మహిళల ఐపీఎల్ (WPL) అరంగేట్రం సీజన్ (2023)లో భాగంగా నిన్న (మార్చి 5) రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో షఫాలీ వర్మ (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), మెగ్ లాన్నింగ్ (43 బంతుల్లో 72; 14 ఫోర్లు), మారిజాన్ కాప్ (17 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా రోడ్రిగెస్ (15 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) శివాలెత్తడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో తారా నోరిస్ (5/29) నిప్పులు చెరగడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.
SCCCENESSSS https://t.co/MwCnUfPzrH
— Jemimah Rodrigues (@JemiRodrigues) March 5, 2023
కాగా, డీసీ ఇన్నింగ్స్ చివర్లో బరిలోకి దిగి బ్యాట్‌తో ఇరగదీసిన జెమీమా రోడ్రిగెస్.. ఆతర్వాత ఫీల్డింగ్ చేసే సమయంలో డ్యాన్స్‌తో అదరగొట్టి అభిమానుల మనసులను కొల్లగొట్టింది. డీసీ వైస్ కెప్టెన్ అయిన 22 ఏళ్ల రోడ్రిగెస్.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా, స్టేడియంలో ఒక్కసారిగా మ్యూజిక్ ప్లే కావడం మొదలైంది. హఠాత్తుగా ఫాస్ట్ బీట్ సంగీతం ప్లే కావడంతో తనలోని డ్యాన్సర్‌ను ఆపుకోలేకపోయిన రోడ్రిగెస్.. బాంగ్రా, వెస్ట్రన్ కలగలిపిన నృత్యం చేస్తూ ఊగిపోయింది.
రోడ్రిగెస్.. అచ్చం ప్రొఫెషనల్ డ్యాన్సర్‌లా డ్యాన్స్ చేసి ఫ్యాన్స్‌ను ఉత్తేజపరిచింది. రోడ్రిగెస్ డ్యాన్సింగ్ స్కిల్స్‌కు ఫిదా అయిన అభిమానులు సోషల్‌మీడియా వేదికగా ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందకేమో రోడ్రిగెస్‌ను విరాట్ కోహ్లితో పోలుస్తూ 100 పర్సంట్ ఎంటర్‌టైనర్ అంటూ కొనియాడుతున్నారు. మ్యాచ్ అనంతరం ఫ్యాన్స్ పోస్ట్ చేసిన తన డ్యాన్సింగ్ మూమెంట్స్‌కు సంబంధించిన వీడియోలకు రోడ్రిగెస్ రెస్పాండ్ అయ్యింది. కొందరికి ఆమె రీట్వీట్‌లు కూడా చేసింది. రొడ్రిగెస్ డ్యాన్సింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment