టీ20 వరల్డ్‌కప్‌.. టీమిండియాకు గాయల బెడద? | Several injury woes cloud Indian Womens T20 World Cup preparation | Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్‌కప్‌.. టీమిండియాకు గాయల బెడద?

Published Sat, Sep 21 2024 9:23 PM | Last Updated on Sat, Sep 21 2024 9:31 PM

Several injury woes cloud Indian Womens T20 World Cup preparation

యూఏఈ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న‌ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024కు ముందు భార‌త మ‌హిళ‌ల జ‌ట్టును గాయాల బెడ‌ద వెంటాడుతోంది. భార‌త మ‌హిళ‌ల‌ జ‌ట్టు ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని ఏన్సీఏలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంప్‌లో చెమ‌డ్చోతుంది. అయితే జ‌ట్టులోని కీల‌క ఆట‌గాళ్లు  గాయాల బారిన ప‌డ్డారు. స్టార్ ప్లేయ‌ర్లు గాయాల‌తో బాధ‌ప‌డుతుండ‌డంతో భార‌త జ‌ట్ట మెనెజ్‌మెంట్ ఆందోళ‌న చెందుతోంది.

గాయాల బారిన ప‌డిన ప్లేయ‌ర్స్ వీరే
అరుంధతి రెడ్డి
భార‌త జ‌ట్టు స్టార్ పేస‌ర్ అరుంధతి రెడ్డి ప్ర‌స్తుతం భుజం గాయంతో బాధపడుతోంది. ఆమె ప్ర‌స్తుతం బౌలింగ్ ప్రాక్టీస్ దూరంగా ఉంది. అయితే ప్రపంచకప్ ప్రారంభమయ్యే ఆమె పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ ఈ మెగా టోర్నీ అయితే భార‌త్‌కు గ‌ట్టి ఎదురు దెబ్బే అనే చెప్పుకోవాలి. అరుంధ‌తి ప్ర‌స్తుతం అద్బుత‌మైన ఫామ్‌లో ఉంది.

పూజా వస్త్రాకర్
టీమిండియా మ‌రో స్టార్ ఆల్‌రౌండ‌ర్ పూజా వస్త్రాకర్ కూడా భుజం గాయంతో పోరాడుతోంది. అయితే గాయంతో పూజా గాయంతో బాధ‌ప‌డుతున్న‌ప్ప‌ట‌కి పెయిన్‌కిల్లర్ ఇంజెక్షన్ల సహాయంతో త‌న ప్రాక్టీస్‌ను కొన‌సాగిస్తోంది. ఆమె కూడా వ‌ర‌ల్డ్‌క‌ప్ స‌మ‌యానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించే ఛాన్స్ ఉంది.

శ్రేయాంక పాటిల్ 
వేలి ఫ్రాక్చర్ కారణంగా ఆసియా కప్‌కు దూరమైన యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఇంకా కోలుకోలేదు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఎంపికైన‌ప్ప‌ట‌కి టోర్నీ అందుబాటులో ఉంటుందా లేద‌న్న‌ది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఆమె మెగా ఈవెంట్ స‌మ‌యానికి ఈ క‌ర్ణాట‌క స్పిన్న‌ర్ కోలుకునే అవ‌కాశ‌మున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

జెమిమా రోడ్రిగ్స్ 
స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ కూడా చేతివేలి గాయంతో బాధపడుతోంది. ఆసియాకప్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు రోడ్రిగ్స్ చేతి వేలికి గాయమైంది. అయితే ఆమె తన వేలికి టేప్ చుట్టి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. ఆమె ప్రపంచకప్‌ సమయానికి దాదాపుగా కోలుకునే సూచనలు కన్పిస్తున్నాయి. కాగా ఈ మెగా టోర్నీ ఆక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం కానుంది. భారత తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 4న న్యూజిలాండ్‌తో తలపడనుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement