విరాట్ కోహ్లి
మొహాలీ : గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి చెందడంతో చాలా బాధేస్తోందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించినా పర్యాటకజట్టు అలవోకగా విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. తమ ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా మంచు గురించి మా అంచనా తప్పయింది. మంచు వల్ల చివర్లో మా బౌలర్లకు అసలు పట్టు చిక్కలేదు. అయితే దీనిని మా ఓటమికి సాకుగా చెప్పను. ఆఖరి ఓవర్లలో ఐదు అవకాశాలు వృథా కావడం జీర్ణించుకోలేనిది. స్టంపింగ్ అవకాశం చేజారింది. ఫీల్డింగ్ బాగా లేదు. డీఆర్‌ఎస్‌ను సందేహించాల్సిన పరిస్థితి మళ్లీ వచ్చింది. అస్టన్ టర్నర్, ఖవాజా, హ్యాండ్స్‌కోంబ్‌ల అద్భుతంగా ఆడారు. ప్రత్యర్ధి జట్టు మా కన్నా బాగా ఆడింది. వరుసగా రెండు మ్యాచ్‌ల ఫలితాలతో మా కళ్లు తెరచుకున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం మరో మాటకు తావు లేకుండా మమ్మల్ని చాలా బాధపెడుతోంది.’ అని కోహ్లి అభిప్రాయపడ్డాడు.
చదవండి: టర్నర్ విన్నర్
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఓపెనర్లు శిఖర్ ధావన్ (115 బంతుల్లో 143; 18 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (92 బంతుల్లో 95; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన ఆసీస్‌ను పీటర్ హ్యాండ్స్‌కోంబ్ (105 బంతుల్లో 117; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), ఉస్మాన్ ఖాజా (99 బంతుల్లో 91; 7 ఫోర్లు)లు కీలక ఇన్నింగ్స్‌తో ఆదుకోగా.. చివర్లో ఆస్టన్ టర్నర్ (43 బంతుల్లో 84 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగి జట్టును గెలిపించాడు.
చదవండి : బుమ్రా మెరిసె.. కోహ్లి మురిసె
Comments
Please login to add a commentAdd a comment