చివరి టీ20లో 10 వికెట్లతో నెగ్గిన భారత మహిళల జట్టు
పూజ వస్త్రకర్‌కు 4 వికెట్లు
స్మృతి అజేయ అర్ధసెంచరీ
దక్షిణాఫ్రికాతో సిరీస్ 1–1తో సమం
India Women vs South Africa Women, 3rd T20I: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను 1–1తో సమంగా ముగించింది.
చెన్నై వేదికగా మంగళవారం జరిగిన చివరిదైన మూడో టీ20 మ్యాచ్‌లో.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా.. 10 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది.
తొలి టీ20లో దక్షిణాఫ్రికా నెగ్గగా... రెండో టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఇక 2006 నుంచి ఇప్పటి వరకు 187 టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టుకిది 100వ విజయం కావడం విశేషం. ప్రత్యర్థి జట్టుపై టీమిండియా 10 వికెట్లతో నెగ్గడం ఇది మూడోసారి.
ఈ మ్యాచ్ కంటే ముందు భారత జట్టు 2016లో ఆస్ట్రేలియాపై, 2019లో వెస్టిండీస్‌పై 10 వికెట్ల తేడాతో గెలిచింది. సిరీస్‌ను సమం చేయాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ నెగ్గిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 17.1 ఓవర్లలో 84 పరుగులకే కుప్పకూలింది.
పూజ వస్త్రకర్‌కు 4 వికెట్లు
భారత పేస్ బౌలర్ పూజా వస్త్రకర్ 13 పరుగులిచ్చి 4 వికెట్లు, స్పిన్నర్ రాధా యాదవ్ 6 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశారు. అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ ఒక్కో వికెట్ తీశారు.
అనంతరం 85 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఆడుతూపాడుతూ ఛేదించింది. 10.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 88 పరుగులు చేసి టీమిండియా గెలిచింది.
Series Levelled ✅#TeamIndia and @ProteasWomenCSA share the honours in the T20I series. 🤝 🏆#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/RS3yCOjH2Q
— BCCI Women (@BCCIWomen) July 9, 2024
స్మృతి మంధాన (40 బంతుల్లో 54 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీ సాధించగా... షఫాలీ వర్మ (25 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) కూడా రాణించింది. పూజా వస్త్రకర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
A clinical 🔟-wicket win in the 3rd T20I 🥳
The @IDFCFIRSTBank #INDvSA series is drawn 1⃣-1⃣
Scorecard ▶️ https://t.co/NpEloo6GAm#TeamIndia pic.twitter.com/f1wcGPWWKo— BCCI Women (@BCCIWomen) July 9, 2024
Comments
Please login to add a commentAdd a comment