61 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్సర్లు | Australia Alyssa Healy Smashes World Record T20 Century In Win Over Sri Lanka | Sakshi

61 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్సర్లు

Oct 3 2019 5:33 AM | Updated on Oct 3 2019 10:02 AM

 Australia Alyssa Healy Smashes World Record T20 Century In Win Over Sri Lanka - Sakshi

సిడ్నీ: అంతర్జాతీయ మహిళల టి20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన క్రికెటర్‌గా అలీసా హీలీ రికార్డు నెలకొల్పింది. శ్రీలంకతో బుధవారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో అలీసా హీలీ కేవలం 61 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 148 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆ్రస్టేలియా దిగ్గజ వికెట్‌ కీపర్‌ ఇయాన్‌ హీలీ మేనకోడలు అయిన అలీసా బ్యాటింగ్‌ మెరుపుల కారణంగా ఈ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 132 పరుగుల భారీ ఆధిక్యంతో గెలిచింది.

సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 226 పరుగులు సాధించింది. అలీసా 25 బంతుల్లో అర్ధ సెంచరీ... 46 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకుంది. అనంతరం శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 94 పరుగులు చేసి ఓడిపోయింది. అలీసా హీలీ కంటే ముందు అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు మెగ్‌లానింగ్‌ (ఆ్రస్టేలియా–133 నాటౌట్‌) పేరిట ఉండేది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement