harman preeth
-
ధనాధన్ ఆటకు అమ్మాయిలు సిద్ధం.. హర్మన్‌ప్రీత్ సేన ఈసారైనా...!
కేప్‌టౌన్: నేటి నుంచి ఐసీసీ టి20 ప్రపంచకప్ రూపంలో మరో ‘షో’కు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు జరిగిన ఏడు మెగా ఈవెంట్లలో ఐదు సార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా అమ్మాయిల జట్టు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. 2020లో ఈ జగజ్జేత చేతిలో మెల్బోర్న్ వేదికపై జరిగిన ఫైనల్లో ఓడిన భారత్ కూడా పొట్టి ప్రపంచకప్‌పై గట్టి ఆశలే పెట్టుకుంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే పది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదు జట్లు రౌండ్ రాబిన్ పద్ధతిలో తలపడతాయి. అనంతరం తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్ (సెమీస్)కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీస్ 23న, రెండో సెమీస్ 24న జరుగుతాయి. 26న జరిగే తుదిపోరుతో టోర్నీ ముగుస్తుంది. ముందుగా శుక్రవారం టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో శ్రీలంక తలపడుతుంది. భారత్ 12న జరిగే తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కొంటుంది. భారత్ ఆడే నాలుగు లీగ్ మ్యాచ్‌లు కూడా 6.30కే మొదలవుతాయి. ‘స్టార్‌స్పోర్ట్స్’లో మ్యాచ్‌లు ప్రసారమవుతాయి. గ్రూప్ ‘ఎ’: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్. గ్రూప్ ‘బి’: భారత్, ఇంగ్లండ్, ఐర్లాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్. మన మహిళల షెడ్యూల్ ఇదే ఫిబ్రవరి 12 భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఫిబ్రవరి 15 భారత్ వర్సెస్ వెస్టిండీస్ ఫిబ్రవరి 18 భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఫిబ్రవరి 20 భారత్ వర్సెస్ ఐర్లాండ్ -
W T20 WC 2023: మహిళల పోరుకు సర్వం సిద్దం.. తొలి మ్యాచ్‌లోనే పాక్‌తో భారత్ ఢీ
Womens T20 World Cup 2023 Full Schedule: దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2023కు సర్వం సిద్దమైంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 10 నుంచి షూరూ కానుంది. ఆ తొలి మ్యాచ్‌లో కేప్ టౌన్ వేదికగా అతిథ్య దక్షిణాఫ్రికాతో శ్రీలంక తలపడనుంది. ఈ మెగా ఈవెంట్లో మొత్తం 10 జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు, గ్రూప్-బిలో ఇంగ్లండ్, భారత్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. తొలి మ్యాచ్‌లోనే పాక్‌తో ఢీ ఇక భారత్ తమ తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ ఫిబ్రవరి 12న కేప్ టౌన్ వేదికగా జరగనుంది. వరల్డ్ కప్‌లో భారత్ షెడ్యూల్.. ఫిబ్రవరి 12న భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఫిబ్రవరి 15న భారత్ వర్సెస్ వెస్టిండీస్ ఫిబ్రవరి 18న భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఫిబ్రవరి 20న భారత్ వర్సెస్ ఐర్లాండ్ టీ20 ప్రపంచకప్‌కు భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యాస్తిక భాటియా, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవికా వైద్య, రాధ యాదవ్, రేణుక ఠాకూర్, అంజలి శర్వాణి, పూజ వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే. రిజర్వ్‌లు: సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, మేఘన సింగ్ టీ20 ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్ ఇదే 10 ఫిబ్రవరి- దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక, రాత్రి 10.30 (వేదిక-కేప్ టౌన్) 11 ఫిబ్రవరి- వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్, సాయంత్రం 6.30( వేదిక -పార్ల్) 11 ఫిబ్రవరి- ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్, రాత్రి 10.30 ( వేదిక పార్ల్) 12 ఫిబ్రవరి- భారత్ వర్సెస్ పాకిస్తాన్, సాయంత్రం 6.30( వేదిక కేప్‌టౌన్) 13 ఫిబ్రవరి- బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక, రాత్రి 10.30 (వేదిక-కేప్ టౌన్) 13 ఫిబ్రవరి- ఐర్లాండ్ వర్సెస్ ఇంగ్లండ్, సాయంత్రం 6.30( వేదిక- పార్ల్) 14 ఫిబ్రవరి- ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్, రాత్రి 10.30 (వేదిక-గ్కేబెర్హా) 15 ఫిబ్రవరి- భారత్ వర్సెస్ వెస్టిండీస్, సాయంత్రం 6.30( వేదిక -కేప్‌టౌన్) 15 ఫిబ్రవరి- పాకిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్, రాత్రి 10.30 (వేదిక-కేప్ టౌన్) 16 ఫిబ్రవరి- శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా, సాయంత్రం 6.30 (వేదిక-గ్కేబెర్హా) 17 ఫిబ్రవరి- న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్, సాయంత్రం 6.30( వేదిక కేప్‌టౌన్) 17 ఫిబ్రవరి- వెస్టిండీస్ వర్సెస్ ఐర్లాండ్, రాత్రి 10.30 (వేదిక-కేప్ టౌన్) 18 ఫిబ్రవరి- ఇంగ్లండ్ వర్సెస్ భారత్, సాయంత్రం 6.30 (వేదిక-గ్కేబెర్హా) 18 ఫిబ్రవరి- దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా, రాత్రి 10.30 (వేదిక-గ్కేబెర్హా) 19 ఫిబ్రవరి- న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక, రాత్రి 10.30 ( వేదిక పార్ల్) 20 ఫిబ్రవరి- ఐర్లాండ్ వర్సెస్ భారత్, సాయంత్రం 6.30 (వేదిక-గ్కేబెర్హా) 21 ఫిబ్రవరి- ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్తాన్, సాయంత్రం 6.30 (వేదిక-గ్కేబెర్హా) 21 ఫిబ్రవరి- దక్షిణాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్, రాత్రి 10.30 (వేదిక-కేప్ టౌన్) 23- ఫిబ్రవరి- సెమీ ఫైనల్-1, సాయంత్రం 6.30( వేదిక -కేప్‌టౌన్) 24- ఫిబ్రవరి- సెమీ ఫైనల్-2, సాయంత్రం 6.30( వేదిక -కేప్‌టౌన్) 26- ఫిబ్రవరి- ఫైనల్, సాయంత్రం 6.30( వేదిక -కేప్‌టౌన్) చదవండి: 'ఉమ్రాన్‌కు అంత సీన్ లేదు.. పాక్‌లో అలాంటోళ్లు చాలా మంది ఉన్నారు’ -
శ్రీలంకపై అద్భుత విజయం.. అమ్మాయిల సెలబ్రేషన్స్ మామాలుగా లేవుగా
మహిళల ఆసియాకప్-2022ను భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. శనివారం శ్రీలంకతో జరిగిన ఫైన్లలో విజయం సాధించిన భారత్.. 7వ ఆసియాకప్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ కీలక పోరులో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ మూడు వికెట్లు.. రాజేశ్వరీ గైక్వాడ్, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 66 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన(51) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేసింది. సెలబ్రేషన్స్ అదుర్స్ ఇక శ్రీలంకపై అద్భుతవిజయం అనంతరరం భారత జట్టు అమ్మాయిలు వినూత్న రీతిలో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. మైదానంలోనే పంజాబీ డ్యాన్స్‌లు, కేరింతలతో ఊర్రూతలూగించారు. కలర్ పేపర్స్‌ను ఒకరిపై ఒకరు చల్లుకుని భారత క్రికెటర్లు సంబురాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను బీసీసీఐ ఉమెన్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం భారత్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Post-win vibes, be like 🎉 🙌#TeamIndia | #AsiaCup2022 | #INDvSL pic.twitter.com/LsUG1PxNiO — BCCI Women (@BCCIWomen) October 15, 2022 చదవండి: Women's Asia Cup 2022: ఛాంపియన్ భారత్‌కు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..? -
ICC Women's T20I Rankings: అదరగొట్టిన జెమిమా రోడ్రిగ్స్.. టాప్10లోకి
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత జట్టు మహిళా స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ దుమ్మురేపింది. బ్యాటర్ల ర్యాంకిగ్స్‌లో రోడ్రిగ్స్ తొలి సారి టాప్ 10లో చోటు దక్కించుకుంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రోడ్రిగ్స్.. నాలుగు స్ధానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం జరగుతోన్న ఆసియాకప్-2022లో రోడ్రిగ్స్ అదరగొడుతోంది. అక్టోబర్ 1న శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో రోడ్రిగ్స్ 76 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. అదే విధంగా మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో కూడా 75 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. మరోవైపు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 13వ స్థానానికి చేరుకుంది. ఇక ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ రెండో ర్యాంకులో ఉంది. చదవండి: Womens Asia Cup 2022: ఆసియాకప్‌లో భారత్ జైత్ర యాత్ర.. వరుసగా మూడో విజయం -
భారత్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం!
చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా భారత మహిళలతో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో దీప్తి శర్మ(29), స్మృతి మంధాన(23) పరుగులతో రాణించారు. వీరిద్దరూ మినహా మిగితా భారత బ్యాటర్ల అంతా దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో గ్లెన్ నాలుగు వికెట్లతో భారత పతనాన్ని శాసించగా.. డేవిస్, స్మిత్ తలా వికెట్ సాధించారు. అనంతరం 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 13 ఓవర్లలో చేధించింది. ఇంగ్లండ్ ఓపెనర్ సోఫియా డంక్లీ 61 పరుగులతో ఆజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా మాత్రమే వికెట్ సాధించింది. చదవండి: Road Safety World Series: బిన్నీ ఊచకోత.. సౌతాఫ్రికాపై ఇండియా లెజెండ్స్ ఘన విజయం -
హర్మన్‌ప్రీత్ ‘హ్యాట్రిక్’
జూనియర్ ఆసియా కప్ సెమీస్‌లో భారత్ కౌంటాన్ (మలేసియా): అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న భారత్... జూనియర్ పురుషుల ఆసియా కప్ హాకీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ (7, 12, 50వ ని.) హ్యాట్రిక్ గోల్స్ చేయడంతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 9-0తో ఒమన్‌పై నెగ్గింది. హర్మన్‌ప్రీత్‌తో పాటు అర్మాన్ ఖురేషి (10వ ని.), గుర్జాంత్ సింగ్ (18వ ని.), సంటా సింగ్ (22వ ని.), మన్దీప్ సింగ్ (30వ ని.), హర్జీత్ సింగ్ (45వ ని.), మహ్మద్ ఉమర్ (54వ ని.)లు భారత్‌కు గోల్స్ అందించారు. ఆరంభం నుంచే బంతిని ఎక్కువ శాతం ఆధీనంలో ఉంచుకున్న భారత్.. వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుంది. పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మల్చడంతో తొలి అర్ధభాగానికి 6-0 ఆధిక్యంలో నిలిచింది. తర్వాత కూడా అదే జోరును చూపెట్టడంతో ఒమన్ ఆటగాళ్లు చేష్టలుడిగిపోయారు. శనివారం జరిగే తొలి సెమీఫైనల్లో భారత్... జపాన్‌తో తలపడుతుంది.