tricks
-
ఆఫీసుకు రాకుండా ఉండేదుకు ఉద్యోగులు వాడే ట్రిక్స్ ఇవే..
ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ విధానాలకు పూర్తిగా స్వస్తి పలికాయి. ఈ జాబితాలో అమెజాన్ కూడా ఉంది. 2025 నుంచి వారానికి ఐదు రోజులు ఖచ్చితంగా ఆఫీసుకు రావాలని కంపెనీ ఆదేశించింది. అందరూ ఆఫీస్ నుంచి పనిచేస్తే కలిగే ప్రయోజనాలను గురించి కూడా అమెజాన్ సీఈఓ 'ఆండీ జాస్సీ' వెల్లడించారు.ఇన్నిరోజులు ఇళ్లకు పరిమితమైన చాలా మంది ఉద్యోగులు.. ఆఫీసుకు రావాలనే వార్తతో కొంత నిరాశకు గురయ్యారు. ఈ నిర్ణయం గురించి మరోసారి ఆలోచించాలని అభ్యర్థించారు. మరికొందరు ఆఫీసు నుంచి పనిచేయడాన్ని తప్పించుకోవడానికి మూడు ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు 'ఆండీ జాస్సీ' చెప్పుకొచ్చారు.కాఫీ బ్యాడ్జింగ్అమెజాన్ ఉద్యోగులు మాత్రమే కాకుండా.. చాలామంది ఉద్యోగులు కాఫీ బ్యాడ్జింగ్ చేస్తున్నారని తెలిసింది. అంటే సమయానికి ఆఫీసులకు వచ్చి పంచ్ వేయడం, అల్పాహారాని కొంత సమయం, కాఫీ తాగటానికి కొంత సమయం ఇలా కేటాయించుకుంటూ.. మళ్ళీ టైమ్ అవ్వగానే పంచ్ వేసి వెళ్ళిపోతారు. ఇదెలా ఉండేదంటే.. ఆఫీసులో కనిపించి, కాఫీ తాగి వెళ్లిపోవడం అన్నమాట. ఈ విధానం కొంత తగ్గుముఖం పట్టింది.హోమ్ వై-ఫై పేరు మార్చేయడంఉద్యోగులు ఆఫీసులకు రాకుండా ఇంట్లోనే పనిచేస్తూ.. హోమ్ వై-ఫైకి ఆఫీస్ వై-ఫై పేరు ఇచ్చేవారు. ఇలా చేసి ఉద్యోగి లాగిన్ అయినప్పుడు రిపోర్టింగ్ సాఫ్ట్వేర్ ద్వారా వారు ఆఫీసులో ఉన్నట్లు తెలిసేది. ఇలా కూడా చేసేవారు ఎక్కువయ్యారు. ఆఖరికి రిపోర్టింగ్ సాఫ్ట్‌వేర్‌ను మరింత పటిష్టంగా చేయడంతో ఇది కొంత కనుమరుగైంది.ఇదీ చదవండి: అక్టోబర్‌లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?ఆఫీసులో బ్యాడ్జ్ వదిలి వెళ్లడంమూడో ట్రిక్ ఏమిటంటే.. కొంతమంది ఉద్యోగులు తమ బ్యాడ్జ్‌ని ఆఫీసులోనే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఈ బ్యాడ్జ్‌తో సహోద్యోగి చెక్ ఇన్, చెక్ అవుట్ వంటివి చేస్తారు. ఇలా చేస్తే సదరు ఉద్యోగి ఆఫీసుకి వచ్చి వెళ్తున్నట్లు రిపోర్టులో చూపిస్తుంది. కానీ నిజానికి వారు ఆఫీసుకే రారని తెలుస్తుంది. -
పెరుగు తొందరగా పాడైపోతుందా? ఈ చిట్కాలు పాటించండి!
వేసవికాలంలో పాలు పెరుగు తొందరగా పాడ పోతూ ఉంటాయి. ముఖ్యంగా పెరుగు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫ్రిజ్‌లో పెట్టినా రెండురోజుల్లో పెరుగు పులిసి పోతుంది. మరిపెరుగు ఎక్కువ రోజులు రుచి మారకుండా తాజాగా నిల్వ చేసుకోవాలో చూద్దాం. పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పెరుగులో ఉండే బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. పులావ్, ఖిచ్డీ, పరాటా, ఉప్మా ,ఇలాంటి అనేక వంటకాల తయారీలో దీన్ని ఉపయోగిస్తాం. ఇక వేసవిలో అయితే లస్సీకున్న ప్రాధాన్యతే వేరు. ♦ మట్టిపాత్రలో పాలు తోడుపెడితే పెరుగు కమ్మగా ఉంటుంది. నిల్వ ఉంటుంది కూడా. ♦ చక్కటి , చిక్కటి పాలను బాగా మరిగించి, కొద్దిగా వేడిగా ఉన్నపుడే తోడు పెట్టాలి. తోడు పెట్టే పెరుగు రుచిగా ఉండేలా చూసుకోవాలి. ♦ తోడు పెట్టిన పాలలో ఒక పచ్చిమిరప కాయగానీ, ఒక ఎండుమిర్చిగానీ వేస్తే గట్టిగా తోడు కోవడమే కాదు, పెరుగు రుచిగా కూడా ఉంటుంది. ♦ గాలి చొరబడని కంటైనర్లలో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అలాగే పెరుగును కూడా ఇలా కంటైనర్లలో నిల్వ చేయాలి. మూత తీసినప్రతీసారి టైట్‌గా పెట్టడం మాత్రం మర్చిపోకూడదు. ♦ పెరుగు తోడు పెట్టిన గిన్నెలోనుంచే నేరుగా తీసుకొని, మళ్లీ అదే గిన్నిని ఫ్రిజ్‌లో పెట్టడం కాకుండా, కావాల్సినంత వేరే గిన్నెలోకి తీసుకొని వాడుకోవాలి ( దోసెలు, ఇడ్లీ పిండిలాగా) ఉపయోగించే స్పూన్ కూడా శుభ్రంగా, తడి లేకుండా ఉండేలా చూసుకోవాలి. ♦ ఫ్రిజ్ డోర్లో నిల్వ ఉంచ కూడదు. ప్రిజ్‌ను తెరచిన ప్రతిసారి డోర్ మొదట వేడెక్కుతుంది. సో.. పెరుగు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిజ్‌లోపల ఉంచితే పెరుగు తాజగా ఉంటుంది. -
హెల్త్ టిప్స్: ఈ చిట్కాలు వాడారో.. ఇకపై ఆరోగ్య సమస్యలు దూరమే!
'మన ఆరోగ్యం బాగుకై ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. తీరికలేక మరెన్నో బాధ్యతలతో పరుగెడుతుంటాం. ఇలాంటి క్రమంలో ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తూంటుంది. దుమ్ము, దూళి, టెన్షన్స్, అవిరామం మరెన్నో కారణాలచే అనారోగ్యం పాలై, బాగుకోసం మెడిసిన్స్ వాడుతుంటాం. ఇకపై ఇలాంటి వాటికి స్వస్తి పలకడానికి ఈ చిన్న చిన్న ట్రిక్స్ వాడితే ఎంతో మేలని చెప్పవచ్చు. మరి అవేంటో చూద్దాం!' కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఓ 10 ఆకులతో పేస్ట్ తయారు చేసి మజ్జిగలో కలిపేసుకుని రోజూ తాగితే వ్యర్థపదార్థాల నుంచి కాలేయానికి రక్షణ దొరుకుతుంది. రోజూ ఓ 8 ఆకుల్ని మిరియాలతో కలిపి తింటే ముక్కులో వచ్చే అలర్జీలు తగ్గిపోతాయి. తులసి ఆకులు, వ్యాధి నిరోధక శక్తిని వద్ధి చేయడమే కాదు, శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఓ ఐదారు ఆకుల కషాయాన్ని మరగించి టీ మాదిరి చేసుకుని తాగితే, దగ్గు, జలుబు, ఆస్తమా అదుపులోకి వస్తాయి. పసుపును పేస్ట్‌గా రోజూ ముఖానికి వాడితే, ముఖం మీద ఉండే సన్నని వెంట్రుకలు రాలిపోతాయి. అలాగే మొటిమలు, మచ్చలు కూడా మాయమవుతాయి. ఇది గొప్ప యాంటీ ఆక్సిడెంటు కాబట్టి రోజు మొత్తంలో ఒక టీ స్పూను దాకా కడుపులోకి తీసుకోవచ్చు. మందారం ఆకుల్ని నూరి షాంపూగా వాడితే జుత్తు బాగా పెరుగుతుంది. చుండ్రు నివారణలోనూ, తెల్ల వెంట్రుకల నిరోధకంలోనూ బాగా సాయమవుతుంది. ఒక కప్పు నీటిలో ఒక పూవు చొప్పున వేసి ఆ నీళ్లను తాగితే రక్తంలో ఐరన్ పెరుగుతుంది. అల్లం, జీర్ణశక్తిని పెంచడంతో పాటు కడుపులోని వికారాన్ని తగ్గిస్తుంది. అల్లం రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే, ఆకలి పెరుగుతుంది. పడుకునే ముందు చెర్రీపండ్లు తిన్నా లేదా జ్యూస్ తాగినా.. అందులో ఉండే ’మెలటోనిన్’ వల్ల చక్కగా నిద్ర పడుతుంది. ఇవి చదవండి: మీకు తెలుసా! వేడి నీళ్లలో నెయ్యి కలిపి తాగితే ఏమౌతుందో!? -
కెమెరాలో ఎన్ని ట్రిక్కులుంటాయంటే.. చూసేదంతా భ్రమే
-
నిమ్మచెక్కలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?ఏం అవుతుందంటే..
కిచెన్ టిప్స్ : ►నిమ్మచెక్కతో మరకలు ఈజీగా పోతాయి కాయగూరలు తరిగే చెక్కని నిమ్మచెక్కతో రుద్ది కాసేపయ్యాక కడిగేయండి. మరకలు పోతాయి. ఎప్పుడైనా దానిపై మాంసం కోసినా.. నిమ్మచెక్కతో రుద్దాలి. క్రిములు వృద్ధి చెందకుండా ఉంటాయి. ► నిమ్మచెక్కలని సన్నగా తరిగి కాసిని నీళ్లలో వేసి ఆ పాత్రని మైక్రో ఓవెన్ లో కొన్ని నిమిషాలు ఉంచి తీసేయండి. అలా చేస్తే దుర్వాసనలు తొలగిపోవడంతో పాటూ లోపల పడి ఉన్న పదార్థాలని శుభ్రం చేయడం కూడా తేలికవుతుంది. ► ఫ్రిజ్‌లో ఓ మూలగా నిమ్మచెక్కని పెట్టి చూడండి. అందులోంచి వచ్చే దుర్వాసనలు పోతాయి. ► స్టీలు కుళాయిలపై నీటిమరకలు పడుతుంటాయి. అవి తెల్లగా మారాలంటే వాటిని నిమ్మచెక్కతో రుద్ది కడిగితే చాలు. -
వైరల్ వీడియో: మెట్రోలో సీటు కోసం.. ఎంత పని చేశాడు!
-
మెట్రోలో సీటు కోసం.. ఎంత పని చేశాడు! వైరల్ వీడియో
సాధారణంగా మెట్రో సౌకర్యం ఉన్న నగరాలలోని ప్రజలు.. తమ ప్రయాణానికి మెట్రోకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలో ఒక్కోసారి మెట్రో రైలులో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కనీసం నిల్చోవటానికి ఖాళీ స్థలం కూడా దొరకని సందర్భాలు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తాం? మహా అయితే అక్కడ ఉండే రోప్‌ను పట్టుకుని పడిపోకుండా నిల్చుంటాం. కానీ ఇక్కడో యువకుడు మాత్రం తనకు మెట్రో రైలులో సీటు దొరకలేదని వింతగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఒక యువకుడు మెట్రో రైలు ఎక్కాడు. ట్రైన్ అంతా చాలా రద్దీగా ఉంది. నిల్చోవటానికి తప్ప కూర్చోవటానికి ఎక్కడా చోటు లేదు. చాలా సేపు నిలబడినందుకు కాళ్లు నొప్పిపెట్టాయో లేదా ఇంకేం అయిందో తెలీదుగానీ వెంటనే నిల్చున్న చోట మూర్ఛ వచ్చినట్టు వణకిపోయాడు. దీంతో అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు ఆందోళనపడ్డారు. వెంటనే ఒక మహిళ లేచి అతడు కూర్చోవడానికి తన సీటు ఇచ్చింది. మరో మహిళ అతని టోపి కింద పడిపోతే అది తీసి సీటు పైన పెట్టింది. ఈ క్రమంలో, అతగాడు.. సీటుపై కూర్చున్న మరోసారి షాక్ కొట్టినట్లు వణికాడు. కానీ, ఈసారి తోటి ప్రయాణికులు సదరు యువకుడి ప్రవర్తన పట్ల కాస్త అనుమానంగా చూశారు. బహుషా.. ఇది ప్రాంక్ ఏమో.. అనుకున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీన్న చూసిన నెటిజన్లు.. ‘ఏం.. తెలివి భయ్యా.. నీది’, ‘తోటి వారిని ఫుల్స్ చేశావ్ గా..’, ‘ అయినా.. ఇలా చేయడం సరైన పనికాదు, ‘ మొత్తానికి సీటు సంపాదించావ్ ’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. చదవండి: స్తంభంపైకి ఎక్కిన ఎలుగుబంటి.. విద్యుత్ అంతరాయం.. -
వాట్సాప్‌లో ఇన్ని ట్రిక్స్ ఉన్నాయా?
మీరు వాట్సాప్ ఉపయోగిస్తున్నారా? వాట్సాప్ అందించే ఫీచర్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. అలాగే, మీకు వాట్సాప్‌లో ఉన్న ట్రిక్స్ గురుంచి మీకు తెలుసా?. తెలియకపోతే ఏమి పర్వాలేదు, వాట్సాప్ ఈసారి ప్రత్యేకంగా వాట్సాప్ ట్రిక్స్‌ని రిలీజ్ చేసింది. అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో కొన్ని వాట్సప్ ట్రిక్స్‌ని విడుదల చేసింది. విండోస్ డెస్క్‌టాప్ యాప్, విండోస్ బ్రౌజర్, మ్యాక్ డెస్క్‌టాప్ యాప్, మ్యాక్ బ్రౌజర్లో ఈ ట్రిక్స్‌ని ఉపయోగించుకోవచ్చు. మీరు వాట్సప్‌లో రెగ్యులర్‌గా ఉపయోగించే కమాండ్స్‌కి సంబంధించిన షార్ట్‌కట్స్‌ని రిలీజ్ చేసింది వాట్సాప్. మరి ఆ షార్ట్‌కట్స్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. Final boss mode: UNLOCKED! pic.twitter.com/ykDVmwyL7V — WhatsApp (@WhatsApp) April 7, 2021 విండోస్ డెస్క్‌టాప్ యాప్ వాట్సాప్ ట్రిక్స్: Mark as unread- Ctrl + Shift + U Archive Chat- Ctrl + E Pin / Unpin- Ctrl + Shift + P Search in chat- Ctrl + Shift + F New Group- Ctrl + Shift + N Settings- Ctrl + , Mute chat- Ctrl + Shift + M Delete chat- Ctrl + Shift + D Search in Chat list- Ctrl + F New Chat- Ctrl + N Open Profile- Ctrl + P Return Space- Shift + Enter విండోస్ బ్రౌజర్ వాట్సాప్ ట్రిక్స్: Mark as unread- Ctrl + Alt + Shift + U Archive Chat- Ctrl + Alt + E Pin / Unpin- Ctrl + Alt + Shift + P Search in Chat- Ctrl + Alt + Shift + F New Chat- Ctrl + Alt + N Settings- Ctrl + Alt + , Mute chat- Ctrl + Alt + Shift + M Delete chat- Ctrl + Alt + Shift + Backspace Search in chat list- Ctrl + Alt + / New Group- Ctrl + Alt + Shift + N Open Profile- Ctrl + Alt + P Return Space- Shift + Enter చదవండి: 6జీ టెక్నాలజీ అభివృద్ధి దిశగా ఎల్జీ కంపెనీ -
10 బెస్ట్ ఇంటర్నెట్ టిప్స్ అండ్ ట్రిక్స్
ఇంటర్నెట్ ప్రపంచం చాలా విస్తృతమైనది. ఇప్పుడు మనం వాడుతున్న ఇంటర్నెట్ అనేది మొత్తం ఇంటర్ నెట్ ప్రపంచంలో ఒక శాతమే. అందుకే దీనిని ఒక సముద్రం అనడం మంచిది. దీని ద్వారా మనకు ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతుంది. కానీ మనం చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా మనకు ఇంటర్ నెడ్ నుండి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోలేని వాటిని చాలా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం మేము కొన్ని ట్రిక్స్ అందిస్తున్నాం.(చదవండి: 499కే 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్) 01) ఏ సాఫ్ట్వేర్ లేకుండా యూట్యూబ్ వీడియోలను డౌన్లోడ్ చేయండి Https:// wwwతర్వాత “SS” అనే కీవర్డ్‌ని ఉపయోగించడం ద్వారా మీరు ఏ సాఫ్ట్వేర్ లేకుండా యూట్యూబ్ వీడియోలను సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనం వివిధ ఫార్మాట్లలో యూట్యూబ్ వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడానికి వేరే వెబ్ సైట్ కి తీసుకువెళ్తుంది. అక్కడ మీకు నచ్చిన ఫార్మాట్ లో వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 02) కోట్స్ ఉపయోగించడం(” “) మీరు గూగుల్ లో ఏదైనా సెర్చ్ చేస్తున్నపుడు మీకు అవసరమైన వాటితో పాటు అనవసరమైన వాటిని ఒక్కోసారి గూగుల్ చూపిస్తుంది. మీకు ఖచ్చితమైన పదం కోసం సెర్చ్ చేసేటప్పుడు ఇప్పుడు కోట్స్ (“ ") ఉపయోగించి సెర్చ్ చేయండి. అప్పుడు ఆ పదానికి సంబదించిన వాటిని మాత్రమే చూపిస్తుంది. కీలకపదాలను సెర్చ్ చేసేటప్పుడు దీన్ని ఒకసారి ప్రయత్నించండి. 03) గూగుల్ నుండి నేరుగా mp3ని డౌన్లోడ్ చేసుకోండి మీరు ఏదైనా mp3 ఫార్మాట్ లో పాటని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఇప్పుడు చాలా సులభంగా పాటని డౌన్లోడ్ చేసుకోవచ్చు. intitle: index.of? Mp3 తర్వాత మీకు నచ్చిన పాటని టైపు చేసి సెర్చ్ చేయండి. 04) క్రోమ్ లో మూసివేసిన టాబ్‌ను తెరవండి కొన్నిసార్లు మీరు చాలా ముఖ్యమైన పని చేస్తున్నపుడు అనుకోకుండా మీరు టాబ్‌ను మూసివేసిన లేదా షట్ డౌన్ అయినప్పుడు మనం సమాచారాన్ని కోల్పోతాం. ఇప్పుడు ఆ సమస్య కోసం చింతించకండి. ఎప్పుడైనా మీ ట్యాబ్ మూసివేసినప్పుడు మీరు కీబోర్డ్ నుండి ఒకేసారి Ctrl + Shift + Tకీని నొక్కి పట్టుకోవడం ద్వారా క్రోమ్ టాబ్‌ను తిరిగి పొందవచ్చు. ఇది ఉత్తమ ఇంటర్నెట్ ట్రిక్ కానప్పటికీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసేటప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 05) గూగుల్ సెర్చ్‌లో డిఫైన్ కీవర్డ్‌ని ఉపయోగించండి మీరు ఏదైనా ఒక పదం యొక్క నిర్వచనం పొందాలనుకున్నపుడు Ex: Define: Internet ఇలా టైపు చేస్తే మీకు త్వరగా దానికి సంబందించిన నిర్వచనం మీకు లభిస్తుంది. 06) ఇంటర్నెట్లో బ్లాక్ చేయబడిన వెబ్సైట్లను ఉపయోగించడం కొన్ని సార్లు మన దేశంలో నిషేదించిన కొన్ని వెబ్సైట్లను VPN ఉపయోగించి మీ కంప్యూటర్ నుండి చాలా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. మీ కంప్యూటర్లో VPNని డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేయండి. దాని తర్వాత అందులో మన దేశానికి సంబందించిన సర్వర్‌ను వేరే దేశానికి సంబందించిన సర్వర్‌ను కనెక్ట్ చేయడం ద్వారా నిషేదించిన వెబ్ సైట్ ని ఉపయోగించవచ్చు 07) ప్రకటనలు లేకుండా యూట్యూబ్ వీడియోలను చూడండి మీరు యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నపుడు కొన్ని యాడ్స్ వస్తుంటాయి. ఇలా యాడ్స్ రాకుండా యూట్యూబ్ వీడియోలను చూడాలని అనుకుంటే యాడ్బ్లాకర్ను ఉపయోగించండి. కానీ ఈ యాడ్‌బ్లాకర్ ఉపయోగిస్తుంటే కొన్ని వెబ్సైట్లను మీరు యాక్సెస్ చేయలేరు. 08) గూగుల్ లో టాస్ వేయండి మీరు క్రికెట్ గేమ్ ఆడుతున్నప్పుడు లేదా ఎప్పుడైనా టాస్ వేయాలని అనుకున్నపుడు మీ దగ్గర కాయిన్ లేకపోతె చింతించకండి ఇప్పుడు గూగుల్ లో కూడా మీరు టాస్ వేయవచ్చు ఎటువంటి కాయిన్ లేకుండా దాని కోసం మీరు గూగుల్ సెర్చ్ లో flip a coin టైపు చేసి సెర్చ్ చేస్తే సరిపోతుంది. అలాగే డైస్ కూడా రోల్ చేయవచ్చు. 09) కాలిక్యులేటర్, అజ్ఞాత మోడ్ ఉపయోగించడం మీ మొబైల్ లో కాలిక్యులేటర్ యాప్ లేకపోతే గూగుల్ శోధనలో కాలిక్యులేటర్‌ను సెర్చ్ చేసి వాడుకోవచ్చు. అలాగే మీరు ఎవరికీ తెలియకుండా, అలాగే మీ హిస్టరీ కూడా రికార్డు చేయకుండా ఉండటానికి ఏదైనా బ్రౌజర్ లో incognito మోడ్ ఓపెన్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. ఇంకా VPNని ఉపయోగిస్తే ఇంకా సురక్షితంగా ఉంటారు. వీటి గురుంచి మీకు తెలిసే ఉంటుంది. 10) స్లో మోషన్లో యూట్యూబ్ వీడియోలను ప్లే చేయడం యూట్యూబ్ వీడియోను ప్లే చేస్తున్నప్పుడు కీబోర్డ్ నుండి స్పేస్ కీని నొక్కి ఉంచడం ద్వారా మీ యూట్యూబ్ వీడియో స్లో మోషన్లో ప్లే అవుతుంది. దీని కోసం మీరు యూట్యూబ్ సెట్టింగ్ నుండి ప్లేబ్యాక్ వేగాన్ని సెట్ చేయవలసిన అవసరం లేదు. -
బ్యాటరీ సేవింగ్ కోసం ఇలా చేయండి!
ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగించే వారికి బ్యాటరీ ఆరోగ్యంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కోసారి అత్యవసర సమయాల్లో చార్జింగ్ అయిపోతే మన బాధ వర్ణనాతీతం. అంతేకాకుండా బ్యాటరీ విషయంలో మనం తగు జాగ్రత్తలు తీసుకోకపోతే.. అది ఫోన్ పనితీరు, జీవితకాలం మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చాల వరకు మొబైల్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం భాగానే ఉన్న.. అదేస్థాయిలో వాడకమూ పెరుగుతోంది. దీంతో సాయంత్రం అయ్యేసరికి బ్యాటరీ డౌన్ అయిపోతోంది. అయితే మీరు ఈ చిట్కాలను పాటిస్తే బ్యాటరీ సామర్థ్యం పెరిగే అవకాశం చాల ఎక్కువ. (చదవండి: వివో వై1ఎస్ వచ్చేసింది) మనం కొన్ని అవసరాల కోసం జీపీఎస్ ఆన్‌లో ఉంచుతాం. ఓలా, ఉబర్, స్విగ్గీ వంటి యాప్స్ వినియోగానికి జీపీఎస్ ఆన్ చేస్తుంటాం. అయితే మనం చాల సార్లు అవసరం లేకున్నా జీపీఎస్ ఆన్‌లో ఉంచుతాం. దీనివల్ల మన ఫోన్ యొక్క బ్యాటరీ సామర్థ్యం దెబ్బతినడంతో పాటు. బ్యాటరీ తొందరగా అయిపోతుంది అందుకోసమే మనం అవసరం లేని సమయంలో జీపీఎస్‌ను ఆఫ్‌లో ఉంచడం మంచిది. మన ఫోన్ చాలా సార్లు ఛార్జింగ్ పెట్టి మర్చిపోవడం లేదా నిద్రపోవడం చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల బ్యాటరీ పేలుతుందన్న అపోహ ఉన్నప్పటికీ అది నిజం కాదు. ఎందుకంటే మీరు చార్జింగ్ పెట్టాక బ్యాటరీకి 100 శాతం ఎక్కితే, చార్జింగ్ ఎక్కకుండా మీ స్మార్ట్ ఫోనే ఆపేస్తుంది. దీనికోసం మీ స్మార్ట్ ఫోన్ లో ప్రత్యేకంగా ఒక చిప్ ఉంది. కానీ ఇలా చేయడం వల్ల మీ ఫోన్ వేడెక్కడంతో పాటు ఫోన్ జీవితకాలం తగ్గిపోయేలా చేస్తుంది. కాబట్టి ఫోన్ ను ఎక్కువ సేపు చార్జ్ చేయడం ఆపండి. ఎప్పుడు 20 శాతం కన్నా ఎక్కువ మరియు 90 శాతం కన్న తక్కువ ఉండేటట్లు ఉంచుకోండి. ఫోన్ నోటిఫికేషన్ బార్లో ఉండే ఐకాన్స్ ను గమనిస్తూ ఉండండి. బ్లూటూత్, వైఫై ఆన్‌లో ఉన్నాయో లేదో చూసుకోండి. అవసరం లేకున్నా ఆన్ చేసి ఉంటే అవి మీ ఫోన్ బ్యాటరీని తగ్గిస్తాయి. మనం చాలా సార్లు వైఫై అందుబాటులో ఉన్నా కూడా మొబైల్ డేటాని వాడటం చేస్తూ ఉంటాం. దీంతో బ్యాటరీ త్వరగా ఖాళీ అయిపోతుంది. మీకు వైఫై అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించడమే మంచి పద్ధతి. మీ మొబైల్ లో 32 డిగ్రీల ఫారన్ హీట్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద లిథియం-ఇయాన్ బ్యాటరీలు చార్జింగ్ కావని ఓ పరిశోధనలో తేలింది. తక్కువ ఉష్ణోగ్రత వద్ద చార్జింగ్ పెట్టడం వల్ల యానోడ్ మీద ఉండే లిథియం మీద ప్లేటింగ్ ఏర్పడుతుంది. ఆ ప్లేటింగ్ ను తీసేయడం కూడా కుదరదు. ఇది కూడా మీ బ్యాటరీ జీవితకాలాన్ని తినేస్తుంది. కాబట్టి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఫోన్ చార్జింగ్ పెట్టకండి. బ్యాటరీ ఎక్కువ సేపు రావాలంటే ఫోన్లో ఉండే పవర్ సేవింగ్ మోడ్‌లో వాడడం మంచిది. దీనివల్ల ఫోన్లో ఉండే సీపీయూ ఎంత మేర అవసరమో అంత మేరకే పనిచేస్తుంది. అక్కర్లేని యాప్స్ బ్యాగ్రౌండ్లో రన్ కాకుండా చూస్తుంది. దీనివల్ల ఫోన్‌ను ఎక్కువసేపు ఉపయోగించొచ్చు. మన అవసరం లేకున్నా మొబైల్ లో లైవ్ వాల్ పేపర్ ని ఉపయోగిస్తూ ఉంటాం. దీనివల్ల మీ ఫోన్ మీద ఎక్కువ సామర్థ్యం పడటంతో బ్యాటరీ లైఫ్ తక్కువగా వస్తుంది. అలాగే మీ బ్యాటరీ కూడా తొందరగా అయిపోతుంది. అందుకోసమే వీటికి దూరంగా ఉండడం మంచిది. ఫోన్ బ్రైట్నెస్ను తగ్గించడం ద్వారా ఫోన్‌ను మరింత ఎక్కువ సేపు వినియోగించొచ్చు. మీ మొబైల్ ఉండే ఆటో బ్రైట్నెస్ను ఎంచుకుంటే మంచిది. దీంతో పాటు పోన్లో ఉండే డార్క్‌మోడ్/నైట్ మోడ్ ఫీచర్‌ను వినియోగిస్తే మళ్లీ మళ్లీ ఛార్జింగ్ పెట్టుకునే బాధ తప్పుతుంది. అలాగే, స్ర్కీన్ టైమ్‌ను కూడా వీలైనంత తక్కువగా సెట్ చేసుకోవడం ద్వారా బ్యాటరీ లైఫ్ పెంచుకోవచ్చు. -
సంపూర్ణ ఆరోగ్యానికి చిట్టి చిట్కాలు
న్యూఢిల్లీ : కూర్చోవాలన్నా, లేవాలన్నా, మెట్లు ఎక్కాలన్నా, దిగాలన్నా మోకాలి నొప్పులు రాకుండా, ఛాతిలో నొప్పి లేకుండా ఉండాలన్నా, మొత్తంగా మెదడు ప్రశాంతంగా హాయిగా ఉండాలన్నా కొన్ని వైద్య చిట్కాలు చాలని లండన్‌కు చెందిన ప్రముఖ వైద్యులు సలహా ఇస్తున్నారు. రోజు ఉదయం, సాయంత్రం ఇరవై బింగీలు తీయాలి. దానివల్ల తొడలు, పిరుదులు బలపడడంతోపాటు మోకాలి నొప్పులు తగ్గుతాయని ‘ఈస్ట్ కెంట్ హాస్పిటల్స్ యూనివర్శిటీ ఫౌండేషన్ ట్రస్ట్’లోని న్యూరోలాజికల్ రీహాబిలిటేషన్ సర్వీస్‌లో పనిచేస్తున్న ఫిజియోథెరపిస్ట్ అలెక్స్ ఆమ్‌స్ట్రాంగ్ తెలిపారు. ఆకుపచ్చ అరటి పండ్లు తినడం. అందులోని ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ బాగుంటుందని, అందులోని పొటాషియం వల్ల ఎముకలు బలపడతాయని బ్రిటీష్ డయాబెటిక్ అసోసియేషన్‌కు చెందిన డైటీషియన్ లారా టిల్ట్ చెప్పారు. అరటి పండ్లు పసుపు పచ్చగా మారినట్లయితే అందులోని ఫైబర్ నశించి పోతుందని ఆయన అన్నారు. ఆన్లైన్లో విరివిగా దొరుకుతున్న కాళ్ల మడమల వద్ద బరువు పట్టీలను ధరించాలి. ఖాళీ సమయాల్లో కాకపోతే టీవీ చూస్తున్నప్పుడు రెండు కాళ్లకు వీటిని ధరించి ఒక కాలు తర్వాత ఒక కాలును గాలిలోకి లేపి కాసేపు ఉంచి, దించాలి. ఇలా ఐదారు సార్లు చేసినట్లయితే కండరాలు బలపడి కాళ్ల నొప్పులు తగ్గుతాయని ‘రాయల్ లివర్ పూల్ హాస్పటల్స్’ ఆర్థోపెడిక్ సర్జన్ జార్జ్ ఆమ్పత్ తెలిపారు. నేలపై కూర్చొని ముందుకు కాళ్లను చాపి ఓ మోకాలి కింది బాగం నేలకు తాకేలా చేయాలి, ఆ తర్వాత మరో కాలితో అలాగే చేయాలి. ఆ తర్వాత మోకాళ్లపై లేచి అలాగే కొద్ది సేపు నిలబడాలి. దానివల్ల మోకాళ్లు బలపడతాయి. మెట్లు మునికాళ్ల మీద ఎక్కాలి. దానివల్ల మోకాలు కింద వెనక బాగానుండే కండరాలు బలపడతాయని స్టాక్‌పోర్ట్‌లోని బ్రిన్నింగ్టన్ సర్జరీ డాక్టర్ జేమ్స్ హిగిన్స్ తెలిపారు. ఉదయం బ్రెష్ చేసుకునేటప్పుడు ఓ కాలును వెనక్కి మడచి ఒంటి కాలిపై కాసేపు నిలబడి, కాలు మార్చి మరో కాలిపై కాసేపు నిలబడినట్లయితే కండరాల మధ్య స్నాయువుల ప్రభావం పెరిగి శరీరం బ్యాలెన్స్‌ను నిలబెడుతుందని ఆయన చెప్పారు. రోజుకోసారి కొన్ని పాత్రలను చేతులతో కడగాలి. ఆ తర్వాత కొద్దిసేపు గోరు వెచ్చని నీళ్లలో రెండు అరచేతులను కాసేపు ఉంచి, ఆ తర్వాత చేతులు కడుక్కోవాలి, తుడుచుకోవాలి, అరచేతులను ముడుచుకోవాలి, విప్పాలి, విదిలించాలి. దాని వల్ల చేతుల వేళ్లు బలపడతాయని, క్రమంగా వేళ్ల నొప్పులు తగ్గుతాయని ‘విల్ట్‌షైర్ అండ్ స్విండన్ హెల్త్ కేర్’ హాండ్స్ ఫిజియోథెరపీలో నిపుణులు మిషెల్లీ లారెన్స్ తెలిపారు. కీళ్ల నొప్పులకు పెయిన్ కిల్లర్ ‘బ్రూఫిన్’కు బదులు పారాసిటమాల్ తీసుకోవడం మంచిదని, చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించేందుకు స్టాటిన్స్గానీ, ఆస్ప్రిన్ ట్యాబ్లెట్లను రాత్రికి బదులు ఉదయమే తీసుకోవాలని ఇడిన్బర్గ్ యూనివర్శిటీ కన్సల్టెంట్ కార్డియోలజిస్ట్ డాక్టర్ మార్క్ డ్వీక్ సూచించారు. బ్రూఫిన్ సాధారణ నొప్పులకు మాత్రమే పనిచేస్తుందని, మోకాలు నొప్పులకు పనిచేయదని, పైగా దాని వల్ల ప్రతికూల ప్రభావాలు ఉన్నాయని డాక్టర్ హెచ్చరించారు. వారానికి ఒకటి రెండు సార్లు టిఫిన్, లంచ్‌ను వదిలేయాలి. అంటే ఆ రోజు ఉదయం నుంచి 16 గంటలపాటు ఏమీ తినకుండ ఉన్నట్లయితే మంచిది. డయాబెటిక్ రోగులకు ఇది మరీ మంచిది. దీనివల్ల గుండె పదిలంగా ఉండడమే కాకుండా కాస్త లావు తగ్గుతారని లండన్‌లోని వెల్బెక్ హార్ట్ హెల్త్ క్లినిక్ కన్సల్టెంట్ కార్డియోలజిస్ట్ డాక్టర్ ఇక్బాల్ మాలిక్ తెలిపారు. రోజు కొంత దూరం నడవాలని, సమయం లేకపోతే ఆఫీసుకు ఓ స్టాప్ ముందు దిగి ఆఫీసు వరకు నడిచిపోవాలని, అది కూడా గుండెకు మంచిదని ఆయన చెప్పారు. ప్రతి రోజు ఒకసారి బ్లాక్ లేదా గ్రీన్ టీ తాగడం కూడా మంచిదని ఆయన తెలిపారు. రోజువారి తిండిలో ఉప్పును సాధ్యమైనంతగా తగ్గించాలని, మొదట్లో ఇబ్బందిగా ఉన్నా నాలుగైదు వారాల్లో ‘టేస్ట్ బడ్స్’ సర్దుకుంటాయని హృద్రోగ నిపుణులు తెలియజేస్తున్నారు. వారానికి రెండు సార్లైనా షాపింగ్ చేయాలని, రెండు నుంచి ఐదారు కిలోల బరువుండే బ్యాగులను చేతులతో మోసుకరావడం వల్ల కూడా చేతులు బలపడుతాయని నిపుణులు సూచించారు. -
లెక్కలతో గేమ్స్ ఆడే యాప్
-
హర్మన్‌ప్రీత్ ‘హ్యాట్రిక్’
జూనియర్ ఆసియా కప్ సెమీస్‌లో భారత్ కౌంటాన్ (మలేసియా): అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న భారత్... జూనియర్ పురుషుల ఆసియా కప్ హాకీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ (7, 12, 50వ ని.) హ్యాట్రిక్ గోల్స్ చేయడంతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 9-0తో ఒమన్‌పై నెగ్గింది. హర్మన్‌ప్రీత్‌తో పాటు అర్మాన్ ఖురేషి (10వ ని.), గుర్జాంత్ సింగ్ (18వ ని.), సంటా సింగ్ (22వ ని.), మన్దీప్ సింగ్ (30వ ని.), హర్జీత్ సింగ్ (45వ ని.), మహ్మద్ ఉమర్ (54వ ని.)లు భారత్‌కు గోల్స్ అందించారు. ఆరంభం నుంచే బంతిని ఎక్కువ శాతం ఆధీనంలో ఉంచుకున్న భారత్.. వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుంది. పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మల్చడంతో తొలి అర్ధభాగానికి 6-0 ఆధిక్యంలో నిలిచింది. తర్వాత కూడా అదే జోరును చూపెట్టడంతో ఒమన్ ఆటగాళ్లు చేష్టలుడిగిపోయారు. శనివారం జరిగే తొలి సెమీఫైనల్లో భారత్... జపాన్‌తో తలపడుతుంది. -
కిడ్నాపర్‌కు సినిమా చూపించిన బుడతడు
సిచుహాన్(చైనా): సినిమాల్లో చూసిన సీన్ల ఆధారంగా ఓ బుడతడు కిడ్నాపర్ ను బోల్తా కొట్టించాడు. కిడ్నాపర్ నుంచి తనను తాను రక్షించుకోవడమే కాకుండా.. ఆ దుండగుడిని పోలీసులు పట్టుకునేలా చేసి.. భేష్ అనిపించుకున్నాడు. ఈ సంఘటన చైనాలోని సిచుహాన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. స్కూల్ వెళుతున్న సమయంలో క్సియోహీ(13) అనే బాలుడు సెప్టెంబర్ 24న కిడ్నాప్ కు గురయ్యాడు. అతన్ని అపహరించిన దుండగుడు ఒక మారుమూల గ్రామంలోని ఒక పాడుబడ్డ ఇంట్లో బంధించాడు. ఆ ఇంట్లో క్సియోహీని తాళ్లతో కట్టేసి, కళ్లకి గంతలు కట్టి, మాట్లాడకుండా మూతికి టేప్ అతికించాడు. కొన్ని రోజుల తర్వాత కిడ్నాపర్ బాలుని తండ్రికి ఫోన్ చేసి.. మీ కొడుకు మీకు దక్కాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. అదే సమయంలో బాలుడు కిడ్నాపర్ బయటికి వెళ్లాడేమోనని భావించి తాళ్లను విప్పుకొని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే బయటే ఉన్న కిడ్నాపర్ కంట పడ్డాడు. ఏముంది అతన్ని మళ్లీ తీసుకువచ్చి మరింత పటిష్టంగా తాళ్లతో బంధించి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు బాలుడు తప్పించుకోవడానికి మరో పక్కా ప్లాన్ వేశాడు. ఈసారి అతడు తప్పించుకోవడానికి ముందు రెండు సార్లు బిగ్గరగా అరిచాడు. ఎలాంటి బదులు రాకపోవడంతో అతను అక్కడినుంచి వెళ్లాడని భావించాడు. కుర్చీకి కట్టిన తాళ్లని విప్పుకొని ఎలాగోలా రోడ్డు పైకి వచ్చాడు. అయితే అతని రెండు చేతులు తాళ్లతో గట్టిగా కట్టి, మోహానికి ప్లాస్లిక్ బ్యాగు చుట్టి ఉంది. ఆ అవతారంలో అగమ్యగోచరంగా రోడ్డుపై ఉన్న ఆ బాలున్ని అదృష్టం కొద్ది స్థానికుడొకరు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాలుని తండ్రి దగ్గర డబ్బు వసూలు చేసే పనిలో ఉన్న కిడ్నాపర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రైం సినిమాల్లో హీరోలు దుండగులనుంచి తప్పించుకోవడాన్ని చూసి ఆ ట్రిక్స్ ను ఇక్కడ అప్లై చేశానని బాలుడు చెప్పాడు. కిడ్నాపర్ కు సహకరించినట్టే ఉండి..అతన్ని నమ్మించి సమయం దొరికితే టక్కున తప్పించుకోవాలని సినిమాల ద్వారానే నేర్చుకున్నానని.. 22 రోజులు కిడ్నాపర్ చెరలో ఉండి తప్పించుకున్న ఆ బాలుడు తెగ సంబరంతో చెబుతున్నాడు. -
తెలంగాణలో పొత్తు కోసం ప్రధాన పార్టీల ఎత్తులు
-
4 స్తంభాలాట
తెలంగాణలో పొత్తు కోసం ప్రధాన పార్టీల ఎత్తులు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్ల చర్చల్లో ఆసక్తికర మలుపులు ఇటు కాంగ్రెస్, అటు బీజేపీతో ఏకకాలంలో టీఆర్ఎస్ చర్చలు టీడీపీతో చర్చలు జరుపుతూనే.. టీఆర్ఎస్తో టచ్‌లో ఉన్న బీజేపీ సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో ప్రధాన పార్టీల మధ్య పొత్తుల అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదని, ఒంటరిగానే పోటీచేస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ తాజాగా కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరుపుతోంది. ఒకవైపు తమ ప్రతిపాదనను కాంగ్రెస్ ముందుంచిన టీఆర్ఎస్ పెద్దలు.. అదే సమయంలో బీజేపీ అగ్రనేతలతోనూ పొత్తుపై టచ్‌లో ఉండటం విశేషం. తమ ప్రతిపాదనలకు ఓకే చెప్తే కాంగ్రెస్‌తోనే వెళతామని.. లేనిపక్షంలో బీజేపీతో పొత్తు ఖాయమని టీఆర్ఎస్ నేతలు సంకేతాలు పంపుతున్నారు. మరోవైపు ఇప్పటికే బీజేపీతో పొత్తు చర్చలు నడుపుతున్న టీడీపీ.. ఆ దోస్తీని పక్కా చేసుకోవటం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీతో టీఆర్ఎస్ జట్టు కడుతుంది? టీఆర్ఎస్, టీడీపీల్లో ఏ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది? అనేది మరింత ఆసక్తికరంగా మారింది. 60 ఎమ్మెల్యే, 6 ఎంపీ సీట్లు కావాలన్న టీఆర్ఎస్! టీఆర్ఎస్ తమతోనే కలిసి వస్తుందని కాంగ్రెస్, బీజేపీ తమతో పొత్తు పెట్టుకుందని టీడీపీ పెద్దలు ధీమాతో ఉన్న తరుణంలో.. కాంగ్రెస్, బీజేపీలతో టీఆర్ఎస్ పెద్దలు ఏకకాలంలో పొత్తుల చర్చలకు తెరతీయటంతో పొత్తు వ్యవహారం రసకందాయంలో పడింది. బుధవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ ఢిల్లీలోనే ఉన్న పార్టీ తెలంగాణ నేతలను పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. ఆరు ఎంపీ స్థానాలు, 60కి పైగా ఎమ్మెల్యే సీట్లతో పాటు సీఎం పదవిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని టీఆర్ఎస్ కోరుతున్న విషయాన్ని ఆయన రాష్ట్ర నేతలకు వివరించి వారి అభిప్రాయాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రతిపాదన పట్ల రాష్ట్ర నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లు సమాచారం. కానీ.. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటేనే తెలంగాణ లో కాంగ్రెస్ సేఫ్‌గా ఉంటుందనే భావన కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో ఏమిటి చేయటమనే డైలమాలో కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు పడ్డారు. 40 అసెంబ్లీ, 4 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒకే! టీఆర్ఎస్తో పొత్తుకు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయని పదేపదే చెప్తున్న కాంగ్రెస్.. అందులో భాగంగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఇటీవలే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ జి.వివేక్ తదితరులను దిగ్విజయ్‌సింగ్ బుధవారం తన నివాసానికి పిలిపించుకున్నారు. సుమారు గంటపాటు సమావేశమై టీఆర్ఎస్ ప్రతిపాదనలపై చర్చించారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. తెలంగాణ రాష్ట్రంలో సుస్థిర పాలన ఉండాలంటే టీఆర్ఎస్తో పొత్తు అవసరం ఎంతైనా ఉందని దిగ్విజయ్ వారితో పేర్కొన్నారు. టీఆర్ఎస్కు ప్రస్తుతమున్న 25 సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలతో పాటు మరో 15 సీట్లు కలిపి మొత్తం 40 వరకు అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ సీట్లు కేటాయిద్దామని ప్రతిపాదించారు. మిగిలిన 79 అసెంబ్లీ సీట్లలో 10 స్థానాల్లో ఎంఐఎంతో అవగాహన ఉంటుందని, అలాగే పొత్తులో భాగంగా 9 సీపీఐ, 2 న్యూడెమోక్రసీ పార్టీలకు కేటాయించాల్సి ఉందని, మిగిలిన 58 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తే ఎలా ఉంటుందని సమాలోచనలు జరిపారు. సీఎం పదవి హామీ ఇస్తే.. టీఆర్ఎస్ ఓకే! ఇదే అభిప్రాయాన్ని తమతో టచ్‌లో ఉన్న టీఆర్ఎస్ నేతలకు దిగ్విజయ్‌సింగ్ ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అటువైపు నుంచి మాత్రం 60 ఎమ్మెల్యే, 6 ఎంపీ సీట్లు కేటాయిస్తే తప్ప పొత్తు సాధ్యం కాదని తేల్చిచెప్పినట్లు తెలిసింది. అయితే.. ఎన్నికల అనంతరం టీఆర్ఎస్కు సీఎం పదవి ఇస్తామని హామీ ఇస్తే సీట్లు తగ్గించుకునేందుకు ఎలాంటి అభ్యంతరమూ లేదని కూడా ఆ పార్టీ నేతలు స్పష్టం చేసినట్లు సమాచారం. సీఎం సీటు సాధ్యం కాదని, సీట్ల సర్దుబాటులో భాగంగా తాము ప్రతిపాదించిన దానికంటే మరో రెండు, మూడు సీట్లు అటుఇటుగా సర్దుబాటు చేసేందుకు సిద్ధమని కాంగ్రెస్ నేతలు సూచించినా టీఆర్ఎస్ నేతల నుంచి సానుకూల స్పందన రాలేదని కాంగ్రెస్ వరా్గాలు చెప్తున్నాయి. ఈ నేపధ్యంలో 24 గంటల్లో తమ ప్రతిపాదనల సంగత తేల్చాలని, లేనిపక్షంలో బీజేపీతో వెళ్లేందుకు వెనుకాడబోమని గులాబీ దళం నాయకులు తెగేసి చెప్పినట్లు తెలిసింది. దిగ్విజయ్‌తో చర్చల్లో పాల్గొన్న నాయకుడొకరు మాట్లాడుతూ.. ‘టీఆర్ఎస్తో పొత్తు ఖరారయ్యేలా కనిపించటం లే దు. ఎన్నికల్లో ఆ పార్టీతో తేల్చుకోక తప్పదు. దిగ్విజయ్ కూడా ఇదే భావనతో ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. కమలనాథులతో గులాబీదళం మంతనాలు... కాంగ్రెస్‌తో పొత్తు సాధ్యమయ్యే పరిస్థితులు కానరాకపోవడంతో గులాబీ నేతలు తమ దృష్టిని బీజేపీ వైపు మళ్లించారు. గత మూడు రోజులుగా టీడీపీ, బీజేపీ పొత్తుల లెక్కలు తేలకపోవటంతో.. బీజేపీతో టీఆర్ఎస్ మంతనాలు మొదలుపెట్టింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎంపీలు బుధవారం ఉదయం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ప్రకాశ్జవదేకర్లను కలిశారు. మరో సీనియర్ నేత అరుణ్‌జైట్లీతో కూడా మంతనాలు జరిపారు. తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన టీఆర్ఎస్, తెలంగాణ ఏర్పాటులో చిత్తశుద్ధిని చూపిన బీజేపీ కలిసి వెళ్లడం వల్ల ఉభయ పార్టీలకు ప్రయోజనం ఉంటుందని రాజ్‌నాథ్‌కు వారు వివరించినట్లు తెలుస్తోంది. తెలంగాణకు వ్యతిరేకించిన టీడీపీ వల్ల బీజేపీకి నష్టమే తప్పితే ఒరిగే ప్రయోజనం ఉండదని కూడా పేర్కొన్నట్లు సమాచారం. అలాగే.. తెలంగాణలోని బీజేపీ నాయత్వం టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న విషయాన్నీ వారు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తమ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి 30 అసెంబ్లీ సీట్లు, 6 లోక్‌సభ స్థానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా వారు రాజ్‌నాథ్ వద్ద ప్రతిపాదించినట్లు సమాచారం. ‘సైకిల్’ కన్నా ‘కారు’తోనే జోరు... ఈ ఆఫర్‌కు బీజేపీ సైతం మొగ్గుచూపిందనే వార్తలు వస్తున్నాయి. టీడీపీ ఇస్తామన్న దానికన్నా తక్కువ సీట్లు ఇస్తామన్న టీఆర్ఎస్ వైపు బీజేపీ మొగ్గుచూపడానికి ప్రధాన కారణం.. అలా పోటీ చేసే స్థానాల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండటమేనని చెప్తున్నారు. అదే టీడీపీతో పొత్తు అయితే గెలుపుపై అంత నమ్మకం ఉండదనే వాదన ఉంది. బీజేపీ తమతోనే పొత్తుపెట్టుకుంటుందని టీఆర్ఎస్ సైతం బలంగా భావిస్తోంది. అయితే.. ప్రస్తుతం టీడీపీతో చర్చలు జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి హామీ ఇవ్వలేమని, కానీ టచ్‌లో ఉండాలని టీఆర్ఎస్ ప్రతినిధులకు బీజేపీ అగ్రనేతలు సూచించినట్లు సమాచారం. టీడీపీతో వెళ్తే ఇక కోలుకోలేమంటున్న టీ-బీజేపీ బీజేపీ - టీడీపీ పొత్తు కోసం నరేంద్రమోడీ, తమకు సన్నిహితులైన బడా పారిశ్రామికవేత్తల ద్వారా చంద్రబాబు ప్రయత్నిస్తున్నప్పటికీ.. బీజేపీ రాష్ట్ర శ్రేణులు మాత్రం అసలు తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దేవద్దని కరాఖండిగా చెప్తున్నాయి. టీడీపీతో కలిసి వెళ్తే ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగలటమే కాకుండా వచ్చే ఎన్నికల వరకు కూడా కోలుకోలేని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో పార్టీ బలం పెరిగినందున భావసారూప్యత గల టీఆర్ఎస్తో చెలిమి చేయటమే మంచిదని బీజేపీ రాష్ట్ర నేతలు వాదిస్తున్నారు. అలాగే.. టీడీపీతో పొత్తుకు తొలుత అనుకూలంగా ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ కూడా చంద్రబాబు వైఖరితో విసిగిపోయి ఆ పార్టీతో పొత్తు వద్దనే నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బడా పారిశ్రామికవేత్త సాయం కోరిన బాబు... కానీ.. తెలంగాణలో అస్తిత్వం కోసం నానా తంటాలు పడుతున్న టీడీపీ మాత్రం ఈ ఎన్నికల్లో బీజేపీ అండలేకుంటే నామమాత్రపు సంఖ్యలో కూడా సీట్లు గెలుచుకునే అవకాశం లేదని ఆందోళన చెందుతోంది. దాదాపు ఆరు నెలల కిందటి నుంచే బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ కనుసన్నల్లో మెలుగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆయన నుంచి పొత్తుకు అనుకూలంగా అనుమతి పొందారు. ఇప్పటికీ ఆయన అదే అభిప్రాయంతో ఉండేలా.. రాజ్‌నాథ్‌సింగ్ లాంటి వారు విసిగిపోయి పొత్తు వద్దన్నా మోడీ మనసు మార్చుకోకుండా ఉండేలా.. జాతీయ స్థాయిలో తనకు సన్నిహితుడైన ఓ బడా పారిశ్రామికవేత్త సాయాన్ని కూడా చంద్రబాబు తీసుకుంటున్నట్లు తెలిసింది. సదరు పారిశ్రామికవేత్త బీజేపీ - టీడీపీ పొత్తు కోసం తన వంతు సాయం చేస్తున్నట్లు చెప్తున్నారు. మంగళవారం అరుణ్‌జైటీ సమక్షంలో అర్ధరాత్రి దాటేవరకు ఇరు పార్టీ నేతల మధ్య చర్చలు జరిగినా సీట్ల విషయంలో ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు. దీంతో ఇక చర్చలు వద్దని తెలంగాణ బీజేపీ నేతలు గట్టిగా చెప్పినా కూడా.. మోడీతో మాట్లాడి చెప్తామంటూ ఆ పార్టీ అధినాయకత్వం ఇంకా సాగదీస్తోంది. కుదిరిందని టీడీపీ.. ఏకాభిప్రాయమే లేదని బీజేపీ! ఈ క్రమంలోనే.. చర్చల్లో పాల్గొన్న నిజామాబాద్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ బుధవారమే తీవ్ర అసంతృప్తితో హైదరాబాద్‌కు తిరిగొచ్చినా.. కిషన్‌రెడ్డి, మరో సీనియర్ నేత దత్తాత్రేయలు ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వచ్చింది. బుధవారం ఢిల్లీ నుంచి వచ్చిన టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు.. బీజేపీతో పొత్తు కుదిరిందని, సీట్ల విషయంలోనూ దాదాపు ఏకాభిప్రాయం వచ్చిందని పేర్కొనగా.. ఆ కొద్దిసేపటికే బీజేపీ నేత యెండల లక్ష్మీనారాయణ ఆ వ్యాఖ్యలను ఖండించటం గమనార్హం. పొత్తుపై ఏకాభిప్రాయమే రాలేదని, అలాంటిప్పుడు సీట్ల విషయంలో సయోధ్య కుదరిందనటం సరికాదని యెండల పేర్కొన్నారు. పార్టీ తెలంగాణ ఇన్చార్జ్ జవదేకర్ కూడా ఢిల్లీలో ఇదే తరహా వ్యాఖ్యలు చేయటం విశేషం. ఇదిలావుంటే.. కిషన్‌రెడ్డి, జవవదేకర్లు గురువారం హైదరాబాద్ వస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. కొసమెరుపు: తెలంగాణలో పొత్తులపై ఇప్పటికే ప్రధాన పార్టీల మధ్య నాలుగు స్తంభాలాట జరుగుతుండగా.. తాజాగా టీఆర్ఎస్ నాయకుడు కడియం శ్రీహరి సీపీఎం కార్యాలయానికి వెళ్లి తెలంగాణ శాఖ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో మంతనాలు ప్రారంభించారు. పొత్తు పెళ్లిలాంటిది! చర్చలను బట్టి అది జరగొచ్చు.. జరగకపోవచ్చు టీడీపీతో పొత్తుపై జవదేకర్ వ్యాఖ్య సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీతో పొత్తు చర్చలకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ కొత్త భాష్యం చెప్పారు. అవి పెళ్లి కోసం జరిగే చర్చల వంటివని.. పెళ్లి జరగొచ్చు.. జరగకపోవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జవదేకర్ మీడియాతో మాట్లాడారు. టీడీపీతో పొత్తు చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు చెప్పారు. ‘పొత్తు అనేది పెళ్లి లాంటిదే. రాజకీయమైనా... పెళ్లయినా ఇరు పక్షాల ఆమోదయోగ్యంతోనే జరుగుతుంది. ఒక బంధం ఏర్పడటానికి పెళ్లి కోసం చర్చలు జరిపినట్లే రాజకీయాల్లో పొత్తు కోసం కూడా చర్చ జరుగుతుంది. పెళ్లి జరగవచ్చు... జరగకపోవచ్చు. అలానే పొత్తు కూడా ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. త్వరలోనే నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం’ అని జవదేకర్ వ్యాఖ్యానించారు. పొత్తులపై టీవీల్లో వస్తున్న వార్తలను నమ్మొద్దన్నారు. ఇరు పార్టీల మధ్య చర్చలు సాఫీగా సాగుతున్నాయని, త్వరలోనే నిర్ణయం వస్తుందని చెప్పారు. పొత్తుకు ద్వారాలు తెరిచే ఉంచాం కేసీఆర్ మా దారికే వస్తున్నారు: పొన్నాల సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్తో పొత్తుకు కాంగ్రెస్ ద్వారాలు తెరిచే ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. బంగారు తెలంగాణ సాధనలో భాగంగానే టీఆర్ఎస్ సహా ఉద్యమ శక్తులతో కలిసి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కొంత త్యాగం చేయక తప్పదన్నారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్ రూంను బుధవారం ప్రారంభించిన సందర్భంగా పొన్నాల మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ చరిత్రాత్మక ఘటన నేపథ్యంలో పొత్తుకు తలుపులు తెరిచే ఉంచామన్నారు. తెలంగాణను పునర్నిర్మిస్తానని నిన్నటి వరకు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ‘బంగారు తెలంగాణ’గా అభివృద్ధి చేస్తానంటూ కాంగ్రెస్ దారిలోకే వచ్చారని వ్యాఖ్యానించారు. తమ పార్టీ కుటుంబంలో ఒకరికే టిక్కెట్ ఇస్తుందనడం ఊహాగానాలేనన్నారు. సీపీఐతో పొత్తుపై ఒకటి రెండ్రోజుల్లోనే హైకమాండ్ నుంచి ప్రకటన వస్తుందని పొన్నాల చెప్పారు. నేడు ఢిల్లీకి పొన్నాల, జానా తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక చివరి దశకు చేరుకుంది. టీపీసీసీ పంపిన జాబితాపై ఇప్పటికే పలుమార్లు చర్చించిన ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చివరి వడపోత మొదలు పెట్టింది. అందులో భాగంగా అధిష్టానం పిలుపుపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నేత కె.జానారెడ్డి గురువారం ఢిల్లీ వెళ్తున్నారు. అభ్యర్థుల ఖరారుతోపాటు టీఆర్ఎస్తో పొత్తుపైనా హైకమాండ్‌తో చర్చించనున్నారు. బుధవారం కూడా హైకమాండ్ పెద్దలు కేసీఆర్‌తో మాట్లాడినట్లు టీపీసీసీ వర్గాల సమాచారం. పొత్తుపై రెండు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.