ICC Women's T20I Rankings: Jemimah Rodrigues Enters Top 10 - Sakshi
Sakshi News home page

ICC Women's T20I Rankings: అదరగొట్టిన జెమిమా రోడ్రిగ్స్.. టాప్‌10లోకి

Oct 4 2022 7:29 PM | Updated on Oct 4 2022 7:52 PM

ICC Womens T20I Rankings: Jemimah Rodrigues enters top 10 - Sakshi

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత జట్టు మహిళా స్టార్‌ బ్యాటర్‌ జెమిమా రోడ్రిగ్స్ దుమ్మురేపింది. బ్యాటర్ల ర్యాంకిగ్స్‌లో రోడ్రిగ్స్ తొలి సారి టాప్‌ 10లో చోటు దక్కించుకుంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రోడ్రిగ్స్.. నాలుగు స్ధానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం జరగుతోన్న ఆసియాకప్‌-2022లో రోడ్రిగ్స్ అదరగొడుతోంది.

అక్టోబర్ 1న  శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో రోడ్రిగ్స్ 76 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడింది. అదే విధంగా మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో కూడా 75 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడింది.

మరోవైపు భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 13వ స్థానానికి చేరుకుంది. ఇక  ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ రెండో ర్యాంకులో ఉంది.
చదవండిWomens Asia Cup 2022: ఆసియాకప్‌లో భారత్‌ జైత్ర యాత్ర.. వరుసగా మూడో విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement