వేసవికాలంలో పాలు పెరుగు తొందరగా పాడ పోతూ ఉంటాయి. ముఖ్యంగా పెరుగు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫ్రిజ్‌లో పెట్టినా రెండురోజుల్లో పెరుగు పులిసి పోతుంది. మరిపెరుగు ఎక్కువ రోజులు రుచి మారకుండా తాజాగా నిల్వ చేసుకోవాలో చూద్దాం.
పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పెరుగులో ఉండే బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. పులావ్, ఖిచ్డీ, పరాటా, ఉప్మా ,ఇలాంటి అనేక వంటకాల తయారీలో దీన్ని ఉపయోగిస్తాం. ఇక వేసవిలో అయితే లస్సీకున్న ప్రాధాన్యతే వేరు.
♦ మట్టిపాత్రలో పాలు తోడుపెడితే పెరుగు కమ్మగా ఉంటుంది. నిల్వ ఉంటుంది కూడా.
♦ చక్కటి , చిక్కటి పాలను బాగా మరిగించి, కొద్దిగా వేడిగా ఉన్నపుడే తోడు పెట్టాలి. తోడు పెట్టే పెరుగు రుచిగా ఉండేలా చూసుకోవాలి.
♦ తోడు పెట్టిన పాలలో ఒక పచ్చిమిరప కాయగానీ, ఒక ఎండుమిర్చిగానీ వేస్తే గట్టిగా తోడు కోవడమే కాదు, పెరుగు రుచిగా కూడా ఉంటుంది.
♦ గాలి చొరబడని కంటైనర్లలో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అలాగే పెరుగును కూడా ఇలా కంటైనర్లలో నిల్వ చేయాలి. మూత తీసినప్రతీసారి టైట్‌గా పెట్టడం మాత్రం మర్చిపోకూడదు.
♦ పెరుగు తోడు పెట్టిన గిన్నెలోనుంచే నేరుగా తీసుకొని, మళ్లీ అదే గిన్నిని ఫ్రిజ్‌లో పెట్టడం కాకుండా, కావాల్సినంత వేరే గిన్నెలోకి తీసుకొని వాడుకోవాలి ( దోసెలు, ఇడ్లీ పిండిలాగా) ఉపయోగించే స్పూన్ కూడా శుభ్రంగా, తడి లేకుండా ఉండేలా చూసుకోవాలి.
♦ ఫ్రిజ్ డోర్‌లో నిల్వ ఉంచ కూడదు. ప్రిజ్‌ను తెరచిన ప్రతిసారి డోర్ మొదట వేడెక్కుతుంది. సో.. పెరుగు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిజ్‌లోపల ఉంచితే పెరుగు తాజగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment