లండన్: భారత మహిళా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ వరుసగా మూడో ఏడాది ఇంగ్లండ్‌లో జరిగే ‘హండ్రెడ్’ టోర్నమెంట్‌లో ఆడనుంది. గత రెండేళ్లుగా నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్టుకు ఆడుతున్న ఆమెను ముందుగా ఈ సీజన్ నుంచి తప్పించాలని ఆ ఫ్రాంచైజీ అనుకుంది.
అయితే నార్తర్న్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆసీస్ ప్లేయర్ హీథెర్ గ్రాహమ్ గాయంతో వైదొలగడంతో చివరి నిమిషంలో 22 ఏళ్ల జెమీమాతో ఆ ఫ్రాంచైజీ మళ్లీ కాంట్రాక్టు కుదుర్చుకుంది. ఈ సీజన్ ‘హండ్రెడ్’ టి20 టోర్నీ వచ్చేనెల 1 నుంచి 27 వరకు జరుగనుంది. ఇందులో నలుగురు భారత క్రికెటర్లు పాల్గొంటున్నారు. లండన్ స్పిరిట్ జట్టుకు రిచా ఘోష్, ట్రెంట్ రాకెట్స్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్, సదర్న్ బ్రేవ్‌కు స్మృతి మంధాన ఆడనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment