అటు హర్మన్‌...ఇటు స్మృతి Smriti Mandhana and Harmanpreet Kaur scored centuries to lead India women to a series win against South Africa. Sakshi
Sakshi News home page

అటు హర్మన్‌...ఇటు స్మృతి

Published Thu, Jun 20 2024 3:57 AM | Last Updated on Thu, Jun 20 2024 8:58 AM

South Africa lost by 4 runs

శతకాలతో చెలరేగిన భారత ద్వయం

4 పరుగులతో ఓడిన దక్షిణాఫ్రికా 

వోల్‌వార్ట్, కాప్‌ సెంచరీలు

బెంగళూరు: భారత్, దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్‌ సమరంలో రికార్డులు హోరెత్తాయి. చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారి హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో చివరకు భారత్‌దే పైచేయి అయింది. బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత్‌ 4 పరుగుల స్వల్ప తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

వన్డేల్లో భారత్‌కు ఇది మూడో అత్యధిక స్కోరు. కెప్టెన్, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (88 బంతుల్లో 103 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు సెంచరీ సాధించగా, స్మృతి మంధాన (120 బంతుల్లో 136; 18 ఫోర్లు, 2 సిక్స్‌లు) వరుసగా రెండో వన్డేలోనూ శతకంతో చెలరేగింది.అనంతరం సఫారీ టీమ్‌ చివరి వరకు పోరాడి ఓడింది. 

50 ఓవర్లలో దక్షిణాఫ్రికా 6 వికెట్లకు 321 పరుగులు సాధించింది. కెపె్టన్‌ లారా వోల్‌వార్ట్‌ (135 బంతుల్లో 135 నాటౌట్‌; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), మరిజాన్‌ కాప్‌ (94 బంతుల్లో 114; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. పూజ వస్త్రకర్‌ వేసిన ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 11 పరుగులు అవసరం కాగా, తొలి 2 బంతుల్లో 5 పరుగులు వచ్చాయి. అయితే తర్వాతి 2 బంతులకు 2 వికెట్లు పడ్డాయి. ఆఖరి 2 బంతుల్లో 1 బై మాత్రమే వచ్చింది. సిరీస్‌ను 2–0తో భారత్‌ సొంతం చేసుకోగా, మూడో వన్డే ఆదివారం జరుగుతుంది. 

4 మహిళల వన్డేలో నలుగురు బ్యాటర్లు సెంచరీలు సాధించడం ఇదే తొలిసారి.  
646 ఇరు జట్లు కలిపి చేసిన పరుగులు. ఇది రెండో అత్యధికం. గతంలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్‌లో 678 పరుగులు నమోదయ్యాయి 
7 వన్డేల్లో ఏడో సెంచరీ సాధించిన స్మృతి...భారత్‌  తరఫున మిథాలీ రాజ్‌ (7)ని సమం చేసింది.  
హైదరాబాద్‌కు చెందిన పేస్‌ బౌలర్‌ అరుంధతి రెడ్డి ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసింది. భారత్‌ తరఫున ఆమె ఇప్పటికే 26 టి20లు ఆడింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement