టీ20 క్రికెట్‌లో ఆస్ట్రేలియా పేసర్ ఆండ్రూ టై ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా టై రికార్డులకెక్కాడు. బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చెర్స్‌కు ఆడుతున్న టై.. ఫైనల్లో బ్రిస్బేన్ హీట్‌పై జేమ్స్ బేజ్లే ఔట్ చేసి ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక అరుదైన రికార్డును అతడు కేవలం 211 మ్యాచ్‌ల్లోనే సాధించాడు.
అంతకుముందు ఈ రికార్డు ఆఫ్గానిస్తాన్ స్టార్ పేసర్ రషీద్ ఖాన్ పేరిట ఉండేది. రషీద్ తన టీ20 కెరీర్‌లో 213 మ్యాచుల్లో 300 వికెట్లు పడగొట్టాడు. తాజామ్యాచ్‌తో రషీద్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో మూడో స్థానంలో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ ఉన్నాడు. మలింగ 222 మ్యాచుల్లో 300 వికెట్లు సాధించాడు.
ఐదో సారి ఛాంపియన్స్‌గా పెర్త్ స్కార్చెర్స్
బిగ్‌బాష్ లీగ్-2023 ఛాంపియన్స్‌గా పెర్త్ స్కార్చెర్స్ నిలిచింది. పెర్త్ వేదికగా జరిగిన ఫైనల్లో బ్రిస్బేన్ హీట్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన స్కార్చర్స్.. ఐదో సారి టైటిల్‌ను ఎగిరేసుకుపోయింది. 176 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పెర్త్ స్కార్చర్స్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. పెర్త్ టైటిల్ సాధించడంలో ఆ జట్టు కెప్టెన్ అష్టన్ టర్నర్ కీలక పాత్ర పోషించాడు.
32 బంతులు ఎదుర్కొన్న టర్నర్ 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేశాడు. అదే విధంగా ఆఖరిలో నిక్ హాబ్సన్(7 బంతుల్లో 18 నాటౌట్), కూపర్ కొన్నోలీ(11 బంతుల్లో 25 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడారు.
No player has reached 300 T20 wickets faster than Andrew Tye 👏 pic.twitter.com/DMEpXNHOQB
— 7Cricket (@7Cricket) February 4, 2023
చదవండి: W T20 WC 2023: మహిళల పోరుకు సర్వం సిద్దం.. తొలి మ్యాచ్‌లోనే పాక్‌తో భారత్ ఢీ
GAME OVER. WHAT A GAME.@ScorchersBBL are BBL champions!#BBL12 pic.twitter.com/wfcVqfYpZc
— 7Cricket (@7Cricket) February 4, 2023
Comments
Please login to add a commentAdd a comment