హర్మన్‌ మెరుపులు.. షఫాలీ విధ్వంసం | Shafali Eclipses Harmanpreet As Haryana Beat Punjab In Senior Womens T20 | Sakshi
Sakshi News home page

Senior Women's T20 Trophy: బోణీ కొట్టిన హర్యానా.. పంజాబ్‌పై గెలుపు

Published Tue, Apr 19 2022 1:24 PM | Last Updated on Tue, Apr 19 2022 1:24 PM

Shafali Eclipses Harmanpreet As Haryana Beat Punjab In Senior Womens T20 - Sakshi

రాంచీ: సీనియర్‌ మహిళల టీ20 టోర్నీలో హర్యానా జట్టు బోణీ కొట్టింది. కెప్టెన్‌ షఫాలీ వర్మ (23 బంతుల్లో 50; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో విధ్వంసం సృష్టించడంతో హర్మాన్‌ప్రీత్‌ నేతృత్వంలోని పంజాబ్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (38 బంతుల్లో 64 నాటౌట్‌; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో రాణించగా.. ప్రగతి సింగ్‌ (36) పర్వాలేదనిపించింది. అనంతరం 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హర్యానా 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. షఫాలీ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేయగా.. సుమన్‌ గుయిలా (25 బంతుల్లో 31), మాన్సీ జోషి (16 బంతుల్లో 25 నాటౌట్‌) జట్టును విజయతీరాలకు చేర్చారు.
చదవండి: T20 Trophy: హైదరాబాద్‌ శుభారంభం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement