Jemimah Rodrigues
-
మెరిసిన జెమీమా, స్మృతి
నవీ ముంబై: భారత మహిళల జట్టు చాన్నాళ్ల తర్వాత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెప్పుకోదగ్గ విజయం సాధించింది. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా 49 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై నెగ్గింది. టాపార్డర్ బ్యాటర్లు స్మృతి మంధాన (33 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్ (35 బంతుల్లో 73; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేయగా, బౌలింగ్‌లో టిటాస్ సాధు (3/37), దీప్తి శర్మ (2/21), రాధా యాదవ్ (2/28) కరీబియన్ జట్టును దెబ్బతీశారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఉమా ఛెత్రి (26 బంతుల్లో 24; 4 ఫోర్లు), రిచా ఘోష్ (14 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. కరిష్మా రమ్హార్యాక్ 2, డియాండ్ర డాటిన్ 1 వికెట్ తీశారు. అనంతరం వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులే చేసి ఓడింది. ఓపెనర్ కియానా జోసెఫ్ (33 బంతుల్లో 49; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), డియాండ్ర డాటిన్ (28 బంతుల్లో 52; 4 ఫోరు, 3 సిక్స్‌లు) రాణించారు. జెమీమాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మంగళవారం ఇదే వేదికపై రెండో టి20 మ్యాచ్ జరుగుతుంది. స్కోరు వివరాలు భారత మహిళల ఇన్నింగ్స్: స్మృతి (సి) కియానా (బి) కరిష్మా 54; ఉమా ఛెత్రి (బి) కరిష్మా 24; జెమీమా రోడ్రిగ్స్ (రనౌట్) 73; రిచా ఘోష్ (సి) మంగ్రూ (బి) డియాండ్ర 20; హర్మన్‌ప్రీత్ (నాటౌట్) 13; సజన (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–50, 2–131, 3–155, 4–190. బౌలింగ్: చినెలీ హెన్రీ 2–0–17–0, జైదా జేమ్స్ 1–0–13–0, హేలీ 3–0–38–0, కరిష్మా 4–0–18–2, అఫీ ఫ్లెచర్ 3–0–39–0, డియాండ్ర 4–0–37–1, షమిలియా 1–0–11–0, కియానా జోసెఫ్ 2–0–22–0. వెస్టిండీస్ మహిళల ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) సబ్–మిన్నుమణి (బి) టిటాస్ 1; కియానా (సి) సైమా (బి) టిటాస్ 49; షెమైన్ (బి) దీప్తి శర్మ 13; డియాండ్ర (సి) రాధ (బి) టిటాస్ 52; చినెలీ హెన్రీ (సి) సబ్–మిన్నుమణి (బి) రాధ 7; షబిక (నాటౌట్) 15; అఫీ ఫ్లెచర్ (బి) దీప్తి శర్మ 0; జైదా (సి) ఉమా ఛెత్రి (బి) రాధ 5; మంగ్రూ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–2, 2–36, 3–80, 4–108, 5–126, 6–127, 7–140. బౌలింగ్: రేణుక 4–0– 25–0, టిటాస్ సాధు 4–0–37–3, దీప్తిశర్మ 4–0– 21–2, సైమా 4–0–35–0, రాధ 4–0–28–2.3622 అంతర్జాతీయ మహిళల టి20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా స్మృతి మంధాన గుర్తింపు పొందింది. ఇన్నాళ్లు హర్మన్‌ప్రీత్ (3589 పరుగులు) పేరిట ఉన్న రికార్డును స్మృతి సవరించింది. 117 అంతర్జాతీయ మహిళల టి20ల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్ డియాండ్రా డాటిన్ (117) ఘనత సాధించింది. న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్ (114) పేరిట ఉన్న రికార్డును డియాండ్రా బద్దలు కొట్టింది. -
IND VS WI 1st T20: చెలరేగిపోయిన జెమీమా.. రాణించిన మంధన
నవీ ముంబై వేదికగా వెస్టిండీస్ మహిళా జట్టుతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి విండీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. స్మృతి మంధన (33 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), జెమీమా రోడ్రిగెజ్ (35 బంతుల్లో 73; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఉమా ఛెత్రి 24, రిచా ఘోష్ 20 పరుగులు చేసి ఔట్ కాగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (13), సంజీవన్ సజనా (1) అజేయంగా నిలిచారు. విండీస్ బౌలర్లలో కరిష్మ రామ్హరాక్ రెండు వికెట్లు పడగొట్టగా.. డియాండ్రా డొట్టిన్ ఓ వికెట్ దక్కించుకుంది.కాగా, మూడు మ్యాచ్‌ల టీ20, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో టీ20 మ్యాచ్‌లు డిసెంబర్ 15, 17, 19 తేదీల్లో జరుగనుండగా.. వన్డేలు 22, 24, 27 తేదీల్లో జరుగనున్నాయి. టీ20 మ్యాచ్‌లన్నీ నవీ ముంబైలో జరుగనుండగా.. మూడు వన్డే మ్యాచ్‌లకు వడోదర వేదిక కానుంది.ఇదిలా ఉంటే, భారత మహిళల క్రికెట్ జట్టు ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భారత్ మూడు మ్యాచ్‌ల్లో దారుణ పరాజయాలు ఎదుర్కొంది. తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత్.. రెండో వన్డేలో 122 పరుగుల తేడాతో, మూడో వన్డేలో 83 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. -
స్మృతి సెంచరీ.. కివీస్‌ను చిత్తు చేసిన భారత్.. సిరీస్ సొంతం
న్యూజిలాండ్‌తో నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. వైట్ ఫెర్న్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక ఆఖరి వన్డేలో భారత ఓపెనర్ స్మృతి మంధాన అద్భుత శతకంతో రాణించి గెలుపులో కీలక పాత్ర పోషించింది.మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ వుమెన్ టీమ్ భారత్‌కు వచ్చింది. తొలి వన్డేలో బౌలింగ్ ప్రదర్శనతో పర్యాటక జట్టును 59 పరుగుల తేడాతో ఓడించిన హర్మన్‌ప్రీత్ సేన.. రెండో వన్డేలో మాత్రం దారుణంగా విఫలమైంది. బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. రాణించిన బ్రూక్ హాలీడేఈ క్రమంలో మంగళవారం అహ్మదాబాద్ వేదికగా ఇరుజట్లు మూడో వన్డేలో పోటీపడ్డాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. టాపార్డర్‌లో ఓపెనర్ సుజీ బేట్స్(4), వన్‌డౌన్ బ్యాటర్ లారెన్ డౌన్(1) విఫలం కాగా.. మరో ఓపెనర్ జార్జియా ప్లెమ్మర్ 39 రన్స్ చేసింది.దీప్తి శర్మకు మూడు వికెట్లుకెప్టెన్ సోఫీ డివైన్(9) నిరాశపరచగా.. ఐదో నంబర్ బ్యాటర్ బ్రూక్ హాలీడే 96 బంతుల్లో 86 రన్స్‌తో అదరగొట్టింది. మిగతా వాళ్లలో ఇసబెల్లా గేజ్(25), లీ తుహుము(24 నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో న్యూజిలాండ్ 232 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు కూల్చగా.. రేణుకా సింగ్, సైమా ఠాకూర్ ఒక్కో వికెట్ తీశారు. మిగతా నాలుగు వికెట్లు రనౌట్ల ద్వారా వచ్చినవే.సెంచరీతో చెలరేగిన స్మృతిఇక వైట్ ఫెర్న్స్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలోనే భారత్‌కు షాక్ తగిలింది. ఓపెనర్ షఫాలీ వర్మ (12)ను కివీస్ పేసర్ హన్నా రోవ్ అవుట్ చేసింది. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ యస్తికా భాటియా(35)తో కలిసి మరో ఓపెనర్ స్మృతి మంధాన స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. గత రెండు మ్యాచ్‌లలో పూర్తిగా విఫలమైన(5, 0) ఆమె ఈసారి మాత్రం బ్యాట్ ఝులిపించింది. మొత్తంగా 122 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ సరిగ్గా వంద పరుగులు చేసింది. స్మృతి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు ఉన్నాయి. హర్మన్ అర్ధ శతకంఇక కెప్టెన్ హర్మన్ సైతం అర్ధ శతకంతో చెలరేగింది. స్మృతి మంధానతో కలిసి 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఫోర్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చింది. ఈ మ్యాచ్‌లో హర్మన్ 61 బంతులు ఎదుర్కొని 55 పరుగులు చేసింది.ఇక జెమీమా రోడ్రిగ్స్ సైతం ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. 18 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 22 పరుగులు చేసింది. ఈ క్రమంలో 44.2 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో వన్డే స్కోర్లు👉న్యూజిలాండ్- 232 (49.5)👉భారత్- 236/4 (44.2)👉ఫలితం- న్యూజిలాండ్‌పై ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయంచదవండి: Ind vs NZ: అతడిపై వేటు.. హర్షిత్ రాణా అరంగేట్రం ఫిక్స్!?That HUNDRED Feeling 💯🤗Live - https://t.co/pSVaIW4Deg#INDvNZ | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/61zSBcOQ2H— BCCI Women (@BCCIWomen) October 29, 20243rd ODI ✅Series ✅#TeamIndia win the third and final #INDvNZ ODI by 6 wickets and complete a 2-1 series win over New Zealand 👏 Scoreboard ▶️ https://t.co/B6n070iLqu@IDFCFIRSTBank pic.twitter.com/grwAuDS6Qe— BCCI Women (@BCCIWomen) October 29, 2024 -
W T20 WC: ‘హర్మన్‌పై వేటు! స్మృతి కాదు.. కొత్త కెప్టెన్‌గా ఆమెకే ఛాన్స్’
Mithali Raj on Women's T20 World Cup debacle: భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో జట్టు వైఫల్యంపై కీలక వ్యాఖ్యలు చేసింది. లీగ్ దశలోనే నిష్క్రమణకు ప్రధాన కారణం గత మూడేళ్లుగా జట్టులో పురోగతే లేదని నర్మగర్భంగా వ్యాఖ్యానించింది. దుబాయ్‌లో ఉన్న ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలపై, క్రికెటర్లలో కొరవడిన పట్టుదలపై తన అభిప్రాయాలను పంచుకుంది.‘ప్రపంచకప్‌కు సన్నాహంగా ఆడిన ఆసియా కప్‌లో చిన్న జట్లతో ఆడేటప్పుడు రిజర్వ్ బెంచ్‌ను పటిష్టం చేసేందుకు వారికి అవకాశాలివ్వాలి. పురుషుల జట్టు చేస్తోంది అదే. మెగా ఈవెంట్లు, పెద్ద టోర్నీలకు ముందు ఈ కసరత్తు చాలా అవసరం. కానీ మన మహిళల జట్టు విషయంలో అలాంటిదేదీ ఉండదు. రిజర్వ్ ఆటగాళ్లకు అవకాశాలివ్వరు. ఇది జట్టు నిర్మాణానికి ఇబ్బందికరంగా పరిణమిస్తుంది’ అని వివరించింది.పలు ప్రశ్నలకు మిథాలీ ఇచ్చిన సమాధానాలు... టోర్నీలో టీమిండియా ప్రదర్శనపై మీ విశ్లేషణ? దీనిపై మాట్లాడాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఆస్ట్రేలియాతో మ్యాచే గురించే! తప్పక గెలవాల్సిన పోరు అది. ఓ దశలో పటిష్ట స్థితిలో కనిపించినా... మళ్లీ కంగారే. మరో పాత కథే! గత రెండు, మూడేళ్లుగా జట్టు సాధించిన పురోగతి నాకైతే కనపించట్లేదు. గట్టి జట్లను ‘ఢీ’కొట్టేముందు చేసే కసరత్తు, ఆటలో ఎత్తుగడలేవీ మెప్పించడం లేదు. అంతర్జాతీయస్థాయిలో కొన్ని జట్లు క్రమంగా పుంజుకున్నాయి. దక్షిణాఫ్రికానే దానికి సరైన ఉదాహరణ.ఆస్ట్రేలియా కంటే కూడా న్యూజిలాండ్‌తో ఎదురైనా పరాజయమే భారత్ నిష్క్రమణకు కారణమని భావిస్తున్నారా? ఆశ్చర్యకర విషయం ఏమిటంటే మనం పరిస్థితులకు తగ్గట్లుగా వెంటనే మారకపోవడమే ఆ మ్యాచ్ ఓటమికి కారణం. మందకొడి వికెట్‌పై వన్డే ప్రపంచకప్‌లో అయితే ముందు నింపాదిగా ఆడి తర్వాత పుంజుకొని ఆడే సౌలభ్యం వుంటుంది. కానీ టీ20 ఫార్మాట్లో అలాంటి అవకాశం ఉండదు. త్వరితగతిన సందర్భాన్ని బట్టి ఆటతీరు మార్చుకోవాలి. సోఫీ డివైన్ చేసింది అదే. కానీ మనం మాత్రం అలా ఆడలేకపోయాం.తరుచూ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడం వల్ల ఆయా స్థానాల్లో స్పష్టత కొరవడిందా? జెమీమా, హర్మన్‌ప్రీత్‌లు తరచూ 3, 4 స్థానాలు మార్చుకోవడం కారణమని నేననుకోను. బ్యాటింగ్‌లో ఓపెనర్ల శుభారంభమే అత్యంత కీలకం. షఫాలీ వర్మ దూకుడుగా ఆడుతుందని అందరికీ తెలుసు కానీ అలా జరగలేదు. ఓపెనర్లిద్దరు బాగా ఆడిఉంటే మిడిల్ ఓవర్లలో యథేచ్ఛగా ఆడే అవకాశముంటుంది. మొదట పవర్ ప్లే, ఆఖర్లో డెత్ ఓవర్లు మంచి స్కోరుకు బాట వేస్తాయి. అయితే దురదృష్టవశాత్తూ ఈ టోర్నీలోని కీలక మ్యాచ్‌ల్లో అలాంటి శుభారంభాలు, చివర్లో దూకుడు కరువయ్యాయి. ఆసియా కప్‌లో కనిపించిన లోపాలపై దృష్టి పెట్టాల్సింది. కానీ అలా ఏమీ జరగలేదు. ప్రపంచకప్ ముంగిట ఫీల్డింగ్ విభాగంపై దృష్టి సారించకపోవడం పెద్ద తప్పిదమని మీరు అంగీకరిస్తారా? ఈ విషయంలో ఆస్ట్రేలితో జరిగిన మ్యాచ్ నన్ను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. రాధా యాదవ్, జెమీమా రోడ్రిగ్స్ తప్ప 11 మందిలో మిగతా వారంతా మైదానంలో చురుగ్గా కనిపించలేదు. కీలకమైన మ్యాచ్‌లో ఇద్దరితో కట్టడి ఎలా సాధ్యమవుతుంది. ఫిట్నెస్ అతిముఖ్యం. దీనిపై మనం ఒక బెంచ్‌మార్క్‌ను పెట్టుకోవాల్సిందే. నిజాయితీగా అడుగుతున్నా ఏడాదంతా ఎంత మంది మన క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెడుతున్నారో చెప్పగలరా! ఆ శ్రద్ధలేకే మైదానంలో ఫీల్డింగ్ విభాగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. హర్మన్‌ప్రీత్ 2018 నుంచి కెప్టెన్ ఉన్నా... ఫలితాలు మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో సారథ్య మార్పు అవసరమా? ఒకవేళ సెలక్టర్లు కెప్టెన్‌ను మార్చాలనుకుంటే మాత్రం నేను యువ క్రికెటర్‌కు పగ్గాలివ్వాలని కోరుకుంటాను. సారథ్య మార్పునకు ఇదే సరైన సమయం. ఇంకా ఆలస్యం చేస్తే... మనం ఇంకో ప్రపంచకప్‌కూ దూరమవుతాం. చేస్తే ఇప్పుడే కొత్త సారథిని ఎంపిక చేయాలి. మరీ ప్రపంచకప్ సమీపంలో చేస్తే ఒరిగే ప్రయోజనం కూడా ఉండదు.స్మృతి కాదు.. కొత్త కెప్టెన్‌గా ఆమెకు ఛాన్స్ ఇస్తేనే..వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అందుబాటులో ఉన్నప్పటికీ 24 ఏళ్ల జెమీమాకు పగ్గాలిస్తే మంచిదనిపిస్తుంది. ఆమెకు ఎక్కువకాలం సారథిగా కొనసాగే వీలుంటుంది. పైగా మైదానంలో చురుకుదనం, ఫీల్డింగ్‌లో అందరిలో ఉత్తేజం నింపే శక్తి ఆమెకుంది. ఈ టోర్నీ ఆసాంతం ఆమె కనబరిచిన చురుకుదనం నన్ను బాగా ఆకట్టుకుంది. అలాంటి జెమీమాకు పగ్గాలిస్తే జట్టులో కొత్త ఉత్తేజాన్ని నింపినట్లవుతుంది. చదవండి: W T20 WC: ఇంగ్లండ్ ఇంటికి...సెమీఫైనల్లో వెస్టిండీస్ -
మంచి తరుణం
ఎన్నో ఏళ్లుగా ఊరిస్తోన్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ట్రోఫీ చేజిక్కించుకోవాలని తహతహలాడుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు టి20 ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని భారత టాపార్డర్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ పేర్కొంది. ఈసారి అందుకు తగ్గ అనుకూలతలు ఉన్నాయని...కప్ గెలిచేందుకు ఇదే మంచి తరుణమని ఆమె వెల్లడించింది. ప్లేయర్లందరికీ జట్టు ప్రయోజనాలే ముఖ్యమన్న జెమీమా... మెగా టోర్నీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. అనుభవజు్ఞలు, యంగ్ ప్లేయర్లతో టీమిండియా సమతూకంగా ఉందని... ఆ్రస్టేలియా వంటి ప్రత్యర్థులపై కూడా విజయాలు సాధించగలమనే నమ్మకముందని పేర్కొంది. రేపటి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో మహిళల టి20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జెమీమా రోడ్రిగ్స్ పంచుకున్న వివరాలు ఆమె మాటల్లోనే...తొలిసారి మహిళల టి20 ప్రపంచకప్ చేజిక్కించుకోవడానికి భారత జట్టుకు అన్ని అనుకూలతలు ఉన్నాయి. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం కంటే పెద్ద ఘనత ఏదీ లేదు. వరల్డ్‌కప్ బరిలోకి దిగుతున్న భారత మహిళల జట్టులో ప్రస్తుతం అందరి పరిస్థితి ఇదే. జట్టుకు అవసరమైన సమయంలో రాణించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు. నా వరకైతే టీమిండియాకు ఆడే సమయంలో సర్వశక్తుల ఒడ్డేందుకు ప్రయత్నిస్తా. జట్టు గెలవడమనే నాకు ఎక్కువ సంతృప్తినిస్తుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న టి20 వరల్డ్‌కప్ కోసం మెరుగ్గా సిద్ధమయ్యా. ప్రత్యేకంగా ఒక బౌలర్‌ను లక్ష్యంగా చేసుకోలేదు. పరిస్థితులపై పైచేయి సాధించాలనుకుంటున్నా. ఎవరిని బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడాలి... ఎలాంటి బంతులను గౌరవించాలి అనే దానిపై సాధన చేశా. నా ప్రదర్శన జట్టు విజయానికి తోడ్పడాలని కోరుకుంటా. సమతూకంగా జట్టు... అటు అనుభవజు్ఞలు ఇటు యంగ్ ప్లేయర్లతో జట్టు సమతూకంగా ఉంది. రిచా ఘోష్, షఫాలీ వర్మతో పాటు నాకూ గతంలో ఐసీసీ ప్రపంచకప్‌లు ఆడిన అనుభవం ఉంది. మేము యువ క్రీడాకారిణులమే అయినా... అవసరమైనంత అనుభవం ఉంది. ఇక జట్టులో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన రూపంలో ఇద్దరు సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. వారికి ప్రపంచకప్‌లలో ఆడిన అపార అనుభవం ఉంది.ఆటగాళ్లంతా ట్రోఫీ చేజిక్కించుకోవాలనే ఉత్సాహంతో ఉన్నాం. జట్టు సమావేశాల్లో ఎక్కువ శాతం చర్చ దీని గురించే జరుగుతుంది. 2020 ప్రపంచకప్ ఫైనల్లో పరాజయం పాలయ్యాం. ఇప్పుడు తొమ్మిదో ఎడిషన్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తామనే నమ్మకముంది. వార్మప్ మ్యాచ్‌లో రాణించడం ఆనందంగా ఉంది. ప్రధాన పోటీలకు ముందు చక్కటి ఇన్నింగ్స్ ఆడటం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ సోఫీ డివైన్ ఆటకు నేను అభిమానిని. మొదటిసారి అండర్–19 క్యాంప్‌లో ఉన్న సమయంలో చిన్నస్వామి స్టేడియంలో సోఫీ డివైన్ వరుసగా ఐదు బంతుల్లో సిక్సర్లు బాదింది. ఆ సందర్భాన్ని మరవలేను. ఆమె కోసం మా బౌలర్ల వద్ద ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో పోటీని ఆస్వాదిస్తా... ఈ నెల 13న ఆ్రస్టేలియాతో మ్యాచ్ ఆడనున్నాం. ఆసీస్‌తో ఆడటాన్ని ఎంతో ఆస్వాదిస్తా. మెరుగైన ప్రత్యరి్థతో తలపడ్డప్పుడు అత్యుత్తమ ఆట బయటకు వస్తుంది. చాన్నాళ్లుగా కంగారూ జట్టుతో మ్యాచ్‌లు ఆడుతున్నాం. ఈసారి మైదానంలో మా ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తాం. జట్టు వైస్ కెపె్టన్ స్మృతి మంధాన ఆటను బాగా అర్థం చేసుకుంటుంది. పరిస్థితులకు తగ్గట్టు ఆటతీరును మార్చుకుంటుంది. అందుకే గొప్ప ప్లేయర్‌గా ఎదిగింది. అవసరమైనప్పుడు చక్కటి సలహాలు ఇస్తుంది. ఇక కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పెద్ద మ్యాచ్‌ల్లో మెరుగ్గా రాణిస్తుంది. కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని తట్టుకొని ఎలా నిలబడాలో ఆమె ఆట ద్వారా నేర్చుకున్నా. ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది టి20 ప్రపంచకప్‌లలోనూ హర్మన్‌ప్రీత్ పాల్గొంది. ఈ టోర్నీ ఆమెకు ఎంత ముఖ్యమో జట్టులో ప్రతి ఒక్కరికీ తెలుసు. దేశంతో పాటు ఆమె కోసం కప్పు గెలవాలని అనుకుంటున్నాం. ఆమె ట్రోఫీ చేజిక్కించుకోవడం చూడాలని ఆశిస్తున్నా. -
టీ20 వరల్డ్‌కప్.. టీమిండియాకు గాయల బెడద?
యూఏఈ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు భారత మహిళల జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. భారత మహిళల జట్టు ప్రస్తుతం బెంగళూరులోని ఏన్సీఏలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంప్‌లో చెమడ్చోతుంది. అయితే జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. స్టార్ ప్లేయర్లు గాయాలతో బాధపడుతుండడంతో భారత జట్ట మెనెజ్‌మెంట్ ఆందోళన చెందుతోంది.గాయాల బారిన పడిన ప్లేయర్స్ వీరేఅరుంధతి రెడ్డిభారత జట్టు స్టార్ పేసర్ అరుంధతి రెడ్డి ప్రస్తుతం భుజం గాయంతో బాధపడుతోంది. ఆమె ప్రస్తుతం బౌలింగ్ ప్రాక్టీస్ దూరంగా ఉంది. అయితే ప్రపంచకప్ ప్రారంభమయ్యే ఆమె పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ మెగా టోర్నీ అయితే భారత్‌కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పుకోవాలి. అరుంధతి ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉంది.పూజా వస్త్రాకర్టీమిండియా మరో స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ కూడా భుజం గాయంతో పోరాడుతోంది. అయితే గాయంతో పూజా గాయంతో బాధపడుతున్నప్పటకి పెయిన్‌కిల్లర్ ఇంజెక్షన్ల సహాయంతో తన ప్రాక్టీస్‌ను కొనసాగిస్తోంది. ఆమె కూడా వరల్డ్‌కప్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించే ఛాన్స్ ఉంది.శ్రేయాంక పాటిల్ వేలి ఫ్రాక్చర్ కారణంగా ఆసియా కప్‌కు దూరమైన యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఇంకా కోలుకోలేదు. టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపికైనప్పటకి టోర్నీ అందుబాటులో ఉంటుందా లేదన్నది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఆమె మెగా ఈవెంట్ సమయానికి ఈ కర్ణాటక స్పిన్నర్ కోలుకునే అవకాశమున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.జెమిమా రోడ్రిగ్స్ స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ కూడా చేతివేలి గాయంతో బాధపడుతోంది. ఆసియాకప్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు రోడ్రిగ్స్ చేతి వేలికి గాయమైంది. అయితే ఆమె తన వేలికి టేప్ చుట్టి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. ఆమె ప్రపంచకప్ సమయానికి దాదాపుగా కోలుకునే సూచనలు కన్పిస్తున్నాయి. కాగా ఈ మెగా టోర్నీ ఆక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. భారత తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో తలపడనుంది. -
BBL: ధరలో స్మృతిని మించిపోయిన జెమీమా, దీప్తి, శిఖా (ఫొటోలు)
-
WBBL: స్మృతి కంటే జెమీమా, దీప్తి, శిఖాలకే ఎక్కువ ధర!
Womens Big Bash League Draft- మెల్బోర్న్: భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సహా ఆరుగురు భారత క్రికెటర్లు మహిళల బిగ్‌బాష్ టి20 లీగ్ (డబ్ల్యూబీబీఎల్)లో మెరిపించనున్నారు. ఓపెనర్ స్మృతి, ఆల్‌రౌండర్ శిఖా పాండే, టాపార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌లు ఇది వరకే ఈ లీగ్‌లో ఆడారు. అయితే కొత్తగా ఆల్‌రౌండర్ దయాళన్ హేమలత, వికెట్ కీపర్ బ్యాటర్ యస్తిక భాటియాలకు తొలిసారిగా బిగ్‌బాష్ చాన్స్ లభించింది. కానీ భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను మాత్రం లీగ్ ఫ్రాంచైజీలు పక్కన బెట్టాయి.‘ప్లాటినమ్’ కేటగిరీలో జెమీమా, దీప్తిగతంలో మెల్బోర్న్ రెనిగేడ్స్, సిడ్నీ థండర్లకు ఆడిన అనుభవమున్న సీనియర్ బ్యాటర్‌పై ఎనిమిది ఫ్రాంచైజీల్లో ఏ ఒక్క జట్టు కూడా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. హిట్టింగ్తో ఆదరగొట్టే బ్యాటర్ జెమీమాకు బ్రిస్బేన్ హీట్ ‘ప్లాటినమ్’ ఎంపిక ద్వారా పెద్దపీట వేసింది. ఐపీఎల్లో టాప్ 1, 2, 3 రిటెన్షన్ పాలసీలా డబ్ల్యూబీబీఎల్‌లో ప్లాటినమ్, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ కేటగిరీలుంటాయి.మరో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు మెల్బోర్న్ స్టార్స్ ‘ప్లాటినమ్’ కేటగిరీలో ఎంపిక చేసుకుంది. ఈ కేటగిరీలోకి ఎంపికైన క్రికెటర్లకు రూ. 62.41 లక్షలు (లక్షా 10 వేల ఆసీస్ డాలర్లు) కాంట్రాక్టు మొత్తంగా లభిస్తుంది. శిఖా పాండేకు రూ. 51 లక్షలు‘గోల్డ్’ కేటగిరీలో బ్రిస్బేన్ హీట్‌కు ఎంపికైన శిఖా పాండేకు రూ. 51 లక్షలు (90 వేల ఆసీస్ డాలర్లు), అడిలైడ్ స్ట్రయికర్స్‌కు స్మృతి మంధాన, పెర్త్ స్కార్చర్స్‌కు హేమలత, మెల్బోర్న్ స్టార్స్‌కు యస్తిక భాటియా సిల్వర్ కేటగిరీలో ఎంపికయ్యారు. ఈ ముగ్గురికి రూ. 36.88 లక్షలు (65 వేల ఆసీస్ డాలర్లు) కాంట్రాక్టు ఫీజుగా లభిస్తుంది. ఈ సీజన్ మహిళల బిగ్‌బాష్ లీగ్ వచ్చే నెల 27న అడిలైడ్‌లో మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అడిలైడ్ స్ట్రయికర్స్‌తో బ్రిస్బేన్ హీట్ జట్టు తలపడుతుంది. -
బిగ్‌బాష్ లీగ్‌లో టీమిండియా స్టార్లు..!
సిడ్నీ: ఈ ఏడాది మహిళల బిగ్‌బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్) టి20 టోర్నీలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ ఆడటం దాదాపు ఖరారైంది. డబ్ల్యూబీబీఎల్ డ్రాఫ్టింగ్ జాబితాలో ఈ ముగ్గురి పేర్లు ఉండటమే దీనికి కారణం. మెల్బోర్న్ రెనిగేడ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హర్మన్‌ప్రీత్‌ను ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోనుంది. ఈ మేరకు ఫ్రాంచైజీలు సోమవారం అట్టిపెట్టుకోవాలనుకుంటున్న ప్లేయర్ల జాబితా విడుదల చేశాయి.అడిలైడ్ స్ట్రయికర్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మను ఆ జట్టు రిటైన్ చేసుకోనుంది. సూజీ బేట్స్ (సిడ్నీ సిక్సర్స్), అలీస్ కాప్సీ (మెల్బోర్న్ స్టార్స్), సోఫియా ఎకెల్‌స్టోన్ (సిడ్నీ సిక్సర్స్), షబ్నిమ్ ఇస్మాయిల్ (హోబర్ట్ హరికేన్స్), హీతర్ నైట్ (సిడ్నీ థండర్), డానీ వ్యాట్ (పెర్త్ స్కార్చెర్స్) రిటెన్షన్ జాబితాలో ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు డబ్ల్యూబీబీఎల్ సీజన్ జరగనుంది. -
WPL 2024: ప్లేఆఫ్స్‌కు ఢిల్లీ
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గత ఏడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఏడాదీ ప్లేఆఫ్స్ దశకు అర్హత సాధించింది. ఆదివారం ఆఖరి బంతిదాకా సాగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ పరుగు తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుపై గెలుపొందింది. ఈ సీజన్లో ఢిల్లీకిది ఐదో విజయం. మొదట ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. పవర్‌ప్లేలో ఓపెనర్లు మెగ్ లానింగ్ (26 బంతుల్లో 29; 5 ఫోర్లు), షఫాలీ వర్మ (18 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) 54 పరుగులతో శుభారంభమిచ్చారు. తర్వాత ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (36 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్), అలైస్ క్యాప్సీ (32 బంతుల్లో 48; 8 ఫోర్లు) క్రీజులో ఉన్నంతసేపు స్కోరు బోర్డును ఉరుకులు పెట్టించారు. మూడో వికెట్‌కు ఇద్దరు కలిసి 61 బంతుల్లోనే 97 పరుగులు జోడించారు. జెమీమా 26 బంతుల్లో అర్ధసెంచరీ సాధించింది. స్పిన్నర్ శ్రేయాంక 4 వికెట్లు తీసింది. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి ఓడింది. ఓపెనర్, కెపె్టన్ స్మృతి మంధాన (5) విఫలమైనా... టాపార్డర్‌లో సోఫీ మోలినెక్స్ (30 బంతుల్లో 33; 5 ఫోర్లు), ఎలీస్ పెరీ (32 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్స్) బెంగళూరును నడిపించారు. ఓవర్ వ్యవధిలో ఇద్దరు పెవిలియన్ చేరారు. ఈ దశలో రిచా ఘోష్ (29 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సోఫీ డివైన్ (16 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మ్యాచ్‌పై ఆశలు రేపారు. చివరి ఓవర్లో బెంగళూరు విజయానికి 17 పరుగులు కావాల్సి ఉండగా, రిచా రెండు భారీ సిక్స్‌లు బాదింది. ఒక బంతి 2 పరుగుల విజయ సమీకరణం వద్ద రిచా రనౌట్ కావడంతో పరుగు తేడాతో ఢిల్లీ గట్టెక్కింది. నేడు గుజరాత్ జెయింట్స్‌తో యూపీ వారియర్స్ తలపడుతుంది. 10 పాయింట్లతో ముంబై ఇండియన్స్, ఢిల్లీ ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ చేరగా... ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న యూపీ ప్లే ఆఫ్స్ దశకు అర్హత పొందే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్‌పై తప్పనిసరిగా గెలవాలి. -
మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (మార్చి 10) ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేసి 181 పరుగుల భారీ స్కోర్ (5 వికెట్ల నష్టానికి) చేసింది. జెమీమా రోడ్రిగెజ్ (36 బంతుల్లో 58; 8 ఫోర్లు, సిక్స్), అలైస్ క్యాప్సీ (32 బంతుల్లో 48; 8 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. ఓపెనర్లు మెగ్ లాన్నింగ్ (29), షఫాలీ వర్మ (23) సైతం ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మారిజన్ కప్ 12, జొనాస్సెన్ 1, రాధా యాదవ్ ఒక పరుగు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4 వికెట్లతో విజృంభించగా.. అషా శోభన ఓ వికెట్ దక్కించుకుంది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ 7 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. స్మృతి మంధన (5) ఔట్ కాగా.. సోఫీ ఎక్లెస్‌స్టోన్ (8), ఎల్లిస్ పెర్రీ (36) క్రీజ్‌లో ఉన్నారు. మంధన వికెట్ క్యాప్సీకి దక్కింది. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ఆర్సీబీ 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో మూడో ప్లేస్‌లో నిలిచింది. 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఏడాది కూడా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. యూపీ వారియర్జ్ (6 పాయింట్లు) నాలుగో స్థానంలో, గుజరాత్ జెయింట్స్ (2 పాయింట్లు) చివరి స్థానంలో ఉన్నాయి. -
ఢిల్లీ ధమాకా...
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీ రెండో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు హవా కొనసాగుతోంది. సొంతగడ్డపై మొదలైన రెండో అంచె పోటీలో ఢిల్లీ గర్జించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్‌ను ఢిల్లీ ఓడించింది. ఈ గెలుపుతో ఢిల్లీ 8 పాయింట్లతో ఒంటరిగా అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీస్కోరు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (33 బంతుల్లో 69 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 27 బంతుల్లోనే ఆమె అర్ధ శతకాన్ని పూర్తిచేసింది. ఓపెనర్, కెపె్టన్ మెగ్ లానింగ్ (38 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడింది. లానింగ్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన షఫాలీ వర్మ (12 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజులో కాసేపే ఉన్నా మెరిపించింది. దీంతో ఢిల్లీ పవర్‌ప్లేలో 56/1 స్కోరు చేసింది. డెత్ ఓవర్లలో జెమీమా చెలరేగడంతో భారీస్కోరు సాధ్యమైంది. ముంబై బౌలర్లు షబ్నిమ్, సైకా ఇషాక్ చెరో వికెట్ తీశారు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి ఓడిపోయింది. ఢిల్లీ బౌలర్లు జెస్ జొనాసెన్ (3/21), మరిజాన్ కాప్ (2/37), శిఖా పాండే (1/27), టిటాస్ సాధు (1/23) ముంబైను కట్టడి చేశారు. ఒకదశలో ముంబై 68/5 స్కోరు వద్ద సగం వికెట్లను కోల్పోయింది. టాపార్డర్‌లో హేలీ మాథ్యూస్ (17 బంతుల్లో 29; 6 ఫోర్లు) మినహా ఆ తర్వాత వరుసగా యస్తిక భాటియా (6), నట్ సీవర్ (5), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (6) నిరాశపరిచారు. లోయర్ ఆర్డర్లో అమన్‌జోత్ (27 బంతుల్లో 42; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. నేడు జరిగే మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. -
రెచ్చిపోయిన రోడ్రిగెజ్.. విరుచుకుపడిన లాన్నింగ్
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మార్చి 5) జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. తొలుత ఓపెనర్లు షఫాలీ వర్మ (12 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మెగ్ లాన్నింగ్ (38 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు షాట్లతో విరుచుకుపడగా.. ఆతర్వాత బరిలోకి దిగిన జెమీమా రోడ్రిగెజ్ (33 బంతుల్లో 69 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీ ఆవలికి తరలించింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో అలైస్ క్యాప్సీ (20 బంతుల్లో 19; 3 ఫోర్లు), మారిజన్ కప్ (12 బంతుల్లో 11; ఫోర్) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. జెస్ జొనాస్సెన్ 5 బంతుల్లో 4 పరుగులతో అజేయంగా నిలిచింది. ముంబై బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాఖీ, పూజా వస్త్రాకర్, హేలీ మాథ్యూస్ తలో వికెట్ పడగొట్టారు. -
‘టీమిండియాకు మరో నయా ఫినిషర్’.. దుమ్ములేపిన ఆల్‌రౌండర్.. కానీ
Update: ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో భారత మహిళా జట్టు ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. వాంఖడేలో 46.3 ఓవర్లలోనే టీమిండియా విధించిన లక్ష్యాన్ని ఛేదించింది ఆసీస్ వుమెన్ టీమ్. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. దుమ్ములేపిన భారత ఆల్‌రౌండర్ ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టులో అదరగొట్టిన భారత మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్ తొలి వన్డేలోనూ సత్తా చాటింది. జట్టుకు అవసరమైన సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ కేవలం 46 బంతుల్లోనే 62 పరుగులతో దుమ్ములేపింది. దీంతో టీమిండియా తరఫున మరో నయా ఫినిషర్ వచ్చేసిందంటూ అభిమానులు పూజా వస్త్రాకర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సొంతగడ్డపై ఆసీస్‌తో ఏకైక టెస్టులో గెలుపొంది చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్టు గురువారం నుంచి వన్డే సిరీస్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ముంబైలోని వాంఖడేలో టాస్ గెలిచిన ఆతిథ్య టీమిండియా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టాపార్డర్‌లో ఓపెనర్ యస్తికా భాటియా 49 పరుగులతో రాణించగా.. మరో ఓపెనర్ షఫాలీ వర్మ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటైంది. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన రిచా ఘోష్ 21 పరుగులు చేయగా.. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పూర్తిగా నిరాశపరిచింది. మొత్తంగా 17 బంతులు ఎదుర్కొన్న హర్మన్ కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇలా ఓవైపు వికెట్లు పడుతున్నా జెమీమా రోడ్రిగ్స్ పట్టుదలగా నిలబడి సంచలన ఇన్నింగ్స్‌తో మెరిసింది. 77 బంతుల్లో 82 పరుగులు సాధించింది. జెమీమా తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన దీప్తి శర్మ 21, అమన్‌జోత్ కౌర్ 20, స్నేహ్ రాణా 1 పరుగులు చేశారు. దీంతో స్వల్ప స్కోరుకే భారత్‌ను కట్టడి చేయగలమన్న ఆస్ట్రేలియా ఆశలపై పూజా వస్త్రాకర్ నీళ్లు చల్లింది. ధనాధన్ ఇన్నింగ్స్‌తో.. రేణుకా ఠాకూర్ సింగ్(5- నాటౌట్)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి సత్తా చాటింది. యస్తికా, జెమీమా, పూజా అద్భుత బ్యాటింగ్ కారణంగా భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 282 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో డారిస్ బ్రౌన్, మేగన్ షట్, అన్నాబెల్ సదర్లాండ్, అలనా కింగ్ ఒక్కో వికెట్ తీయగా.. ఆష్లే గార్డ్నర్, వెరెహాం తలా రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. Pooja Vastrakar a fighter and new finisher for team India She scored 62 of 46 balls.Brilliant 👏#AUSvPAK #INDvSA #Dhoni #SENA #BBL13 #INDvAUS #BabarAzam #Shami #Abdullah #Prasidh #CricketTwitterpic.twitter.com/OaXDuyiXpx — Sujeet Suman (@sujeetsuman1991) December 28, 2023 -
ఏకైక టెస్టులో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్.. సరికొత్త చరిత్ర
India Women vs Australia Women, Only Test: భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాను మట్టికరిపించి సొంతగడ్డపై చరిత్రాత్మక విజయం అందుకుంది. సమిష్టి ప్రదర్శనతో రాణించి కంగారూ జట్టుపై మొట్టమొదటి టెస్టు గెలుపు నమోదు చేసింది. మరోరోజు ఆట మిగిలి ఉండగానే జయకేతనం ఎగురవేసి సత్తా చాటింది. కాగా భారత్ ఏకైక టెస్టు ఆడేందుకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ముంబైకి వచ్చింది. ఇరు జట్ల మధ్య వాంఖడే వేదికగా డిసెంబరు 21న మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ల దెబ్బకు 219 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. అదరగొట్టిన బౌలర్లు, బ్యాటర్లు పూజా వస్త్రాకర్ నాలుగు, స్నేహ్ రాణా మూడు, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశారు. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌కు ఓపెనర్లు షఫాలీ వర్మ 40, స్మృతి మంధాన 74 పరుగులతో అదిరిపోయే ఆరంభం అందించారు. మిడిలార్డర్లో రిచా ఘోష్ 52, జెమీమా రోడ్రిగ్స్ 73 పరుగులతో దుమ్ములేపారు. ఇక లోయర్ ఆర్డర్లో దీప్తి శర్మ 78, పూజా వస్త్రాకర్ 47 పరుగులతో అద్వితీయ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇలా బ్యాటర్లంతా సమిష్టిగా రాణించడంతో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 406 పరుగులకు ఆలౌట్ అయి ఆధిక్యంలో నిలిచింది. చెలరేగిన భారత బౌలర్లు.. ఆసీస్ పోరాడినా ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 233 పరుగులు సాధించింది. ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని పట్టుదలగా పోరాడింది. అయితే, భారత బౌలర్ల ముందు ఆసీస్ పప్పులు ఉడకలేదు. టాపార్డర్, మిడిలార్డర్ పర్వాలేదనిపించినా.. నాలుగో రోజు ఆటలో లోయర్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. స్నేహ్ రాణా నాలుగు వికెట్లుతో చెలరేగగా.. పూజా ఒకటి, రాజేశ్వరి గైక్వాడ్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రెండేసి వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను కట్టడి చేశారు. దీంతో 261 పరుగులకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ఆలౌట్ అయింది. మొట్టమొదటి టెస్టు గెలుపు ఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆదివారం నాటి నాలుగో రోజు ఆటలోనే మ్యాచ్‌ను ముగించేసింది. స్మృతి మంధాన 38, జెమీమా రోడ్రిగ్స్ 12 పరుగులతో ఆఖరి అజేయంగా నిలవగా.. 18.4 ఓవర్లలోనే టార్గెట్‌ను పూర్తి చేసింది. మంధాన ఫోర్ బాది విజయాన్ని ఖరారు చేయగా.. ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా టెస్టుల్లో ఆస్ట్రేలియాపై భారత మహిళా క్రికెట్ జట్టుకు ఇదే తొలి విజయం. అంతేకాదు 1984 తర్వాత సొంతగడ్డపై ఆసీస్‌తో టెస్టు ఆడటం కూడా ఇదే మొదటిసారి అది కూడా వాంఖడేలో!! ఇక గతంలో భారత్- ఆసీస్ మహిళా జట్లు పదిసార్లు ముఖాముఖి పోటీపడగా.. ఆసీస్ నాలుగుసార్లు గెలిచింది. ఆరుసార్లు మ్యాచ్ డ్రా అయింది. చదవండి: WFI: క్రీడా శాఖ సంచలన నిర్ణయం.. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐపై వేటు 𝙃𝙄𝙎𝙏𝙊𝙍𝙔 𝙄𝙉 𝙈𝙐𝙈𝘽𝘼𝙄! 🙌#TeamIndia women register their first win against Australia in Test Cricket 👏👏 Scorecard ▶️ https://t.co/7o69J2XRwi#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/R1GKeuRa69 — BCCI Women (@BCCIWomen) December 24, 2023 -
‘హండ్రెడ్’ టోర్నీకి జెమీమా
లండన్: భారత మహిళా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ వరుసగా మూడో ఏడాది ఇంగ్లండ్‌లో జరిగే ‘హండ్రెడ్’ టోర్నమెంట్లో ఆడనుంది. గత రెండేళ్లుగా నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్టుకు ఆడుతున్న ఆమెను ముందుగా ఈ సీజన్ నుంచి తప్పించాలని ఆ ఫ్రాంచైజీ అనుకుంది. అయితే నార్తర్న్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆసీస్ ప్లేయర్ హీథెర్ గ్రాహమ్ గాయంతో వైదొలగడంతో చివరి నిమిషంలో 22 ఏళ్ల జెమీమాతో ఆ ఫ్రాంచైజీ మళ్లీ కాంట్రాక్టు కుదుర్చుకుంది. ఈ సీజన్ ‘హండ్రెడ్’ టి20 టోర్నీ వచ్చేనెల 1 నుంచి 27 వరకు జరుగనుంది. ఇందులో నలుగురు భారత క్రికెటర్లు పాల్గొంటున్నారు. లండన్ స్పిరిట్ జట్టుకు రిచా ఘోష్, ట్రెంట్ రాకెట్స్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్, సదర్న్ బ్రేవ్‌కు స్మృతి మంధాన ఆడనున్నారు. -
జెమీమా రోడ్రిగ్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన..108 పరుగులతో భారీ విజయం
మిర్పూర్: సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు మెరిసింది. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన రెండో వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం 108 పరుగులతో ఘనవిజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్న జెమీమా 86 పరుగులు చేయడంతో పాటు బంతితో రాణించి 3 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. తాజా ఫలితంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం రెండు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. నిర్ణయాత్మక మూడో వన్డే శనివారం జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 228 పరుగులు సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ (78 బంతుల్లో 86; 9 ఫోర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (88 బంతుల్లో 52; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలతో భారత్‌ను ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 131 పరుగుల భాగస్వామ్యం జోడించారు. వన్డేల్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన 22 ఏళ్ల జెమీమా 2019 తర్వాత మళ్లీ వన్డేల్లో అర్ధ సెంచరీ చేసింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (58 బంతుల్లో 36; 4 ఫోర్లు), హర్లీన్ (36 బంతుల్లో 25) కూడా రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో సుల్తానా ఖాతూన్, నహీదా అక్తర్ రెండు వికెట్ల చొప్పున తీశారు. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 35.1 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. ఫర్జానా హఖ్ (47; 5 ఫోర్లు), రీతూ మోని (27; 3 ఫోర్లు), ముర్షిదా ఖాతూన్ (12; 3 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. జెమీమా తన ఆఫ్ స్పిన్ మాయాజాలంతో 3.1 ఓవర్లు వేసి కేవలం 3 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. లెగ్ స్పిన్నర్ దేవిక వైద్య 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. మేఘన సింగ్, స్నేహ్ రాణా, దీప్తి శర్మలకు ఒక్కో వికెట్ లభించింది. 8⃣6⃣ runs with the bat 👏 4️⃣ wickets with the ball 😎@JemiRodrigues' all-round performance makes her the Player of the Match 👌🏻#TeamIndia win by 108 runs in the second ODI 👏 Scorecard - https://t.co/6vaHiS9Qad #BANvIND pic.twitter.com/CuUNtJpFOo — BCCI Women (@BCCIWomen) July 19, 2023 చదవండి: Stuart Broad: 600 వికెట్ల క్లబ్లో.. టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో బౌలర్‌గా -
బ్యాట్‌తో ఇరగదీసి, డ్యాన్స్‌తో అదరగొట్టిన జెమీమా రోడ్రిగెస్
మహిళల ఐపీఎల్ (WPL) అరంగేట్రం సీజన్ (2023)లో భాగంగా నిన్న (మార్చి 5) రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో షఫాలీ వర్మ (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), మెగ్ లాన్నింగ్ (43 బంతుల్లో 72; 14 ఫోర్లు), మారిజాన్ కాప్ (17 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా రోడ్రిగెస్ (15 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) శివాలెత్తడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో తారా నోరిస్ (5/29) నిప్పులు చెరగడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. SCCCENESSSS https://t.co/MwCnUfPzrH — Jemimah Rodrigues (@JemiRodrigues) March 5, 2023 కాగా, డీసీ ఇన్నింగ్స్ చివర్లో బరిలోకి దిగి బ్యాట్‌తో ఇరగదీసిన జెమీమా రోడ్రిగెస్.. ఆతర్వాత ఫీల్డింగ్ చేసే సమయంలో డ్యాన్స్‌తో అదరగొట్టి అభిమానుల మనసులను కొల్లగొట్టింది. డీసీ వైస్ కెప్టెన్ అయిన 22 ఏళ్ల రోడ్రిగెస్.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా, స్టేడియంలో ఒక్కసారిగా మ్యూజిక్ ప్లే కావడం మొదలైంది. హఠాత్తుగా ఫాస్ట్ బీట్ సంగీతం ప్లే కావడంతో తనలోని డ్యాన్సర్‌ను ఆపుకోలేకపోయిన రోడ్రిగెస్.. బాంగ్రా, వెస్ట్రన్ కలగలిపిన నృత్యం చేస్తూ ఊగిపోయింది. రోడ్రిగెస్.. అచ్చం ప్రొఫెషనల్ డ్యాన్సర్లా డ్యాన్స్ చేసి ఫ్యాన్స్‌ను ఉత్తేజపరిచింది. రోడ్రిగెస్ డ్యాన్సింగ్ స్కిల్స్‌కు ఫిదా అయిన అభిమానులు సోషల్‌మీడియా వేదికగా ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందకేమో రోడ్రిగెస్‌ను విరాట్ కోహ్లితో పోలుస్తూ 100 పర్సంట్ ఎంటర్టైనర్ అంటూ కొనియాడుతున్నారు. మ్యాచ్ అనంతరం ఫ్యాన్స్ పోస్ట్ చేసిన తన డ్యాన్సింగ్ మూమెంట్స్‌కు సంబంధించిన వీడియోలకు రోడ్రిగెస్ రెస్పాండ్ అయ్యింది. కొందరికి ఆమె రీట్వీట్లు కూడా చేసింది. రొడ్రిగెస్ డ్యాన్సింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. -
ఢిల్లీ సారథిగా ఐదుసార్లు ఐసీసీ ట్రోఫీ గెలిచిన కెప్టెన్
WPL 2023- Delhi Capitals Squad- Captain: ఢిల్లీ క్యాపిటల్స్ తమ మహిళా జట్టు కెప్టెన్ పేరును ప్రకటించింది. ఆస్ట్రేలియాకు ఐదుసార్లు ప్రపంచకప్ అందించిన మెగ్ లానింగ్‌ను సారథిగా నియమించినట్లు తెలిపింది. ఆమెకు డిప్యూటీగా టీమిండియా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్‌ను ఎంపిక చేసినట్లు గురువారం వెల్లడించింది. కాగా మార్చి 4 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)-2023 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఆర్సీబీ స్మృతి మంధాన, ముంబై ఇండియన్స్ హర్మన్‌ప్రీత్‌కౌర్, గుజరాత్ జెయింట్స్ బెత్ మూనీ, యూపీ వారియర్జ్ అలిసా హేలీలను సారథులుగా నియమించినట్లు ప్రకటించాయి. ఆరోజే తొలి మ్యాచ్ ఎట్టకేలకు ఢిల్లీ సైతం తమ కెప్టెన్ పేరును తాజాగా రివీల్ చేసింది. కాగా ఆస్ట్రేలియాకు చెందిన 30 ఏళ్ల మెల్ లానింగ్ రైట్‌హ్యాండ్ బ్యాటర్. ఆసీస్‌కు ఐదుసార్లు ఐసీసీ ట్రోఫీ అందించిన ఘనత ఆమెది. 2014, 2018, 2020, 2023 టీ20 ప్రపంచకప్, 2022 వన్డే వరల్డ్‌కప్ గెలిచింది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ మార్చి 5న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌తో డబ్ల్యూపీఎల్ ప్రయాణం ఆరంభించనుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఇక ఢిల్లీ కెప్టెన్, వైస్ కెప్టెన్లుగా నియమితులు కావడం పట్ల మెగ్ లానింగ్, జెమీమా రోడ్రిగ్స్ హర్షం వ్యక్తం చేశారు. కాగా ఫిబ్రవరి 13న జరిగిన వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్‌ను రూ.1.1కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, రోడ్రిగ్స్‌కు మాత్రం భారీ మొత్తంలో 2.2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సొంతం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: మెగ్ లానింగ్, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రాధా యాదవ్, శిఖా పాండే, మరిజానే క్యాప్, టైటాస్ సాధు, అలిస్ కాప్సీ, తారా నోరిస్, లారా హ్యారిస్, జేసియా అక్తర్, మిన్ను మణి, తాన్యా భాటియా, పూనమ్ యాదవ్, జెస్ జొనాస్సెన్, స్నేహదీప్తి, అరుంధతి రెడ్డి, అపర్ణ మొండాల్. చదవండి: IND Vs AUS: స్టన్నింగ్ క్యాచ్.. అడ్డంగా దొరికిపోయిన శ్రేయాస్ BGT 2023: పుజారా భయపడుతున్నాడు.. అయ్యర్ పిరికిపందలా ఉన్నాడు! ముందుందిలే.. -
వేలంలో అత్యధిక ధర పలికిన టాప్-5 క్రికెటర్లు వీరే..
మహిళల ప్రీమియర్ లీగ్-2023 సంబంధించిన వేలం సోమవారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ వేలంలో మొత్తం 87 మంది క్రికెటర్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. క్రికెటర్లను కొనుగోలు చేయడానికి ఐదు ఫ్రాంచైజీలు రూ. 59.5 కోట్ల మొత్తాన్ని వెచ్చించాయి. అయితే ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్లపై ఓ లూక్కేద్దం. స్మృతి మంధాన ఈ వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానకు జాక్‌పాట్ తగిలింది. మంధానను రూ.3.4 కోట్ల భారీ ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా మంధాన నిలిచింది. ఆష్లీ గార్డనర్ ఈ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డనర్‌కు ఊహించని ధర దక్కింది. ఆమెను రూ. 3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది. దీంతో ఈ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న రెండో ప్లేయర్‌గా గార్డనర్ నిలిచింది. అదే విధంగా వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్‌గా గార్డనర్ నిలిచింది. నాట్ స్కివర్ ఇంగ్లండ్‌కు చెందిన స్టార్ ఆల్ రౌండర్ నాట్ స్కివర్పై కూడా కాసుల వర్షం కురిసింది. ఈ వేలంలో స్కివర్‌ను రూ. 3.20 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. దీంతో ఈ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న రెండో ప్లేయర్‌గా గార్డనర్తో కలిసి సంయుక్తంగా నిలిచింది. దీప్తి శర్మ భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మను ఉత్తరప్రదేశ్ వారియర్జ్ రూ. 2.60 కోట్లకు సొంతం చేసుకుంది. దీప్తి శర్మను ఉత్తరప్రదేశ్ వారియర్జ్ తమ కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉంది. జెమీమా రోడ్రిగ్స్ టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌ను దిల్లీ క్యాపిటల్స్ రూ. 2.20 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటి వరకు 97 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోడ్రిగ్స్ 13 అర్ధసెంచరీలు చేసింది. చదవండి: WPL Auction: లేడీ సెహ్వాగ్‌కు భారీ ధర.. ఎన్ని కోట్లంటే? -
మహిళల టి20 ప్రపంచకప్ : పాక్‌పై టీమ్ఇండియా ఘనవిజయం (ఫోటోలు)
-
T20 WC 2023: పాక్‌పై ఇదే అత్యధిక ఛేదన.. విరాట్ కోహ్లి ప్రశంసల జల్లు
ICC Womens T20 World Cup 2023: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2023 టోర్నీలో శుభారంభం చేసిన భారత మహిళా క్రికెట్ జట్టుపై టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించిన హర్మన్‌ప్రీత్ సేనకు శుభాభినందనలు తెలిపాడు. అద్భుత ఆట తీరుతో ముందుకు సాగుతూ మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడాడు. మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించాడు. భారత్ వర్సెస్ పాక్ దక్షిణాఫ్రికా వేదికగా శుక్రవారం(ఫిబ్రవరి 10)న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్ ఆరంభమైంది. ఈ క్రమంలో కేప్‌టౌన్‌లో జరిగిన మూడో మ్యాచ్‌లో ఆదివారం(ఫిబ్రవరి 12) చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఇక భారత్ లక్ష్య ఛేదనకు దిగిన క్రమంలో.. ఓపెనర్ యస్తికా భాటియా(17) తక్కువ స్కోరుకే వెనుదిరిగింది. అదరగొట్టిన జెమీమా- రిచా మరో ఓపెనర్ షఫాలీ వర్మ 25 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 33 పరుగులు సాధించింది. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగెస్ ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 16 పరుగులకే పెవిలియన్ చేరిన వేళ.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వికెట్ కీపర్ రిచా ఘోష్‌తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపింది. ఇదే అత్యధిక ఛేదన జెమీమా(53)- రిచా(31) జోడీ అద్భుతంగా రాణించి ఆఖరి వరకు అజేయంగా నిలవడంతో 19 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించగలిగింది. 3 వికెట్ల నష్టానికి 151 పరుగులు సాధించి ప్రపంచకప్ ప్రయాణాన్ని గెలుపుతో ఆరంభించింది. కాగా.. వరల్డ్‌కప్ మ్యాచ్‌లో భారత మహిళా జట్టుకిదే అత్యధిక ఛేదన కావడం విశేషం. అంతేకాదు.. టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్‌కిది ఐదో విజయం. వాట్ ఏ విన్ ఈ నేపథ్యంలో ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లి ఇన్‌స్టా వేదికగా భారత మహిళా జట్టు ఫొటో షేర్ చేస్తూ వారిని అభినందించాడు. ‘‘తీవ్ర ఒత్తిడిలోనూ.. పాకిస్తాన్ విధించిన లక్ష్యాన్ని ఛేదించారు. వాట్ ఏ విన్’’ అని కొనియాడాడు. ప్రతి టోర్నమెంట్లోనూ సత్తా చాటుతూ ఆటను ఉన్నత శిఖరాలకు చేరుస్తూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కితాబులిచ్చాడు. చదవండి: SA20 2023: తొట్టతొలి మినీ ఐపీఎల్ టైటిల్‌ను హస్తగతం చేసుకున్న సన్‌రైజర్స్ ధర్మశాల టెస్టు వైజాగ్‌లో? View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
భారత అమ్మాయిల ‘హ్యాట్రిక్’
సిల్హెట్ (బంగ్లాదేశ్): మహిళల ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భారత జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది. మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (45 బంతుల్లో 75 నాటౌట్; 11 ఫోర్లు), దీప్తి శర్మ (49 బంతుల్లో 64; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. దీంతో భారత అమ్మాయిల జట్టు 104 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ టోర్నీలో మహిళల జట్టుకిది వరుసగా మూడో విజయం. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత అమ్మాయిల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లు సబ్బినేని మేఘన (10), రిచా ఘోష్ (0), దయాళన్ హేమలత (2) నిరాశపరచడంతో భారత్ 20 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది. ఈ దశలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన దీప్తి, ఐదో వరుస బ్యాటర్ జెమీమా ధాటిగా ఆడారు. ఇద్దరు నాలుగో వికెట్‌కు 128 పరుగులు జోడించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. తదుపరి మ్యాచ్‌లో భారత అమ్మాయిల జట్టు 7న పాకిస్తాన్‌తో తలపడుతుంది. -
ICC Women's T20I Rankings: అదరగొట్టిన జెమిమా రోడ్రిగ్స్.. టాప్10లోకి
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత జట్టు మహిళా స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ దుమ్మురేపింది. బ్యాటర్ల ర్యాంకిగ్స్‌లో రోడ్రిగ్స్ తొలి సారి టాప్ 10లో చోటు దక్కించుకుంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రోడ్రిగ్స్.. నాలుగు స్ధానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం జరగుతోన్న ఆసియాకప్-2022లో రోడ్రిగ్స్ అదరగొడుతోంది. అక్టోబర్ 1న శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో రోడ్రిగ్స్ 76 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. అదే విధంగా మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో కూడా 75 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. మరోవైపు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 13వ స్థానానికి చేరుకుంది. ఇక ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ రెండో ర్యాంకులో ఉంది. చదవండి: Womens Asia Cup 2022: ఆసియాకప్‌లో భారత్ జైత్ర యాత్ర.. వరుసగా మూడో విజయం -
ఆసియాకప్‌లో భారత్ జైత్ర యాత్ర.. వరుసగా మూడో విజయం
మహిళల ఆసియాకప్-2022లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. షెల్లాట్ వేదికగా యూఏఈ మహిళలతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఈ ఆసియాకప్‌లో వరుసగా మూడో విజయాన్ని భారత్ తమ ఖాతాలో వేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో దీప్తీ శర్మ(49 బంతుల్లో 64), రోడ్రిగ్స్( 45 బంతుల్లో 75) అర్ధ సెంచరీలతో చెలరేగారు. యూఏఈ బౌలర్లలో గౌర్, మొఘల్, కోట్టి, ఇషా రోహిత్ తలా వికెట్ సాధించారు. ఇక 179 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 74 పరుగులకే పరిమితమైంది. యూఏఈ బ్యాటర్లో కవిషా ఎగోడాగే(30 నటౌట్), కుషీ శర్మ(29) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. కాగా భారత బౌలర్లలో రాజేశ్వరి గయక్వాడ్ రెండు వికెట్లు, దయాలన్ హేమలత ఒక్క వికెట్ సాధించింది. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో ఆక్టోబర్7న తలపడనుంది. చదవండి: LLC 2022: మహిళా అంపైర్‌తో దురుసు ప్రవర్తన.. అందుకే గొడవ