హర్మన్‌ప్రీత్ కౌర్
ప్రొవిడెన్స్ (గయానా): ఏమి ఆ బ్యాటింగ్... ఏమి ఆ సిక్సర్ల జోరు... ఆ దూకుడు, ధాటిని చూసి ఆడుతోంది అమ్మాయేనా అనే సందేహం తప్పక వస్తోంది. పవర్ గేమ్‌కు కొత్త పాఠాలు చూపిస్తూ ధనా ధన్ షాట్లతో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ విధ్వంసం సృష్టించింది. న్యూజిలాండ్ బౌలర్లపై సునామీలా విరుచుకుపడుతూ ఏకంగా ఎనిమిది భారీ సిక్సర్లతో మహిళల టీ20 క్రికెట్‌లోనే సెంచరీ సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది.
దీంతో శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో భారత్ 34 పరుగులతో గెలిచి బోణి కొట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హర్మన్ 51 బంతుల్లోనే 103 పరుగులు చేసింది. ఆమెకు తోడుగా జెమీమా రోడ్రిగ్స్ (45 బంతుల్లో 59; 7 ఫోర్లు) సత్తా చాటడంతో భారత విజయం సులువైంది. హర్మన్ ఇన్నింగ్స్‌ను కొనియాడుతూ ఐసీసీ తన సిక్స్‌ర్లకు సంబంధిచి వీడియోను ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. భారత్ తదుపరి మ్యాచ్‌ను ఆదివారం పాకిస్తాన్‌తో తలపడనుంది.
Harmanpreet Kaur got the @WorldT20 off to a RAPID start with a sensational display of hitting in Guyana. Here are her biggest and best shots, delivered by @Oppo #FlashCharge. pic.twitter.com/KOSrNbDGOJ
— ICC (@ICC) November 10, 2018
Comments
Please login to add a commentAdd a comment