కేప్‌టౌన్:దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన చివరిదైన ఐదో టీ20లో భారత క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ తన ఫీల్డింగ్‌తో అబ్బురపరిచింది. బౌండరీ లైన్ వద్ద కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకుని శభాష్ అనిపించింది. క్యాచ్ పట్టుకున్న క్రమంలో రోడ్రిగ్స్ తనను తాను నియంత్రించుకోవడం భారత అభిమానుల్లో జోష్‌ను నింపింది.
దక్షిణాఫ్రికా లక్ష్య ఛేదనలో భాగంగా 17 ఓవర్‌ను రుమేలి ధార్ వేసింది. ఐదో బంతిని స్టైకింగ్‌లో ఉన్న మారిజాన్నే కాప్ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడింది. అదే సమయంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న రోడ్రిగ్స్ బౌండరీ లైన్‌కు అంగుళం దూరంలో కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకుంది. క్యాచ్‌ను అందుకునే తర్వాత ఆమె బ్యాలెన్స్ తప్పి బౌండరీ లైన్‌పై పడుతుందేమో అనిపించింది. అయితే నియంత్రించుకోవడంతో కాప్ భారంగా పెవిలియన్ చేరింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో కాప్(27)దే అత్యధిక స్కోరు. ఆఖరి టీ20లో భారత మహిళలు 54 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్నారు. తొలి టీ20లో స్మృతీ మంధన సైతం ఇదే తరహాలో క్యాచ్ పట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment