
భారత క్రికెట్ జట్టు రెండో సారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో ఆసీస్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఆసీస్ నిర్ధేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలో చేధించింది.
కాగా భారత్ విజయంలో విరాట్ కోహ్లి కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి.. తృటిలో తన 52వ వన్డే సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 98 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 84 పరుగులు చేసిన కోహ్లి.. జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించాడు.
అప్పటివరకు ఆచితూచి ఆడుతున్న కోహ్లి అనూహ్యంగా ఔట్ అవ్వడంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. నాన్‌స్ట్రైక్‌లో ఉన్న కేఎల్ రాహుల్ సైతం నిరాశచెందాడు. నేను కొడుతున్నా కదా భయ్యా అన్నట్లు రాహుల్ రియాక్షన్ ఇచ్చాడు. అయితే దీనిపై మ్యాచ్ అనంతరం రాహుల్ స్పందించాడు.
"నేను క్రీజులోకి వచ్చాక పది పన్నేండు బంతులు ఆడాక కోహ్లి వద్దకు వెళ్లి కాసేపు మాట్లాడాను. ఆఖరి వరకు క్రీజులోనే ఉండాలని తనకు చెప్పాను. నేను రిస్క్ తీసుకుని షాట్లు ఆడుతాను, ఏదో ఒక ఓవర్‌ను టార్గెట్ చేస్తాను అని చెప్పా. ఎందుకుంటే ఆ సమయంలో మాకు ఓవర్‌కు 6 పరుగులు మాత్రమే అవసరం.
కానీ ఈ వికెట్‌పై ఓవర్‌కు ఎనిమిది పరుగులు సులువగా సాధించవచ్చు అన్పించింది. ఓవర్‌కు ఒక్క బౌండరీ వచ్చినా చాలు. కాబట్టి ఆ రిస్క్ నేను తీసుకుంటూ, నీవు కేవలం స్ట్రైక్ రోటేట్ చేస్తే చాలు అని చెప్పాను. కానీ కోహ్లి నా మాట వినలేదు. భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. బహుశా బంతి స్లాట్‌లో ఉందని భావించి ఆ షాట్ ఆడిండవచ్చు. కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో మైదానం వీడాల్సి వచ్చింది" అని రాహుల్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి: అదే మా కొంపముంచింది... లేదంటే విజయం మాదే: స్టీవ్ స్మిత్
Comments
Please login to add a commentAdd a comment