కేప్‌టౌన్: నేటి నుంచి ఐసీసీ టి20 ప్రపంచకప్ రూపంలో మరో ‘షో’కు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు జరిగిన ఏడు మెగా ఈవెంట్లలో ఐదు సార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా అమ్మాయిల జట్టు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. 2020లో ఈ జగజ్జేత చేతిలో మెల్‌బోర్న్ వేదికపై జరిగిన ఫైనల్లో ఓడిన భారత్ కూడా పొట్టి ప్రపంచకప్‌పై గట్టి ఆశలే పెట్టుకుంది.
ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే పది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదు జట్లు రౌండ్ రాబిన్ పద్ధతిలో తలపడతాయి. అనంతరం తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్ (సెమీస్)కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీస్ 23న, రెండో సెమీస్ 24న జరుగుతాయి. 26న జరిగే తుదిపోరుతో టోర్నీ ముగుస్తుంది. ముందుగా శుక్రవారం టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో శ్రీలంక తలపడుతుంది.
భారత్ 12న జరిగే తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కొంటుంది. భారత్ ఆడే నాలుగు లీగ్ మ్యాచ్‌లు కూడా 6.30కే మొదలవుతాయి. ‘స్టార్‌స్పోర్ట్స్’లో మ్యాచ్‌లు ప్రసారమవుతాయి.
గ్రూప్ ‘ఎ’: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్.
గ్రూప్ ‘బి’: భారత్, ఇంగ్లండ్, ఐర్లాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్.
మన మహిళల షెడ్యూల్ ఇదే
ఫిబ్రవరి 12 భారత్ వర్సెస్ పాకిస్తాన్
ఫిబ్రవరి 15 భారత్ వర్సెస్ వెస్టిండీస్
ఫిబ్రవరి 18 భారత్ వర్సెస్ ఇంగ్లండ్
ఫిబ్రవరి 20 భారత్ వర్సెస్ ఐర్లాండ్
Comments
Please login to add a commentAdd a comment