అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చారిత్రత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రపంచ కప్ టోర్నమెంట్లలో పురుషులతో సమానంగా మహిళలకు ప్రైజ్‌మనీని ఐసీసీ అందజేయనుంది. వచ్చే నెల యూఏఈ వేదికగా జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2024తో ఈ నిర్ణయాన్ని ఐసీసీ అమలు చేయనుంది.
దీంతో టోర్నమెంట్ మొత్తం ప్రైజ్‌మనీ 7.958 మిలియన్ డాలర్లకు ( భారత కరెన్సీలో రూ.66 కోట్లు). గత టోర్నీలతో పోలిస్తే ఇది 225 శాతం అధికం కావడం విశేషం. వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టు రూ.19 కోట్ల ప్రైజ్‌మనీ లభించనుంది. అదేవిధంగా రన్నరప్‌గా నిలిచిన జట్టు రూ.9 కోట్ల నగదు బహుమతి దక్కించుకోనుంది.
"ఐసీసీ టోర్నీల్లో పురుషులతో పాటు మహిళలకు సమాన ప్రైజ్ మనీ ఇవ్వనున్నాం. మహిళల టీ20 ప్రపంచకప్-2024లో ఈ చారిత్రత్మక నిర్ణయాన్ని అమలు చేయనున్నాం. క్రీడా చరిత్రలో ఇదొక మైలు రాయిగా నిలిచిపోతుంది. ఈ ఏడాది జూలైలో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాము.
క్రీడల్లో లింగ వివక్ష లేకుండా చేసేందుకు మరో అడుగు ముందుకు వేశాము. సమాన ప్రైజ్‌మనీ అందిస్తున్న క్రీడగా క్రికెట్ నిలిచిందని" ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా మహిళల టీ20 ప్రపంచ కప్ అక్టోబరు 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment