Womens T20 cup
-
Womens Asia Cup T20: భారత మహిళలకు షాక్
సిల్హెట్ (బంగ్లాదేశ్): ఆసియా కప్ మహిళల టి20 టోర్నీలో జోరుగా దూసుకుపోతున్న భారత బృందానికి బ్రేక్ పడింది. ఫేవరెట్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్ సేన పాకిస్తాన్ చేతిలో అనూహ్యంగా పరాజయంపాలై ఆశ్చర్యపర్చింది. శుక్రవారం మ్యాచ్‌కు ముందు టి20ల్లో పాక్‌తో 12 సార్లు తలపడి 10 సార్లు గెలిచిన భారత్... చివరిసారిగా 2016లో ఆ జట్టు చేతిలో ఓడింది. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత పాకిస్తాన్ మన జట్టుపై విజయం సాధించింది. చివరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో పాక్ 13 పరుగుల తేడాతో భారత్‌పై గెలుపొందింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా, భారత్ 19.4 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. గురువారం అనూహ్యంగా థాయ్‌లాండ్ చేతిలో ఓడిన పాక్ కోలుకొని ఆసియాకప్ టోర్నీలో తొలి సారి భారత్‌పై విజయాన్ని అందుకోవడం విశేషం. ఓపెనర్లు మునీబా (17; 1 ఫోర్), సిద్రా (11; 1 ఫోర్)తో పాటు ఒమైమా (0) కూడా విఫలం కావడంతో ఆరు ఓవర్ల లోపే 33 పరుగుల వద్ద పాక్ 3 వికెట్లు కోల్పోయింది. అయితే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నిదా దార్ (37 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ బిస్మా మారూఫ్ (35 బంతుల్లో 32; 2 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 58 బంతుల్లో 76 పరుగులు జోడించారు. దీప్తి శర్మ 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, పూజ వస్త్రకర్ 2 వికెట్లు తీసింది. ఛేదనలో ఓపెనర్లు సబ్బినేని మేఘన (15; 1 ఫోర్, 1 సిక్స్), స్మృతి మంధాన (17; 2 ఫోర్లు), హేమలత (20; 3 ఫోర్లు ) కొన్ని చక్కటి షాట్లు ఆడినా ఎక్కువ సేపు నిలవలేకపోయారు. ఫామ్‌లో ఉన్న జెమీమా (2) విఫలం కాగా, చెప్పుకోదగ్గ భాగస్వామ్యం ఒక్కటీ లేకపోయింది. బ్యాటింగ్ ఆర్డర్‌ను మారుస్తూ ఏడో స్థానంలో వచ్చిన హర్మన్ ప్రీత్ (12) ప్రయోగం విఫలమైంది. తీవ్ర ఎండ కారణంగా కీపింగ్ వదిలి మధ్యలోనే మైదానం వీడిన రిచా ఘోష్ (13 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. చివరి 3 ఓవర్లలో 43 పరుగులు చేయాల్సి ఉండగా నష్రా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లతో పాటు సాదియా ఓవర్లోనూ వరుసగా 6, 4 కొట్టి రిచా గెలుపుపై ఆశలు రేపింది. అయితే అదే ఓవర్లో ఆమెను సాదియా అవుట్ చేయగా... చివరి ఓవర్లో 18 పరుగులు కావాల్సి ఉండగా, భారత్ 4 పరుగులకే పరిమితమైంది. నష్రా 3 వికెట్లు తీయగా... నిదా, సాదియా చెరో 2 వికెట్లు పడగొట్టారు. నేడు జరిగే ఐదో లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలయ్యే ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
Womens Asia Cup T20: చెలరేగిన జెమీమా
సిల్హెట్: ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న జెమీమా రోడ్రిగ్స్ (53 బంతుల్లో 76; 11 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి చెలరేగడంతో ఆసియా కప్ మహిళల టి20 టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తమ తొలి లీగ్ పోరులో భారత్ 41 పరుగులతో శ్రీలంకపై జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (6), షఫాలీ వర్మ (10) జట్టు స్కోరు 23 పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్)తో జతకట్టిన జెమీమా భారత్ స్కోరును మెరుపు వేగంతో నడిపించింది. ఇద్దరు కలిసి దాదాపు 13 ఓవర్లపాటు క్రీజులో నిలవడంతో లంక బౌలర్లకు కష్టాలు తప్పలేదు. మూడో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. ఈ క్రమంలో జెమీమా 38 బంతుల్లోనే (7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. నిజానికి భారత్ స్కోరు మరింత పెరగాలి. అయితే డెత్ ఓవర్లలో జెమీమాతో పాటు రిచా ఘోష్ (9), పూజ (1) విఫలమవడంతో ఆశించినన్ని పరుగులు రాలే దు. అనంతరం శ్రీలంక జట్టు 18.2 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు హేమలత (3/15), పూజ (2/12), దీప్తి శర్మ (2/15) లంకను దెబ్బ తీశారు. హర్షిత (26; 5 ఫోర్లు), హాసిని పెరీరా (30; 3 ఫోర్లు) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేకపోయారు. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 9 వికెట్లతో థాయ్‌లాండ్‌పై గెలిచింది. -
పుణే వేదికగా మహిళల టి20 చాలెంజ్ టోర్నీ
న్యూఢిల్లీ: మహిళల టి20 చాలెంజ్ క్రికెట్ టోర్నీ వేదిక మారింది. మూడు జట్లతో కూడిన ఈ టోర్నీ లక్నోలో కాకుండా పుణేలో ఈనెల 23 నుంచి 28 వరకు జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. కరోనా కారణంగా గత ఏడాది ఈ టోర్నీని నిర్వహించలేదు. గత నెలలో బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం తర్వాత మహిళల టి20 చాలెంజ్ టోర్నీ లక్నోలో నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించాడు. ఇప్పుడు ఈ టోర్నీ వేదికను లక్నో నుంచి పుణేకు మార్చారు. చదవండి: Rishi Dhawan Vs Hardik Pandya: గుజరాత్ కెప్టెన్‌కు రిషి ధవన్ ఫ్లైయింగ్ కిస్; నిరాశలో హార్దిక్ భార్య -
హర్మన్ మెరుపులు.. షఫాలీ విధ్వంసం
రాంచీ: సీనియర్ మహిళల టీ20 టోర్నీలో హర్యానా జట్టు బోణీ కొట్టింది. కెప్టెన్ షఫాలీ వర్మ (23 బంతుల్లో 50; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో విధ్వంసం సృష్టించడంతో హర్మాన్‌ప్రీత్ నేతృత్వంలోని పంజాబ్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (38 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో రాణించగా.. ప్రగతి సింగ్ (36) పర్వాలేదనిపించింది. అనంతరం 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హర్యానా 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. షఫాలీ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేయగా.. సుమన్ గుయిలా (25 బంతుల్లో 31), మాన్సీ జోషి (16 బంతుల్లో 25 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: T20 Trophy: హైదరాబాద్ శుభారంభం -
మహిళల టి20 చాలెంజ్ వాయిదా!
ముంబై: ఐపీఎల్ ప్లే ఆఫ్స్ సమయంలో జరగాల్సిన మహిళల టి20 చాలెంజ్ టోర్నీ ఈసారి నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అంతర్గత సమాచారం ప్రకారం ఈ టోర్నీని వాయిదా వేయనున్నారు. భారత్‌లో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించడం సాధ్యం కాదని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వివిధ దేశాల నుంచి భారత్‌కు ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు ఎవరూ ఈ టోర్నీకి వచ్చే అవకాశాలు లేవు. ఆస్ట్రేలియా ఇప్పటికే విమానాలు రద్దు చేయగా, ఇంగ్లండ్ కూడా తమ రెడ్‌లిస్ట్‌లో భారత్‌ను పెట్టింది. మహిళల చాలెంజ్ టోర్నీ వేదికగా నిర్ణయించిన న్యూఢిల్లీలో అయితే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు మెరుగుపడితే తగిన అవకాశాన్ని బట్టి టోర్నీ జరగవచ్చని బోర్డు కీలక సభ్యుడొకరు వెల్లడించారు. 2019, 2020లలో మూడు జట్లు వెలాసిటీ, ట్రయల్ బ్లేజర్స్, సూపర్ నోవాస్ పేరుతో నిర్వహించిన ఈ టోర్నీలో గత ఏడాది 12 మంది విదేశీ క్రికెటర్లు పాల్గొన్నారు. దుబాయ్ వేదికగా గత ఏడాది జరిగిన ఈ టోర్నీలో స్మృతి మంధాన కెప్టెన్సీలోని ట్రయల్ బ్లేజర్స్ జట్టు విజేతగా నిలిచింది. -
చాంపియన్ ట్రయల్ బ్లేజర్స్
షార్జా: మహిళల టి20 చాలెంజ్ క్రికెట్ టోర్నమెంట్లో కొత్త చాంపియన్ అవతరించింది. ఇప్పటికే రెండుసార్లు టైటిల్‌ను గెలుచుకున్న డిఫెండింగ్ చాంపియన్ సూపర్ నోవాస్‌ను ఓడించి ట్రయల్ బ్లేజర్స్ విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో స్మృతి మంధాన సారథ్యంలోని బ్లేజర్స్ 16 పరుగులతో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని సూపర్ నోవాస్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ట్రయల్ బ్లేజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులు చేసింది. స్మృతి మంధాన (49 బంతుల్లో 68; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టు ఆమాత్రం స్కోరు సాధించగలిగింది. నోవాస్ బౌలర్ రాధా యాదవ్ మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో 5 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించింది. అనంతరం సల్మా ఖాతూన్ (3/18), దీప్తి శర్మ (2/9)ల ధాటికి సూపర్ నోవాస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 102 పరుగులే చేసి ఓటమి పాలైంది. కెప్టెన్ హర్మ¯న్‌ప్రీత్ కౌర్ (36 బంతుల్లో 30; 2 ఫోర్లు), శశికళ సిరివర్ధనే (18 బంతుల్లో 19; 1 ఫోర్) రాణించారు. విజేతగా నిలిచిన ట్రయల్ బ్లేజర్స్ జట్టుకు ట్రోఫీతోపాటు రూ. 25 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. కెప్టెన్ మెరుపులు... టైటిల్‌పై గురిపెట్టిన స్మృతి దూకుడే మంత్రంగా చెలరేగింది. అనుజా బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6తో తన ఉద్దేశాన్ని చాటింది. డాటిన్ (32 బంతుల్లో 20; 1 ఫోర్) రాణించడంతో పవర్‌ప్లేలో జట్టు 45 పరుగులు సాధించింది. తర్వాత నోవాస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పరుగుల వేగం తగ్గింది. డాటిన్‌ను అవుట్ చేసిన పూనమ్ యాదవ్ ఓవర్లోనే వరుసగా 4, 6తో స్మృతి జోరు పెంచింది. ఈ క్రమంలో 38 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుది. జట్టు స్కోరు 101 వద్ద స్మృతి రెండో వికెట్‌గా వెనుదిరిగింది. రాధ మాయాజాలం... డెత్ ఓవర్లలో రాధ కొట్టిన దెబ్బకి బ్లేజర్స్ ఇన్నింగ్స్ కకావిలకమైంది. 18వ ఓవర్లో బంతినందుకున్న ఆమె... దీప్తి శర్మ (9), రిచా ఘోష్ (10)లను డగౌట్ చేర్చి భారీ స్కోరుకు కళ్లెం వేసింది. ఇక చివరి ఓవర్లోనైతే ఏకంగా 3 వికెట్లతో విజృంభించింది. తొలి బంతికి ఎకెల్‌స్టోన్ (1), నాలుగో బంతికి హర్లీన్ (4), ఐదో బంతికి జులన్ గోస్వామి (1) వికెట్లను పడగొట్టి కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చింది. చివరి బంతికి చాంథమ్ (0) రనౌట్‌గా వెనుదిరగడంతో ఆ వికెట్ ఆమె ఖాతాలో చేరలేదు. ఈ దెబ్బకి చివరి ఐదు ఓవర్లలో నోవాస్ కేవలం 17 పరుగులే చేయగలిగింది. అతి జాగ్రత్తతో... ఆరంభంలోనే నోవాస్‌కు షాక్ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న చమరి ఆటపట్టు (6) వికెట్‌ను రివ్యూ కోరి బ్లేజర్స్ దక్కించుకుంది. దీంతో అతి జాగ్రత్తకు పోయిన నోవాస్ పవర్‌ప్లేలో 28 పరుగులే చేసింది. తానియా (14), జెమీమా (13) విఫలమయ్యారు. ఈ దశలో కెప్టెన్ హర్మన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడింది. శశికళ (19)తో కలిసి నాలుగో వికెట్‌కు 37 పరుగులు జోడించి మ్యాచ్‌పై ఆశలు రేపింది. విజయానికి 12 బంతుల్లో28 పరుగులు చేయాల్సి ఉండగా... రెండు పరుగుల వ్యవధిలో అనుజా, హర్మన్, పూజలను పెవిలియన్ చేర్చి సల్మా ఖాతూన్ నోవాస్ నుంచి టైటిల్‌ను లాగేసుకుంది. -
సగర్వంగా ఫైనల్‌కు..
షార్జా: డిఫెండింగ్ చాంపియన్ సూపర్ నోవాస్ అనుకున్నది సాధించింది. ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొని మహిళల టి20 చాలెంజ్ టోరీ్నలో ఫైనల్ బెర్తును ఒడిసి పట్టింది. గెలుపు... ట్రయల్ బ్లేజర్స్వైపు మొగ్గుతోన్న దశలో రాధా యాదవ్ (2/30) అద్భుత బౌలింగ్‌తో సూపర్ నోవాస్‌ను 2 పరుగులతో గెలిపించింది. బ్లేజర్స్ విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా... రాధ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్‌ను దక్కించుకుంది. దీంతో శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ట్రయల్ బ్లేజర్స్‌కు ఓటమి తప్పలేదు. మూడు జట్ల మధ్య లీగ్ మ్యాచ్‌లు ముగిశాక మూడు జట్లూ ఒక్కో విజయంతో రెండు పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా స్మృతి మంధాన నేతృత్వంలోని ట్రయల్ బ్లేజర్స్ (+2.109), హర్మన్‌ప్రీత్ కెపె్టన్సీలోని సూపర్ నోవాస్ (–0.054) జట్లు ఫైనల్లోకి ప్రవేశించగా... హైదరాబాద్ క్రికెటర్ మిథాలీ రాజ్ నాయకత్వం వహిస్తున్న వెలాసిటీ (–1.869) జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించింది. సోమవారం జరిగే ఫైనల్లో ట్రయల్ బ్లేజర్స్, సూపర్ నోవాస్ అమీతుమీ తేల్చుకుంటాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సూపర్ నోవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 146 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ చమరి ఆటపట్టు జయాంగని (48 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకుంది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రయల్ బ్లేజర్స్ జట్టు 20 ఓవర్లు ఆడి 5 వికెట్లకు 144 పరుగులు చేసి ఓడిపోయింది. దీప్తి శర్మ (43 నాటౌట్) రాణించినా జట్టును గెలిపించలేకపోయింది. -
గెలిస్తేనే ఫైనల్లోకి...
షార్జా: అదిరే ఆరంభం... ఆపై నిరాశజనక ప్రదర్శన... తొలి రెండు మ్యాచ్‌ల్లో మహిళల టి20 చాలెంజ్ క్రికెట్ టోర్నీ సాగిన తీరిది. కరోనా విరామం తర్వాత భారత మహిళలు తలపడుతోన్న ఈ టోర్నీలో ఊహకందని ప్రదర్శనలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన డిఫెండింగ్ చాంపియన్ సూపర్ నోవాస్... అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ట్రయల్ బ్లేజర్స్‌ను నేడు ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్‌లో గెలుపొంది దర్జాగా ఫైనల్‌కు చేరేందుకు స్మృతి మంధాన సారథ్యంలోని బ్లేజర్స్ పక్కాగా సిద్ధమైంది. లీగ్‌లో నిలవాలంటే గెలవడం తప్ప సూపర్ నోవాస్‌కు మరో దారి లేదు. ఈ మ్యాచ్‌లో గెలుపొందితే నెట్ రన్‌రేట్ సహాయంతో వెలాసిటీ (–1.869) జట్టును వెనక్కి నెట్టి సూపర్ నోవాస్ (–0.204) ఫైనల్‌కు చేరే అవకాశముంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం పట్టుదలగా ఉంది. చమరి ఆటపట్టు, జెమీమా రోడ్రిగ్స్ సహాయంతో భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించాలని యోచిస్తుంది. మరోవైపు ట్రయల్ బ్లేజర్స్ భారీ విజయంలో కీలక పాత్ర పోషించిన లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ ఎకెల్‌స్టోన్ ఈ మ్యాచ్‌లో కీలకం కానుంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై సోఫీతో పాటు రాజేశ్వరీ గైక్వాడ్‌ను తట్టుకొని నిలిస్తే సూపర్ నోవాస్ విజయం కష్టమేమీ కాదు. ఇరు జట్లలోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉండటంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా జరుగనుంది. బ్యాటర్లు సత్తా చాటిన జట్టునే విజయం వరించడం ఖాయం. -
వెలాసిటీ 47 పరుగులకే సరి!
షార్జా: మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో నిరాశాజనక ప్రదర్శన! పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో టోర్నీ రెండో లీగ్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ట్రయల్ బ్లేజర్స్ 9 వికెట్ల తేడాతో వెలాసిటీని చిత్తుచేసింది. స్మృతి మంధాన సారథ్యంలోని బ్లేజర్స్ ముందు మిథాలీ రాజ్ నాయకత్వంలోని వెలాసిటీ నిలబడలేకపోయింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన వెలాసిటీ జట్టును టి20 ప్రపంచ నంబర్‌వన్ బౌలర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సోఫీ ఎకెల్‌స్టోన్ (3.1–1–9–4) బెంబేలెత్తించింది. ఆమె ధాటికి వెలాసిటీ 15.1 ఓవర్లలో 47 పరుగులకే కుప్పకూలింది. షఫాలీ వర్మ (9 బంతుల్లో 13; 1 ఫోర్, 1 సిక్స్) టాప్ స్కోరర్. జులన్ గోస్వామి, రాజేశ్వరీ గైక్వాడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం స్మృతి మంధాన (6) తొందరగా అవుటైనా... డియాండ్రా డాటిన్ (28 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు), రిచా ఘోష్ (10 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి జట్టును గెలిపించారు. బ్లేజర్స్ 7.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి 49 పరుగులు చేసింది. శనివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ట్రయల్ బ్లేజర్స్‌తో సూపర్ నోవాస్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో బ్లేజర్ గెలిస్తే ఆ జట్టుతో పాటు వెలాసిటీ ఫైనల్ చేరుతుంది. నోవాస్ గెలిస్తే మూడు జట్లూ ఒక్కో విజయంతో సమంగా నిలుస్తాయి. అప్పుడు రన్‌రేట్ ఆధారంగా ఫైనల్ చేరేదెవరో తేలుతుంది. సమష్టి వైఫల్యం... తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన వెలాసిటీ జట్టుకు ఈ మ్యాచ్‌లో ఊహించని రీతిలో షాక్ తగిలింది. మొదట సాధారణంగానే మొదలైన ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. మూడో ఓవర్లో షఫాలీ వర్మను చక్కటి బంతితో జులన్ అవుట్ చేయడంత వెలాసిటీ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత ఎకెల్‌స్టోన్ దెబ్బకి వెలాసిటీ జట్టు విలవిల్లాడింది. వరుస బంతుల్లో మిథాలీరాజ్ (1), వేద కృష్ణమూర్తి (0)లను ఆమె పెవిలియన్ చేర్చింది. కాసేటికే సుష్మ వర్మ (1)ను అవుట్ చేసి కోలుకోలేని దెబ్బతీసింది. అంతకుముందే వెలాసిటీ... డేనీ వ్యాట్ (3) వికెట్‌ను కూడా కోల్పోయింది. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికే 22/5తో జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రాజేశ్వరీ గైక్వాడ్ చెలరేగడంతో గత మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన సునె లూస్ (4), దివ్యదర్శిని (0) వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. 10 ఓవర్లకు జట్టు స్కోరు 27/7. తర్వాత మరో ఐదు ఓవర్ల ఆట జరిగినా కేవలం 20 పరుగులు మాత్రమే జోడించగలిగింది. అనంతరం అతి స్వల్ప లక్ష్యఛేదనను ట్రయల్ బ్లేజర్స్ సులువుగానే ఛేదించింది. కెప్టెన్ స్మృతి మంధాన నాలుగో ఓవర్లో వెనుదిరిగినా... ఏమాత్రం తడబడకుండా రిచా ఘోష్, డాటిన్ పని పూర్తి చేశారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 24 బంతుల్లో అభేద్యంగా 370 పరుగులు జోడించారు. ఎనిమిదో ఓవర్ తొలి బంతికి సిక్సర్‌తో రిచా మ్యాచ్‌ను ముగించింది. -
యూఏఈ చేరుకున్న మహిళా క్రికెటర్లు
దుబాయ్: మహిళల టి20 చాలెంజ్ సిరీస్ కోసం భారత టాప్–30 మహిళా క్రికెటర్లు గురువారం యూఏఈ చేరుకున్నారు. షార్జా వేదికగా నవంబర్ 4 నుంచి 9 వరకు జరుగనున్న ఈ టోర్నీలో భారత వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్, టి20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ తదితరులు పాల్గొననున్నారు. తొమ్మిదిరోజుల పాటు ముంబైలో క్వారంటైన్లో ఉన్న మహిళా క్రికెటర్లు... బయో బబుల్‌లోకి ప్రవేశించే ముందు మరో వారం రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు. ఆరు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నీలో సూపర్నోవాస్, ట్రయల్ బ్లేజర్స్, వెలాసిటీ జట్లు తలపడనున్నాయి. ఈ జట్లకు మిథాలీరాజ్, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ సారథ్యం వహిస్తారు. మినీ ఐపీఎల్‌గా పరిగణించే ఈ టోర్నీతోనే భారత మíహిళా క్రికెటర్లు కరోనా విరామం తర్వాత తొలి సారి మళ్లీ బ్యాట్ పడుతున్నారు. -
61 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్సర్లు
సిడ్నీ: అంతర్జాతీయ మహిళల టి20 క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన క్రికెటర్‌గా అలీసా హీలీ రికార్డు నెలకొల్పింది. శ్రీలంకతో బుధవారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో అలీసా హీలీ కేవలం 61 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 148 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆ్రస్టేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ మేనకోడలు అయిన అలీసా బ్యాటింగ్ మెరుపుల కారణంగా ఈ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 132 పరుగుల భారీ ఆధిక్యంతో గెలిచింది. సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 226 పరుగులు సాధించింది. అలీసా 25 బంతుల్లో అర్ధ సెంచరీ... 46 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకుంది. అనంతరం శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 94 పరుగులు చేసి ఓడిపోయింది. అలీసా హీలీ కంటే ముందు అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు మెగ్‌లానింగ్ (ఆ్రస్టేలియా–133 నాటౌట్) పేరిట ఉండేది. -
‘చాలెంజ్’ నెగ్గిన సూపర్ నోవాస్
హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సూపర్ నోవాస్ ‘మహిళల టి20 చాలెంజ్’ విజేతగా నిలిచింది. ఆరంభంలో చక్కగా ఛేదించే పనిలో పడ్డ సూపర్ నోవాస్ అనూహ్యంగా 11 పరుగుల వ్యవధిలో 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మెరుపులు మెరిపించిన హర్మన్ ఆఖరి ఓవర్లో నిష్క్రమించింది. కాస్త ఉత్కంఠ రేపినా... రాధా యాదవ్ మిగతా లాంఛనాన్ని పూర్తి చేసింది. జైపూర్: ‘మహిళల టి20 చాలెంజ్’ ట్రోఫీని సూపర్ నోవాస్ నెగ్గింది. శనివారం జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన నాలుగు వికెట్లతో మిథాలీ రాజ్ నాయకత్వంలోని వెలాసిటీపై విజయం సాధించింది. ముందుగా వెలాసిటీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 121 పరుగులు చేసింది. సుష్మ వర్మ (40 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. లియా తహుహు 2 వికెట్లు తీసింది. తర్వాత సూపర్ నోవాస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 125 పరుగులు చేసి గెలిచింది. హర్మన్‌ప్రీత్ (37 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగింది. విజేత సూపర్ నోవాస్ జట్టుకు రూ. 25 లక్షలు ప్రైజ్‌మనీగా లభించింది. ఖాతా తెరువకముందే కష్టాలు... సూపర్ నోవాస్ టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో వెలాసిటీ ఆట మొదలుపెట్టింది. కానీ... ఖాతా తెరువకముందే కష్టాల్లో పడింది. హేలీ మాథ్యూస్ (0), డానియెల్లి వ్యాట్ (0) డకౌటయ్యారు. షఫాలీ వర్మ (11), వేద (8), కెప్టెన్ మిథాలీ రాజ్ (12) బ్యాట్లెత్తేయడంతో 37 పరుగులకే సగం (5) వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సుష్మ వర్మ, అమెలియా కెర్ (38 బంతుల్లో 36; 4 ఫోర్లు) ఆరో వికెట్‌కు 71 పరుగులు జోడించడంతో స్కోరు వంద పరుగులు దాటింది. ఆఖరి ఓవర్లో సుష్మ ఓ భారీ సిక్సర్ బాదడంతో 13 పరుగులు వచ్చాయి. చకచకా ఛేదన... తర్వాత లక్ష్యఛేదనలో సూపర్ నోవాస్ చకచకా పరుగులు చేసింది. రెండో ఓవర్లో జయాంగని (2) ఔటైనా... ప్రియా (31 బంతుల్లో 29; 5 ఫోర్లు), జెమీమా (25 బంతుల్లో 22; 3 ఫోర్లు) జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. కానీ 53 పరుగుల వద్ద జెమీమా ఔటయ్యాక పరిస్థితి మారింది. స్వల్పవ్యవధిలో ప్రియా, స్కీవర్ (2), సోఫీ (3) ఔట్ కావడంతో 64 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ హర్మన్ అద్భుత పోరాటం చేసి జట్టును గెలిపించింది. -
వెలాసిటీ (vs) సూపర్ నోవాస్
జైపూర్: ప్రయోగాత్మకంగా మొదలుపెట్టినా, పురుషుల ఐపీఎల్ తరహాలో ఉత్కంఠగా సాగుతూ బాగానే ఆకట్టుకుంది మహిళల టి20 చాలెంజ్. ఫైనల్ సహా మొత్తం నాలుగు మ్యాచ్‌ల షెడ్యూల్‌తో... ట్రయ ల్ బ్లేజర్స్, వెలాసిటీ, సూపర్ నోవాస్ పేరిట మూడు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో లీగ్ దశలో ప్రతి జట్టు ఒక్కో మ్యాచ్ గెలిచాయి. రెండేసి పాయింట్లతో అన్నీ సమంగా నిలిచినా నెట్ రన్‌రేట్‌లో వెనుకబడి ట్రయల్ బ్లేజర్స్ ఫైనల్‌కు దూరమైంది. హైదరాబాదీ వెటరన్ బ్యాటర్ మిథాలీ రాజ్ నేతృత్వంలోని వెలాసిటీ... హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం లోని సూపర్ నోవాస్ మధ్య శనివారం ఇక్కడ తుది పోరు జరుగనుంది. వాస్తవానికి డాషింగ్ బ్యాటర్ స్మృతి మంధాన కెప్టెన్‌గా ఉన్న ట్రయల్ బ్లేజర్స్ కూడా బాగానే ఆడింది. స్మృతి ధనాధన్ ఇన్నింగ్స్‌తో తొలి మ్యాచ్‌లో నోవాస్‌పై నెగ్గింది. కానీ, వెలాసిటీపై రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యంతో కేవలం 112 పరుగులకే పరిమితమైంది. ఈ ప్రభావం రన్‌రేట్‌పై పడింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓటమి పాలవడం మైనస్‌గా మారింది. గురువారం వెలాసిటీపై గెలిచిన నోవాస్ ఫైనల్ బెర్తు కొట్టేసింది. ఈ రెండింటి కంటే చాలా మెరుగైన రన్ రేట్ ఉన్న వెలాసిటీకి ఓడినా టైటిల్ పోరుకు వెళ్లేందుకు ఇబ్బంది లేకపోయింది. అయితే, బౌలర్లు ముఖ్యంగా స్పిన్నర్లు కట్టిపడేస్తుండటంతో హర్మన్, జెమీమా రోడ్రిగ్స్, హేలీ వంటి హిట్టర్లున్నా మరీ స్వల్ప స్కోర్లు నమోదవుతున్నాయి. 150 దాటడమే గగనం అన్నట్లుంది. ఈ స్కోర్లను ఛేదించేందుకూ కష్టపడాల్సి వస్తుండటంతో ఉత్కంఠకు లోటుండటం లేదు. శనివారం నాటి తుది సమరంలోనూ భారీ స్కోర్లను ఆశించలేం. టీనేజ్ సంచలనం షఫాలీ వర్మ (వెలాసిటీ) ఎలా ఆడుతుం దనేది ఆసక్తికరం. దూకుడు పరంగా చూస్తే రోడ్రిగ్స్, హర్మన్‌లకు తోడు సోఫియా డివైన్ వంటి బ్యాటర్లు ఉండటం నోవాస్‌కు మేలు చేయనుంది. అనుభవం ప్రకారం అయితే మిథాలీ, వేదా కృష్ణమూర్తి, హేలీలతో వెలాసిటీ దీటుగా కనిపిస్తోంది. గురువారం లీగ్ మ్యాచ్‌లో ఇదే జట్టుపై సాధించిన గెలుపు నోవాస్‌కు ఆత్మవిశ్వాసం ఇచ్చేదే. -
జెమీమా ‘సూపర్’
జైపూర్: మహిళల టి20 లీగ్‌లో సూపర్నోవాస్ ‘ఆఖరి’ విజయంతో ముందడుగు వేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో నోవాస్ 12 పరుగుల తేడాతో వెలాసిటీపై నెగ్గింది. మెరుగైన రన్‌రేట్‌తో సూపర్నోవాస్, వెలాసిటీ జట్లు ఫైనల్స్‌కు అర్హత సంపాదించాయి. ట్రయల్‌బ్లేజర్స్ కథ లీగ్ దశలోనే ముగిసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సూపర్ నోవాస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (48 బం తుల్లో 77 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధసెంచరీ సాధించింది. అమెలియా కెర్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన వెలాసిటీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 130 పరుగులు చేసి ఓడింది. డానియెల్లి వ్యాట్ (33 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిథాలీ రాజ్ (42 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు) రాణించారు. సూపర్నోవాస్, వెలాసిటీల మధ్య రేపు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. జెమీమా ధాటిగా... టాస్ నెగ్గిన వెలాసిటీ ఫీల్డింగ్‌కు మొగ్గుచూపింది. ప్రియా పూనియాతో కలిసి సూపర్నోవాస్ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన జయంగని ఆరంభంలో బౌండరీలతో ఆకట్టుకుంది. ఫోర్లతో టచ్‌లోకి వచ్చిన పూనియా (16; 2 ఫోర్లు)ను శిఖాపాండే పెవిలియన్ చేర్చింది. 29 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోవడంతో బరిలోకి దిగిన జెమీమా రోడ్రిగ్స్ సూపర్ నోవాస్‌కు వెన్నెముకగా నిలిచింది. జయంగనితో కలిసి రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించింది. తర్వాత జయంగని (38 బంతుల్లో 31; 5 ఫోర్లు) ఔటయ్యాక... సోఫీ డివైన్‌తో కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది. ఫోర్లతో వేగం పెంచిన జెమిమా ఈ క్రమంలో 31 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. మరోవైపు డివైన్ మాత్రం ధాటిగా ఆడలేకపోయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (1 నాటౌట్) క్రీజులోకి వచ్చినప్పటికీ ఆఖరి ఓవర్లో చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయింది. ఆరంభంలోనే తడబాటు అనంతరం 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెలాసిటీ తడబడింది. జట్టు స్కోరు 7 పరుగుల వద్ద ఓపెనర్, టీనేజీ బ్యాట్స్‌మన్ షఫాలీ వర్మ (2), 22 వద్ద హేలీ మాథ్యూస్ (11) పెవిలియన్ చేరడంతో వెలాసిటీ కష్టాల్లో పడింది. ఈ దశలో డానియెల్లీ వ్యాట్, కెప్టెన్ మిథాలీ రాజ్ ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత తీసుకున్నారు. వెటరన్ బ్యాట్స్‌మన్ మిథాలీ నింపాదిగా ఆడుతుంటే... వ్యాట్ రెండు భారీ సిక్సర్లతో మెరిపించింది. ఇద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఏడో ఓవర్లో జట్టు స్కోరు 50 పరుగులకు చేరింది. పది ఓవర్లు ముగిసేసరికి వెలాసిటీ స్కోరు 68/2. మూడో వికెట్‌కు 56 పరుగులు జోడించాక భారీ షాట్‌కు ప్రయత్నించిన వ్యాట్... పూనమ్ ఓవర్లో క్లీన్‌బౌల్డయింది. తర్వాత మిథాలీకి వేద కృష్ణమూర్తి (29 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు) తోడైంది. కానీ పరుగుల రాక మందగించడంతో చేయాల్సిన లక్ష్యం పెరుగుతూ పోయింది. వెలాసిటీ విజయానికి 30 బంతుల్లో 51 పరుగులు చేయాలి. అయితే సూపర్ నోవాస్ బౌలర్లు కట్టుదిట్టగా బౌలింగ్ చేయడంతో భారీషాట్లకు అవకాశం లేకపోయింది. ఆఖరి 6 బంతులకు 23 పరుగులు చేయాల్సివుండగా... 10 పరుగులే చేసి ఓడింది. -
వెలాసిటీదే విజయం
జైపూర్: పురుషుల ఐపీఎల్ తరహాలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో ఉత్కంఠకు మాత్రం కొదవ ఉండటం లేదు. స్కోర్లు తక్కువైనా సోమవారం ట్రయల్ బ్లేజర్స్–సూపర్ నోవాస్ జట్ల మ్యాచ్ చివరి బంతి వరకు సాగి ఆసక్తి రేపగా... బుధవారం ట్రయల్ బ్లేజర్స్, వెలాసిటీ మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో అనూహ్య ఫలితం వచ్చేలా కనిపించింది. వెలాసిటీ విజయానికి 20 బంతుల్లో 2 పరుగులు మాత్రమే అవసరమైన స్థితిలో... ఏడు బంతుల్లో ఒక్క పరుగూ రాకుండా ఐదు వికెట్లు పడటంతో ఏం జరుగుతుందోనన్న ఉత్సుకత నెలకొంది. అయితే, సుశ్రీ ప్రధాన్ (2) అందుకు అవకాశం ఇవ్వకుండా లాంఛనాన్ని పూర్తి చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ట్రయల్ బ్లేజర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. వెలాసిటీ 18 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసి మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. హర్లీన్... మళ్లీ గత మ్యాచ్‌లో చెలరేగిన కెప్టెన్ స్మృతి మంధాన (10) ఈసారి త్వరగానే వెనుదిరగడంతో బ్లేజర్స్‌కు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సుజీ బేట్స్ (22 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్), వన్ డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (40 బంతుల్లో 43; 5 ఫోర్లు) రెండో వికెట్‌కు 35 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. సుజీ ఔటవడం, హర్లీన్‌కు ఎక్కువగా స్ట్రయికింగ్ రాకపోవడంతో స్కోరు వేగం పుంజుకోలేదు. స్టెఫానీ టేలర్ (18 బంతుల్లో 5) బంతులు వృథా చేసింది. 18వ ఓవర్లో హర్లీన్, దీప్తి శర్మ (16) వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. దీంతో మెరుగైన స్కోరుకు అవకాశం లేకపోయింది. వెలాసిటీ బౌలర్లలో ఏక్తా బిష్త్ (2/13), అమేలీ కెర్ (2/21) రెండేసి వికెట్లు పడగొట్టారు. శిఖా పాండే (1/18) పొదుపుగా బౌలింగ్ చేసింది. అనంతరం టీనేజ్ ఓపెనర్ షఫాలీ వర్మ (31 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్), వన్‌డౌన్ బ్యాటర్ డానియల్ వ్యాట్ (35 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్) మెరుపులతో వెలాసిటీ ఛేదన సులువుగానే సాగింది. రెండో వికెట్‌కు వీరు 38 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 63 పరుగుల వద్ద షఫాలీ ఔటయ్యాక వ్యాట్, కెప్టెన్ మిథాలీ రాజ్ (22 బంతుల్లో 17; 1 ఫోర్) ఇన్నింగ్స్‌ను నడిపించారు. మూడో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. గెలుపునకు 25 బంతుల్లో 2 పరుగులే కావాల్సిన దశలో దీప్తి శర్మ (4/14) మాయాజాలానికి వ్యాట్, వేద కృష్ణమూర్తి (0), మిథాలీ, శిఖా పాండే (0), కెర్ (0) ఒకరివెంట ఒకరు వెనుదిరిగారు. దీంతో జట్టు 111/2 నుంచి 111/7కు పడిపోయింది. చేతిలో మూడు వికెట్లుండగా సమీకరణం 13 బంతుల్లో 2 పరుగులుగా మారింది. ఒత్తిడిని తట్టుకున్న ప్రధాన్... దీప్తి వేసిన బంతిని షార్ట్ థర్డ్‌మ్యాన్ దిశగా పంపి వెలాసిటీని గెలిపించింది. నేడు వెలాసిటీ, సూపర్ నోవాస్ మ్యాచ్ ఫైనల్ సహా మొత్తం నాలుగు మ్యాచ్‌ల మహిళల టి20 లీగ్‌లో గురువారం వెలాసిటీ, సూపర్నోవాస్ మధ్య మూడో లీగ్ మ్యాచ్ జరుగనుంది. ప్రస్తుతం ట్రయల్ బ్లేజర్స్, వెలాసిటీ చెరో మ్యాచ్ నెగ్గి ఉన్నాయి. మూడింటిలో బ్లేజర్స్ (–0.305), నోవాస్ (–0.1) కంటే వెలాసిటీ (0.678) రన్‌రేట్ చాలా మెరుగ్గా ఉంది. గురువారం వెలాసిటీ గెలిచినా, ఓడినా ఫైనల్‌కు వెళ్లే చాన్స్ ఉంది. నోవాస్‌కు మాత్రం విజయం, మంచి రన్‌రేట్ సాధించడం కూడా ముఖ్యమే. 15 ఏళ్ల సంచలనం... బ్లేజర్స్, వెలాసిటీ మ్యాచ్‌లో బరిలో దిగిన షఫాలీ వర్మ వయసు కేవలం 15 ఏళ్లు. హరియాణాకు చెందిన ఈ టీనేజర్ అండర్–19 స్థాయిలో అదరగొట్టే ప్రదర్శన కనబరుస్తోంది. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన ఈమె ఇటీవల జరిగిన బీసీసీఐ అండర్–19 మహిళల క్రికెట్ లీగ్‌లో విశేషంగా రాణించింది. బెంగాల్‌పై 57 బంతుల్లో సెంచరీ బాది వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్‌పై 58 బంతుల్లో 98 పరుగులు చేసింది. ఇక హైదరాబాద్‌పై అయితే 77 బంతుల్లోనే 125 పరుగులు చేసింది. ఈ మూడుసార్లూ జట్టు గెలవగా ఈమెనే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’. ఈ టోర్నీలో 5 ఇన్నింగ్స్‌ల్లో 376 పరుగులు చేసింది. ఆఫ్‌బ్రేక్ బౌలింగ్‌తో వికెట్ కీపింగ్ కూడా చేయగలగడం షఫాలీ ప్రత్యేకత. షఫాలీ ఇదే జోరును కొనసాగిస్తే మహిళల జాతీయ జట్టులోకి రావడానికి మరెంతో కాలం పట్టకపోవచ్చు. -
రెండో ర్యాంక్‌కు జెమీమా రోడ్రిగ్స్
దుబాయ్: ఐసీసీ మహిళల టి20 తాజా ర్యాంకింగ్స్ (బ్యాటింగ్)లో భారత ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ రెండో స్థానంలో నిలిచింది. ఇటీవల న్యూజిలాండ్‌లో ముగిసిన 3 మ్యాచ్‌ల సిరీస్‌లో జెమీమా 132 పరుగులు చేసింది. మరో బ్యాటర్ స్మృతి మంధాన ఆరో ర్యాంక్‌కు ఎగబాగింది. ఇదే సిరీస్‌లో 180 పరుగులు చేసిన స్మృతి నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుంది. ఈ జాబితాలో సుజీ బేట్స్ (న్యూజిలాండ్) అగ్రస్థానంలో కొనసాగుతోంది. టాప్–10లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (7) కూడా ఉంది. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో పూనమ్ యాదవ్ రెండో స్థానంలో ఉండగా, రాధ యాదవ్ 18 స్థానాలు మెరుగుపర్చుకొని 10వ ర్యాంక్‌కు చేరుకోవడం విశేషం. టి20 ఆల్‌రౌండర్ల జాబితాలో భారత్ నుంచి టాప్–10లో ఎవరికీ చోటు దక్కలేదు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. -
అంతర్జాతీయ టి20: 14 పరుగులకే ఆలౌట్
బ్యాంకాక్: చైనా వస్తువుల నాణ్యత, మన్నిక గురించి మనకు సాధారణంగా ఎన్నో సందేహాలు! ఇప్పుడు చైనా క్రికెట్ జట్టు కూడా అలాగే ఉన్నట్లుంది. ఇటీవలే ఆ జట్టు క్రికెట్లోకి అడుగు పెట్టగా... మహిళల టీమ్ అంతర్జాతీయ టి20ల్లో అత్యల్ప స్కోరు రికార్డును మూటగట్టుకుంది. ఆదివారం ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో జరిగిన మ్యాచ్‌లో చైనా 10 ఓవర్లలో 14 పరుగులకే ఆలౌటైంది. జట్టు ఇన్నింగ్స్ 48 నిమిషాలకే ముగిసింది. ఏడుగురు ప్లేయర్లు ‘సున్నా’తో సరిపెట్టగా... లిలి 4, యాన్ లింగ్, యింగ్జూ చెరో 3, జాంగ్ చాన్ 2 పరుగులు చేశారు. మరో 2 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. థాయ్‌లాండ్ ఉమెన్స్ టి20 స్మాష్ టోర్నీ లో భాగంగా ఈ మ్యాచ్ జరిగింది. అంతకుముందు యూఏఈ 20 ఓవర్లలో 3 వికెట్లకు 203 పరుగులు చేసింది. ఫలితంగా టి20ల్లో అత్యధిక పరుగుల తేడాతో (189) గెలిచిన జట్టుగా రికార్డులకెక్కింది. క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు గత ఏడాది జూలై 1 నుంచి సభ్యదేశాలు ఆడే టి20 మ్యాచ్‌లన్నింటికీ ఐసీసీ అంతర్జాతీయ హోదా ఇచ్చింది. ప్రస్తుత టోర్నీలో భూటాన్, మయన్మార్‌లాంటి జట్లు కూడా బరిలో ఉన్నాయి. మరోవైపు ఈ జనవరి 1 నుంచి పురుషుల క్రికెట్లో కూడా ఇదే తరహాలో ‘అంతర్జాతీయ మ్యాచ్‌ల’నిబంధన అమలు కానుంది. ఫలితంగా ఈ తరహా ‘సిత్రాలు’మున్ముందు మరిన్ని కనిపించవచ్చు. పురుషుల క్రికెట్లో భారత్ వర్సెస్ చైనా మ్యాచ్ స్కోర్లను ఊహించుకోండి! -
అనుష్క చూస్తుంది.. వ్యాట్ బీ కేర్‌ఫుల్!
సాక్షి, ముంబై: ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లీ వ్యాట్ గుర్తుందా?.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని.. నన్ను పెళ్లి చేసుకో అంటూ గతంలో ట్వీట్ చేసిన క్రికెటరే ఇ డానియెల్లీ వ్యాట్. నాలుగేళ్ల కింద ఆమె విరాట్‌కు ట్వీటర్ ద్వారా ప్రపోజ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆపై ఆమెను కలుసుకున్న సందర్భంలో వ్యాట్‌కు కోహ్లి బ్యాట్ బహుమతిగా ఇచ్చాడు. తాజాగా కోహ్లి అభిమానులు మహిళా క్రికెటర్ వ్యాట్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. విషయం ఏంటంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా వ్యాట్ ముంబైకి వచ్చారు. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్ తర్వాత వ్యాట్‌కి కాస్త విరామం దొరికింది. దీంతో ముంబైలోని ఎలిఫెంటా ఐలాండ్ వెళ్తున్నామని వ్యాట్ ట్వీట్ చేశారు. అంతే సంగతి! నిమిషాల్లో కోహ్లి అభిమానులు ట్వీటర్లో వ్యాట్‌కు స్వీట్ వార్నింగ్ ఇస్తూ కామెంట్లు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్లో అనుష్కశర్మ, విరాట్ కోహ్లిల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ‘కోహ్లి ఇంటికి కొద్ది దూరంలోనే నువ్వు ఉన్నావ్’ అతడి పక్కన అనుష్క ఉంటుంది జాగ్రత్త అంటూ క్రికెట్ ప్రేమికులు కొందరు వ్యాట్ పోస్టుకు రిప్లై ఇచ్చారు. అనుష్క నిన్ను గమనిస్తుంటుంది, జాగ్రత్తగా ఉండాలంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు. 2014లో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినప్పుడు వ్యాట్, కోహ్లిని కలిసింది. ఈ సందర్భంగా విరాట్ ఆమెకు బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ బ్యాట్‌ను మార్చి 23న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో వాడనున్నట్లు వ్యాట్ తెలిపారు. Day off in Mumbai so we’re off to have a look at Elephanta Island ⛴ 🙋🏼♀️ pic.twitter.com/eaVlWCQoPj — Danielle Wyatt (@Danni_Wyatt) 21 March 2018 -
మళ్లీ ఆస్ట్రేలియా x వెస్టిండీస్
మహిళల తొలి సెమీస్ నేడు అదే వేదిక... అదే ఫార్మాట్... అదే జట్లు... కాకపోతే ఈసారి మహిళలు. ఆస్ట్రేలియాపై గెలిచాక వెస్టిండీస్ పురుషుల జట్టు చేసిన డ్యాన్స్ ఇంకా మరచిపోకముందే... ఈసారి అదే దేశాలకు చెందిన మహిళల జట్ల మధ్య మరో కీలక మ్యాచ్ జరగనుంది. షేరే బంగ్లా స్టేడియంలో గురువారం జరిగే మహిళల టి20 కప్ తొలి సెమీస్‌లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. రెండు జట్లూ లీగ్ దశలో నాలుగేసి మ్యాచ్‌లు ఆడి మూడేసి , విజయాలతో సెమీస్‌కు చేరాయి. ఆసీస్ ఎ గ్రూప్ టాపర్‌గా... వెస్టిండీస్ బి గ్రూప్ రన్నరప్‌గా నాకౌట్‌కు అర్హత సాధించాయి. ఆసీస్ జట్టులో లానింగ్ కీలక బ్యాట్‌వుమన్. టోర్నీలో ఇప్పటికే ఓ సెంచరీ చేసింది. మరోవైపు కరీబియన్ జట్టులో టేలర్, డాటిన్ గమనించదగ్గ క్రీడాకారిణులు. మ. గం. 2.00 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం