హర్మన్‌ప్రీత్ ‘హ్యాట్రిక్’ | Jr Asia Cup: Harmanpreet 'tricks' as India rout Oman to enter | Sakshi
Sakshi News home page

హర్మన్‌ప్రీత్ ‘హ్యాట్రిక్’

Published Fri, Nov 20 2015 12:37 AM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM

హర్మన్‌ప్రీత్ ‘హ్యాట్రిక్’

హర్మన్‌ప్రీత్ ‘హ్యాట్రిక్’

జూనియర్ ఆసియా కప్ సెమీస్‌లో భారత్

 కౌంటాన్ (మలేసియా): అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న భారత్... జూనియర్ పురుషుల ఆసియా కప్ హాకీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ (7, 12, 50వ ని.) హ్యాట్రిక్ గోల్స్ చేయడంతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 9-0తో ఒమన్‌పై నెగ్గింది. హర్మన్‌ప్రీత్‌తో పాటు అర్మాన్ ఖురేషి (10వ ని.), గుర్జాంత్ సింగ్ (18వ ని.), సంటా సింగ్ (22వ ని.), మన్‌దీప్ సింగ్ (30వ ని.), హర్జీత్ సింగ్ (45వ ని.), మహ్మద్ ఉమర్ (54వ ని.)లు భారత్‌కు గోల్స్ అందించారు. ఆరంభం నుంచే బంతిని ఎక్కువ శాతం ఆధీనంలో ఉంచుకున్న భారత్.. వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుంది. పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మల్చడంతో తొలి అర్ధభాగానికి 6-0 ఆధిక్యంలో నిలిచింది. తర్వాత కూడా అదే జోరును చూపెట్టడంతో ఒమన్ ఆటగాళ్లు చేష్టలుడిగిపోయారు. శనివారం జరిగే తొలి సెమీఫైనల్లో భారత్... జపాన్‌తో తలపడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement