బిగ్‌బాష్‌ లీగ్‌ లో ఆడనున్న భారత ఆల్‌ రౌండర్‌..! | Pooja Vastrakar signed by Brisbane Heat for WBBL | Sakshi
Sakshi News home page

WBBL 2022: బిగ్‌బాష్‌ లీగ్‌ లో ఆడనున్న భారత ఆల్‌ రౌండర్‌..!

Jul 28 2022 4:47 PM | Updated on Jul 28 2022 4:47 PM

Pooja Vastrakar signed by Brisbane Heat for WBBL - Sakshi

భారత ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ మహిళల బిగ్ బాష్ లీగ్-2022లో తొలి సారి ఆడనుంది. ఈ మెరకు  బ్రిస్బేన్ హీట్‌తో పూజా తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా  వేదికగా బ్రిస్బేన్ హీట్‌ వెల్లడించింది. కాగా న్యూజిలాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ అమేలియా కెర్ తర్వాత బ్రిస్బేన్ హీట్‌కు పూజా రెండో విదేశీ క్రికెటర్‌ కావడం గమనార్హం.

గత ఏడాది ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత జట్టు తరపున వస్త్రాకర్ అద్భుతంగా రాణించింది. అదే విధంగా ఈ ఏడాది న్యూజిలాండ్‌ వేదికగా జరగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లోనూ పూజా తన ప్రదర్శనతో అకట్టుకుంది. వరల్డ్‌కప్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన పూజా.. 156 పరుగులతో పాటు 10 వికెట్లు పడగొట్టింది. ఇక కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022కు ప్రకటించిన భారత జట్టులో పూజా భాగంగా ఉంది. అయితే ఆమె కరోనా బరిన పడడంతో ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి మ్యాచ్‌కు దూరం కానుంది.

బిగ్‌ బాష్‌ లీగ్‌లో భారత స్టార్‌ క్రికెటర్లు
ఇప్పటికే భారత స్టార్‌ మహిళా క్రికెటర్లు బిగ్‌ బాష్‌ లీగ్‌లో భాగమయ్యారు. వారిలో స్మృతి మంధాన, దీప్తి శర్మ (సిడ్నీ థండర్‌), షఫాలీ వర్మ, రాధా యాదవ్‌ (సిడ్నీ సిక్సర్స్‌) తరపున ఆడగా..  రిచా ఘోష్ (హోబర్ట్ హరికేన్స్) హర్మన్‌ప్రీత్ కౌర్ ( మెల్ బోర్న్ రెనెగేడ్స్ ),రాధా యాదవ్ ( సిడ్నీ సిక్సర్స్‌) తరపున ప్రాతనిధ్యం వహిస్తున్నారు.
చదవండిPrabath Jayasuriya: టెస్ట్‌ క్రికెట్‌లో నయా సెన్సేషన్‌.. తొలి మూడు టెస్ట్‌ల్లో ఏకంగా 29 వికెట్లు..! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement