టీమిండియా అరంగేట్రం సందర్భంగా క్యాప్ అందుకుంటూ అంజలి(పాత ఫొటో)
ఆసియా క్రీడలు-2023కు ఆంధ్రప్రదేశ్ పేసర్ అంజలి శర్వాణి దూరమైంది. మోకాలి గాయం కారణంగా ఆమె టోర్నీ నుంచి తప్పుకొంది. ఈ క్రమంలో ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్‌బౌలర్ స్థానంలో.. పూజా వస్త్రాకర్‌ను ప్రధాన జట్టులోకి తీసుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది.
అంజలి స్థానాన్ని హార్డ్ హిట్టింగ్ ఆల్‌రౌండర్‌తో భర్తీ చేసినట్లు వెల్లడించింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 26 ఏళ్ల అంజలి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ సందర్భంగా టీమిండియాలో ఎంట్రీ ఇచ్చింది.
మెరుగైన ఆట తీరు కనబరిచి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ప్రస్తుతం గ్రేడ్-సి(రూ. 10 లక్షల వార్షిక వేతనం)లో ఉన్న అంజలి 19వ ఆసియా క్రీడల్లో ఎంట్రీ ఇవ్వనున్న భారత మహిళా ప్రధాన జట్టుకు ఎంపికైంది.
అయితే, దురదృష్టవశాత్తూ గాయం కారణంగా మెగా ఈవెంట్లో పాల్గొనే సువర్ణావకాశం ఆమె చేజారింది. అంజలి శర్వాణి జట్టుకు దూరం కావడంతో స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న పూజా వస్త్రాకర్‌కు ప్రధాన జట్టులో చోటు దక్కింది. కాగా సెప్టెంబరు 23 నుంచి ఆసియా క్రీడలు ఆరంభం కానున్నాయి. చైనాలోని హోంగ్జో ఇందుకు వేదిక.
ఆసియా క్రీడలు-2023కి భారత మహిళా క్రికెట్ జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్జోత్ కౌర్, దేవికా వైద్య, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రి (వికెట్ కీపర్), అనూష బారెడ్డి, పూజా వస్త్రాకర్.
స్టాండ్ బై ప్లేయర్ల జాబితా: హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, స్నేహ్ రాణా, సైకా ఇషాక్.
Comments
Please login to add a commentAdd a comment