మిథాలి మెరిసినా ఓడిన భారత్ | Skipper Mithali Raj made a strokeful half-century but could not save India | Sakshi
Sakshi News home page

మిథాలి మెరిసినా ఓడిన భారత్

Published Tue, Mar 18 2014 2:58 PM | Last Updated on Sat, Sep 2 2017 4:52 AM

మిథాలి మెరిసినా ఓడిన భారత్

మిథాలి మెరిసినా ఓడిన భారత్

సావర్(బంగ్లాదేశ్): మిథాలి రాజ్ అర్థ సెంచరీ చేసినప్పటికీ న్యూజిలాండ్తో జరిగిన వార్మప్ టి20 మ్యాచ్లో భారత్ పరాజయం పాలయింది. మహిళా టి20 ప్రపంచకప్లో భాగంగా కివీస్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో మిథాలి సేన 17 పరుగులతో ఓడిపోయింది. కివీస్ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది.

మిథాలి 47 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్తో 53 పరుగులు చేసింది. కౌర్ 27, గోస్వామి 10, మదానా 11 పరుగులు చేశారు. ముగ్గురు డకౌటయ్యారు. మరో ముగ్గురు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement