మళ్లీ ఆస్ట్రేలియా x వెస్టిండీస్ | Women's World T20 Australia x west indies starts to day | Sakshi
Sakshi News home page

మళ్లీ ఆస్ట్రేలియా x వెస్టిండీస్

Published Thu, Apr 3 2014 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 5:29 AM

మళ్లీ ఆస్ట్రేలియా   x వెస్టిండీస్

మళ్లీ ఆస్ట్రేలియా x వెస్టిండీస్

మహిళల తొలి సెమీస్ నేడు
 అదే వేదిక... అదే ఫార్మాట్... అదే జట్లు... కాకపోతే ఈసారి మహిళలు. ఆస్ట్రేలియాపై గెలిచాక వెస్టిండీస్ పురుషుల జట్టు చేసిన డ్యాన్స్ ఇంకా మరచిపోకముందే... ఈసారి అదే దేశాలకు చెందిన మహిళల జట్ల మధ్య మరో కీలక మ్యాచ్ జరగనుంది.
 
  షేరే బంగ్లా స్టేడియంలో గురువారం జరిగే మహిళల టి20 కప్ తొలి సెమీస్‌లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. రెండు జట్లూ లీగ్ దశలో నాలుగేసి మ్యాచ్‌లు ఆడి మూడేసి , విజయాలతో సెమీస్‌కు చేరాయి. ఆసీస్ ఎ గ్రూప్ టాపర్‌గా... వెస్టిండీస్ బి గ్రూప్ రన్నరప్‌గా నాకౌట్‌కు అర్హత సాధించాయి. ఆసీస్ జట్టులో లానింగ్ కీలక బ్యాట్‌వుమన్. టోర్నీలో ఇప్పటికే ఓ సెంచరీ చేసింది. మరోవైపు కరీబియన్ జట్టులో టేలర్, డాటిన్ గమనించదగ్గ క్రీడాకారిణులు.
 
 మ. గం. 2.00 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement