దుబాయ్: త్వరలో జరిగే మహిళల పొట్టి ప్రపంచకప్‌లో మూడో కన్నుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. బౌలర్లు గీతదాటి వేసిన నోబాల్స్‌ను థర్డ్ అంపైర్ చూస్తారని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తెలిపింది. ఇంతకుముందు భారత్, వెస్టిండీస్‌లలో జరిగిన మ్యాచ్‌ల్లో థర్డ్ అంపైర్‌కు ప్రయోగాత్మకంగా ఆ బాధ్యతను అప్పగించి పరిశీలించిన ఐసీసీ... అమ్మాయిల మెగా టోర్నీలో పూర్తిస్థాయిలో మూడో అంపైర్‌కే నిర్ణయాధికారం వదిలేసింది. ఇటీవల 12 మ్యాచ్‌ల్లో 4717 బంతులు సంధించగా... థర్డ్ అంపైర్ గీత దాటిన 13 నోబాల్‌లను గుర్తించారు. ఇందులో కచ్చితమైన నిర్ణయాలు రావడంతో ఐసీసీ మెగా ఈవెంట్‌లో మూడో కన్నుకే ఆ పని అప్పజెప్పింది. ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనున్న అమ్మాయిల టి20 ప్రపంచకప్ ఈ నెల 21న మొదలవుతుంది. సిడ్నీలో జరిగే తొలి మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment