Womens T20 World Cup 2023 Full Schedule: దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2023కు సర్వం సిద్దమైంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 10 నుంచి షూరూ కానుంది. ఆ తొలి మ్యాచ్‌లో కేప్ టౌన్ వేదికగా అతిథ్య దక్షిణాఫ్రికాతో శ్రీలంక తలపడనుంది.
ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం 10 జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు, గ్రూప్-బిలో ఇంగ్లండ్, భారత్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి.
తొలి మ్యాచ్‌లోనే పాక్‌తో ఢీ
ఇక భారత్ తమ తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ ఫిబ్రవరి 12న కేప్ టౌన్ వేదికగా జరగనుంది.
వరల్డ్ కప్‌లో భారత్ షెడ్యూల్..
ఫిబ్రవరి 12న భారత్ వర్సెస్ పాకిస్తాన్
ఫిబ్రవరి 15న భారత్ వర్సెస్ వెస్టిండీస్
ఫిబ్రవరి 18న భారత్ వర్సెస్ ఇంగ్లండ్
ఫిబ్రవరి 20న భారత్ వర్సెస్ ఐర్లాండ్
టీ20 ప్రపంచకప్‌కు భారత మహిళల జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యాస్తిక భాటియా, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవికా వైద్య, రాధ యాదవ్, రేణుక ఠాకూర్, అంజలి శర్వాణి, పూజ వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే.
రిజర్వ్‌లు: సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, మేఘన సింగ్
టీ20 ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్ ఇదే
10 ఫిబ్రవరి- దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక, రాత్రి 10.30 (వేదిక-కేప్ టౌన్)
11 ఫిబ్రవరి- వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్, సాయంత్రం 6.30( వేదిక -పార్ల్)
11 ఫిబ్రవరి- ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్, రాత్రి 10.30 ( వేదిక పార్ల్)
12 ఫిబ్రవరి- భారత్ వర్సెస్ పాకిస్తాన్, సాయంత్రం 6.30( వేదిక కేప్‌టౌన్)
13 ఫిబ్రవరి- బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక, రాత్రి 10.30 (వేదిక-కేప్ టౌన్)
13 ఫిబ్రవరి- ఐర్లాండ్ వర్సెస్ ఇంగ్లండ్, సాయంత్రం 6.30( వేదిక- పార్ల్)
14 ఫిబ్రవరి- ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్, రాత్రి 10.30 (వేదిక-గ్కేబెర్హా)
15 ఫిబ్రవరి- భారత్ వర్సెస్ వెస్టిండీస్, సాయంత్రం 6.30( వేదిక -కేప్‌టౌన్)
15 ఫిబ్రవరి- పాకిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్, రాత్రి 10.30 (వేదిక-కేప్ టౌన్)
16 ఫిబ్రవరి- శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా, సాయంత్రం 6.30 (వేదిక-గ్కేబెర్హా)
17 ఫిబ్రవరి- న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్, సాయంత్రం 6.30( వేదిక కేప్‌టౌన్)
17 ఫిబ్రవరి- వెస్టిండీస్ వర్సెస్ ఐర్లాండ్, రాత్రి 10.30 (వేదిక-కేప్ టౌన్)
18 ఫిబ్రవరి- ఇంగ్లండ్ వర్సెస్ భారత్, సాయంత్రం 6.30 (వేదిక-గ్కేబెర్హా)
18 ఫిబ్రవరి- దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా, రాత్రి 10.30 (వేదిక-గ్కేబెర్హా)
19 ఫిబ్రవరి- న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక, రాత్రి 10.30 ( వేదిక పార్ల్)
20 ఫిబ్రవరి- ఐర్లాండ్ వర్సెస్ భారత్, సాయంత్రం 6.30 (వేదిక-గ్కేబెర్హా)
21 ఫిబ్రవరి- ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్తాన్, సాయంత్రం 6.30 (వేదిక-గ్కేబెర్హా)
21 ఫిబ్రవరి- దక్షిణాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్, రాత్రి 10.30 (వేదిక-కేప్ టౌన్)
23- ఫిబ్రవరి- సెమీ ఫైనల్-1, సాయంత్రం 6.30( వేదిక -కేప్‌టౌన్)
24- ఫిబ్రవరి- సెమీ ఫైనల్-2, సాయంత్రం 6.30( వేదిక -కేప్‌టౌన్)
26- ఫిబ్రవరి- ఫైనల్, సాయంత్రం 6.30( వేదిక -కేప్‌టౌన్)
చదవండి: 'ఉమ్రాన్‌కు అంత సీన్ లేదు.. పాక్‌లో అలాంటోళ్లు చాలా మంది ఉన్నారు’
Comments
Please login to add a commentAdd a comment