస్ మహిళా జట్టు మరో 3 బంతులుండగానే లక్ష్యాన్ని చేరుకుని సూపర్ విక్టరీ సాధించింది. కెప్టెన్ మెగ్ లాన్నింగ్ (97) మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ జట్టును విజయపుటంచులదాకా తీసుకురాగా, ఓపెనర్లు అలైసా హీలీ (72), రేచల్ హేన్స్ (43) విజయానికి గట్టి పునాది వేశారు. ఆఖర్లో బెత్ మూనీ (30 నాటౌట్) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చింది.
చదవండి: World Cup 2022: మిథాలీ సేనకు షాక్.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆసీస్
Comments
Please login to add a commentAdd a comment