
నేడు అండర్–19 టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో భారత్ సెమీఫైనల్ పోరు
మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
కౌలాలంపూర్: డిఫెండింగ్ చాంపియన్ హోదాకు నూటికి నూరుశాతం న్యాయం చేస్తూ అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్‌లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత్ టైటిల్ నిలబెట్టుకునే అర్హత కోసం సెమీఫైనల్స్‌కు సిద్ధమైంది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లు ఒక ఎత్తయితే... ఈ రోజు ఆడే మ్యాచ్ ఒక ఎత్తు! ఎందుకంటే ఇన్నాళ్లు లీగ్ దశలో, సూపర్ సిక్స్‌లో తన గ్రూపులోని ప్రత్యర్థుల్ని చిత్తు చేసిన నికీ ప్రసాద్ నేతృత్వంలోని భారత్ ఇప్పుడు అసలైన సెమీఫైనల్ సవాల్‌కు రె‘ఢీ’ అయ్యింది.
నేడు జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ ఆడుతుంది. మరో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. ఈ ప్రపంచకప్‌లో భారత్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ టీనేజ్ సంచలనం గొంగడి త్రిష ఫామ్ ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో గుబులు రేపుతోంది.
బౌలింగ్‌లో వైజాగ్ సీమర్ షబ్నమ్ సహా ఆయుష్ , మిథిల, వైష్ణవి నిలకడగా రాణిస్తున్నారు. మరోవైపు ఇంగ్లండ్ జట్టు మెరుగ్గా ఆడుతున్న ప్పటికీ భారత్‌ను నిలువరిస్తుందో లేదో చూడాలి.
చదవండి :తాలిబన్లను వ్యతిరేకించి క్రికెట్ బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ ధీర వనితలు
Comments
Please login to add a commentAdd a comment