Ashton Turner
-
శతక్కొట్టిన టర్నర్.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఖాతాలో 17వ షెఫీల్డ్ షీల్డ్ టైటిల్
వెస్ట్రన్ ఆస్ట్రేలియా.. షెఫీల్డ్ షీల్డ్ 2022-23 టైటిల్‌ను 17వ సారి సొంతం చేసుకుంది. విక్టోరియాతో జరిగిన ఫైనల్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆట నాలుగో రోజైన ఇవాళ (మార్చి 26) విక్టోరియా నిర్ధేశించిన 91 పరుగుల లక్ష్యాన్ని వెస్ట్రన్ ఆస్ట్రేలియా వికెట్ కోల్పోయి ఛేదించింది. కెమారూన్ బాన్‌క్రాఫ్ట్ (39), టీగ్ వైల్లీ (43) వెస్ట్రన్ ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చారు. Western Australia clinched their 17th #SheffieldShield title with a thumping nine-wicket win over Victoria! Full recap from @ARamseyCricket at the WACA + full highlights 👇https://t.co/uAEk4nL5CL — cricket.com.au (@cricketcomau) March 26, 2023 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విక్టోరియా తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌట్ కాగా.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 315 పరుగులు సాధించి 120 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్‌ను దక్కించుకుంది. విక్టోరియా తొలి ఇన్నింగ్స్‌లో ఆష్లే చంద్రసింఘే (46) టాప్ స్కోరర్‌గా నిలువగా.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఆస్టన్ టర్నర్ (128) సెంచరీతో కదం తొక్కాడు. What a way to go back-to-back!! Western Australia are the 2022-23 #SheffieldShield champions! #PlayOfTheDay | @MarshGlobal pic.twitter.com/gdsFuNWgqb — cricket.com.au (@cricketcomau) March 26, 2023 అనంతరం విక్టోరియా రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమై 210 పరుగులకే చాపచుట్టేసి, వెస్ట్రన్ ఆస్ట్రేలియా ముందు 91 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. దీన్ని వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ ఛేదించారు. ఈ మ్యాచ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ జోష్ ఫిలిప్స్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరుగురిని, రెండో ఇన్నింగ్స్‌లో ఇద్దరిని ఔట్ చేయడంలో భాగం కావడం విశేషం. -
చరిత్ర సృష్టించిన ఆండ్రూ టై .. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా!
టీ20 క్రికెట్లో ఆస్ట్రేలియా పేసర్ ఆండ్రూ టై ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా టై రికార్డులకెక్కాడు. బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చెర్స్‌కు ఆడుతున్న టై.. ఫైనల్లో బ్రిస్బేన్ హీట్‌పై జేమ్స్ బేజ్లే ఔట్ చేసి ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక అరుదైన రికార్డును అతడు కేవలం 211 మ్యాచ్‌ల్లోనే సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు ఆఫ్గానిస్తాన్ స్టార్ పేసర్ రషీద్ ఖాన్ పేరిట ఉండేది. రషీద్ తన టీ20 కెరీర్లో 213 మ్యాచుల్లో 300 వికెట్లు పడగొట్టాడు. తాజామ్యాచ్తో రషీద్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో మూడో స్థానంలో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ ఉన్నాడు. మలింగ 222 మ్యాచుల్లో 300 వికెట్లు సాధించాడు. ఐదో సారి ఛాంపియన్స్‌గా పెర్త్ స్కార్చెర్స్ బిగ్‌బాష్ లీగ్-2023 ఛాంపియన్స్‌గా పెర్త్ స్కార్చెర్స్ నిలిచింది. పెర్త్ వేదికగా జరిగిన ఫైనల్లో బ్రిస్బేన్ హీట్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన స్కార్చర్స్.. ఐదో సారి టైటిల్‌ను ఎగిరేసుకుపోయింది. 176 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పెర్త్ స్కార్చర్స్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. పెర్త్ టైటిల్ సాధించడంలో ఆ జట్టు కెప్టెన్ అష్టన్ టర్నర్ కీలక పాత్ర పోషించాడు. 32 బంతులు ఎదుర్కొన్న టర్నర్ 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేశాడు. అదే విధంగా ఆఖరిలో నిక్ హాబ్సన్(7 బంతుల్లో 18 నాటౌట్), కూపర్ కొన్నోలీ(11 బంతుల్లో 25 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడారు. No player has reached 300 T20 wickets faster than Andrew Tye 👏 pic.twitter.com/DMEpXNHOQB — 7Cricket (@7Cricket) February 4, 2023 చదవండి: W T20 WC 2023: మహిళల పోరుకు సర్వం సిద్దం.. తొలి మ్యాచ్‌లోనే పాక్‌తో భారత్ ఢీ GAME OVER. WHAT A GAME.@ScorchersBBL are BBL champions!#BBL12 pic.twitter.com/wfcVqfYpZc — 7Cricket (@7Cricket) February 4, 2023 -
టర్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బిగ్‌బాష్ లీగ్ ఛాంపియన్స్‌గా పెర్త్ స్కార్చర్స్
బిగ్‌బాష్ లీగ్-2023 ఛాంపియన్స్‌గా పెర్త్ స్కార్చర్స్ జట్టు నిలిచింది. పెర్త్ వేదికగా జరిగిన ఫైనల్లో బ్రిస్బేన్ హీట్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన స్కార్చర్స్.. ఐదవసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 176 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పెర్త్ స్కార్చర్స్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. పెర్త్ బ్యాటర్లలో కెప్టెన్ అష్టన్ టర్నర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 32 బంతులు ఎదుర్కొన్న టర్నర్ 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేశాడు. అదే విధంగా ఆఖరిలో నిక్ హాబ్సన్(7 బంతుల్లో 18 నాటౌట్), కూపర్ కొన్నోలీ(11 బంతుల్లో 25 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. బ్రిస్బేన్ హీట్ బౌలర్లలో జేవియర్ బార్ట్లెట్, మాథ్యూ కుహ్నెమాన్, జాన్సెన్ తలా వికెట్ సాధించారు. రాణించిన బ్రెయింట్, మెక్‌స్వీనీ ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. బ్రిస్బేన్ బ్యాటర్లలో మెక్‌స్వీనీ(41), బ్రెయింట్(14 బంతుల్లో 31) పరుగులతో రాణించారు. ఇక పెర్త్ బౌలర్లలో బెహ్రెండోర్ఫ్, కెల్లీ రెండు వికెట్లు పడగొట్టగా.. హార్దీ, టై తలా వికెట్ సాధించారు. చదవండి: 'ఉమ్రాన్‌కు అంత సీన్ లేదు.. పాక్‌లో అలాంటోళ్లు చాలా మంది ఉన్నారు’ -
ఏబీ జెర్సీ ధరించాడు.. అందుకే అలా పడ్డాడు
పెర్త్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్-10)లో భాగంగా బుధవారం పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ సిక్సర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పెర్త్ స్కార్చర్స్ కెప్టెన్ ఆస్టన్ టర్నర్ కొట్టిన ఒక షాట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెర్త్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను జేక్ బాల్ వేశాడు. క్రీజులో మిచెల్ మార్ష్, ఆస్టన్ టర్నర్లు ఉన్నారు. బాల్ వేసిన మొదటి బంతిని ఆస్టన్ టర్నర్ ఫైన్‌లెగ్ దిశగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి కింద పడ్డాడు.. కానీ అప్పటికే బంతి బ్యాట్‌కు సరైన దిశలో తగలడంతో వేగంగా బౌండరీ లైన్‌ను దాటేసింది. (చదవండి: సిక్స్ కొడితే బీర్ మగ్‌లో పడింది..!) ఇలాంటి షాట్లను దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఎక్కువగా ఆడుతుంటాడు. ఆస్టన్ టర్నర్ ధరించిన జెర్సీ నెంబర్ 17.. అంతర్జాతీయ క్రికెట్లో ఏబీ డివిలియర్స్ జెర్సీ నెంబర్ కూడా 17 కావడం ఇక్కడ యాదృశ్చికం. ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్లో షేర్ చేసింది. ఆస్టన్ ఆడిన షాట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. 'పడితే పడ్డాడు కాని షాట్ మాత్రం సూపర్‌గా ఆడాడు.. ఏబీ డివిలియర్స్ జెర్సీని ధరించాడే కాబట్టే అలాంటి షాట్లు ఆడాడు.. టర్నర్‌కు డివిలియర్స్ గుర్తుచ్చాడేమో.. ఒక్కసారి టర్నర్ ధరించిన జెర్సీ నెంబర్ చూడండంటూ ' వినూత్న రీతిలో కామెంట్లు పెట్టారు.(చదవండి: 'ఛీ.. స్కూల్ లెవల్ కన్నా దారుణం') కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కొలిన్ మున్రో 50 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్స్ 16.4 ఓవర్లలోనే 97 పరుగులకే ఆలౌటైంది. జాక్ ఎడ్వర్డ్స్ 44 పరుగులు మినహా ఏ ఒక్కరు ఆకట్టుకోలేకపోయారు. పెర్త్ స్కార్చర్స్ బౌలర్లలో అండ్రూ టై 4 వికెట్లు తీయగా.. జై రిచర్డ్సన్ 3 వికెట్లు తీశాడు. How on earth did Ashton Turner do that!? #BBL10 pic.twitter.com/juU0uXH5MW — cricket.com.au (@cricketcomau) January 6, 2021 -
చాలా బాధేస్తోంది: కోహ్లి
మొహాలీ : గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి చెందడంతో చాలా బాధేస్తోందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించినా పర్యాటకజట్టు అలవోకగా విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. తమ ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా మంచు గురించి మా అంచనా తప్పయింది. మంచు వల్ల చివర్లో మా బౌలర్లకు అసలు పట్టు చిక్కలేదు. అయితే దీనిని మా ఓటమికి సాకుగా చెప్పను. ఆఖరి ఓవర్లలో ఐదు అవకాశాలు వృథా కావడం జీర్ణించుకోలేనిది. స్టంపింగ్ అవకాశం చేజారింది. ఫీల్డింగ్ బాగా లేదు. డీఆర్ఎస్ను సందేహించాల్సిన పరిస్థితి మళ్లీ వచ్చింది. అస్టన్ టర్నర్, ఖవాజా, హ్యాండ్స్‌కోంబ్‌ల అద్భుతంగా ఆడారు. ప్రత్యర్ధి జట్టు మా కన్నా బాగా ఆడింది. వరుసగా రెండు మ్యాచ్‌ల ఫలితాలతో మా కళ్లు తెరచుకున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం మరో మాటకు తావు లేకుండా మమ్మల్ని చాలా బాధపెడుతోంది.’ అని కోహ్లి అభిప్రాయపడ్డాడు. చదవండి: టర్నర్ విన్నర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఓపెనర్లు శిఖర్ ధావన్ (115 బంతుల్లో 143; 18 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (92 బంతుల్లో 95; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన ఆసీస్‌ను పీటర్ హ్యాండ్స్కోంబ్ (105 బంతుల్లో 117; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), ఉస్మాన్ ఖాజా (99 బంతుల్లో 91; 7 ఫోర్లు)లు కీలక ఇన్నింగ్స్‌తో ఆదుకోగా.. చివర్లో ఆస్టన్ టర్నర్ (43 బంతుల్లో 84 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగి జట్టును గెలిపించాడు. చదవండి : బుమ్రా మెరిసె.. కోహ్లి మురిసె -
ఆసీస్‌కు ఎదురుదెబ్బ
సిడ్నీ: భారత్‌తో జరుగనున్న మూడు వన్డేల సిరీస్‌లో తలపడే ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగలింది. శనివారం సిడ్నీ వేదికగా జరిగే తొలి వన్డేకు ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ దూరమయ్యాడు. జీర్ణాశయ సంబంధిత రోగంతో బాధపడుతున్న మార్ష్ కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. దాంతో మిచెల్ మార్ష్ తొలి వన్డేలో పాల్గొనడం లేదని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు. మిగతా రెండు వన్డేలకు మార్ష్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నాడు. మిచెల్ మార్ష్ తేరుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అతని స్థానంలో ఆస్టాన్ టర్నర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అయిన టర్నర్.. పార్ట్‌టైమ్ ఆఫ్ స్పిన్నర్ కావడంతో అతన్ని ఎంపిక చేసినట్లు కోచ్ తెలిపాడు. మరొకవైపు ఆస్టన్ వికెట్ల మధ్య పరుగెత్తడంలో అథ్లెట్‌ను తలపిస్తాడన్నాడు. బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో ఆస్టన్ టర్నర్ పెర్త్ స్కార్చర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ లీగ్‌లో ఆస్టన్ ఆడిన చివరి మూడు మ్యాచ్‌ల్లో (60 నాటౌట్, 47, 43 నాటౌట్) రాణించాడు.