బిగ్‌బాష్ లీగ్ 2023-24లో మరో మెరుపు ఇన్నింగ్స్ నమోదైంది. అడిలైడ్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (జనవరి 3) జరిగిన మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ ఆటగాడు లారీ ఈవాన్స్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 28 బంతులు ఎదుర్కొన్న ఈవాన్స్ 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 85 పరుగులు చేశాడు. ఈవాన్స్ తన హాఫ్ సెంచరీని కేవలం 18 బంతుల్లోనే పూర్తి చేశాడు. బీబీఎల్‌లో పెర్త్ స్కార్చర్స్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టి కావడం విశేషం.
ఈవాన్స్ విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈవాన్స్‌తో పాటు వైట్‌మ్యాన్ (31), ఆరోన్ హార్డీ (34), జోస్ ఇంగ్లిస్ (26) కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్ట్రయికర్స్ బౌలర్లలో థార్టన్, ఓవర్టన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన స్ట్రయికర్స్.. కెప్టెన్ మాథ్యూ షార్ట్ (44 బంతుల్లో 74; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నంతసేపు లక్ష్యం దిశగా సాగింది. అయితే షార్ట్ ఔటైన అనంతరం స్ట్రయికర్స్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో 19.2 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటై, 42 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
లాన్స్ మోరిస్ (4-0-24-5) ఐదు వికెట్ల ప్రదర్శనతో స్ట్రయికర్స్ పతనాన్ని శాశించాడు. జై రిచర్డ్స్‌సన్ (2/31), ఆండ్రూ టై (2/35), బెహ్రెన్‌డార్ఫ్ (1/24) తలో చేయి వేశారు. స్ట్రయికర్స్ ఇన్నింగ్స్‌లో షార్ట్‌తో పాటు క్రిస్ లిన్ (27), థామస్ కెల్లీ (29), ఆడమ్ హోస్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment