
దుబాయ్: ఐసీసీ మహిళల టి20 తాజా ర్యాంకింగ్స్ (బ్యాటింగ్)లో భారత ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ రెండో స్థానంలో నిలిచింది. ఇటీవల న్యూజిలాండ్‌లో ముగిసిన 3 మ్యాచ్‌ల సిరీస్‌లో జెమీమా 132 పరుగులు చేసింది. మరో బ్యాటర్ స్మృతి మంధాన ఆరో ర్యాంక్‌కు ఎగబాగింది. ఇదే సిరీస్‌లో 180 పరుగులు చేసిన స్మృతి నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుంది. ఈ జాబితాలో సుజీ బేట్స్ (న్యూజిలాండ్) అగ్రస్థానంలో కొనసాగుతోంది. టాప్–10లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (7) కూడా ఉంది. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో పూనమ్ యాదవ్ రెండో స్థానంలో ఉండగా, రాధ యాదవ్ 18 స్థానాలు మెరుగుపర్చుకొని 10వ ర్యాంక్‌కు చేరుకోవడం విశేషం. టి20 ఆల్‌రౌండర్ల జాబితాలో భారత్ నుంచి టాప్–10లో ఎవరికీ చోటు దక్కలేదు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment