తొలి టి20లో భారత మహిళల జట్టు గెలుపు
49 పరుగులతో ఓడిన వెస్టిండీస్
రేపు రెండో టి20 మ్యాచ్
నవీ ముంబై: భారత మహిళల జట్టు చాన్నాళ్ల తర్వాత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెప్పుకోదగ్గ విజయం సాధించింది. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా 49 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై నెగ్గింది. టాపార్డర్ బ్యాటర్లు స్మృతి మంధాన (33 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్ (35 బంతుల్లో 73; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేయగా, బౌలింగ్‌లో టిటాస్ సాధు (3/37), దీప్తి శర్మ (2/21), రాధా యాదవ్ (2/28) కరీబియన్ జట్టును దెబ్బతీశారు.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఉమా ఛెత్రి (26 బంతుల్లో 24; 4 ఫోర్లు), రిచా ఘోష్ (14 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. కరిష్మా రమ్హార్యాక్ 2, డియాండ్ర డాటిన్ 1 వికెట్ తీశారు.
అనంతరం వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులే చేసి ఓడింది. ఓపెనర్ కియానా జోసెఫ్ (33 బంతుల్లో 49; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), డియాండ్ర డాటిన్ (28 బంతుల్లో 52; 4 ఫోరు, 3 సిక్స్‌లు) రాణించారు. జెమీమాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మంగళవారం ఇదే వేదికపై రెండో టి20 మ్యాచ్ జరుగుతుంది.
స్కోరు వివరాలు
భారత మహిళల ఇన్నింగ్స్: స్మృతి (సి) కియానా (బి) కరిష్మా 54; ఉమా ఛెత్రి (బి) కరిష్మా 24; జెమీమా రోడ్రిగ్స్ (రనౌట్) 73; రిచా ఘోష్ (సి) మంగ్రూ (బి) డియాండ్ర 20; హర్మన్‌ప్రీత్ (నాటౌట్) 13; సజన (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–50, 2–131, 3–155, 4–190.
బౌలింగ్: చినెలీ హెన్రీ 2–0–17–0, జైదా జేమ్స్ 1–0–13–0, హేలీ 3–0–38–0, కరిష్మా 4–0–18–2, అఫీ ఫ్లెచర్ 3–0–39–0, డియాండ్ర 4–0–37–1, షమిలియా 1–0–11–0, కియానా జోసెఫ్ 2–0–22–0.
వెస్టిండీస్ మహిళల ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) సబ్–మిన్నుమణి (బి) టిటాస్ 1; కియానా (సి) సైమా (బి) టిటాస్ 49; షెమైన్ (బి) దీప్తి శర్మ 13; డియాండ్ర (సి) రాధ (బి) టిటాస్ 52; చినెలీ హెన్రీ (సి) సబ్–మిన్నుమణి (బి) రాధ 7; షబిక (నాటౌట్) 15; అఫీ ఫ్లెచర్ (బి) దీప్తి శర్మ 0; జైదా (సి) ఉమా ఛెత్రి (బి) రాధ 5; మంగ్రూ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–2, 2–36, 3–80, 4–108, 5–126, 6–127, 7–140. బౌలింగ్: రేణుక 4–0– 25–0, టిటాస్ సాధు 4–0–37–3, దీప్తిశర్మ 4–0– 21–2, సైమా 4–0–35–0, రాధ 4–0–28–2.
3622 అంతర్జాతీయ మహిళల టి20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా స్మృతి మంధాన గుర్తింపు పొందింది. ఇన్నాళ్లు హర్మన్‌ప్రీత్ (3589 పరుగులు) పేరిట ఉన్న
రికార్డును స్మృతి సవరించింది.
117 అంతర్జాతీయ మహిళల టి20ల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్ డియాండ్రా డాటిన్ (117) ఘనత సాధించింది. న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్ (114) పేరిట ఉన్న రికార్డును డియాండ్రా బద్దలు కొట్టింది.
Comments
Please login to add a commentAdd a comment