1/21
స్మృతిని మించిపోయిన జెమీమా, దీప్తి, శిఖా పాండే
2/21
భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సహా ఆరుగురు భారత క్రికెటర్లు మహిళల బిగ్‌బాష్ టి20 లీగ్ (డబ్ల్యూబీబీఎల్)లో మెరిపించనున్నారు.
3/21
ఓపెనర్ స్మృతి, ఆల్‌రౌండర్ శిఖా పాండే, టాపార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌లు ఇది వరకే ఈ లీగ్‌లో ఆడారు.
4/21
అయితే కొత్తగా ఆల్‌రౌండర్ దయాళన్ హేమలత, వికెట్ కీపర్ బ్యాటర్ యస్తిక భాటియాలకు తొలిసారిగా బిగ్‌బాష్ చాన్స్ లభించింది. కానీ భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను మాత్రం లీగ్ ఫ్రాంచైజీలు పక్కన బెట్టాయి.
5/21
గతంలో మెల్‌బోర్న్ రెనిగేడ్స్, సిడ్నీ థండర్‌లకు ఆడిన అనుభవమున్న సీనియర్ బ్యాటర్‌పై ఎనిమిది ఫ్రాంచైజీల్లో ఏ ఒక్క జట్టు కూడా ఆసక్తి చూపకపోవడం గమనార్హం.
6/21
హిట్టింగ్‌తో ఆదరగొట్టే బ్యాటర్ జెమీమాకు బ్రిస్బేన్ హీట్ ‘ప్లాటినమ్’ ఎంపిక ద్వారా పెద్దపీట వేసింది. ఐపీఎల్‌లో టాప్ 1, 2, 3 రిటెన్షన్ పాలసీలా డబ్ల్యూబీబీఎల్‌లో ప్లాటినమ్, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ కేటగిరీలుంటాయి.
7/21
మరో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు మెల్‌బోర్న్ స్టార్స్ ‘ప్లాటినమ్’ కేటగిరీలో ఎంపిక చేసుకుంది. ఈ కేటగిరీలోకి ఎంపికైన క్రికెటర్లకు రూ. 62.41 లక్షలు (లక్షా 10 వేల ఆసీస్ డాలర్లు) కాంట్రాక్టు మొత్తంగా లభిస్తుంది.
8/21
‘గోల్డ్’ కేటగిరీలో బ్రిస్బేన్ హీట్‌కు ఎంపికైన శిఖా పాండేకు రూ. 51 లక్షలు (90 వేల ఆసీస్ డాలర్లు), అడిలైడ్ స్ట్రయికర్స్‌కు స్మృతి మంధాన, పెర్త్ స్కార్చర్స్‌కు హేమలత, మెల్‌బోర్న్ స్టార్స్‌కు యస్తిక భాటియా సిల్వర్ కేటగిరీలో ఎంపికయ్యారు.
9/21
ఈ ముగ్గురికి రూ. 36.88 లక్షలు (65 వేల ఆసీస్ డాలర్లు) కాంట్రాక్టు ఫీజుగా లభిస్తుంది. ఈ సీజన్ మహిళల బిగ్‌బాష్ లీగ్ వచ్చే నెల 27న అడిలైడ్‌లో మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అడిలైడ్ స్ట్రయికర్స్‌తో బ్రిస్బేన్ హీట్ జట్టు తలపడుతుంది.
10/21
11/21
12/21
13/21
14/21
15/21
16/21
17/21
18/21
19/21
20/21
21/21