ICC Womens Twenty20 World Cup
-
టీ20 వరల్డ్‌కప్.. టీమిండియాకు గాయల బెడద?
యూఏఈ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు భారత మహిళల జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. భారత మహిళల జట్టు ప్రస్తుతం బెంగళూరులోని ఏన్సీఏలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంప్‌లో చెమడ్చోతుంది. అయితే జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. స్టార్ ప్లేయర్లు గాయాలతో బాధపడుతుండడంతో భారత జట్ట మెనెజ్‌మెంట్ ఆందోళన చెందుతోంది.గాయాల బారిన పడిన ప్లేయర్స్ వీరేఅరుంధతి రెడ్డిభారత జట్టు స్టార్ పేసర్ అరుంధతి రెడ్డి ప్రస్తుతం భుజం గాయంతో బాధపడుతోంది. ఆమె ప్రస్తుతం బౌలింగ్ ప్రాక్టీస్ దూరంగా ఉంది. అయితే ప్రపంచకప్ ప్రారంభమయ్యే ఆమె పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ మెగా టోర్నీ అయితే భారత్‌కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పుకోవాలి. అరుంధతి ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉంది.పూజా వస్త్రాకర్టీమిండియా మరో స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ కూడా భుజం గాయంతో పోరాడుతోంది. అయితే గాయంతో పూజా గాయంతో బాధపడుతున్నప్పటకి పెయిన్‌కిల్లర్ ఇంజెక్షన్ల సహాయంతో తన ప్రాక్టీస్‌ను కొనసాగిస్తోంది. ఆమె కూడా వరల్డ్‌కప్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించే ఛాన్స్ ఉంది.శ్రేయాంక పాటిల్ వేలి ఫ్రాక్చర్ కారణంగా ఆసియా కప్‌కు దూరమైన యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఇంకా కోలుకోలేదు. టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపికైనప్పటకి టోర్నీ అందుబాటులో ఉంటుందా లేదన్నది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఆమె మెగా ఈవెంట్ సమయానికి ఈ కర్ణాటక స్పిన్నర్ కోలుకునే అవకాశమున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.జెమిమా రోడ్రిగ్స్ స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ కూడా చేతివేలి గాయంతో బాధపడుతోంది. ఆసియాకప్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు రోడ్రిగ్స్ చేతి వేలికి గాయమైంది. అయితే ఆమె తన వేలికి టేప్ చుట్టి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. ఆమె ప్రపంచకప్ సమయానికి దాదాపుగా కోలుకునే సూచనలు కన్పిస్తున్నాయి. కాగా ఈ మెగా టోర్నీ ఆక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. భారత తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో తలపడనుంది. -
ఐసీసీ చారిత్రత్మక నిర్ణయం.. రూ.66 కోట్ల ప్రైజ్‌మనీ
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చారిత్రత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రపంచ కప్ టోర్నమెంట్లలో పురుషులతో సమానంగా మహిళలకు ప్రైజ్‌మనీని ఐసీసీ అందజేయనుంది. వచ్చే నెల యూఏఈ వేదికగా జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2024తో ఈ నిర్ణయాన్ని ఐసీసీ అమలు చేయనుంది. దీంతో టోర్నమెంట్ మొత్తం ప్రైజ్‌మనీ 7.958 మిలియన్ డాలర్లకు ( భారత కరెన్సీలో రూ.66 కోట్లు). గత టోర్నీలతో పోలిస్తే ఇది 225 శాతం అధికం కావడం విశేషం. వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టు రూ.19 కోట్ల ప్రైజ్‌మనీ లభించనుంది. అదేవిధంగా రన్నరప్‌గా నిలిచిన జట్టు రూ.9 కోట్ల నగదు బహుమతి దక్కించుకోనుంది."ఐసీసీ టోర్నీల్లో పురుషులతో పాటు మహిళలకు సమాన ప్రైజ్ మనీ ఇవ్వనున్నాం. మహిళల టీ20 ప్రపంచకప్-2024లో ఈ చారిత్రత్మక నిర్ణయాన్ని అమలు చేయనున్నాం. క్రీడా చరిత్రలో ఇదొక మైలు రాయిగా నిలిచిపోతుంది. ఈ ఏడాది జూలైలో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాము. క్రీడల్లో లింగ వివక్ష లేకుండా చేసేందుకు మరో అడుగు ముందుకు వేశాము. సమాన ప్రైజ్‌మనీ అందిస్తున్న క్రీడగా క్రికెట్ నిలిచిందని" ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా మహిళల టీ20 ప్రపంచ కప్ అక్టోబరు 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. -
టీ20 వరల్డ్‌కప్ కోసం న్యూజిలాండ్ జట్టు ప్రకటన..
మహిళల టీ20 ప్రపంచకప్-2024, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఆల్ రౌండర్ సోఫీ డివైన్ ఎంపికైంది. అదే విధంగా ఈ జట్టులో సీనియర్ క్రికెటర్ సుజీ బేట్స్‌కు కూడా చోటు దక్కింది. గత కొంత కాలంగా గాయం కారణంగా దూరంగా ఉంటున్న ఎక్స్‌ప్రెస్ పేసర్ రొస్మేరీ మైర్ తిరిగి జట్టులోకి వచ్చింది. ఆమె రాకతో వైట్ ఫెర్న్(న్యూజిలాండ్ మహిళల జట్టు) బౌలింగ్ విభాగం మరింత బలంగా మారింది. లీ కాస్పెరెక్, మెలీ కెర్, ఫ్రాన్ జోనాస్, ఈడెన్ కార్సన్ వంటి స్పిన్నర్లకు సైతం వరల్డ్‌కప్ జట్టులో చోటు లభించింది. ఇక ఈ మెగా టోర్నీ ఆక్టోబర్ 3 నుంచి యూఎఈ వేదికగా ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 4న భారత్‌తో తలపడనుంది.కాగా టీ20 వరల్డ్‌కప్ సన్నాహాకాల్లో భాగంగా న్యూజిలాండ్.. ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గోనుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి 24 మధ్య జరగనుంది. ఆ తర్వాత పొట్టి ప్రపంచకప్ కసం యూఏఈకు వైట్ ఫెర్న్స్ బయలదేరనున్నారు. కాగా టీ20 వరల్డ్‌కప్ తర్వాత సోఫీ డివైన్ కెప్టెన్సీకి విడ్కోలు పలకనుంది.న్యూజిలాండ్ జట్టు: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఇజ్జీ గేజ్ (వికెట్ కీపర్), మాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, ఫ్రాన్ జోనాస్, లీ కాస్పెరెక్, జెస్ కెర్, మెలీ కెర్, రోజ్మేరీ మెయిర్, మోలీ పెన్ఫోల్డ్, జార్జియా ప్లిమ్మర్, హన్నా రోవ్, లీ తహుహుచదవండి: #Joe Root: చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బ్రేక్ -
టీ20 వరల్డ్‌కప్-2024పై నీలినీడలు! భారత్ వేదికగా?
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంశంపై జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో అక్కడి పరిస్థితి చేజారింది. దీంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్‌కు చేరుకున్నారు. ఆమె భారత్ నుంచి లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఈ ఏడాది ఆక్టోబర్‌లో జరగనున్న మహిళల టీ20 వరల్డ్‌కప్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. టోర్నమెంట్ ఆరంభానికి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉండడంతో బంగ్లాలోని పరిస్థితులను ఐసీసీ కూడా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆధికారులు మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే బంగ్లాలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ మెగా టోర్నమెంట్‌ను ప్రత్యామ్నాయ వేదికపై నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. భారత్, శ్రీలంక, యూఏఈలను బ్యాకప్ ఆప్షన్స్‌గా ఐసీసీ ఉంచినట్లు సమాచారం."బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB), ఆ దేశ భద్రతా ఏజెన్సీలతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాం. అక్కడ పరిస్థితిలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాము. ఈ మెగా టోర్నీలో పాల్గోనే ఆటగాళ్లే భద్రత మా ప్రాధన్యత. అందుకోసం మేము ఈ నిర్ణయం తీసుకోవడానికైనా సిద్దం. ఈ మెగా టోర్నీ నిర్వహణపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని" ఐసీసీ అధికారి ప్రతినిథి ఒకరు పేర్కొన్నారు. కాగా ఈ మెగా టోర్నీ ఆక్టోబర్ 3 నుంచి ఆక్టోబర్ 20 వరకు జరగనుంది. -
‘ముందు’కొచ్చిన నోబాల్‌పై మూడో కన్ను
దుబాయ్: త్వరలో జరిగే మహిళల పొట్టి ప్రపంచకప్‌లో మూడో కన్నుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. బౌలర్లు గీతదాటి వేసిన నోబాల్స్‌ను థర్డ్ అంపైర్ చూస్తారని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తెలిపింది. ఇంతకుముందు భారత్, వెస్టిండీస్‌లలో జరిగిన మ్యాచ్‌ల్లో థర్డ్ అంపైర్‌కు ప్రయోగాత్మకంగా ఆ బాధ్యతను అప్పగించి పరిశీలించిన ఐసీసీ... అమ్మాయిల మెగా టోర్నీలో పూర్తిస్థాయిలో మూడో అంపైర్‌కే నిర్ణయాధికారం వదిలేసింది. ఇటీవల 12 మ్యాచ్‌ల్లో 4717 బంతులు సంధించగా... థర్డ్ అంపైర్ గీత దాటిన 13 నోబాల్‌లను గుర్తించారు. ఇందులో కచ్చితమైన నిర్ణయాలు రావడంతో ఐసీసీ మెగా ఈవెంట్లో మూడో కన్నుకే ఆ పని అప్పజెప్పింది. ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనున్న అమ్మాయిల టి20 ప్రపంచకప్ ఈ నెల 21న మొదలవుతుంది. సిడ్నీలో జరిగే తొలి మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడతాయి. -
‘నా చివరి టీ20 వరల్డ్‌కప్ ఇదే కావచ్చు’
గయానా: మహిళల క్రికెట్లో తనకుంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న టీమిండియా ఓపెనర్, స్టార్ బ్యాట్స్‌వుమెన్ మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం ప్రకటించారు. వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ తన చివరిది అవుతుండొచ్చని తెలియజేశారు. టీ20 అంటేనే ధనాధన్ ఆట అని, అందుకే కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ‘జట్టులో చాలా మార్పులు వచ్చాయి, కొత్త ప్లేయర్లను ప్రోత్సాహించాల్సిన అవసరం ఏర్పడింది. దేశం తరపున ఎంతకాలం ఆడామన్న దానికంటే.. దేశానికి ప్రాతినిథ్యం వహించడమే గొప్ప విషయం. నా బ్యాటింగ్ కంటే ఎక్కువగా జట్టు ప్రయోజనాల కోసమే ఆలోచించాను. యువ ప్లేయర్లు కుదురుకుని జట్టు సమతూకంగా ఉండడంతో ఇదే తనకు చివరి టీ20 వరల్డ్‌కప్ అయ్యే అవకాశం ఉంది’. అంటూ మిథాలీ పేర్కొన్నారు. ఇక ఇప్పటికే సీనియర్ బౌలర్ జులన్ గోస్వామి టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే ఆ ఫార్మట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మిడిలార్డర్లో రావటంపై.. న్యూజిలాండ్ బలమైన జట్టు కావడంతో అనుభవం కలిగిన బ్యాటర్ మిడిల్ ఆర్డర్లో ఉంటే జట్టుకు ఉపయోగమని భావించామని అందకే ఆ మ్యాచ్‌లో ఓపెనింగ్‌కు రాలేదని వివరించారు. రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ స్పిన్నర్లతో బరిలోకి దిగడంతో ఓపెనర్‌గా వస్తేనే బెటర్ అనుకున్నామని పేర్కొన్నారు. ఇక తన బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ, ప్లాన్‌కు ప్రకారమే ఆడితే కొన్ని సార్లు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది గనుక పరిస్థితులకు తగ్గట్టుగా వేగంగా ఆడాలో, నెమ్మదిగా ఆడాలో నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మిథాలీరాజ్ 56 పరుగులు (47 బంతుల్లో) చేసి జట్టును విజయతీరాలకు చేర్చిన విషయం తెలిసిందే. -
మిథాలి మెరిసినా ఓడిన భారత్
సావర్(బంగ్లాదేశ్): మిథాలి రాజ్ అర్థ సెంచరీ చేసినప్పటికీ న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ టి20 మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలయింది. మహిళా టి20 ప్రపంచకప్‌లో భాగంగా కివీస్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో మిథాలి సేన 17 పరుగులతో ఓడిపోయింది. కివీస్ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. మిథాలి 47 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 53 పరుగులు చేసింది. కౌర్ 27, గోస్వామి 10, మదానా 11 పరుగులు చేశారు. ముగ్గురు డకౌటయ్యారు. మరో ముగ్గురు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది.